వావిలాల సుబ్బారావు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
వావిలాల సుబ్బారావు
జననం (1940-06-23) 1940 జూన్ 23 (వయసు 83)
జాతీయతభారతీయుడు
వృత్తిరచయిత, పరిశోధకుడు, విశ్రాంత అధ్యాపకుడు
ప్రసిద్ధిచలం సాహిత్యం, బౌద్ధ సాహిత్యం
తండ్రివావిలాల నరసింహారావు
తల్లిసత్యవతమ్మ

వావిలాల సుబ్బారావు తెలుగు రచయిత, పరిశోధకుడు. అధ్యాపకుడు.

జీవిత విశేషాలు[మార్చు]

ఇతడు వావిలాల నరసింహారావు, సత్యవతమ్మ దంపతులకు జన్మించాడు. ఇతని తండ్రి వావిలాల నరసింహారావు కవి, పండితుడు. అతడు సౌదామిని, విక్రమార్క, రుద్రమదేవి మొదలైన పద్యకావ్యాలు రచించాడు. సుబ్బారావు ప్రాథమిక విద్యాభ్యాసం అమరావతిలో గడిచింది. గుంటూరు హిందూ కళాశాలలో, ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఉన్నత విద్యాభ్యాసం చేశాడు. వావిలాల సోమయాజులు, పిల్లలమర్రి హనుమంతరావు, ఎక్కిరాల కృష్ణమాచార్యల శిష్యరికంలో ఇతడు తెలుగు సాహిత్యం పట్ల అభిరుచిని పెంచుకున్నాడు. గుడిపాటి వెంకటచలం సమగ్ర కథానికా సాహిత్యంపై పరిశోధన చేసి పి.హెచ్.డి. పట్టాని, ఉత్తమ థీసిస్ గ్రంథంగా స్వర్ణపతకాన్ని సంపాదించాడు. ఇతడు అధ్యాపకునిగా వివిధ కళాశాలలో పనిచేసి పదవీ విరమణచేసి అమరావతిలో స్థిరపడ్డాడు.

రచనలు[మార్చు]

  1. చలంగారి కథానికా సాహిత్యము, అనుశీలనము
  2. చలం ఇంకా..! ఇంకా...!
  3. ఆచార్య నాగార్జున లేఖలు
  4. మన అమరావతి కైఫీయతు
  5. ధమ్మపదం నవనీతం
  6. చలం నీడ చెప్పిన కథ (నవల)
  7. గాంధేయం (సంపాదకత్వం)
  8. చలం సాహిత్య సంగ్రహం (సి.ధర్మారావుతో కలిసి)
  9. బోధి చర్యావతారం
  10. Gadaba, The Language and The People (డి.ఆర్. పట్నాయిక్‌తో కలిసి)

మూలాలు[మార్చు]