వికీపీడియా:స్థూలదృష్టి ప్రశ్నలు

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
ఈ వ్యాసము తరచూ అడిగే ప్రశ్నలు
యొక్క భాగము
ప్రశ్నల పేజీలు...
చూడండి...


స్థూలంగా.. (తరచూ అడిగే ప్రశ్నలు) :

వికీ అంటే ఏమిటి?[మార్చు]

వికీ అనేది ఒకదానికొకటి అనుబంధమున్న వెబ్‌ పేజీల సమూహం . వీటన్నిటినీ ఎవరైనా, ఎప్పుడైనా చూడవచ్చు, మార్పు చేర్పులు చెయ్యవచ్చు.(collaborative software). ఇది ఆసక్తికరంగానూ, సరదాగానూ అనిపిస్తోంది. కానీ, దీని వలన సమాచారానికి భద్రత కరవై, తప్పులతో కూడి పనికిరాకుండా పోవచ్చు. వార్డ్‌ కన్నింగ్‌హామ్‌ ఈ భావాన్నీ, సాఫ్ట్‌వేర్‌ ను కనుక్కున్నారు. ఈ పేజీలో పైనున్న "మార్చు" అనే లింకును నొక్కి, ఈ పేజీని సైతం దిద్దుబాటు చెయ్యవచ్చు లెదా కుడి పక్కనున్న "[edit]" అనే లింకును నొక్కి ఏదో ఒక విభాగాన్ని మాత్రమే దిద్దుబాటు చెయ్యవచ్చు! ఈ పేజీలో మార్పులు చేర్పులు చెయ్యటానికి మీకేమీ కనిపించకపోతే, అసలిది ఎలా పనిచేస్తుందో చూడాటానికి ప్రయోగశాల లో ప్రయోగాలు చెయ్యండి. ఇంకా చూడండి: దిద్దుబాటు ప్రశ్నలు.

వికీపీడియా అంటే ఏమిటి?[మార్చు]

వికీపీడియా అనేది ఒక సమగ్రమైన, ఉచితంగా లభించే కొత్త తరహా విజ్ఞాన సర్వస్వాన్ని తయారుచేసే ఒక పథకం.

మరింత సమాచారం కొరకు వికీపీడియా:గురించి మరియు వికీపీడియా:వికీపీడియా లను చూడండి.

దీన్ని వికీపీడియా అని ఎందుకంటారు?[మార్చు]

వికీపీడియా అనేది "వికివికి" మరియు "ఎన్‌సైక్లోపీడియా" అనే పదాల కలయికతో పుట్టిన పదం.

వికీపీడియా లక్ష్యం ఏమిటి?[మార్చు]

విస్తృతి లోనూ, లోతు లోను కూడ అత్యంత పెద్దదైన ఒక ఉచిత, నమ్మదగ్గ విజ్ఞాన సర్వస్వాన్ని— తయారుచెయ్యడమే. ఈ బృహత్తర లక్ష్యాన్ని సాధించటానికి ఎన్నో సంవత్సరాలు పట్టవచ్చు!

వికీపీడియా ఎవరిది?[మార్చు]

వికీపీడియాని మాతృ సంస్థ అయిన వికీమీడియా ఫౌండేషన్‌ నిర్వహిస్తుంది. వికీపీడియా సోదర ప్రాజెచ్టులైన విక్షనరీ (వికి నిఘంటువు), వికీబుక్స్‌ (ఉచిత పాఠ్యపుస్తకాలు), మొదలైన వాటితో పాటు, సంబంధిత డోమైన్‌ పేరులను కూడా కలిగివుంది. ఇదివరలో, ఈ సైటును జిమ్మీ వేల్స్‌ కు చెందిన బొమిస్‌ Inc అనే కంపెనీ సర్వర్లలో వుండేది. ఈ కంపెనీ ప్రస్తుతం సిటు యొక్క ఖర్చుల్లో కొంత భాగాన్ని భరిస్తోంది. వికీమీడియా ఫౌండేషన్‌ ను జూన్‌ 20, 2003 లో ఏర్పాటు చేసిన తరువాత డొమైన్‌ పేర్లూ, సంకేతిక పరికరాలు ఫౌండేషన్‌ కు బదిలీ అయ్యాయి. జిమ్మీ వేల్స్‌ ప్రవచించిన సిధ్ధాంతాల మార్గదర్శకత్వంలో వికీపీడియనుల సముదాయం ప్రస్తుతం ఈ సైటును నిర్వహిస్తున్నది. నిష్పాక్షిక దృక్పథం ఒక ఉదాహరణ.


ఈ సైటులో ప్రచురించిన వ్యాసాలన్నీ ఆయా రచయితలు GNU Free Documentation License కు లోబడి వెలువరిస్తారు, కాబట్టి ఈ వ్యాసాలన్నీ ఉచితం. వీటిని ఆ లైసెన్సుకు లోబడి ఉచితంగా వాడుకోవచ్చు కూడా. వికీపీడియా వ్యాసాలను ఎలా వాడుకోవచ్చో తెలుసుకోవడం కొరకు కాపీ హక్కులు మరియు పాఠకుల ప్రశ్నలు చూడండి.

వికీపీడియా లోని వ్యాసాలకు బాధ్యులెవరు?[మార్చు]

వికీపీడియనులు. ఇది ఒక సమష్టి ప్రయత్నం. వేలాది మంది ఈ ప్రాజెక్టు లోని వివిధ భాగాలలో తమ తమ వంతు పాత్రలను పోషిస్తున్నారు. మీతో సహా, ఎవరైనా చెయ్యవచ్చు. దీనికి పేజీని ఎలా దిద్దుబాటు చెయ్యాలనేది, ఇతరులతో పంచుకోడానికి కాస్త విజ్ఞానం తెలిస్తే చాలు. ఈ విజ్ఞాన సర్వస్వం వినియోగదారులకు కొంత స్వేఛ్చనిస్తుంది.
ఒక పేజీలోని ఇటీవలి మార్పులు ఎవరెవరు చేసారనేది "పేజీ చరితం" అనే లింకును నొక్కి తెలుసుకోవచ్చు. ప్రస్తుతమున్న కూర్పులో ఏమైనా తప్పులున్నట్లు మీరు గుర్తిస్తే, వాటిని సరిదిద్దటానికి చొరవగా ముందుకు రండి. ఈ విజ్ఞాన సర్వస్వం యొక్క విశ్వసనీయతను కాపాడడంలో ఇది ఒక మౌలిక అంశం.


ఏదైనా వ్యాసంలో పదాలు గానీ, వాక్యాలు గానీ మీకు అస్పష్టంగా, సందిగ్ధంగా అనిపిస్తే, ఆ భాగాన్ని ఉదహరిస్తూ సంబంధిత చర్చా పేజీ లో ప్రశ్నించండి. దీని ద్వారా తప్పులూ, సందిగ్ధతా, సందేహాస్పదమైనవీ, తప్పు అర్ధం వచ్చే వాటిని సత్వరమే తీసివేసే వీలు కలుగుతుంది. పైగా దీన్ని సముదాయం హర్షిస్తుంది కూడా.

నేను ప్రాజెక్టును ఎలా సంప్రదించాలి?[మార్చు]

ఇంత పెద్ద స్థాయిలో ప్రజలు పాల్గొనే ప్రాజెక్టులో ఒకే సప్రదింపుల కేంద్రం వుండదు. ప్రాజెక్టు సంబంధిత సందేహాల నివృత్తికై మాట్లాడడానికి చాల జాబుల జాబితాలు (మెయిలింగు లిస్టులు) ఉన్నాయి. meta:మెయిలింగు జాబితాలు ఇక్కడ చూడండి. ప్రాజెక్టేతర విషయాల కొరకు ఫౌండేషన్‌ మైలింగు జాబితా మరియు మెటావికీ చూడండి. బహిరంగంగా సంప్రదించడానికి మీరు ఇష్టపడకపోతే, ఫౌండేషన్‌ డైరెక్టర్లను board@wikimedia.org లో సంప్రదించవచ్చు. ఫలానా సభ్యునితో సంభాషించాలంటే ఆ సభ్యుని వ్యక్తిగత చర్చా పేజీలో సందేశం రాయండి; వ్యక్తిగత పేజీల జాబితా (మీ దానితో సహా) వికీపీడియనుల జాబితాలో చూడవచ్చు. చాలా మంది వికీపీడియన్యులు తమ ఈ-మెయిల్‌ ఐ డీ ని నమోదు చేసుకున్నారు. వ్యక్తిగత పేజీలోని "సభ్యునికి ఈ-మెయిల్‌ పంపు" లింకును నొక్కి ఈ-మెయిల్‌ పంపవచ్చు. ప్రతీ సభ్యునికీ, వ్యాసానికి ఒక్కొక్క చర్చా పేజీ ఉంది. సభ్యునికి సందేశం ఇవ్వటానికి, వ్యాసంపై వ్యాఖ్యానం రాయడానికి ఇది మీకు అవకాశమిస్తుంది. చర్చ లింకును నొక్కి చర్చా పేజీకి వెళ్ళవచ్చు

నుపీడియా ఏమిటి?[మార్చు]

నుపీడియా అనేది ఇదివరకటి విజ్ఞాన సర్వస్వం ప్రొజెక్టు. ప్రస్తుతం అది పనిచేయడంలేదు; en:Wikipedia:Nupedia and Wikipedia చూడండి.

నేను అకౌంటు ప్రారంభించడం తప్పనిసరా? అనామకంగా వ్యాసాలను సరిదిద్దలేనా?[మార్చు]

వికీపీడియా:బాధ్యత చూడండి. అకౌంటు వున్న ఎడిటర్లు చాలా సౌకర్యాలు అనుభవిస్తారు. మంచి నాణ్యమైన పనికి లభించే గుర్తింపు, కీర్తి వాటిల్లో ఒకటి. వ్యాస వివాదాలను పరిష్కరించడంలో చక్కటి చరిత్ర వున్న వికీపీడియన్ల మాటకు విలువ వుంటుంది. పైగా, ఊరూ పేరూ లేని వారితో కలిసి పని చేయడం వికీపీడియన్లకు ఇబ్బందిగా వుంటుంది. దీనర్ధం వికీపీడియా అధికార సోపానం అనేదేదో ఉందని కాదు గానీ ఇక్కడ నిర్వాహక హక్కులున్న ఎడిటర్లున్నారు (వికీపీడియా:నిర్వాహకులు చూడండి) - వీళ్ళని సముదాయం ఎంపిక చేసింది. కాస్త అరాచకం తోనైనా సరే వికీపీడియా లో ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చెయ్యడమే వికీపీడియన్ల లక్ష్యం.


ఒక రకంగా సభ్యనామమున్న వికీపీడియన్లే ఎక్కువ అనామకంగా, అన్యాపదేశంగా ఉంటారు: ఎందుకంటే లాగిన్‌ అవని సభ్యుని ఐ పి అడ్రసును ఎవరైనా చూడవచ్చు, అదే లాగిన్‌ అయినవారి ఐ పి అడ్రసును సర్వరు నిర్వాహకులు మాత్రమే చూడగలరు. కాబట్టి, గోప్యత, అనామకత్వం గురించి అలోచించేట్లయితే మీరు లాగిన్‌ అయితేనే మంచిది.


ఏదేమైనా, మీరు చీకట్లోనే ఉండాలని అనుకుంటే, లాగిన్‌ కాకుండానే దిద్దుబాట్లు చెయ్యవచ్చు. ఎంతో మంది ఈ పధ్దతినే ఎంచుకుని తమ విలువైన సమర్పణలు చేశారు.

సమాచారం సరి యైనదే అని మీరు ఎలా తెలుసుకుంటారు?[మార్చు]

ఎవరైనా, ఏ వ్యాసాన్నైనా దిద్దవచ్చు కాబట్టి, పక్షపాత పూరితమైన, కాలదోషం పట్టిన లేక తప్పుడు సమాచారాన్ని ప్రచురించే అవకాశం ఉంది. కానీ, ఎంతో మంది ఇటీవలి మార్పులు పేజీ లో ఈ వ్యాసాలను చదువుతూ, గమనిస్తూ ఉంటారు కాబట్టి, తప్పుడు సమాచారాన్ని త్వరగానే సరి దిద్దుతారు. ఈ విధంగా, రోజు రోజుకూ పెరుగుతున్న సభ్యుల కారణంగా స్థూలంగా విజ్ఞాన సర్వస్వం యొక్క ప్రామణికత మెరుగు పడుతూ ఉంది. వ్యాసాల్ని సరిదిద్దటానికీ, మీ విజ్ఞానాన్ని పంచడానికి మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాం.


ఈ విషయంపై మరింత చర్చ కొరకు వికీపీడియా:సాధారణ అభ్యంతరాలకు జవాబులు చూడండి.

X అనే సైటు వికీపీడియా కాపీ హక్కులను అతిక్రమిస్తుందనిపిస్తోంది. మీకీ సంగతి తెలుసా?[మార్చు]

వాళ్ళు హక్కులను అతిక్రమించి వుండక పోవచ్చు. గ్నూ ఫ్రీ డాక్యుమెంటేషన్‌ లైసెన్స్ ను పాటించినంత కాలం వికీపీడియా లోని సమాచారాన్ని ఎవరైనా వాడేసుకోవచ్చు. 100 కు పైగా సైట్లు వికీపీడియా లోని సమాచారాన్ని వాడేసుకోవడాన్ని గమనించాం. en:Wikipedia:Mirrors and forks లో ఈ సైట్ల వర్గీకరణను చూడవచ్చు.

వికీపీడియా ఏ సాఫ్ట్‌ వేర్‌ పై నడుస్తుంది?[మార్చు]

వికీపీడియా:మీడియావికీ చూడండి