లీనా (మలయాళ నటి)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
లీనా
2022లో లీనా
జననం
లీనా మోహన్ కుమార్

1981 (age 42–43)
త్రిస్సూర్, కేరళ, భారతదేశం
వృత్తి
  • నటి
  • రచయిత
  • స్క్రిప్ట్ రైటర్
క్రియాశీల సంవత్సరాలు1998–ప్రస్తుతం
జీవిత భాగస్వామి
అభిలాష్ కుమార్
(m. 2004; div. 2013)
ప్రశాంత్ బాలకృష్ణన్ నాయర్ (వ్యోమగామి)
(m. 2024)

లీనా మోహన్ కుమార్ (ఆంగ్లం: Lena Mohan Kumar; జననం 1981), ఒక భారతీయ నటి, రచయిత్రి, స్క్రిప్ట్ రైటర్.[1][2] ఆమె ప్రధానంగా మలయాళం సినిమాలో కనిపిస్తుంది. సినిమారంగంలో లీనాగా పిలువబడే ఆమె, తన 25 సంవత్సరాల కెరీర్‌లో, ఇంగ్లీష్, హిందీ, తమిళం, తెలుగు, మలయాళం భాషలలో 175 చిత్రాలకు పైగా పనిచేసింది. ఇందులో బ్లాక్‌బస్టర్‌లు అలాగే విమర్శకుల ప్రశంసలు పొందిన చిత్రాలు చాలానే ఉన్నాయి.[3][4]

2023లో, ఆమె రచయితగా తన మొదటి పుస్తకం ది ఆటోబయోగ్రఫీ ఆఫ్ గాడ్ పేరుతో ప్రచురించింది. ఈ పుస్తకం మానసిక ఆరోగ్యంపై ఆమె ప్రయాణం, దృక్కోణాలను కవర్ చేసింది.[5] 2020లో, ఆమె కొత్త ప్రాజెక్ట్ తన మొదటి డ్రాఫ్ట్‌ను పూర్తి చేసి త్వరలో దర్శకత్వ అరంగేట్రం కూడా చేయనున్నానని చెప్పింది.[6]

2017లో వచ్చిన తెలుగు సినిమా డా. చక్రవర్తి, తెలుగు వెబ్​సిరీస్‌ సైతాన్ (2023)లలో ఆమె నటించింది.[7]

కెరీర్[మార్చు]

ఆమె జయరాజ్ స్నేహంలో తన అరంగేట్రం చేసింది, ఆ తర్వాత విమర్శకుల ప్రశంసలు పొందిన కరుణమ్ (2000)లో నటించింది. దీనికి ముందు, ఆమె ఓమనతింకల్పక్షి, ఓహరి, మలయోగం, తడంకల్పాళయం వంటి సీరియల్‌లతో మలయాళ టెలివిజన్ పరిశ్రమలో ప్రధాన నటిగా స్థిరపడింది. ఆమె ఒక టెలివిజన్ హోస్ట్, యూట్యూబ్ ఛానెల్‌ని కూడా నిర్వహిస్తోంది.[8]

విమర్శకుల ప్రశంసలు పొందిన చిత్రం ట్రాఫిక్ (2011)లో ఆమె నటనకు మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత ఆమె స్నేహవీడు, ఈ అడుతా కాలం, స్పిరిట్, లెఫ్ట్ రైట్ లెఫ్ట్, ఎన్ను నింటే మొయిదీన్ వంటి చిత్రాలలో సహాయక పాత్రల్లో నటించింది.[9] ఆదిల్ హుస్సేన్ తో కలిసి ఆమె నథాలియా శ్యామ్ దర్శకత్వం వహించిన ఫుట్‌ప్రింట్స్ ఆన్ వాటర్ (Footprints On Water)అనే బ్రిటిష్-ఇండియన్ ఫీచర్‌లో కూడా ఆమె నటించింది.[10]

వ్యక్తిగత జీవితం[మార్చు]

లీనా కేరళలోని త్రిస్సూర్‌లో సెవెంత్ డే అడ్వెంటిస్ట్ హయ్యర్ సెకండరీ స్కూల్‌లో, హరి శ్రీ విద్యా నిధి స్కూల్‌లలో చదివింది.[11] ఆమె క్లినికల్ సైకాలజీలో పోస్ట్-గ్రాడ్యుయేట్ పట్టాపుచ్చుకుని ముంబైలో క్లినికల్ సైకాలజిస్ట్‌గా పనిచేసింది. అయితే, ఆమె నటిగా స్థిరపడాలనే కోరికతో తన ఉద్యోగాన్ని విడిచిపెట్టింది.[12]

2004లో, ఆమె అభిలాష్ కుమార్‌ను వివాహం చేసుకుంది. అయితే, ఈ జంట 2013లో విడాకులు తీసుకుంది.[13] 2024 ఫిబ్రవరి 27న వ్యోమగామి ప్రశాంత్ నాయర్‌ని వివాహం చేసుకున్నట్లు ఆమె ప్రకటించింది.[14]

మూలాలు[మార్చు]

  1. Saigal, Geetika. "Filmfare Awardee Lenaa Kumar releases her debut book on self-realisation, published by Geetika Saigal's Beeja House". Business Standard. Business Standard. Retrieved 9 February 2024.
  2. Soman, Deepa. "Lena turns scriptwriter with Arjun Ashokan-starrer Olam – Times of India". The Times of India. Archived from the original on 17 July 2021. Retrieved 17 July 2021.
  3. Joy, Jerin. "Can't believe it's been 25 years in Malayalam cinema". ON Manorama. Manorama. Retrieved 9 February 2024.
  4. Jayaram, Deepika. "Acting in Tamil is a win-win situation for Malayali actors: Lena – Times of India". The Times of India. Archived from the original on 23 January 2019. Retrieved 8 August 2020.
  5. Nabiyar, Mahima. "I was a Buddhist monk in my previous birth". The Times of India. Times Entertainment. Retrieved 9 February 2024.
  6. "Lena: In the lockdown, I finished scripting the first draft for my directorial debut – Times of India". The Times of India. Archived from the original on 14 December 2020. Retrieved 15 December 2020.
  7. Eenadu (18 June 2023). "రివ్యూ: సైతాన్‌ (వెబ్‌సిరీస్‌)". Archived from the original on 18 June 2023. Retrieved 18 June 2023.
  8. "അടിപൊളി ലുക്കിൽ ലെനയുടെ നേപ്പാൾ യാത്ര; വൈറലായി വിഡിയോ | lenas magazine | lena nepal journey | lena baldy look". Archived from the original on 5 November 2020. Retrieved 8 August 2020.
  9. She is no cry baby The Hindu Entertainment, Thiruvananthapuram
  10. "Nimisha Sajayan, Lena Kumar join Adil Hussain in 'Footprints on Water'". 30 October 2020. Archived from the original on 1 November 2020. Retrieved 30 October 2020.
  11. Sebastian, Shevlin (22 April 2012). "Lena is a Gorgeous Woman". The New Indian Express. Archived from the original on 27 December 2015. Retrieved 27 July 2015.
  12. She is no cry baby The Hindu Entertainment, Thiruvananthapuram
  13. "Lena: Lena says she parted ways with her ex-husband in a friendly – Times of India". The Times of India. Retrieved 14 August 2023.
  14. Staff (27 February 2024). "Actor Lena reveals her marriage to Gaganyaan pilot Prasanth Nair". The News Minute.