మోహన్ జునేజా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

మోహన్ జునేజా (1967 నవంబరు 14 - 2022 మే 7) (కన్నడం: ಮೋಹನ್ ಜುನೇಜಾ) (ఆంగ్లం: Mohan Juneja) కన్నడ సినీ నటుడు. కన్నడంతో పాటు తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో అయిదు వందలకు పైగా సినిమాల్లో ఎన్నో విలక్షణ పాత్రలు పోషించాడు.[1] హాస్య నటుడిగా, విలన్ గా ఆలరించాడు. వాల్ పోస్టర్ సినిమా ద్వారా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ఆయన ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన కేజీఎఫ్(2018), కేజీఎఫ్ - 2 (2022) చిత్రాలలో కీ రోల్ లో నటించి మెప్పించాడు. సినిమాలతో పాటు పలు సీరియల్స్ లో కూడా ఆయన నటించారు.

కెరీర్[మార్చు]

1967 నవంబర్ 14న బెంగళూరులో మోహ‌న్ జునేజా జన్మించాడు. ఆయ‌న తండ్రి సివిల్ ఇంజ‌నీర్‌. చదువుకునే రోజుల్లో మంచి మార్కులు తెచ్చుకునే మోహన్ జునేజా తండ్రిలాగే కొడుకు కూడా ఇంజనీర్ అవుతాడనుకున్నారు. కానీ, మోహ‌న్ జునేజా స్కూల్, కాలేజీల దగ్గర సినిమా థియేటర్లలో రోజూ మూడు సినిమాలు చూస్తూ గడిపేవాడు. దాంతో తండ్రి డబ్బు ఇవ్వడం మానేశాడు. డబ్బు కోసం రకరకాల పనులు చేయాల్సి వచ్చింది. ఆ తరువాత నటనపై మ‌క్కువతో నాట‌క కంపెనీలో చేరి న‌టుడిగా రాణించాడు. అలా మోహన్ జునేజా నడక పూల పూలదారి కాదు. తన కల నెరవేరడానికి చాలా కష్టమైన మార్గాన్ని ఎంచుకున్నాడు.

మరణం[మార్చు]

54 ఏళ్ల మోహన్ జునేజా అనారోగ్యంతో ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బెంగళూరులో 2022 మే 7న మృతి చెందాడు.[2]

మూలాలు[మార్చు]

  1. "ನಿಧನರಾದ ಮೋಹನ್ ಜುನೇಜಾ ಹೂವಿನ ಹಾದಿಯಲ್ಲಿ ನಡೆದು ಬಂದವರಲ್ಲ – Public TV". web.archive.org. 2022-05-08. Archived from the original on 2022-05-08. Retrieved 2022-05-08.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  2. "Mohan Juneja: 'కేజీయఫ్‌' నటుడు కన్నుమూత". web.archive.org. 2022-05-08. Archived from the original on 2022-05-08. Retrieved 2022-05-08.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)