Jump to content

విరాట్ (నవల)

వికీపీడియా నుండి

విరాట్ చిన్న నవల లేదా పెద్ద కథ. ఆంగ్ల మూలం రచయిత.....స్టెపాన్ త్స్వైక్.... తెలుగు అనువాదం పొనుగోటి కృష్ణా రెడ్డి. దీన్ని నవలగా భావిస్తున్నట్లు అనువాదకుడు చెప్పుకున్నాడు. ఇందులోని విషయం భారతీయ తత్వానికి, వేదాంతానికి చాల దగ్గరగా ఉంది. కాని అసలు రచయిత భారతీయుడు కాదు. ఇది అత్యద్భుతమైన రచన. అందుకే దానిని చదువరులకొరకు క్లుప్తంగా అందిస్తున్నాను..... చదవండి.

అది వీర వాఘు రాజ్యం. రాజ్యంలోని సగ భాగానికి రాజ ప్రతినిదిగా రాజుగారి భావ మరది పరిపాలిస్తుంటాడు. అతనికి రాజ్యాన్నంత కబళించాలని దుర్బుద్ధి పుట్టి రాజుగారి సైన్యంలో గొప్పా యోదుల్ని బెదిరించి, లంచాలిచ్చి తన వైపు తిప్పుంటాడు. అలా పెద్ద సైన్యాన్ని సమకూర్చు కొని రాజుగారి పైకి దండేత్తాడు. భీతిల్లిన రాజు "విరాట్" సాయాన్ని కోరుతాడు.సంతోషంగా అంగీకరించి కొంత మంది యోధుల్ని సమకూర్చుకొని యుద్ధానికి భయల దేరుతాడు. ఒక నదికి అవతల శత్రు శేనలు విడిది చేసి ఉన్నారు. అప్పటికి బాగా చీకటి పడి ఉంది. అర్థ రాత్రి ఒక రేవుద్వారా నదిని దాటి సత్రువు పై ఆకస్మిక దాడి చేస్తాడు విరాట్. అనుకోని ఈ సంఘటనకు భీతిల్లిన సత్రు సైన్యంమ్ చెల్లచెదురు కాగ మిగిలిన వారందరూ హాతులౌతారు. సూర్వోదయం తర్వాత యుద్ద భూమిలో తిరుగుతున్న విరాట్ కి తల తెగిన తన అన్న శవం కనబడుతుంది. ఎంతో ఆవేధనకు గురైన విరాట్ తానింకెప్పుడు యుద్ధం చేయనని శపథం చేసి కత్తిని నదిలో పారవేస్తాడు. విజయ విషయం తెలిసి రాజుగారు వచ్చి విరాట్ కు బహుమతిగా తన ఖడ్గానిచ్చి ఇకపై తనసైన్యానికి సర్వాద్యక్షునిగా వుండమని కోరుతాడు. దాన్ని వినయంగా తోసి పుచ్చిన విరాట్ ని రాజు గారు సర్వోత్తమ న్యాయ పీఠానికి అధిపతిని చేసి గౌరవిస్తాడు.

అప్పటినుండి విరాట్ రాజుగారి తరుపున తీర్పులు చెప్పుతూ, అందరి మన్ననలను పొండుతాడు. ఎక్కడెక్కడి నుండో ప్రజలు న్యామైన తీర్పు కొరకు వస్తుండే వారు. విరాట్ ఎవరికి మరణ శిక్ష వేయ లేదు. రాను రాను విరాట్ ఖ్యాతి రాజ్య మంతా పాకింది. ఇంతవరకు విరాట్ ను వీరుడు, యోధుడు అని పొగిడిన ప్రజలు ఇప్పుడు అతన్ని ధర్మ దేవత, న్యామ మూర్తి అని పొగడసాగారు. ఇలా వుండగా...ఒక రోజున కొంతమంది కొండ జాతి వారు ఒక యువకుణ్ణి తాళ్లతో బంధించి, తెచ్చి విరాట్ ముందుంచి ఇతడు మహా ధుర్మార్గుడు, చాల మందిని హత్య చేశాడు, ఎంతో కష్టపడి వీడిని బంధించి తెచ్చాము, వీడిని కఠినంగా శిక్షించి మమ్ములను కాపాడాలని వారు కోరారు. "ఇది నిజమేనా " అని అడిగిన విరాట్ ప్రశ్నలకు ఆ బందీ దేనికి సమాధనం చెప్పక క్రూరంగా చూస్తుంటాడు. చివరగా నోరు తెరిసి " ఇతరులు చెప్పిన దాన్ని విని నీవెలా తీర్పు చెప్తావ్? అని నిర్లక్ష్యంగా ప్రశ్నిస్తాడు. ఈ పలుకులకు ఆఅవేధన చెందిన విరాట్ తన తీర్పు న్యా బద్దంగా వుండాలని భగవంతుణ్ని కోరుకుని " ఇతడు పదకొండు మందిని హత్య చేశాడు గనుక పదకొండు సంవత్సరాలు భూగర్బ జైలి శిక్ష, ప్రతి సంవత్సరం పదకొండు సార్లు, ప్రతి సారి పదకొండు కొరడాల దెబ్బలు శిక్షగా వేసి ఇలా అన్నాడు..... నీవు సంజాయిషి ఇచ్చుకోవడానికి అవకాశం ఇచ్చాను, నీవు నోరు మెదప లేదు, నీమీద కొంత దయ చూపాను అదే నాకు సంతోషం" అన్నాడు.

దాంతో ముద్దాయి నోరు విప్పి నీదయ నాకక్కర లేదు, నీ తీర్పుకు ప్రమాణం ఏది? కొరడా దెబ్బలు నీవెప్పుడైనా తిన్నావా? వెలుగుకు దూరంగా చీకట్లో జీవితం గడిపావా? బాధలు పడ్డ వానికే ఆ బాధల విలువ తెలుసు, నీవు అగ్నానివి, .....నేను ఆవేశంలో హత్యలు చేశాను,...కాని నీవు ప్రశాంతంగా వుండి నా ప్రాణాల్ని హరిస్తున్నావు.. నీవు న్యాయ పీఠం నుండి దిగి పో...." అని గర్జిస్తున్నాడు. కౄరమైన అతని చూపులను తట్టుకో లేక విరాట్ మనసు కాకవికలమై పోగా రాజు వద్దకు వెళ్లితనకు ప్రశాంతమైన మనసుతో సత్యాణ్వేషణ చేయడానికి ఒకనెల శలవు కావాలని, రాజుని ఒప్పించి ఇంటికి వెళ్లి హుతుంబ సభ్యులతో తాను ఒక నెల పాటు అజ్ఞాతంలోకి వెళుతున్నాననిచెప్పి ఒకలేఖ రాసుకొని జేబులో వుంచుకొని నేరుగా ఆ రాత్రే విరాట్ ఆ జైలు వద్దకు వెళతాడు. అక్కడున్న కాపలా దారుని అడిగి ఆ ఖైదీ వున్న గది తాళం చెవి తీసుకొని కొరడా దెబ్బలకు అచేతనంగా పడివున్న ఆ ఖైదీ వద్దకెళగా, మళ్లీ ఎందుకొచ్చావ్? అని కోపంగా అడుగ తాడు. దానికి సమాధానంగా విరాట్ " నీ మాటాల్లో సత్యం వున్నది, తనకు అనుభవం కాని శిక్షలను ఇతరులకు వేయరాదు, ఇప్పుడు అనుభవంద్వార తెలుసుకోవాలనుకుంటున్నాను, నాదుస్తులు ధరించి నీవు స్వ్స్చగా బయడకు వెళ్లు ఈతాళం చెవి ద్వారం వద్ద వదలివెళ్లు, ఒకనెల తర్వాత ఈ ఉత్తరాన్ని రాజుగారికివ్వు, అప్పుడు నాకు విముక్తి లభిస్తుంది, నెల తర్వాత తప్పక వస్తానని నాకు మాట ఇవ్వూ " అంటాడు. దానికి ఖైదీ బోరున విలపిస్తూ, ప్రభూ మీరు విధించిన సరైనదే" నన్నడు. విధిలేక విరాట్ చెప్పినట్టే చేశాడు.

ఆ మరునాడు ఖైదీగా వున్న విరాట్ కు (ఖైదీకి పడవలసిన) కొరడా దెబ్బలు పడ్డాయి. పళ్ల బిగువున భరించాడు. చీకటిలో ఒంటరిగా అలౌకికమైన స్థిలో రాగ ద్వేషాలు, మమతాను రాగాలకు దూరంగా వుండడం చేత రోజులు గడిచే కొద్ది అతని మనస్సు నిర్మలం అయిపోయింది. వివిద రూపాల్లో వున్న పరమాత్మ విశ్వ రూపాన్ని లోతుగా అర్థం చేసుకో గలిగాడు. రాను రాను ఖైది జీవిత ఆనంద దాయకంగా అనిపించ సాగింది...... కాని ఒకరోజు అతనికొచ్చిన ఆలొచనతో అతని దేహం కంపించ సాగింది. " ఒక వేళ ఆ ఖైదీ రాక పోతే?.... మర్చి పోతే?.....జీవితాంతం ఈ చీకటి గదిలో మగ్గి పోవలసిందే....... ఈ ఆలోచన కలగ గానే అతనికి బ్రతుకు పై ఆశ కలిగింది.... ఆప్పటినుంది తనగురించే ఆలోశించ సాగాడు. ప్రాపంచిక ఆలోచన్నలతోఅతని మనస్సు నిండి పోయింది... ఒక్కో రోజు ఒక యుగంగా ఉంది...... ఇలా వుండగా ఒకరోజు ఏవో శబ్దాలు, ఎవరో తలుపు తెరుస్తున్న శబ్దం....... ఒపిక తెచ్చుకొని కళ్లు తెరిచి చూడగా ఎదురుగా మహారాజు. "మహారాజ ఈ చట్టాలు ఎంట ధుర్మార్గ మైనవో నేనిప్పుడు గ్రహించాను, మీరు, ఈ ప్రజలు నన్ను కీర్తిస్తుంటే నాకు సిగ్గుగా వుంది." అన్నాడు వురాట్. దాంతో రాజుగారు " నీ సత్యాన్వేషణలో మునుపటి కన్న నీవిప్పుడు గొప్ప న్యాయ మూర్తివి, నీ స్థానం ఇప్పుడు నా సింహాసనం ప్రక్కనే.. దయచేసి స్వీకరించండీ" అన్నాడు. దానికి విరాట్ " మహారాజ ...న్యాధికారి పదవి నుండి నన్ను తప్పించండి, ఒకరి గురించి మరొకరుమ్ న్యాయం చెప్పే అధికారం ఎవ్వరికి లేదు, ఇది తెలుసుకున్న తర్వాత నేను తీర్పులు చెప్పలేను. అధికారం క్రియను కోరుతుంది, నేను చెప్పింది కార్య రూపం దాలుస్తుంది, శిక్షించే అధికారం ఒక్క భగవంతినికే వున్నది, ఈ పాపాలకు దూరంగా జీవితం గడపాలనుకుంటున్నాను" అన్నాడు. రాజు గారి అనుమతి తీసుకొని ఇంటికొచ్చిన విరాట్ జీవితం సంతోషంగా గడిచి పోతున్నది. ద్యానం తో, దీనుల పట్ల దయతో, అండరితో ఆత్మీయంగా మెలగడం, ఇతరులకుమ్ సహాయ పడడం, ..ఇలా జీవితం సాగి పోతున్నది. ప్రజలు అతణ్ణి గొప్పయోధుడని గాని, గొప్ప సలహా దారుడని గాని, గొప్ప న్యాయ మూర్తి అని గానీ, అనడం లేదు...

ఇలా జీవితం సాగి పోతుండగా ఒకరోజున ఎవరివ్ ఆక్రందనలు వినబడ్డాఅయి విరాట్కి. విచారించగా తన కొడుకు ఒక బానిసను పని సరిగా చేయ లేదని, పారిపోవడానికి ప్రయత్నించాడని, ఇతన్ని చూసి ఇతర బానిసలు అలాంటి పని చేయ కుండా భయపడాలని అతడిని విపరీతంగా కొడుతున్నాడు. దాంతో విరాట్ మనస్సు బాధ పడింది. కొడుకులను పిసిచి " నేను పాపాలకు దూరంగా జీవించాలని అనుకునాను, ఈ రోజు నేను నివసించే ఈ నేలమీద ఒక వ్యక్తి రక్తం చిందింది. చిన్న అపరాదానికి కౄరంగా శిక్ష అనుభవించిన ఆ బానిసను వదిలేయండి, అతనికి ఇష్టం వున్న చోటుకి వెళ్లనివ్వండి." అన్నాడు. అందుకు పెద్ద కొడుకు "ఒకడు పోతే నష్టమేమి లేదు, కాని వాణ్ణి చూసి ఇంకొకడు అలా అందరు వెళ్లిపోతే ఎలా?" అన్నాడు. దానికి విరాట్ ఒకరి జీవితాన్ని నిర్దేసించే అధికారం ఇంకొకరికి లేదు. పోయే వాళ్ళందర్నీ పోనివ్వండి.. అన్నాడు. "మీరు రాజ శాసనాన్ని దిక్కరిస్తున్నారు, ఈ భూమి మనది, అందులోని చెట్లు మనావి, ఆ కాయలు మనవి, ఈబానిసలు కూడా మన అస్తి." అన్నాడు రెండో కొడుకు. " భగవంతుడు మనకు ప్రసాదించిన హక్కు జీవించడం. ఆ అధికారం అందరికీ వుంది. మీరు నాకు బాగానే భోదించారు. నేను పాపాలకు దూరంగా బతుకుతున్నాననే బ్రమలో వున్నాను.నేనుమ్ బానిసలను విడుదల చేస్తాను. వాళ్ల విషయంలోనయినా పాపాలకు దూరంగా వుంటాని." అన్నాడు వురాట్. " బానిసలు లేకుంటే పొలాలెలా పండతాయి, పశువులనెవరు కాస్తారు, మీరు ఇంట్లొ ఏ నాడైన చిన్న పని చేసారా? ఇకపై ఆ పనులన్నీ మేమే చేస్తాము. ఆ ఎద్దులను కూడా వదిలేయండి. వాటికి మాత్రం నొప్పి వుండదా, రేపట్నుంచి మేమే కాడిమ్మోస్తాము. మనుషులకు మల్లే పశువులకు కూడ భగవంతుడు జీవింఛే హక్కునిచ్చాడు కదా?..... మీరు ఒక్కటి గుర్తు పెట్టుకొండి ఈ ప్రపంచం అంతా భలప్రయోగం చేతనే నడుస్తున్నది. భూమికూడ భలప్రయోగం చేయ కుంటే అనగా దున్న కుంటే పండదు. భలప్రయోగం మీద ఆధార పడే ఈ ప్రపంచం నడుస్తున్నది, మనం దానికి దూరంగ వుండలేము. అంటూ పెద్ద కోడుకు గద్దించాడు. దానికి విరాట్ విరాట్ చాల సేపు మౌనంగా వుండి పోయాడు. కొడుకుల వంక చూసి...."మీరు నాకు పాఠం నేర్పారు, ఈ ఇంటిని సంపదను మీరే తీసుకొండి. వాటితో వచ్చేఆపమూ నాకొద్దు. ఒంటరిగా బతికే వ్యక్తికే భగవంతుని ఉనికి తెలుస్తుంది". అని అక్కడి నుండి లేచి వెళ్లి పోయాడు. వాళ్ల ఆశ నెరవేరినందుకు కొడుకులు చాల ఆనందించారు.

అలా వెళ్లిన విరాట్ తెల్లరే సరికి ఒక దట్టమైన అటవీ ప్రాంతానికి చేరి మనుష్య సంచారం లేని ఒక ప్రదేసంలో ఒక కుటీరాన్ని నిర్మించుకొని ఏకాంతంగా జీవించ సాగాడు, పండ్లు ఫలాలే అతని ఆహారం. ద్యానంతో జీవితం సుఖంగా గడిచి పోతున్నది. ఆ వచ్చిన వ్యక్తి తన పనులు తాను చేసుకొని పోవడం చూసిన పక్షులు, పిట్టలు, జంతువులు, అతనితో ప్రమాదమేమి లేదని గ్రహించి అతనికి దగ్గరవ సాగాయి. ఆ విధంగ అతనికి వాటికి స్నేహం పెరిగింది,. విరాట్ వాటితో ఆడుకు ఏ వాడు. పిలిస్తే అవి దగ్గరకు వచ్చేవి. ఆ విధంగా పశుపక్ష్యాదులు అతనికి దగ్గరయ్యయి. ఈలా కాలం గడిచి పోతుండగా....., ఒకరోజున ఒక వేటగాడు ఒక జంతువును తరుముతూ నది ఒడ్డున వున్న ఆ ఆశ్రమం వద్దకు వచ్చి అక్కడి దృస్యాన్ని చూసి నోట మాటస్రాక అలా చూస్తుండి పోయాడు. ఒక ఋషి పశు పక్ష్యాదులతో ఆటలాడుకుంటున్నాడు. అతని మాఅటలకు అవి నాట్యం చేస్తున్నాయి., అవి మానవ భాషలో అతనితో మాట్లాడుతున్నాయి, అతను తన మహిమతో నక్షత్రాలను తెంపగలడు, ఒక్క ఊదు ఊది ఆకాశాన్ని ఎగర గొట్ట గలదు, అని అనిపించింది., అతనికి. తానొచ్చిన పని మరిచి పోయి, తాను చూసిన ఈ వింతను పట్నంలో చెప్పాలని పట్నంవైపు పరుగు తీశాడు.

ఆ మరునాటి నుండే ప్రజలు అడవిలోని ఆ నదీ తీరం వైపు గుంపులుగా ఆ వింతని చూడడానికి రాసాగారు. అందులో ఒకడు విరాట్ ను గుర్తించాడు అతడు ఈ విషయాన్ని రాజుగారికి చేరవేయగా, రాజుగారు సపారివారం ఆశ్రమానికి బయలు దేరి వచ్చాడు. విరాట్ రాజుగారికి నమస్కరించాడు. రాజుగారు " మీలోని అబ్దుత ధర్మ పరయాణత్బాన్ని దర్సించు కోవడానికి వచ్చాను, మహోన్నత వ్యక్తి ఎలా జీవించాలో నేను కూడా నేర్చు కుంటాను." అని అన్నాడు. " మీ దర్శన భాగ్యంతో నామనసు,అలౌకికమైన ఆనండంతో నిండి పోయింది అంతకన్న నాకింకేం కావాలి" అని విరాట్ నుండి శలవు తీసుకుని వెళ్లి పోయాడు. విరాట్ పేరు ప్రఖ్యాతులు మళ్లీ నలుదిశలా వ్యాపించాయి. కాలం గడిచే కొద్ది ప్రజలు తామజీవన విధానం సక్రమంగా లేదని భావించే వాళ్లు, తాము చేసిన పాప కర్మలకు పాచ్చాత్తప పడేవారు, జీవితం నిస్సారంగాంగా తోచిన వారు, విరాట్ ని ఆదర్శంగా తీసుకొని ఇల్లు వాకిలి, పెళ్ళాంపిల్లను వదిలి సర్వం త్యజించి, జీవితాన్ని భగవంతుని స్మరణంలో గడపడానికి అడవులకొచ్చి కుటీరాలను నిర్మించుకొని ద్యాన మార్గం అనుసరించ నారంబించారు.

ఒక రోజున అడవిలో విహరిస్తున్న విరాట్ కి ఒక సాధువు శవం కనబడింది. దాన్ని తరిలించడానికి అతనికి సాద్యం కాలేదు. సహాయం కొరకు సమీప గ్రామానికి బయలు దేరాడు, "ఏకాంత వాస దృవతార అని భక్తితో పిలుచుకునే మహాఋషి తమ గ్రామంలోకే రావడమేమిటని ప్రజలు ఆయన చుట్టు గుంపులు గుంపులుగా చేరారు. అతనికి సహాయ పడడానికి నేనంటే నేనని చాల మంది ముందుకొచ్చారు. విరాట్ తిరిగి వెళుతుంటే స్త్రీలు ప్రతి చోట భక్తి తో నమస్కరించారు.భక్తితో స్వాగతం పలికారు, ఆనందంతో అతని వెంబడి నడిచారు. కాని ఒక ఇంట్లో నుండి ఒక స్త్రీ తనను అతి ద్వేషంగా చూడడం గమనించాడు విరాట్. తాను బ్రమ పడుతున్నానేమో అనికొని మళ్లీ చూశాడు. ఆ స్త్రీ ద్వేషంతో నిప్పులు కక్కుతూ విరాట్ వైపు చూసింది. విరాట్ భయంతో వణికి పోయాడు. ఆమె తనను తప్పుగా అర్థం చేసుకుండేమోనని లేక ఎవరో అనుకొని తన పట్ల ద్వేషంతో వ్వహరిస్తున్నదేమో నని, ఆమెను పలకరించాలని అటు వైపు అడుగులు వేశాడు. చిరుత పులిలా ఆమె అతని వైపు చూసి దబాలున తలుపు వేసేసింది. విరాట్ నిచ్చేష్టుడయ్యాడు. ఆమెను తను ఎప్పుడు చూడలేదు, పరిచయం లేదు, ఎక్కడో దో లోపం జరిగింది తెలుసుకోవాలి అని తలచి తలుపు కొట్టాడు. సమాధానం లేదు, మళ్ళీ కొట్టాడు, అప్పుడు తలుపు తీసి ద్వారంలో నిలబడ్డ ఆమె చూపులు ఇంకా క్రోదంగానే వున్నాయి. కోపం తో వూగి పోతున్నది ఆమె. "నేను మీకు సతృవునా, మీకేమైనా అపకారం చేశానా?" అన్నడు విరాట్. " నువ్వు నాకేమి అపకారం చేశావా? కళకళ లాడే నా ఇంటిని సూన్యం చేశావు, నా భర్తను నానుండి దూరం చేశావు, పో, వెళ్ళిపో" అని అరిచింది ఆమె. " మీరు నన్ను ఎవరో అనుకొని ద్వేషిస్తున్నారు. నేను మనుషులకు దూరంగా బతుకుతున్నాను.ఎవరిమ్ జీవితంలోను నా ప్రమేయం లేదు. మీరు పొరబడుతున్నారు" అన్నాడు. " నువ్వు నాకు తెలుసు. నువ్వు విరాట్ వి. అందరూ పిలిచే ఏకాంత దృవతారవి. ప్రజలందరి చేత కీర్తింఛబడే వాడివి. అందరి దృష్టిలో మహార్షివి. కాని నేను నిన్ను ద్వేషిస్తూనె వుంటాను. నువ్వు నాకేం కీడు చేశావో చూపిస్తాను రా? అని అతని చేయి పట్టుకొని లోపలికి తీసుకెళ్ళింది. లోపలి గదిలో చాప మీద ఒక శరీరం చలనం లేని స్థిలో పడివున్నది. వంగి చూడబోయి భయంతో వెనక్కి తగ్గాడు. ఆ సవం అమె కొడుకుది. ఆ పక్కనే జీవ చ్చవంలా ఆమె నిలబడి వుంది. మిగిలిన ఇద్దరి లాగె వీడిని నీ పొట్టాన బెట్టు కున్నవు. జనాలంతా నిన్ను తాపసి, అనీ, దేవదూత అనీ అంటారు. కాని నీవు హంతకుడివి, ఆమె కోపం ఆరిచింది,. విరాట్ ఏదో చెపాలనుకున్నాడు. దానికి అడ్డు పడి ఆమె మరలా అన్నది. " "ఈ మగ్గం చూడు, ఈ ముక్కలిమ్పీట చూడు, ఇక్కడ కూర్చునే నాభర్త బట్టాలు నేసేవాడు,. ఆయనతో సమానంగా నేత గాడు ఈ ప్రాంతంలోనె లేడు. అతనిచే బట్టాలు నేయించు కోడానికి ప్రజలు ఎక్కడినుండో వచ్చెవారు. మా కుటుంబానికి ఈ వృత్తే ఆధారం. పిల్లలను జాగ్రత్తగా పెంచాం. వారిని తండ్రి అంతటి వారిని చేద్దాం అనుకున్నా. కాని ఒకరోజున ఒక వేటగాడొచ్చి ఎవరో ఒకఋషి సర్వం త్యజించి భగవంతుని సేవలొ జీవితం గడుపుతున్నాడని ఆయనే భగవంతుని ప్రతి రూపమనీ, ఏవో చెప్పాడు. ఆ మాటలు మనసులో నాటుకొని క్రమేణ పరద్యానం లో పడి, మాతో మాట్లాడ్డం కూడ తగ్గించాడు. ఒక రోజు ఎవ్వరికి చెప్పకుండా అడవిలోకి వెళ్లి పోయాడు. ఆయన స్వార్థాన్ని ఆయన చూసుకున్నాడు. మాకు జీవనాధరం పోయింది. ఇంటికి దారిద్ర్యంపట్టుకుంది,. ఒకరి తర్వాత ఒకరు మా బిడ్డలు చనిపోయారు. నీవే నా భర్తను నీమ్మార్గం లోకి ఆకర్షించావు. నువ్వు భగవంతునికి దగ్గిర కావాలని నా బిడ్డలను దూరం చేశావు. కుటుంబంతో హాయిగా మసలుతున్న వ్యక్తిని .......సంసార భందనాలు మిద్య అనే బ్రమ కల్పించావు. ఇవన్నీ నీకు తెలిసి వుండక పోవచ్చు. నీవల్లే పోషించే నాధుడు లేక ఎన్నొ సంసారాలు కూలి పోయ్యి. ఒక పని చేసే ముందు దీన్ని ఇతరులు అనుసరిస్తారేమో, దాని పరిమాణాలెలా వుంటాయో? అని ఆలోచించ్ ని వాడివి నువ్వేం మహాత్ముడివి.?.....

విరాట్ భయంతో కంపించిమ్పోయాడు. " నన్ను చూసి ప్రజలు అనుకరిస్తారనుకోలేదు. నేనెన్నుకున్న మార్గంలో నేనిక్కడినే నడవాలను కున్నాను."

"ఓయీ మునీ నీ జ్ఞానం ఏమయిందయ్యా? పసి పిల్లకు కూడ అర్థం అయ్యే ఈ విషయం నీకు అర్థం కాలేదా? ప్రపంచంలో వున్న అన్ని కార్యాలు భగవత్ కార్యాలే. ఆ పనులనుండి, కార్యాల నుండి తప్పించుకునే వీలు లేదు. నీ కర్మలకు నీవే కర్తవు కాగలవను కున్నావు. ఈ విషయాన్ని ఇతరలుకు భోదించాలనుకున్నావు. నీకు అమృతమైన విషయం నాకు విషం అయింది. నీ జీవితాదర్శం కొరకు నా బిడ్డలు బలైనారు.

విరాట్ కొంత సేపు ఆలోసించి అమె మాటలను అంగీకరించి తల వంచు కున్నాడు.

" మీరు చెప్పింది నిజమే, ఏకాంత వాసంలో కంటే, కర్తవ్య నిర్వహణలో ఒంటరిగా క్షోభ ననుభవించే వ్యక్తిలోనే ఎక్కువ సత్య దర్శనం అవుతుంది.. ప్రతి వ్యక్తి తెలిసో తెలియకో ఏదో ఒక కర్మను ఆచరిస్తూనే వుంటాడు. దానికి అతడు ఈ భూమిమీద బాధ్యుడే అనేది సత్యం. నేను మిమ్ములను క్షమా భిక్ష కోరుతున్నాను. నేను అడవినుండి బయటకు వస్తాను, మీ భర్త కూడా వస్తాడు, మీకొక కొత్త జీవితాన్ని ప్రసాదిస్తాడు. మళ్లి మీకు సంతానం కలుగుతుంది. " అని ఆమెకు నమస్కరించి బయటకు నడిచాడు. ఆమె మనసు లోనున్న క్రోదమంతా తుడిచి పెట్టుక పోయింది. విరాట్ వైపు అలా చూస్తూనే ఉంది.