వికీపీడియా:కొత్త వాడుకరులను నిలుపుకునే ప్రాజెక్టు ప్రతిపాదన

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

వికీపీడియాలో ఏటా రెండు వేలకు పైబడి కొత్త వాడుకరులు చేరుతూ ఉన్నారు. వివిధ సంవత్సరాల్లో నేరుగా తెవికీలో నమోదైన కొత్త వాడుకరుల సంఖ్యను కింది పట్టికలో చూడవచ్చు. సింగిల్ సైనాన్ ద్వారా ఆటోమాటిగ్గా నమోదైన వారి సంఖ్య దీనికి మూడు నాకుగు రెట్లు ఉంటుంది. అయితే వాళ్ళలో 99% మందికి తెలుగు వచ్చే అవకాశం ఉండదు కాబట్టి వాళ్ళను పట్టించుకోనక్కర్లేదు.

సంవత్సరం 2006 2007 2008 2009 2010 2011 2012 2013 2014 2015 2016 2017 2018 2019 2020 2021

(ఫిబ్ర 16 వరకు)

మొత్తం
నేరుగా తెవికీలో నమోదైన

కొత్త వాడుకరుల సంఖ్య

1,360 1,691 3,029 1,693 1,499 2,012 1,972 1,907 2,339 1,930 2,044 2,453 2,806 2,873 2,313 211 32,132



నమోదౌతున్న వాళ్ళు వేలల్లో ఉన్నా, దిద్దుబాట్లు చేస్తున్నవాళ్ళను వేళ్ళమీద లెక్కపెట్టవచ్చు. 2021 లో ఫిబ్రవరి 16 వరకు 211 మంది కొత్తగా నమోదు కాగా, కనీసం ఒక్క దిద్దుబాటైనా చేసినవాళ్ళు 42 మంది. ఐదు అంతకు మించి దిద్దుబాట్లు చేసినవారు 5 గురు మాత్రమే. 2020 లో 2313 మంది నమోదయ్యారు. కానీ ఒక్క దిద్దుబాటైనా చేసినది 425 మంది.

దిద్దుబాట్లు ఛేసేందుకు కొత్త వాడుకరులను ప్రోత్సహించి, తెవికీ అభివృద్ధికి వాళ్ళు తోడ్పడేందుకు ఏం చెయ్యాలో చర్చించి నిర్ణయించడం ఈ పేజీ ఉద్దేశం.

ఎందుకు నమోదు చేసుకుంటున్నారు, ఎందుకు అక్కడే ఆగిపోతున్నారు[మార్చు]

అసలు నమోదు ఎందుకు చేసుకుంటున్నారు?[మార్చు]

దిద్దుబాట్లు ఎందుకు చెయ్యడం లేదో ఆలోచించే ముందు, ఎందుకు నమోదు చేసుకుంటున్నారో అర్థం చేసుకోవాలి. నమోదు చేసుకునేవారంతా దిద్దుబాట్లు చేసే ఉద్దేశంతో చేసుకోవడం లేదేమోనని తోస్తోంది. నమోదుకు కారణాలు ఏమయ్యుంటాయంటే...

  1. దిద్దుబాటు చేసేందుకు (40% మంది ఉండవచ్చు)
  2. అజ్ఞాతంగా ఉంటే వికీపీడియా లోని కొన్ని అంశాలు అందుబాటులో ఉండవు, నమోదు చేసుకుంటే మరిన్ని అంశాలు అందుబాటు లోకి వస్తాయేమో ననే ఆలోచన (40% మంది ఉండవచ్చు)
  3. నమోదు చేసుకుంటే ఎమౌతుందో చూద్దామనే కుతూహలం (20% మంది ఉండవచ్చు)

నమోదు చేసుకున్నది ఎందుకైనా సరే.., వాళ్ళందరూ ఇక్కడ రాయవచ్చు. నమోదైన వాళ్లందరూ మన లక్ష్యంలో భాగమే.

మరి దిద్దుబాటు ఎందుకు చెయ్యడం లేదు[మార్చు]

నమోదయ్యాక వాళ్ళు దిద్దుబాటు ఎందుకు చెయ్యడం లేదని ఆలోచిస్తే కింది కారణాలు ఉండవచ్చని తెలుస్తోంది

  1. అసలు దిద్దుబాటు చేసే ఆసక్తే లేనందున
  2. దిద్దుబాటు చేద్దామంటే వికీపీడియా అంతా గందరగోళంగా ఉంది. సామాజిక మాధ్యమాల్లాగా సరళంగా కనిపించడం లేదు అనే భావన
  3. నాకు తెలిసిందే నలుసంత, ఇక నేనేం రాయగలను!? అనే ఊహ
  4. విజ్ఞాన సర్వస్వంలో రాయాలంటే విజ్ఞానం ఉండాలి కదా.. నాకు తెలిసిందల్లా సినిమాలే. వాటి గురించి కూడా రాస్తారా ఇక్కడ!? అనే ఆలోచన (సినిమాలు విజ్ఞాన సర్వస్వంలో భాగం కాదని కొంతమంది అనుకుంటారు)
  5. నాకు తెలుగులో రాయడం సరిగ్గా రాదు, తప్పులు పోతాయి, నామర్దాగా ఉంటది. అనే ఆలోచన

సమస్యను ఎలా ఎదుర్కొనాలి?[మార్చు]

పైన చూపిన సమస్యలను పరిష్కరించడమే సముదాయం చెయ్యాల్సిన పని. అందులో కొన్ని సూచనలు

  1. నమోదు కాగానే వారిని పరిచయం చేసుకోవాలి. నేను ఫలానా, మీకు తోడుంటాను, సాయం చేస్తాను. ఇక్కడ ఏ సందేహమున్నా నన్ను అడగండి అని చెబుతూ చేరువ కావాలి. సాన్నిహిత్య భావన కలిగించాలి
  2. సరళమైన తేలికైన పద్ధతిలో వికీపీడియాతో పరిచయం కలిగించాలి.
  3. కనీసమాత్రపు విషయాలతోనే మొదలుపెట్టాలి. అన్నీ ఒక్కసారే చెప్పేసి హడలగొట్టెయ్యకూడదు.
  4. ఒక FAQ తయారు చెయ్యాలి. కొత్తవారికి మాత్రమే సరిపోయేలా ఉండాలిది.

ప్రస్తుతం మనమేం చేస్తున్నాం[మార్చు]

  1. కొత్త సభ్యులకు స్వాగతం పలుకుతున్నాం
  2. అడపా దడపా మంచి మార్పులు చేసిన కొంత మంది సభ్యుల చర్చా పేజీల్లో రాస్తున్నాం

వికీమీడియా వారి "గ్రోత్" ప్రాజెక్టు ప్రతిపాదన[మార్చు]

కొత్త వాడుకరులకు వికీపీడియా గురించి నేర్పి వారిని వికీలో నిలబెట్టుకునే ప్రాజెక్టు ఒకదాన్ని మొదలుపెట్టాలి. అనుభవజ్ఞులైన వాడుకరులు అందులో స్వచ్ఛందంగా చేరి రోజూ కొంత సమయాన్ని ఇందుకు కేటాయిస్తారు. ఈ విషయమై వికీమీడియా ఫౌండేషను ఏర్పరచిన గ్రోత్ అనే బృందం ప్రత్యేకంగా ఒక ప్రాజెక్టును చేపట్టింది. కొత్త వాడుకరులను ప్రోత్సహించి వాళ్ళను నిలబెట్టుకునేలా చేసే ప్రాజెక్టు అది. ప్రస్తుతం అది అన్ని వికీపీడియాలకూ అందుబాటులో లేదు, కేవలం పది పదిహేను వికీపీడియాల్లోనే ఉంది. దాని లోని విశేషాలు టూకీగా ఇవి:

  1. శిష్యరికం పద్ధతిలో ఈ ప్రాజెక్టు నడుస్తుంది.
  2. కొత్తగా నమోదైన ప్రతీ వాడుకరికీ ఒక గురువును (మెంటర్) ప్రాజెక్టే ఆటోమాటిగ్గా కేటాయిస్తుంది
  3. గురువుగా (మెంటరుగా) పనిచేసే ఆసక్తి ఉన్నవారు ఈ ప్రాజెక్టులో నమోదు చేసుకుంటారు. ఆ జాబితా లోంచే ఈ కేటాయింపులు జరుగుతాయి.
  4. ఒక గురువు వద్ద అనేక మంది శిష్యులు ఉంటారు.
  5. ఈ శిక్షణ కోసం ప్రత్యేకంగా ఒక హోంపేజీ ఉంటుంది (అదే ఈ ప్రాజెక్టు పేజీ అన్నమాట). ప్రతి శిషునికీ తన స్వంత హోంపేజీ ఉంటుంది. వాడుకరి పేజీకి వెళ్ళినపుడు "వాడుకరి పేజీ" ట్యాబు పక్కనే ఈ హోంపేజీ ట్యాబు కూడా కనిపిస్తుంది.
  6. ఈ హోంపేజీలో ప్రశ్నలడిగే స్థలం, గురువు ఇచ్చిన సమాధానాలు, శిష్యుడు చేసిన పనుల ప్రభావం, సహాయం పేజీల లింకులు వగైరాలుంటాయి.
  7. గురు శిష్యుల ప్రశ్న-జవాబు లన్నీ ఈ హోంపేజీ లోనే జరుగుతాయి.
  8. ఈ ప్రాజెక్టును టెస్ట్ వికీ ప్రాజెక్టులో చూడవచ్చు
  9. శిక్షణ యావత్తూ గురువు శిష్యునికి చేసే బోధన లాగానే జరుగుతుంది.
  10. శిక్షణ ఇచ్చే విషయమై గ్రోత్ ప్రాజెక్టు గురువులకు ఇచ్చే ముఖ్యమైన సలహాలివి:
    1. శిష్యుడు వేసే ప్రతి ప్రశ్నకూ గురువు స్వయంగా సమాధానం చెప్పాలి. అంతేగానీ.. ఫలానా పేజీ చదువుకో, ఫలానా వీడియో చూడి, ఆడియో విను అని చెప్పకూడదు.
    2. తాను చెప్పాల్సిన సమాధానం చెప్పేసాక, అదనపు సమాచారం కోసం ఫలానావి చదువు అని మాత్రం చెప్పవచ్చు.
    3. ప్రశ్న అడిగాక, వీలైనంత త్వరగా సమాధానం చెప్పండి. ఆలస్యమయ్యేట్లుగా ఉంటే ఆ సంగతే శిష్యునికి చెప్పండి.
    4. సమాధానమిచ్చే మూడ్ లేకపోతే మరొకరు ఆ పని చెయ్యగలరేమో చూడండి.
    5. ప్రశ్నకు సమాధానం మీకు తెలియని పక్షంలో ఇతర గురువుల సహాయం తీసుకోండి
  11. గ్రోత్ ను స్థాపించిన 17 వికీపీడియాల అనుభవం ప్రోత్సాహకరంగా ఉందని, అన్ని వికీపీడియాలూ దీన్ని స్థాపించుకోవాలని భావిస్తున్నామనీ గ్రోత్ బృందం చెబుతోంది. ఆ వివరాలు ఈ పేజీలో చూడండి.

టెస్టు వికీలో ప్రాజెక్టును చూడండి[మార్చు]

  1. టెస్టు వికీ సైటుకు వెళ్ళండి.
  2. అక్కడ కొత్త వాడుకరిగా నమోదు చేసుకోండి.
  3. Preferences కు వెళ్ళి అక్కడ, User profile ట్యాబులో, Display newcomer homepage అనే దాన్ని టిక్కు పెట్టండి. ఇక ఆ పేజీని Save చేసి, వాడుకరి పేజికి వెళ్లండి.
  4. అక్కడ Homepage అనే ట్యాబుకు వెళ్తే మీ హోంపేజీ కనిపిస్తుంది.

భారతీయా భాషా వికీపీడియాల్లో బెంగాలీ వికీలో ప్రస్తుతం ఈ ప్రాజెక్టు నడుస్తోంది.

ఈ గ్రోత్ ప్రాజెక్టును స్థాపించాలంటే మనమేం చెయ్యాలి[మార్చు]

గ్రోత్ ప్రాజెక్టును స్థాపించుకోవాలంటే ఆ బృందం కొన్ని తప్పనిసరిగా పాటించాల్సిన నిబంధనలు విధించింది. ఆ షరతులను ఇక్కడ చూడండి. మనం ఆ నిబంధనలను పాటించి అవసరమైన పనులు చేసి, ఈ ప్రాజెక్టును స్థాపించమని ఫ్యాబ్రికేటరులో గ్రోత్ బృందాన్ని కోరవచ్చు.

ఆ నిబంధనల్లో ముఖ్యమైనవి, తెవికీకి సంబంధించి వాటి ప్రస్తుత పరిస్థితి ఇవి:

క్ర. సం నిబంధన తెవికీకి సంబంధించి

ఈ నిబంధన ప్రస్తుత స్థితి

ఎవరు చేసారు? ఏం చెయ్యాలి? ఎవరు చెయ్యాలి
1 గ్రోత్ ఎక్స్పెరిమెంట్స్ అనే ఈ ప్రాజెక్టు పేజీ యావత్తునూ అనువదించాలి అనువదించాం చదువరి
2 కింది అలియాసులను అనువదించుకోవాలి
  • "Special:WelcomeSurvey"
  • "Special:Homepage"
  • "Special:Impact"
  • "Special:ClaimMentee"
ఇంటర్‌ఫేస్ అడ్మిన్ చేత ఈ

అనువాదాలు చేయించాలి.

ప్రాజెక్టును స్థాపించాక చెయ్యవచ్చు

అర్జున, చదువరి

అనుమతులిస్తే

ఎవరైనా ఈ పని చెయ్యవచ్చు

3 Growth/Focus on help desk/Help panel పేజీని అనువదించాలి అనువదించాం చదువరి
4 Growth/Communities/How to interact with newcomers పేజీని అనువదించాలి అనువాదం పూర్తైంది చదువరి రెండు రోజుల్లో పూర్తి చెయ్యాలి

పూర్తైంది

5 Help:Growth/Tools పేజీని అనువదించాలి అనువదించాం చదువరి
6 మరో మూడు పేజీలను అనువదించాలి. అయితే ఇది తప్పనిసరేమీ కాదు ఇది తప్పనిసరి కానందున తరువాతైనా చెయ్యవచ్చు.
7 సహాయం పేజీలను ఎంచి పెట్టుకుని, వాటికి వికీడేటాలో లింకులు ఇవ్వాలి. ఈ పేజీల్లో 20 పైచిలుకు పేజీల్లో పని పూర్తైంది. మరో నాలుగైదు పేజీల్లో పని చేస్తే సరిపోతుంది. చదువరి
8 ప్రాజెక్టును స్థాపించాక చెయ్యాల్సిన పనులు ఈ పనులను ప్రాజెక్టు స్థాపించుకున్నాక చేసుకోవచ్చు

విజ్ఞప్తి[మార్చు]

పై గ్రోత్ ప్రాజెక్టును పరిశీలించవలసినదిగా వాడుకరులను కోరుతున్నాను. సందేహాలు, సూచనలను దీని చర్చ పేజీలో చర్చిద్దాం. ఈ ప్రాజెక్టును తెవికీలో స్థాపించే విషయమై వాడుకరుల అభిప్రాయాలను కింది విభాగంలో రాయాల్సిందిగా కోరుతున్నాను. ఈ చర్చలో తీసుకున్న నిర్ణయాన్ని బట్టి, గ్రోత్ ప్రాజెక్టును స్థాపించమని ఫ్యాబ్రికేటరులో అభ్యర్ధించవచ్చు.

అభిప్రాయాలు[మార్చు]

  1. దిద్దుబాట్లు చేసేందుకు కొత్త వాడుకరులను ప్రోత్సహించి, తెవికీ అభివృద్ధికి వాళ్ళు తోడ్పడేందుకు ఈ "గ్రోత్" ప్రాజెక్టు ఉపయోగపడుతుందని నా అభిప్రాయం. కాబట్టి, దీనిని తెవికీలో కూడా అమలుపరుచుకుందాం.-- ప్రణయ్‌రాజ్ వంగరి (చర్చ|రచనలు) 15:00, 22 ఫిబ్రవరి 2021 (UTC)[ప్రత్యుత్తరం]
  2. ఈ "గ్రోత్" ప్రాజెక్టును పరిశీలించటమైనది.ప్రాజెక్టు పేజీలో ఎందుకు నమోదు చేసుకుంటున్నారు? మరి దిద్దుబాటు ఎందుకు చెయ్యడం లేదు?ఎందుకు అక్కడే ఆగిపోతున్నారు? అనే వాటికి ఈ ప్రాజెక్టులో కారణాలు గుర్తించి,వాటికి పరిష్కారం మార్గంగా ఏమి చర్యలు చేపట్టాలి, ఆ సమస్యలను ఎలా ఎదుర్కొనాలి? అనే వాటిని ప్రాజెక్టు పేజీలో ఆచరణాత్మకమైన పంథాలో గుర్తించబడినవి.కొత్త వాడుకరులు ఉత్సాహంగా తెవికీలో దిద్దుబాట్లు చేసేందుకు వారిని ప్రోత్సహించి వాళ్లకు తోడ్పడేందుకు, తద్వారా తెవికీ అభివృద్ధికి ఈ "గ్రోత్" ప్రాజెక్టు చాలా ఉపయోగపడుతుందని నా అభిప్రాయం.కావున దీనిని తెలుగు వికీపీడియాలో ప్రవేశపెట్టి ఆచరించుటకు నేను అంగీకరిస్తున్నాను.--యర్రా రామారావు (చర్చ) 03:57, 24 ఫిబ్రవరి 2021 (UTC)[ప్రత్యుత్తరం]
  3. కొత్త వాడుకరులకు, ముఖ్యంగా ఇప్పటి వాళ్ళకు కొంచెం సహనం తక్కువ..ఏదైనా తెలిసిన వెంటనే నేర్చేసుకోవాలి, అప్పుడే రాసేయాలి, చేసేయాలి. పెద్ద వ్యాసాలను చదవరు. రూల్స్ పాలసీలను అసలు చదవరు. కనుక ఈ గ్రోత్ ప్రాజెక్టు గమనించరేమో అనుకుంటాను.. నా అభిప్రాయం అయితే, కట్టె కొట్టె తెచ్చే అనే విధంగా సులభంగా ఉన్న చిన్న వీడియోలు ఉండాలి, వాటిని వాళ్ళ స్వాగతం పేజీలో మొదట కనిపించేలా ఇవ్వాలి. వీడియోలు ఖచ్చితంగా వినోదాత్మకంగా, సింపుల్ గా ఉండాలి. ఎక్కడా ఉపకరణాలు, సాంకేతికాంశాల, పాలసీల ప్రస్తావన ఉండకూడదు. ఫేస్బుక్ వాట్సాప్ లో ఎలా రాస్తున్నారో అలానే ఉంటుంది అనే లాంటి వీడియోలు ఇచ్చి, వాటి కింద రాయడానికి ప్రయోగశాలకు వెళ్లేలా లింకులను డిస్క్రిప్షన్ అందించాలి. ప్రతి ప్రయోగ శాలలో కొన్ని రాయవలసిన మామూలు వ్యాసాలు, ప్రాజెక్టు పేజీలు కింద ఉండేలా పేజీ మార్చుకోవాలి. అలవాటు పడినాక ఎలాగూ అన్నీ చదవడం, పాలసీలను నేర్చుకుంటూ రాయడం చేస్తారు. ఇవి జరిగితే కొత్తవాడుకరుల నిలకడ ఉంటుంది అనుకుంటాను...B.K.Viswanadh (చర్చ) 14:54, 24 ఫిబ్రవరి 2021 (UTC)[ప్రత్యుత్తరం]
    1. విశ్వనాధ్గారూ, మీ వ్యాఖ్య చూసాక, పేజీలో కొంత సమాచారాన్ని చేర్చాను. 10, 11 పాయింట్లను పరిశీలించండి. అక్కడిచ్చిన లింకులను కూడా చూడండి. ఈ ప్రాజెక్టు పని చేసే విధానం పట్ల, పెద్ద వ్యాసాలను చదివే విషయం పట్ల మీకున్న సందేహాలు కొంత నివృత్తి కావచ్చు. __చదువరి (చర్చరచనలు) 04:53, 25 ఫిబ్రవరి 2021 (UTC)[ప్రత్యుత్తరం]
  4. వికీలో కొత్త వాడుకరులు ఖాతా సృష్టించుకున్న తరువాత సవరణలు చేయడానికి ప్రయత్నిస్తున్నారు.ఈ పోటీ ప్రపంచంలో ఉద్యోగాన్వేషణా, సంపాదన, ఎంటర్టైన్మెంట్ ఇంకా ఇతర విషయాలు వికీలో స్వచ్చందంగా రాయడానికి వారికి అడ్డంకులుగా ఉండొచ్చు. అయితే నా అభిప్రాయం ప్రకారం మనం ఎంత ఎక్కువగా వికీ గురించి ప్రజల్లోకి ఈ సదుద్దేశాన్ని తీసుకెళ్లగలమో, వచ్చిన కొన్ని వేల మందిలో పదుల్లో వందల్లో వాడుకరులు దిద్దుబాట్లు చేస్తున్నారు కాబట్టి మనం ఇంకా ఎక్కువ(లక్షల్లో) వాడుకరులకు వికీ పరిచయం చేస్తూ ఉండాలి. కొత్తగా వచ్చిన వాడుకరులకు పైన సూచించిన విదంగా సహాయం అందిస్తుండాలి. ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటంటే రోజు రోజుకి కొత్త రంగులు పులుముకొనే ఈ సమాజాన్ని అలాగే వివిధ విషయాలను అర్థం చేసుకోగల వారు వికీ అభివృద్ధికి బాగా సహాయపడగలరు. ఒక పదవ తరగతి విద్యార్థి ఫేస్బుక్ ఇలాంటి సోషల్ మాధ్యమాల్లో ఎలాగైతే ఖాతాను సృష్టించు కుంటున్నాడో , అలాంటి ఉత్సాహం విద్యార్థుల్లో వికీలో దిద్దుబాట్లు చేయడంపై సృష్టించాలి. ఈ ప్రయత్నం ఇదివరకే కొంతమంది చేసి ఉండొచ్చు అయితే తెవికీ అభివృద్దిలో విద్యార్థి వాడుకరుల పాత్ర కొంచెం మందగమంగానే ఉంది. విద్యార్థుల్లో వికీ అవగాహన పెంచడం ద్వారా సమాజంలో ఎక్కువమొత్తంగా వికీ అవగాహన పెంచొంచ్చు. దీన్ని చేయడానికి: కళాశాలల్లో వికీ అనుబంధ గుంపులని నిర్మించడం, వికీ ఫెలోషిప్ లాంటి స్థిరమైన అభివృద్ధి నమూనాలని రూపొందించడం అవసరం, కొత్త వాడుకరులకు తెవికీని పరిచయం చేస్తున్న వారి శైలిని గమనించాలి. వికీ ఔన్నత్యాన్ని సంరక్షించుకొని, వికీ అభివృద్ధికి తోడ్పడే వాడుకరులకి మనం సహాయం అందించాలి వారి దిద్దుబాట్లని నేరుగా వికీలోనే చేసేటట్లు చూడాలి.
  5. ఈ ప్రయత్నం చాలా బావుంది. తప్పనిసరిగా చేద్దాం. ఇంటర్నెట్‌లో సామాజిక మాధ్యమాల పద్ధతిలో వికీపీడియా సరళమైనది కాకపోవడంతో (పాలసీల్లోనూ, రాయగలిగిన విషయాల్లోనూ, నేర్చుకోగలిగిన పద్ధతుల్లోనూ కూడా) దీన్ని విస్తరించాలంటే మనం ఈ గురు-శిష్య పద్ధతినీ, ఒక పాఠ్య ప్రణాళికను అనుసరించాలి. నిజానికి మనకున్న మానవ వనరులు పరిమితం, ఉన్నవాటిని సరిగా ఛానలైజ్ చేసి వికీపీడియాలోకి ఎక్కువమందిని తెచ్చి నిలపాలన్న ఏకైక లక్ష్యంతో ఏకోన్ముఖంగా సాగుతూ, ఇతరులను నడిపిస్తున్న చదువరి గారికి అనేక అభినందనలు, ధన్యవాదాలు. ఇంకొక ముఖ్యమైన అంశం. సభ్యుల సంఖ్య పెరగాలన్నది మంచి లక్ష్యమే. కానీ, అది ఎలా జరగాలీ అంటే 1) వికీపీడియా లక్ష్యాలు, విధానాలు దీర్ఘకాలంలో దెబ్బతినేలా కాకుండా 2) వికీపీడియా పద్ధతులు (స్వచ్ఛంద కృషి ఆధారితం, పారదర్శకం) కూడా అనుసరించీ జరగాలి. అలా కాక వికీపీడియా ఏమిటన్నది తెలుసుకునే ఆసక్తి లేక, తెలుసుకోక, ఇబ్బడిముబ్బడిగా వికీ స్ఫూర్తిని నాశనం చేసే తరహా కిష్కింధకాండ ఎప్పటికప్పుడు పునరావృతమవుతూ ఉంటే సభ్యులు పెరిగారని సంతోషిస్తూ కూర్చోలేం. అందుకు చూసినా ఈ ప్రాజెక్టు వల్ల ఎంతో సదుపయోగం ఉంటుంది. --పవన్ సంతోష్ (చర్చ) 16:47, 24 ఫిబ్రవరి 2021 (UTC)[ప్రత్యుత్తరం]
  6. జర్మన్ వికిపీడియా లో మెంటర్ పోగ్రాం గురించి విపుల మైన సమాచారం ఉన్నది https://de.wikipedia.org/wiki/Wikipedia:Mentorenprogramm క్రోం వెబ్ అనువాదం ద్వారా దీనిని అర్ధం చెసుకోవచ్ఛు అయితే కొన్ని వికీపీడియాలలో ఈ మెంటర్ పోగ్రాం అనుకొన్న ఫలితం సాధించలేదు, చైనా భాషలో ఇది విరమించబడినది , ఇక పొతే చురుదనం అనేది ప్రతి వికీలో ఉండేదే , నేను ఈ వికీపీడియా జాబితాల ద్వారా Active Users చేసిన మార్పులు చూశాను, మనం లాగానే అందరూనూ :) , తెలుగు వాడుకరులు ఉత్సాహంగా తెవికీలో దిద్దుబాట్లు చేసేందుకు మొదట విద్యార్ధులను ఎంచుకొవటం కొంచెం ఫలితాలను ఇవ్వవచ్చు , పవన్ సంతోష్ గారు చెప్పినట్లు ఈ గురు-శిష్య పద్ధతి , ఒక పాఠ్య ప్రణాళికను అనుసరించాలి , ఇక్కడ ఇంగ్లీషు లో విద్యార్థుల శిక్షణా తరగతులు ఉన్నయి (https://dashboard.wikiedu.org/training/students) , ఇందులో కొన్ని అంశాల ఆధారంగా కోడ్ లాబ్స్ లో కొన్ని పాఠాలు చేశాను Kasyap (చర్చ) 05:10, 27 ఫిబ్రవరి 2021 (UTC)[ప్రత్యుత్తరం]
    1. Kasyap గారూ, మీరు మాట్లాడుతున్నది మెంటార్ షిప్ ప్రోగ్రామ్ అన్న పేరున్న ఒక కార్యక్రమం. ఇది వివిధ భాషల్లో 2008-2012 మధ్యకాలంలో ప్రారంభమైంది. జర్మన్‌లో కొనసాగుతోంది, మరోవైపు మీరన్నట్టు చైనీస్ వంటి భాషల్లో ముగిసిపోయింది. ఇప్పుడు మన చదువరి గారు సూచిస్తున్నది గ్రోత్ ప్రాజెక్టు అని వేరే కార్యక్రమం. అందులోనూ గురు-శిష్యులు ఉన్నారు, ఇందులోనూ ఉంటారు. అంతమాత్రాన అదీ ఇదీ ఒకటి కాదు. ఈ గ్రోత్ ప్రాజెక్టు చాలా ఇటీవలనే ప్రారంభమైంది. ప్రాజెక్టు పేజీని చదివి చూస్తే వికీమీడియా ఫౌండేషన్‌లోని గ్రోత్ టీం ఉద్యోగస్తులు శ్రద్ధగా, ఇంతకుముందు జరిగిన వైఫల్యాల నుంచి నేర్చుకుని చాలా చక్కని ప్రణాళికతో చేస్తున్నారు. కాబట్టి, గ్రోత్ ప్రాజెక్టును, ఆ మెంటార్‌షిప్ కార్యక్రమాన్నీ పోల్చలేం. --పవన్ సంతోష్ (చర్చ) 14:01, 28 ఫిబ్రవరి 2021 (UTC)[ప్రత్యుత్తరం]
  7. పవన్ సంతోష్ గారు పైన చెప్పిన దానికి మద్దతు నిస్తూ, కింది సంగతులను కూడా గమనించమని వాడుకరులందరినీ కోరుతున్నాను.
    • ప్రస్తుతం మనం కొత్త వాడుకరులను నిలుపుకునేందుకు ప్రత్యేకంగా, సాముదాయికంగా చేస్తున్న ప్రయత్నాలేమీ పెద్దగా లేవు. ఈ గ్రోత్ ప్రాజెక్టు ఆ దిశలో చేసే ప్రయత్నం.
    • ప్రస్తుతం కొందరు వాడుకరులు విడిగా గానీ, స్వాగతం మూస ద్వారా గానీ కొత్త వాడుకరులను పలకరించే/స్వాగతించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ప్రాజెక్టు వారి ప్రయత్నాలకు మద్దతుగా నిలిచేదేగానీ అడ్డుకునేది కాదు.
    • అంతేకాదు, ఈ గ్రోత్ ప్రాజెక్టు తెవికీలో ప్రస్తుతం జరుగుతున్న ఏ ఇతర కార్యక్రమాన్నీ, ఏ ప్రాజెక్టునూ, ఏ పనినీ అడ్డుకునేది కాదు. దీనిలో చేరి గురువు బాధ్యతలు తీసుకోవాలా లేదా అనేది వాడుకరుల ఇష్టం. వారి ఇతర పనులకు అడ్డంకి కాని పక్షం లోనే ఈ బాధ్యతను చేపట్టవచ్చు. ఒకే ఒక్క గురువు ఉన్నా ఈ ప్రాజెక్టు పని సాగిపోతుంది.
    • ఈ గ్రోత్ ప్రాజెక్టులో చేరితే ఇపుడు దాని నుండి ప్రయోజనం పొందడమే కాకుండా, భవిష్యత్తులో ఆ బృందం వెలువరించే కొత్త విశేషాలను కూడా మనం పొందే అవకాశం ఉంది.
    • ఒకవేళ ఈ ప్రాజెక్టు నుండి మనం ఆశించిన ప్రయోజనం పొందలేని పక్షంలో, దీని వలన మనకు కలిగే నష్టమేమీ ఉండదు. ఒక ప్రయత్నం చేసినవారమౌతాం.
పరిశీలించవలసినది. __చదువరి (చర్చరచనలు) 09:40, 9 మార్చి 2021 (UTC)[ప్రత్యుత్తరం]
ధన్యవాదాలు చదువరి గారు వికీమీడియా ఫౌండేషన్‌లోని గ్రోత్ టీం గురించి చదివాను, ఆశాజనకంగా ఉన్నది ఈ కొత్త వాడుకరులను నిలుపుకునే ప్రాజెక్టు ప్రతిపాదన బాగున్నది పవన్ సంతోష్ గారు రచ్చబండలొ చెప్పినట్లు ముందు వీరికి వికి పీడియా , సోదర ప్రాజెక్టులు పరిచయం చేసి వారి వారి ఆసక్తుల ఆధారంగా ముందు వికీపీడియన్ గా మార్చాలి Kasyap (చర్చ) 10:37, 9 మార్చి 2021 (UTC)[ప్రత్యుత్తరం]

నిర్ణయం[మార్చు]

నిర్ణయం ప్రకటించేందుకు ఎవరూ ముందుకు రానందున ఈ చర్చకు ముగింపు పలుకుతూ నిర్ణయం ప్రకటిస్తున్నాను.

పై చర్చలో ప్రతిపాదకునితో సహా, ఏడుగురు అభిప్రాయం చెప్పారు. ఐదుగురు తమ కారణాలను చూపుతూ ప్రతిపాదనను సమర్ధించారు. ఒకరు వ్యతిరేకించారు. ఒకరి అభిప్రాయం ప్రాజెక్టు పరిధిని దాటి పోయింది.

విశ్వనాధ్ గారు స్పష్టంగా అభిప్రాయం చెప్పకపోయినా, ఆయన ఈ ప్రాజెక్టుకు వ్యతిరేకమన్నట్లుగా ధ్వనించారు. వివిధ కారణాల వల్ల కొత్తవారు "ఈ గ్రోత్ ప్రాజెక్టు గమనించరేమో అనుకుంటాను" అని అన్నారు. కొత్తవారికి ఉపకరణాలు, సాంకేతికాంశాల, పాలసీల ప్రస్తావనే లేకుండా తొలి శిక్షణ ఇవ్వాలని ఆయన అభిప్రాయపడ్డారు (కానీ, ఈ ప్రాజెక్టు పద్ధతి అది కాదు). పవన్ సంతోష్ గారు ఈ ప్రాజెక్టుకు మద్దతు పలుకుతూ, ఈ శిక్షణ వికీపీడియా లక్ష్యాలు, విధానాలు దీర్ఘకాలంలో దెబ్బతినేలా కాకుండాను, వికీపీడియా పద్ధతులు (స్వచ్ఛంద కృషి ఆధారితం, పారదర్శకం) కూడా అనుసరించీ జరగాలని చెప్పారు. అజ్ఞాత ఈ ప్రాజెక్టు మంచి చెడుల గురించి మాట్లాడలేదు. కొత్తవారిని ఎలా తీసుకురావాలి అనే దాని గురించి ఎక్కువగా మాట్లాడారు. అది ఈ ప్రాజెక్టు పరిధి లోనిది కాదు. అంచేత, ఆ అభిప్రాయాన్ని పరిగణన లోకి తీసుకోవడం లేదు. కశ్యప్ గారు తొలుత తన అభిప్రాయాన్ని అంత స్పష్టంగా చెప్పక పోయినా, తన తదుపరి అభిప్రాయంలో విస్పష్టంగా మద్దతు పలికారు. మిగతా ముగ్గురు కూడా ఈ ప్రాజెక్టుకు స్పష్టంగా మద్దతు పలికారు.

ప్రాజెక్టు లక్ష్యాల పైన, దాని మంచిచెడుల పైనా వాడుకరుల అభిప్రాయాలను గమనించాక, ఈ ప్రాజెక్టును తెవికీలో అమలు చెయ్యాలని నిర్ణయిస్తున్నాను. ఇక, ఫ్యాబ్రికేటరులో అభ్యర్ధనను చేర్చడం వంటి తదుపరి చర్యలను చేపట్టవచ్చు. __చదువరి (చర్చరచనలు) 16:40, 15 మార్చి 2021 (UTC)[ప్రత్యుత్తరం]

Translation of the crux of the decision[మార్చు]

Out of the total 7 respondents, one opposed the proposal giving their reason and another spoke of something not relevant to the project. Remaining 5 responded positively, giving reasons for their support. Hence it is decided to go with the implementation of Growth experiments project in Telugu Wikipedia. It is also decided to pursue next steps like raising a request at Phabricator. __చదువరి (చర్చరచనలు) 16:44, 15 మార్చి 2021 (UTC)[ప్రత్యుత్తరం]