మోనికా బేడి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మోనికా బేడీ
8వ ఆప్ కీ ఆవాజ్ మీడియా ఎక్సలెన్స్ అవార్డులు, 2013లో మోనికా బేడీ
జననం (1975-01-18) 1975 జనవరి 18 (వయసు 49)
చబ్బెవాల్, హోషియార్‌పూర్, పంజాబ్, ఇండియా
వృత్తి
  • నటి
  • టెలివిజన్ వ్యాఖ్యాత
క్రియాశీల సంవత్సరాలు1994–2017
భాగస్వామిఅబు సలేం (1999–2007)[1]

మోనికా బేడి (జననం 1975 18 జనవరి) భారతీయ నటి, టెలివిజన్ వ్యాఖ్యాత. ఆమె 1990ల మధ్యలో హిందీ చిత్రాలలో నటించింది. ఆమె ఖాతాలో ప్యార్ ఇష్క్ ఔర్ మొహబ్బత్ (2001), జోడి నెం.1 (2001)వంటి ఎన్నో విజయవంతమైన చిత్రాలు ఉన్నాయి. ఆమె బిగ్ బాస్ 2, ఝలక్ దిఖ్లా జా 2 లలో పాల్గొన్నది. అలాగే స్టార్ ప్లస్ ప్రసారం చేసిన సరస్వతీచంద్ర షోలో గుమాన్ కౌర్ వ్యాస్ పాత్ర పోషించడం ద్వారా ఆమె ప్రసిద్ధి చెందింది.

బాల్యం, విద్యాభ్యాసం[మార్చు]

ఆమె 1975 జనవరి 18న ప్రేమ్ కుమార్ బేడీ, శకుంతలా బేడీ దంపతులకు పంజాబ్‌లోని హోషియార్‌పూర్ జిల్లా చబ్బేవాల్ గ్రామంలో జన్మించింది. ఆమె తల్లిదండ్రులు 1979లో నార్వేలోని డ్రామెన్‌కి మారారు. ఆమె ఢిల్లీ విశ్వవిద్యాలయం నుండి 1995లో విద్యాభ్యాసం పూర్తి చేసింది.[2][3]

కెరీర్[మార్చు]

ఆమె డి. రామానాయుడు నిర్మించిన తెలుగు భాషా చిత్రం తాజ్ మహల్ (1995)తో నటన ప్రారంభించింది. ఆ తరువాత కూడా శివయ్య (1996), సోగ్గాడి పెళ్ళాం, సర్కస్ సత్తిపండు (1997), చూడాలని వుంది (1998) స్పీడ్ డాన్సర్‌ (1999)లో కూడా నటించింది.[4] 1995లో సురక్షతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది.

టెలివిజన్ రియాల్టీ షో అయిన బిగ్ బాస్ సీజన్ 2లో ఆమె పాల్గొంది.[5] ఆమె రియాల్టీ షోలు ఝలక్ దిఖ్లా జా 3, దేశీ గర్ల్ పోటీదారులలో ఒకరు.

యూనివర్సల్ మ్యూజిక్‌లో ఆధ్యాత్మిక సంగీత ఆల్బమ్ కోసం ఆమె "ఏకోంకర్" కీర్తనలను పాడింది.[6]

హర్జిత్ సింగ్ రికీ దర్శకత్వం వహించిన పంజాబీ చిత్రం సిర్ఫైర్ (2012)లో ఆమె నటించింది.

2013 నుండి 2014 వరకు, ఆమె స్టార్ ప్లస్ షో సరస్వతీచంద్రలో ఘుమ్మన్‌గా ప్రతికూల పాత్రను పోషించింది.

కారాగార శిక్ష[మార్చు]

సెప్టెంబరు 2002లో, నకిలీ పత్రాలపై దేశంలోకి ప్రవేశించినందుకు పోర్చుగల్‌లో ఆమెతో పాటు అబూ సలేం అనే భారతీయ గ్యాంగ్‌స్టర్ అరెస్టు చేయబడ్డారు.[7][8][9] ఆ తరువాత జైలు శిక్ష అనుభవించింది. 2006లో, కల్పిత పేరుతో పాస్‌పోర్ట్ సంపాదించినందుకు ఆమెని భారత న్యాయస్థానం దోషిగా నిర్ధారించింది.[10][11] నవంబర్ 2010లో, భారత సుప్రీంకోర్టు ఆమె నేరారోపణను సమర్థించింది, అయితే ఆమె అప్పటికే శిక్ష అనుభవించిన కాలానికి జైలు శిక్షను తగ్గించింది.[12][13]

మూలాలు[మార్చు]

  1. Bedi, Aneesha (3 July 2015). "I am happy for him, says Abu Salem's ex-partner Monica Bedi on his impending marriage". Hindustan Times (in ఇంగ్లీష్). Archived from the original on 13 February 2021. Retrieved 1 January 2021.
  2. "The tale of Monica Bedi". The Times of India. Archived from the original on 16 July 2013. Retrieved 13 February 2013.
  3. "जेलर पर लगा था इस एक्ट्रेस के बाथरूम में कैमरे लगाने के आरोप, अंडरवर्ल्ड डॉन से भी जुड़ा नाम". Rajasthan Patrika (in హిందీ). 19 January 2020. Retrieved 15 January 2021.
  4. "Monica Bedi makes Telugu producers wary". The Times of India. Archived from the original on 11 April 2013. Retrieved 13 February 2013.
  5. IANS (6 September 2008). "Monica Bedi bids adieu to Bigg Boss". Sify. Archived from the original on 22 October 2012. Retrieved 20 September 2011.
  6. "Monica Bedi turns singer!". The Times of India. Archived from the original on 11 April 2013. Retrieved 13 February 2013.
  7. Kumar, Vinay (29 November 2003). "Abu Salem, Monica Bedi sentenced to jail in Portugal". The Hindu. Archived from the original on 7 December 2003. Retrieved 5 October 2012.
  8. "Monica Bedi writes pardon letter to PM". The Times of India. Press Trust of India. 7 November 2004. Archived from the original on 3 January 2013. Retrieved 22 April 2012.
  9. "The tale of Monica Bedi". The Times of India. 10 August 2005. Retrieved 27 September 2016.
  10. "Monica Bedi lives tough life in jail". CNN-IBN. 1 October 2005. Archived from the original on 2 February 2014. Retrieved 22 April 2012.
  11. "Top 10 Celebrities and Their Run-ins With the Law". The New Indian Express. 25 February 2016. Archived from the original on 11 మే 2016. Retrieved 27 September 2016.
  12. "Fake Passport Case: SC Upholds Bedi's Conviction". Outlook. 9 November 2010. Archived from the original on 2 February 2014. Retrieved 5 October 2012.
  13. "Supreme Court upholds Monica Bedi's conviction in fake passport case". Daily News and Analysis. 9 November 2010. Retrieved 27 September 2016.