వికీపీడియా:తెలుగు వికీమీడియన్స్ యూజర్ గ్రూప్/విధి విధానాల ప్రతిపాదన

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

తెలుగు వికీమీడియన్స్ యూజర్ గ్రూప్ విధి విధానాల గురించిన చర్చల కోసం ఉపయోగించే పేజీ ఇది.

డిసెంబరు 2022 - జనవరి 2023[మార్చు]

విధి విధానాల ప్రతిపాదన[మార్చు]

ఈ కింద పేర్కొన్న అంశాలన్నీ ప్రతిపాదిత అంశాలే. వీటిలో మార్పుచేర్పులు చేయడానికి, కొత్తవి చేర్చడానికి, ఉన్నవి తీసివేయడానికి కింద చర్చ చేసి, ఆ చర్చ ఫలితంగా చేయగలరు. చర్చ చేయకుండా నేరుగా ఈ ప్రతిపాదిత విభాగంలో మార్చవద్దు.

  1. వికీమీడియా మార్గదర్శక సూత్రాలైన స్వేచ్ఛా లైసెన్సులు-ఓపెన్ సోర్స్, అందరికీ అందుబాటు/అందరికోసం కృషి (Serving every human being), పారదర్శకత, జవాబుదారీతనం, స్టీవార్డ్‌షిప్, అధికారాన్ని పంచుకోవడం (Shared power), అంతర్జాతీయతత్వం, వాక్స్వాతంత్ర్యం, స్వతంత్రతల పరిధిలో సంస్థ పనిచేస్తుంది. వికీమీడియా ఫౌండేషన్ వారితో చేసుకున్న ఒప్పందం, కోడ్ ఆఫ్‌ కాండక్ట్‌ను గౌరవించి పనిచేయాలి. కోడ్ ఆఫ్ కాండక్ట్‌ను మొదటి కార్యవర్గం పరిశీలించి అవసరమైతే మరిన్ని అంశాలు చేర్చాలి. (ఈ అంశం వికీమీడియా ఫౌండేషన్ వారు యూజర్ గ్రూప్ గుర్తింపుకు ఇది తప్పనిసరి.)
  2. యూజర్ గ్రూప్ అన్నది తెలుగు వికీపీడియా, వికీసోర్స్ లేదా మరే ఇతర వికీమీడియా సముదాయాలకి ప్రత్యామ్నాయం కాదు. వికీపీడియా తరఫున కానీ, వికీమీడియా ఫౌండేషన్ తరఫున కానీ యూజర్ గ్రూప్ మాట్లాడదు, యూజర్ గ్రూప్ అన్నది యూజర్ గ్రూప్ తరఫునే మాట్లాడుతుంది. ఆయా ప్రాజెక్టుల మంచిచెడ్డలను నిర్ణయించే అధికారం కానీ, కంటెంట్ మంచిచెడులకు బాధ్యత కానీ యూజర్ గ్రూప్ వహించదు. అలాగే, వికీపీడియాలో వర్తించే విధానాలు, మార్గదర్శకాలు నేరుగా యూజర్ గ్రూప్‌కి ఆపాదించకూడదు.
  3. తెలుగు వికీమీడియన్స్ యూజర్ గ్రూప్‌ సభ్యత్వం, కార్యనిర్వహణ, నిర్ణయాధికారం స్థూలంగా వికీమీడియన్లతోనే ఉండాలి. యూజర్ గ్రూప్ నిర్వహణలోనూ, నిర్ణయాధికారంలోనూ వికీమీడియన్లు కాని నిపుణులకు కొంతమేరకు స్థానం కల్పించవచ్చు. కానీ, ఏ దశలోనూ యూజర్ గ్రూప్ నిర్వహణ వికీమీడియా అనుభవం నుంచి మరీ దూరంగా వెళ్ళకూడదు. (ఈ అంశం వికీమీడియా ఫౌండేషన్ వారు యూజర్ గ్రూప్ గుర్తింపుకు విధించిన eligibility requirements నుంచి స్వీకరించి మార్పుచేర్పులు చేసినది.)
  4. తెలుగు వికీమీడియన్స్ యూజర్ గ్రూప్ అధికారిక భాష తెలుగు, ప్రత్యామ్నాయ భాష ఆంగ్లం. యూజర్ గ్రూప్ అధికారిక కార్యకలాపాలు, చర్చలు, నిర్ణయాలు, నివేదికలు, వివరాలు అన్నీ సాధ్యమైనంతవరకూ తెలుగులోనే ఉండాలి. వికీమీడియా ఫౌండేషన్ వారు, ఇతర సంస్థల సౌలభ్యం మేరకు అవసరమైన పేజీలు ఆంగ్లంలోనూ ఉంటాయి. కార్యకలాపాలు ప్రాథమికంగా మెటాలో జరుగుతాయి. దాని వివరాలు తెలుగు వికీమీడియా ప్రాజెక్టుల్లో తెలియబరచడానికి తగు ఏర్పాట్లు ఉంటాయి.
  5. సంస్థలో ప్రాథమిక/సాధారణ సభ్యత్వం, ఓటుహక్కు గల సభ్యులు, కార్యనిర్వాహక కమిటీ అన్నవి ఉంటాయి. వీటి అర్హత, ఇది:
    1. యూజర్ గ్రూపులో సాధారణ సభ్యత్వం ఎంతమందైనా కలిగి ఉండవచ్చు. వికీమీడియా ప్రాజెక్టుల్లో ఎక్కడైనా ఆటోకన్ఫర్మ్‌డ్ ఖాతా (కనీసం 10 ఎడిట్లు, ఖాతా సృష్టించి నాలుగు రోజులు అవ్వాలి) కలిగి ఉన్న ప్రతివారికీ యూజర్ గ్రూపులో సాధారణ సభ్యత్వానికి మౌలిక అర్హత ఉంటుంది.
    2. సాధారణ సభ్యుల్లో కొందరికి ఓటుహక్కు కలిగిన సభ్యత్వం ఉంటుంది. ఇందుకు వారు కనీసం 2000 సాధారణ గ్లోబల్ ఎడిట్లు (నాన్-బాట్, నాన్-సెమీ ఆటోమేటెడ్) చేసిన అనుభవం ఉండాలి. వికీడేటా/సెమీ-ఆటోమేటెడ్ ఎడిట్లు అయితే గనుక 1 సాధారణ ఎడిట్‌కి 5 సెమీ ఆటోమేటెడ్ ఎడిట్లు కింద లెక్కించాలి. (ఇదేమీ నిర్ణయం కాదు, చర్చించగలరు) ఓటుహక్కు ద్వారా ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్‌ని, సంస్థ బాధ్యులను ఎన్నుకునేందుకు, సంస్థ విషయమై విస్తృత నియమ నిబంధనలను, అంశాలను నిర్ణయించేందుకు ఉపయోగించే వీలుంటుంది.
    3. అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, కార్యదర్శి, కోశాధికారి సహా 9 మందితో కూడిన కార్యనిర్వాహక కమిటీ ఉంటుంది. యూజర్ గ్రూప్ సౌలభ్యం మేరకు రెండు నుంచి మూడు సంవత్సరాల మధ్యలో ఎన్నికలు నిర్వహించి కార్యనిర్వాహక కమిటీని ఎన్నుకుంటూ ఉండాలి. కార్యనిర్వాహక కమిటీకి ఓటుహక్కు కలిగిన సభ్యులు ఎవరైనా నిలబడేందుకు అర్హత ఉంటుంది. ఓటుహక్కు గల సభ్యుల ఓట్ల ద్వారా ఈ ఎన్నిక జరగాలి. ఎన్నికల నిర్వహణలో పారదర్శకత, హుందాతనం ఉండాలి.
  6. ఏదైనా వికీమీడియా ప్రాజెక్టులో నిషేధంలో ఉన్న సభ్యులకు ఓటుహక్కు, తన్మూలంగా కార్యవర్గ సభ్యత్వాలకు అవకాశం ఉండదు. ఏ సభ్యులైనా సంస్థ ప్రయోజనలకు భంగకరమైన రీతిలో వ్యవహరిస్తున్నా, వేధింపులకు పాల్పడుతున్నా కార్యవర్గ సభ్యులు చర్చించి మూడొంతుల మెజారిటీ మీద వారి సభ్యత్వం తొలగింపు గురించి, ఇతరేతర నిషేధాల గురించి నిర్ణయించవచ్చు.
  7. యూజర్ గ్రూప్ లక్ష్యాలు, ఆశయాల ఆధారంగా, తమ సామర్థ్యం, పరిస్థితులు పరిశీలించుకుని తగిన కార్యకలాపాలను ప్రతీ ఏడాది రూపొందించుకోవాలి. వాటి అమలుకు కృషిచేయాలి. అయితే, సముదాయం కానీ, సభ్యులు కానీ లక్ష్యాలు, ఆశయాలకు అనుగుణమైన మరే ఇతర కార్యకలాపాలు ప్రతిపాదించినా పరిశీలించి చేపట్టవచ్చు. యూజర్ గ్రూప్ కార్యకలాపాల నిర్వహణలో పాలుపంచుకునేవారందరూ యూజర్ గ్రూప్ సభ్యులో, భాగస్వాములో అయివుండాల్సిన అవసరం ఏమీ లేదు.
  8. సముదాయం, సముదాయ సభ్యులు స్వంతంగా చేసుకోదగ్గ కార్యకలాపాలను యూజర్ గ్రూప్ చేపట్టకపోవడం మంచిది. అలాంటి కార్యకలాపాల విషయంలో సముదాయం స్వయంగా, తేలికగా చేసుకోలేని పనులను చేపట్టి చేయాలి. సహ-నిర్వాహకత్వం అన్నది కేవలం నామమాత్రంగా ఉండడానికి వీల్లేదు. ఏయే విషయాల్లో యూజర్ గ్రూప్ బాధ్యత వహించి సహకరిస్తుందో స్పష్టంగా తెలియాలి. ఆ మేరకు పనిచేయాలి.
  9. యూజర్ గ్రూప్ చేపట్టే కార్యకలాపాల్లో నాయకత్వం, నేతృత్వం అన్నది సాధ్యమైనంతవరకూ వేర్వేరు సభ్యులు వహించేలా ప్రోత్సహించాలి. కొత్తగా నాయకత్వం పెంపొందించడానికి కృషిచేయడం యూజర్ గ్రూప్ కార్యకలాపాల్లో ముఖ్యమైన అంశంగా స్వీకరించాలి.

చర్చ[మార్చు]

పైన పేర్కొన్న అంశాలు పరిపూర్ణమూ కాదు, నిశ్చితమూ కాదు. వీటిని చర్చించి, అవసరమైతే కొత్తవి ప్రతిపాదనకు పెట్టడానికి ఈ చర్చ విభాగం ఉపయోగపడుతుంది.

  • దిద్దుబాట్ల సంఖ్యకు సంబంధించి - ఆటోవికీబ్రౌజరు, వికీడేటాలో క్విక్‌స్టేట్‌మెంట్స్, వికీసోర్సులో వాడే ఒసియార్ తదితరాలైన వంటి ఉపకరణాలతో చేసే సెమీ ఆటోమేటెడ్ ఎడిట్లను అసలు పరిగణించకుండా ఉంటే బాగుంటుంది. మానవికంగా చేసే దిద్దుబాట్లను మాత్రమే పరిగణించాలని నా అభిప్రాయం. __చదువరి (చర్చరచనలు) 10:12, 30 డిసెంబరు 2022 (UTC)[ప్రత్యుత్తరం]