వత్సవాయి బుచ్చి సీతాయమ్మ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

వత్సవాయి బుచ్చి సీతాయమ్మ పెద్దాపురం సంస్థానానికి చెందిన మహారాణి. ఈమె పెద్దాపురం సంస్థానాన్ని (1828 - 1833) మధ్యకాలంలో పరిపాలించిన శ్రీ వత్సవాయి రాజా రాయ జగపతి భార్య

పాలనా కాలం

[మార్చు]

శ్రీ వత్సవాయ రాయ జగపతి మహారాజు గారు పెద్దాపురం సంస్థానాన్ని 1797 నుండి 1804 వరకూ పరిపాలించి మరణించిన తరువాత, బుచ్చి సీతాయమ్మ పెద్దాపురం సంస్థానాన్ని 1828 నుండి 1833 వరకూ పరిపాలించారు [1]

మహారాణీ సత్రం నిర్మాణం

[మార్చు]

అన్నార్తుల ఆకలి తీర్చేందుకే, రాజ్యాధికారం చేపట్టిన రెండేళ్ళ వ్యవధిలోనే 1828 లో పెద్దాపురంలో అమ్మన్న అనే పెద్ద జమీందారు యొక్క ఇల్లు స్వాధీనం చేసుకుని, సత్రాన్ని నిర్మించి, ఆ సత్రానికి నిర్వహణ నిమిత్తం ఐదు వందల ఎకరాల సుక్షేత్రమైన వ్యవసాయ స్థలాన్ని కేటాయించింది. వెనువెంటనే ఒంటిమామిడిలో మరొక సత్రాన్ని (ఈ సత్రం ఇప్పుడు కత్తిపూడికి మార్చబడింది) నిర్మింపచేసింది. నేటికీ ఈ సత్రాల ద్వారా ఎందరో పాదచారులు మరెందరో పేద విద్యార్థులు మూడుపూటలా కడుపు నిపుకుంటున్నారు.[2]

మహారాణీ కళాశాల

[మార్చు]

ఆ తరువాతి కాలంలో వ్యవసాయ స్థలం ద్వారా వచ్చే ఆదాయంలో సత్రాల నిర్వహణకు పోగా మిగులు నిధులను - ఉన్నత విద్యకోసం వేరు ప్రాంతాలకు వలస పోతున్న విద్యార్థుల సౌకర్యార్దం 1967 సంవత్సరంలో బుచ్చి సీతాయమ్మ గారి జ్ఞాపకార్ధం పెద్దాపురంలో శ్రీ రాజా వత్సవాయి బుచ్చి సీతాయమ్మ జగపతి బహద్దూర్ మహారాణీ కళాశాల నిర్మాణం జరిగింది - ఈ నిర్మాణానికి శ్రీ రాజా వత్సవాయి కృష్ణమరాజ బహద్దరు గారు, భారతీయ సంస్కృతీ ధర్మ పరిరక్షకులు, శ్రీ..ఎస్.బి.పి.బి.కె.సత్యనారాయణ రావు గారు ప్రముఖ పాత్ర వహించారు. ఈ రెండు సత్రాలను 1969 వ సంవత్సరంలో జిల్లా పరిషత్ నుండి దేవాదాయ ధర్మాదాయ శాఖ వారు స్వాధీనం చేసుకుని అన్నదానాన్ని నిరంతరాయంగా కొనసాగిస్తున్నారు.[2][3]

మూలాలు

[మార్చు]
  1. పెద్దాపుర సంస్థాన చరిత్రము, వత్సవాయ రాయజగపతి వర్మ, పేజి నం 89
  2. 2.0 2.1 ఆంధ్ర సంస్థానములు - సాహిత్య పోషణము - డా . తూమాటి దొప్పన్న - పేజి 277
  3. కాశీయాత్ర చరిత్ర, యేనుగుల వీరాస్వామయ్య , పుట 341