వర్గం చర్చ:కాల్షియం సమ్మేళనాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

అక్షరభేదాలుతో రెండు వర్గాలు[మార్చు]

చదువరి గారూ, వెంకటరమణ గారూ, వర్గం:కాల్సియం సమ్మేళనాలు, వర్గం:కాల్షియం సమ్మేళనాలు అనే రెండు వర్గాలు ఉన్నవి. వీటిలో రెండవ వర్గం శీర్షిక సరియైంది అని నేను భావిస్తున్నాను.నేను భావించిన వర్గం సరియైన వర్గం అయినయెడల మొదటి వర్గాన్ని తొలగించడంతోపాటు,ఆ వర్గంలో ఉన్న 12 వ్యాసాలు శీర్షికలు 'కాల్సియం' నుండి 'కాల్షియం'గా తరలింపు చేయాల్సిఉంది.స్పందించగలరు.--యర్రా రామారావు (చర్చ) 08:43, 11 జనవరి 2021 (UTC)[ప్రత్యుత్తరం]

యర్రా రామారావు గారూ, ఇలాంటి కొన్ని పదాలను మనం ఉచ్చరించే విధానానికి, బయటి వారు ఉచ్చరించే విధానానికీ తేడా ఉంటోంది. మనం కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం అంటాం, పాశ్చాత్యులు కాల్సియం, పొటాసియం, మెగ్నీసియం అంటారు. తెవికీలో కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం అనే అనాలని నా అభిప్రాయం. Chaduvari‎__09:36, 11 జనవరి 2021 (UTC)[ప్రత్యుత్తరం]

వర్గం:కాల్సియం సమ్మేళనాలు, వర్గం:కాల్షియం సమ్మేళనాలు వర్గాలలో ప్రస్తుతం వివిధ పాఠ్యపుస్తకాలలో వాడకం ప్రకారం "కాల్షియం" సరైనది. కనుక వర్గం:కాల్షియం సమ్మేళనాలు ఉంచి వర్గం:కాల్సియం సమ్మేళనాలు లోని వ్యాసాలలో వర్గం పేరును మార్చాలి. ఖాళీ అయిన తరువాత ఆ వర్గాన్ని దారిమార్పు చేయాలి. – K.Venkataramana  – 02:06, 12 జనవరి 2021 (UTC)[ప్రత్యుత్తరం]

వెంకటరమణ గారూ ఈ వర్గంలో ఉన్నపేజీలు కాల్షియం అనే పదంతో తరలించటానికి అన్నీ 'ఓకె' నా? వాటిలో ఏపేజీలకైనా శీర్షికలు పూర్తిగా మారతాయా?తెలియజేయగలరు. యర్రా రామారావు (చర్చ) 07:54, 14 జనవరి 2021 (UTC)[ప్రత్యుత్తరం]
యర్రా రామారావు గారూ, అన్ని వ్యాసాలలో "కాల్సియం" బదులుగా "కాల్షియం" అని మార్చాలి. అదే విధంగా వర్గాలలో కూడా మార్చాలి. గూగుల్ శోధనలో "కాల్షియం" కు 20,60,00,000కు పైగా ఫలితాలు, "కాల్సియం" కు 6,76,000కు పైగా ఫలితాలు ఉన్నాయి. ఎక్కువగా శాస్త్ర గ్రంధాలలో,పాఠ్య పుస్తకాలలో వాడుతున్న పదం "కాల్షియం". కనుక "కాల్షియం" కు మార్చాలని నా ఉద్దేశ్యం. వీటిని సృష్టించిన వాడుకరి:Palagiri గారు వారి స్పందన తెలియజేస్తే బాగుంటుంది. – K.Venkataramana  – 16:46, 20 జనవరి 2021 (UTC)[ప్రత్యుత్తరం]
Palagiri గారు స్పందన కోసం వేచి చూడగా ఇంతవరకు రాలేదు.చర్చ ప్రకారం అన్ని వ్యాసాలలో "కాల్సియం" బదులుగా "కాల్షియం" అని తరలించి, కాల్సియం సమ్మేళనాలు అనే వర్గాన్ని సాప్ట్ వర్గంగా దారిమార్పు చేసాను. యర్రా రామారావు (చర్చ) 08:49, 5 ఫిబ్రవరి 2021 (UTC)[ప్రత్యుత్తరం]