మైక్రోమీటర్
స్క్రూగేజ్ |
|
| Other names | స్క్రూగేజ్ |
|---|---|
| Uses | 0.01మి.మీ వరకు ఖచ్చితంగా కొలుచుటకు |
| Inventor | మొదట ప్రవేశపెట్టినవారు -William Gascoigne |
ఒక వస్తువు పొడవును 0.001 మి.మీ వరకు ఖచ్చితంగా కొలిచే పరికరము మైక్రోమీటరు.ఇది స్వల్ప వ్యాసాలు, స్వల్ప మందాలు అతి ఖచ్చితంగా కొలవడానికి ఉపయోగిస్తారు. దీనిని స్క్రూగేజ్ అనికూడా అంటారు. ఒక వస్తువు పొడవును కొలవాలంటే సాధారణంగా స్కేలును ఉపయోగిస్తాము. స్కేలు యొక్క కనీసపుకొలత 1 మి.మీ. ఒక మి.మీ కంటె తక్కువ పొడవులను కొలుచుటకు వాడే పరికరం వెర్నియర్ కాలిపర్స్. ఇది ఒక మిల్లి మీటర్ లో పదవ వంతు వరకు ఖచ్చితంగా కొలవగలదు. ఒక మిల్లీ మీటరులో 100 వ వంతు వరకు ఖచ్చితంగా కొలిచె సాధనం స్క్రూగేజ్ లేదా మైక్రోమీటర్. దీనిని తెలుగులో సూక్ష్మ మాపకం అంటారు.
విషయ సూచిక |
పనిచేసే సూత్రము [మార్చు]
ఇది మర సూత్రంపై ఆధారపడి పనిచేస్తుంది.
యిందులో గల స్కేళ్ళు [మార్చు]
- తల స్కేలు
- పిచ్ స్కేలు
మరభ్రమణాంతరం [మార్చు]
మరశీల ఒక పూర్తి భ్రమణం చేసినపుడు మర కదిలిన దూరమును మరభ్రమణాంతరం లేదా మరపిచ్ అందురు.తలస్కేలు ఒక పూర్తి భ్రమణం చేయునపుదు అది పిచ్ స్కేలుపై కదిలిన దూరం మరభ్రమణాంతరం అవుతుంది. ఉదాహరణకు తలస్కేలు 10 భ్రమణాలు చేసినపుడు మరశీల పిచ్ స్కేలుపై కదిలిన దూరం 10 మి.మీ అయిన మరభ్రమణాంతరం 1 మి.మీ. అవుతుంది.
మరభ్రమణాంతరం = మరకదిలిన దూరం / మర చేసే భ్రమణాల సంఖ్య
కనీసపు కొలత [మార్చు]
ఒక పరికరంతో కొలవగలిగే అతి తక్కువ కొలతను కనీసపు కొలత అందురు. స్క్రూగేజ్ లో తలస్కేలుపై 100 విభాగాలుంటాయి. తలస్కేలు ఒక భ్రమణం చేయునపుడు మర కదిలిన దూరం 1 మి.మీ అయిన ఒక తలస్కేలు విభాగం కదిలినపుడు మర కదిలిన దూరం 0.01 మి.మీ అవుతుంది. అందువలన స్క్రూగేజ్ కనీసపు కొలత 0.01 మి.మీ. లేదా 0.001 సెం.మీ అవుతుంది.
కనీసపు కొలత = మరభ్రమణాంతరం / తలస్కేలు విభాగాల సంఖ్య
వర్ణన [మార్చు]
స్క్రూగేజ్ "U" ఆకారంపు లోహ చట్రం కలిగి ఉంటుంది. ఈ చట్రం ఒక చివర ఒక పొట్టి దండం బిగించి ఉంటుంది. దీనికి ఎదురు దిశలో బోలుగా, పొడవుగా వున్న ఒక లోహపు స్థూపాకార గొట్టం బిగించబడిఉంటుంది. ఈ ఖాళీ స్థూపం లోపలి భాగంలో సర్పిలాకారపు గాళ్ళు చెక్కబడి ఉంటాయి. అందువలన అది ఒక నట్తు మాదిరిగా పనిచేస్తుంది. దాని బాహ్య తలం మీద పొదవుగా అక్షం వెంబడి ఒక సూచీ రేఖ సమభాగాలుగా చేయబడి ఉంటుంది. ఇది "పిచ్ స్కేలు". పొట్టి దండం ఎదురుగా మరొక దండం ఉంటుంది. ఇది లోహపు స్థూపం లోపల ఉన్న సర్పిలాకారపు గాళ్ళు మాదిరిగానే ఉన్న గాళ్ళు రెండవ దండం మీద చెక్క బడి ఉంటాయి. దీనికి మరొక చివర గాడులు చేయబడిన ఒక మరశీల తల ఉంటుంది. తలస్కేలు స్థూపం పై 100 విభాగాలుంటాయి.
పొడవు కనుగొనే విధానం [మార్చు]
- మొదట స్క్రూగేజి యొక్క శూన్యాంశ దోషాన్ని కనుగొనాలి.
- స్క్రూగేజ్ యొక్క కనీసపు కొలతను కనుగొనాలి.
- యిచ్చిన గాజు పలకను రెండు దండముల మద్య ఉంచి బిగించాలి.
- పిచ్ స్కేలు మీద తలస్కేలు ఏ విభాగం వద్ద ఆగిందో చూసి ఆ రీడింగ్ ను గుర్తించాలి. ఇది పిచ్ స్కేలు రీడింగ్ అవుతుంది.
- పిచ్ స్కేలు యొక్క సూచేరేఖ ను తలస్కేలు మీది ఏ విభాగం ఏకీ భవిస్తుందో గుర్తించి దానిని తలస్కేలు రీడింగ్ గా తీసికోవాలి.
- ఈ తలస్కేలు రీడింగు కు శూన్యాంశ దోషం ను సవరించాలి.
- పిచ్ స్కేలు రీడింగు+(తలస్కేలు రీడింగ్xకనీసపు కొలత) అను సూత్రము ఉపయోగించి గాజు పలక మందం కనుగొనవచ్చు.
శూన్యాంశ దోషములు [మార్చు]
- ఋణ శూన్యాంశ దోషం: పిచ్ స్కెలు లోని సూచీ రేఖ కంటే తలస్కెలు లోని శూన్య విభాగం ఎగువన ఉంటే దానిని ఋణ శూన్యాంశ దోషం అందురు. దీని సవరణ ధనాత్మకం.
- ధన శూన్యాంశ దోషం: పిచ్ స్కెలు లోని సూచీ రేఖ కంటే తలస్కెలు లోని శూన్య విభాగం దిగువన ఉంటే దానిని ధన శూన్యాంశ దోషం అందురు. దీని సవరణ ఋణాత్మకం.
రకాలు [మార్చు]
సాధారణంగా మూడు రకాల మైక్రోమీటర్లను ఉపయోగిస్తారు.
1. వెలుపల మైక్రోమీటర్ : తీగలు, కమ్ములు వంటి వాటిని కొలవడానికి ఉపయోగిస్తారు.
2. లోపలి మైక్రోమీటర్లు : రంధ్రముల వ్యాసం (డయామీటర్) కొలిచేందుకు ఉపయోగిస్తారు.
3. లోతు మైక్రోమీటర్లు : స్లాట్స్ అండ్ స్టెప్స్ యొక్క లోతులను కొలవడానికి ఉపయోగిస్తారు.