రామాపురం (రేవూరు)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
రామాపురం
—  రెవిన్యూ గ్రామం  —

Lua error in మాడ్యూల్:Location_map at line 391: A hemisphere was provided for longitude without degrees also being provided.

రాష్ట్రం తెలంగాణ
జిల్లా నల్గొండ
మండలం మేళ్లచెరువు
ప్రభుత్వం
 - సర్పంచి
పిన్ కోడ్
ఎస్.టి.డి కోడ్

గ్రామ జనాభా[మార్చు]

       రామాపురం, సూర్యాపేట జిల్లా, మేళ్లచెరువు మండలానికి చెందిన గ్రామం. పిన్ కోడ్: 508246. రామాపురం మేళ్లచెరువు మండలంలోనే రెండవ అతి పెద్ద గ్రామం. రామాపురంలో ప్రభుత్వ పాఠశాల (శిశు తరగతి నుండి పదవ తరగతి వరకు) ఉంది. అంతే గాక ఇంకా ప్రైవేటు పాఠశాలలు కూడా ఉన్నాయి. రామాపురానికి తూర్పు భాగంలో సున్నపురాయి వేలఎకరాల్లో పరచుకుని ఉంది. ఇపుడు సింమెంట్ పరిశ్రమల ఆధీనంలోకి వెళ్లాయి. తూర్పు భాగంలో ఉన్న నల్లరేగడి భూములే రామాపురానికి ప్రధాన . ఊరు పక్కే ప్రవహించే నాగర్జున సాగర్ ఎడమ కాలవ ఆసరాగా వందల ఎకరాల్లో వరి,పత్తి,మిరప,కంది పండుతుంది. చెరువు కింద మాగాణి ఉంది ఛెరువు గట్టు మీద ఒక ఆంజనేయ స్వామి గుడి ఉంది. ఇక రామాపురంలో ఉన్న సామాజిక పరిస్థితులు చుట్టుపట్టు మరే ఊరిలో ఉండవు. రామాపురం చుట్టూ సిమెంట్ పరిశ్రమలు (ప్రియా,భీమ,కాకతియ) వెలిసినవి. రామాపురంలో దాదాపు ప్రధాన వీధులన్నీ సిమెంటు వీధులుగా మార్చబడ్డాయి.గ్రామంలో రక్షిత మంచి నీటి పథకం అమలులో ఉంది. గ్రామంలో ప్రతి వీధిలో మంచినీటి కుళాయిలు ఉన్నాయి. ఇంటింటికి త్రాగు నీటి కుళాయిల సౌకర్యం కల్పించటం కూడా జరిగింది.రామాపురం గ్రామంలో రామాలయం,వినాయకుని గుడి,సాయి బాబా గుడి, ముత్యాలమ్మ గుళ్లు ఉన్నాయి. ఈ గ్రామంలో హిందూ దేవాలయాలతో పాటు ఒక మసీదు, చర్చిలు కూడా ఉన్నాయి.అన్ని పండుగలను భక్తి శ్రధ్దలతో జరుపుకుందురు. ముఖ్యమైన పండుగలు దసరా, సంక్రాంతి, శ్రీరామనవమి, శివరాత్రి, ముక్కోటి ఏకాదశి. ముక్కోటి ఏకాదశికి రామాలయంలో 24 గంటల హరే రామ సంకీర్తన చేస్తారు. శ్రీ రామ నవమికి శ్రీరాముని కళ్యాణం చేసి కళ్యాణానికి వచ్చిన భక్తులకు పానకం పులిహోరను ప్రసాదముగా పంచుతారు.హిందువుల పండుగలే కాక ముస్లిం సోదరులు రంజాన్, ఈద్-ఉల్-ఫితర్ లను క్రైస్తవ సోదరులు క్రిస్మస్, గుడ్ ఫ్రైడే లను జరుపుకొంటారు.ఈ గ్రామం జాతీయ రహదారి-65 కి 15 కి.మీ.ల దూరంలో ఉంటుంది.

రామాపురం అంటే రాముని యొక్క పురం రాముని యొక్క పురాన్ని ఆంజనేయ స్వామి ఎలా కాపాడాడు అనే ఒక చరిత్ర కూడా ఉంది అది ఏమిటి అంటే పూర్వము ఒక దొంగల ముఠా ఊరిలొకి చెరువు గట్టు మీదుగ వస్తు వుంటే వెనుకనుంచి "ఊరిలొకి దొంగలు వస్తున్నరు" అనే ఒక శబ్దం వినపడింది ఆ దొంగలు వెనుకకు తిరిగి చూస్తే ఎవరు లేరు వారికి ఒక సన్న రాతి బండ మీద ఆంజనేయ స్వామి వెలసినట్టు కనపడ్డాడు ఆప్పుడు వాళ్ళు ఆ శబ్దం ఆంజనేయ స్వామి చేసాడని తెలిసి ఆ రాతి బండని గొడ్డళ్ళతో సగానికి నరికేసి ముందుకి వెళ్ళారు ఆ తర్వాత మళ్ళి అదే శబ్దం వినపడింది ఆ దొంగలు వెనుకకు తిరిగి చూస్తే ఈ సారి పెద్ద రాతి బండ మీద ఆంజనేయ స్వామి వెలసినట్టు కనపడ్డాడు ఈ సారి వాళ్ళకి భయమెసి వెనుకకు తిరిగి పారిపొతుంటే ఆంజనేయ స్వామి వాళ్ళని మూడు పెద్ద రాతి బండలు విసిరి అంతమొందించాడు. ఆ సగానికి నరికెసిన ఆంజనేయు స్వామి విగ్రహం ముక్కలు ఇప్పటికి ఉన్నాయి ప్రతి సంవత్సరం అక్కడ పూజలు చేస్తారు,ఆ పెద్ద మూడు రాతి బండలు ఇప్పటికి చెరువు ఒడ్డున మనం చూడవచు, అదే నిధంగా మరొసారి ఆంజనెయ స్వామి చెరువు గట్టు తెగి పొతుండగ దానికి అడ్డుగ రాళ్ళు వెసి నీళ్ళు ఊరి మీదకు రాకుండ ఊరిని కాపాడాడు అని ఊరి పూర్వికులు చెబుతూ ఉంటారు.