లక్ష్మీ కిరణ్
లక్ష్మీ కిరణ్ | |
---|---|
జననం | |
వృత్తి | రంగస్థల, టీవి, సినిమా నటులు. |
లక్ష్మీ కిరణ్ (ములుగు లక్ష్మీనర్సింహారావు) తెలంగాణ రాష్ట్రానికి చెందిన రంగస్థల, టీవి, సినిమా నటుడు.
జననం
[మార్చు]లక్ష్మీకిరణ్ 1974, సెప్టెంబర్ 12న వెంకటరావు, అమృతాబాయి దంపతులకు తెలంగాణ రాష్ట్రం, సిద్ధిపేట జిల్లా, వర్గల్ మండలంలోని వేలూరు లో జన్మించాడు.
విద్యాభ్యాసం
[మార్చు]బాల్య విద్య వేలూర్లోనే చదివిన లక్ష్మీకిరణ్, హైదరాబాద్ కి వచ్చి సర్ధార్ పటేల్ కాలేజీలో డిగ్రీ పూర్తిచేశాడు. ఉస్మానియా విశ్వవిద్యాలయం లో ఎంఏ థియేటర్‌ఆర్ట్స్‌లో పట్టాపొందాడు.[1]
నాటకరంగం
[మార్చు]లక్ష్మీ కిరణ్ ది కరణం కుటుంబం. దాంతో చిన్నప్పటినుండే తెలుగు సాహిత్యంపై పట్టు వచ్చింది. చిన్ననాటి తెలుగు గురువు నర్సయ్య సార్ ప్రోత్సాహంతో పద్యపఠనం, పద్య రచనలో మెళకువలు నేర్చుకున్నాడు. నటనపై మక్కువతో హైదరాబాద్‌లో అడుగుపెట్టాడు. డిగ్రీ పూర్తిచేసి, ఎంఏలో చేరాడు. అక్కడ విశ్వవిద్యాలయ నాటకాలలో నటించాడు. శాపగ్రస్తులు నాటకంలో నటించి ఉత్తమ నటుడి అవార్డు కూడా అందుకున్నాడు.
టివీరంగం
[మార్చు]కళారంగంపై మక్కువతో ఒడిదుడుకులను ఎదుర్కొని టీవీలో చిన్నచిన్న పాత్రలకు ఎంపికయ్యాడు. ఈటీవీలో తూర్పుకువెళ్లే రైలు, భార్యామణి, అంతఃపురం, చంద్రముఖి, నాపేరు మీనాక్షి, మా టీవీ లో అష్టాచెమ్మా, జెమిని టీవీలో ఫ్రెండ్స్, మమతల కోవెల వంటి సీరియల్స్ లో నటించాడు. కొత్తగా వస్తున్న ధారావాహికలలో కూడా నటిస్తున్నాడు. సువర్ణభూమి, పాల్కాన్, శ్రీరామ్‌చిట్స్ వంటి వ్యాపార ప్రకటనలలో నటించాడు.
ఎంతోమందిని ఆకట్టుకుంటున్న జబర్దస్త్ కార్యక్రమంలో రాకెట్ రాఘవ, చమ్మక్ చంద్ర, రచ్చ రవి, శకలక శంకర్ బృందాలలో విభిన్న పాత్రలు పోషిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నాడు.
సినీరంగం
[మార్చు]పవర్, గబ్బర్‌సింగ్-2, పిట్టగోడ, ఇంటలిజెంట్ ఇడియట్స్, ప్రేమంత సులువుకాదు, ఓసీ, హిందీలో ఇష్క్యే హైదరాబాద్ తదితర సినిమాల్లోనూ నటించాడు.
వెంకట లక్ష్మీనరసింహ క్రియేషన్స్ అనే బ్యానర్ తో నిర్మాణ సంస్థను స్థాపించి ప్రేమమయం అనే సినిమా తీశాడు.
అవార్డులు
[మార్చు]- 2007 పరుచూరి రఘుబాబు స్మారక నాటక పరిషత్తు లో ఖాజా పాషా రచించి, దర్శకత్వం వహించిన శాపగ్రస్తులు నాటకంలోని నటనకు ఉత్తమ నటుడు అవార్డు లభించింది
- 2009లో టీవీ నందీ అవార్డులకు గాను విప్రనారాయణ పాత్రకు నందీ అవార్డు లభించింది
- 2014లో నందీ అవార్డుల జ్యూరీ మెంబర్‌గా ఎన్నికయ్యాడు
- రకరకాల వేదికలపై దాదాపు నూటయాభైకి పైగా అవార్డులు అందుకున్నాడు
ఇతర వివరాలు
[మార్చు]- AREA (Art Related Experimental Association)అనే నాటక సంస్థకి 2004 నుండి వ్వవస్థాపక సంయుక్త కార్యదర్శిగా గా ఉంటూ..అనేక నాటన ప్రదర్శనలిచ్చి, ఔత్సాహిక కళాకారులకి అవకాశాల్ని కలిపిస్తున్నాడు
- తెలంగాణ (సిద్దిపేట జిల్లా) గ్రామీణ ప్రాంతాల్లోని చిన్నారులకు నాటకరంగ గొప్పదనాన్ని, జీవితానికి నాటకం యొక్క అవసరాన్నీ.. దానివల్ల వ్యక్తిత్వవికాసాన్ని పొందేలా..వర్క్ షాప్ప్ ఏర్పాటు చేస్తున్నాడు
మూలాలు
[మార్చు]- ↑ నమస్తే తెలంగాణ. "బుల్లితెరపై వేలూరి బుల్లోడు..!". Retrieved 2 March 2017.[permanent dead link]