విలియం వర్డ్స్ వర్త్

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
విలియం వర్డ్స్ వర్త్
William wordsworth.jpg
జననం: {{{birth_date}}}
వృత్తి: కవి
Literary movement: రొమాంటిసిజమ్
ప్రభావాలు: జాన్ మిల్టన్, హెన్రీ వాగన్, డేవిడ్ హార్ట్ లె, శామ్యూల్ కొలెరిడ్జ్, జొహాన్ వొల్ఫ గ్యాంగ్ వాన్ గోతె, విలియం షేక్ ష్పియర్, జాన్ వాకింగ్ స్టివార్ట్ , చార్లొటె స్మిత్
ప్రభావితులు: జాన్ స్టువార్ట్ మిల్, మాథ్యూ అర్నాల్డ్, రాల్ఫ్ వాల్డో ఎమర్సన్, లెస్లీ స్టీఫెన్, విల్ఫ్రెడ్ వోవన్, ఎజ్రా పౌండ్, రాబర్ట్ ఫ్రాస్ట్, విలియం బట్లర్ యీట్స్, జార్జ్ బైరన్, 6వ బారన్ , జాన్ మిల్లింగ్ టన్ సింజె

విలియం వర్డ్ స్ వర్త్ (జ: 7 ఏప్రిల్ 1770 - మ: 23 ఏప్రిల్ 1850) సుప్రసిద్ధ ఆంగ్ల కవి. అంతే కాకుండా 1798వ సంవత్సరంలో శామ్యూల్ టేలర్ కొలరిడ్జ్తో కలసి "లిరికల్ బాలడ్స్" ప్రచురించటం ద్వారా ఆంగ్ల సాహిత్యం నందు romantic (?)యుగం మొదలు అవ్వడానికి సహాయం చేశాడు.

వర్డ్స్ వర్త్ రచనలన్నిటిలోకి అమోఘమైనదిగా "ది ప్రిల్యూడ్"ను భావిస్తారు. ఇది రచయత తొలి వత్సరాల అర్దాత్మకవిత. దీనిని రచయిత చాలామార్లు పునః పరిశీలించాడు, పొడిగించాడు. ఈ రచనను మరణానంతరం పేరు పెట్టి, ప్రచురించాడు, అంతకుముందు ఈ రచన "టూ కొలరిడ్జ్" గా పిల్చే వాడు. వర్డ్స్ వర్త్ ఇంగ్లాండు రాజ కవిగా (poet laureate) 1843 నుండి 1850 వరకు ఉన్నాడు.

జీవిత చరిత్ర[మార్చు]

తొలి జీవితం మరియు చదువు[మార్చు]

జాన్ వర్డ్స్ వర్త్, అన్ కుక్సన్ దంపతుల ఐదుగురు సంతానంలో రెండవవాడు విలియం వర్డ్స్ వర్త్. ఇతను ఇంగ్లాండు నందలి కుంబర్లాండ్ నందలి కాకర్ మౌత్ నందు ఏప్రియల్ 7 1770 న జన్మించాడు. ఈ కుంబర్లాండ్, ఆగ్నేయ ఇంగ్లాండ్ లో ప్రకృతి సౌందర్యంతో అలరారు లేక్ జిల్లా నందలి భాగం. వర్డ్స్ వర్త్ తోబుట్టువులందరూ జీవితంలో మంచి విజయాలు సాధించారు. ఇతని తరువాత సంవత్సరానికి జన్మించిన సోదరి డొరోతి వర్డ్స్ వర్త్ ఒక కవి మరియు డయారిస్ట్. పెద్దన్న రిచర్డ్ లండను నగరంలో లాయర్. చిన్నన్న జాన్ ఈస్ట్ ఇండియా కంపెనీనందు కేప్టనుగా ఎదిగాడు. చిట్టచివరివాడయిన క్రిస్టఫర్ కేంబ్రిడ్జి నందలి ట్రినిటీ కాలేజి నందు మాస్టరుగా ఎదిగాడు. 1778లో వర్డ్స్ వర్త్ తల్లి మరణం తర్వాత, ఇతని నాన్న గారు హాక్స్ హెడ్ గ్రామర్ బడిలో చేర్పించాడు. సోదరి డొరోతిని యాక్షైర్ లో బంధువుల ఇంట్లో నివసించటానికి పంపాడు. ఆ తరువాత 9 సంవత్సరాల వరకు అన్నచెల్లెల్లిద్దరూ కలుసుకోలేదు. వర్డ్స్ వర్త్ 13 ఏండ్ల వయసులో పితృవియోగం కలిగింది. [1] రచయితగా వర్డ్స్ వర్త్ అరంగేట్రం 1787వ సంవత్సరంలో "ది యూరోపియన్ మాగజైన్ " లో చిన్న పద్యం ప్రచురించడం ద్వారా జరిగింది. ఇదే సంవత్సరం తను కేంబ్రిడ్జ్ సెయింట్ జాన్స్ కాలేజి లో చేరి 1791వ సంవత్సరానికి బి యే డిగ్రీ లో ఉత్తీర్ణుడయినాడు. [2] తొలి రెండు వేసవి శలవులకూ హాక్స్ హెడ్ కు తిరిగి వచ్చాడు, ఆ తరువాతి శలవులను నడక యాత్రలు, ప్రకృతి రమణీయత ఉట్టిపడే ప్రదేశాలను దర్శిస్తూ గడిపాడు. 1790వ సంవత్సరంలో యూరోప్ నడక యాత్రకు వెళ్లాడు. ఈ యాత్రలో ఆల్ప్స్ పర్వతాలు మూలమూలలూ దర్శించాడు. ఇంకా ఆక్కడికి దగ్గరలోని ఫ్రాన్స్, స్విడ్జర్లాండ్, ఇటలీ దేశాలలోని సమీప ప్రాంతాలను కూడా దర్శించాడు. ఇతని చిన్న తమ్ముడు కేంబ్రిడ్జ్ ట్రినిటీ కాలేజి మాష్టరుగా ఎదిగాడు. [3]

అన్నెట్టో వాలన్ తో సంబంధం[మార్చు]

1791వ సంవత్సరంలో వర్డ్స్ వర్త్ విప్లవ ఫ్రాన్స్ దర్శించాడు. అక్కడి ఘణతంత్ర ఉద్యమాన్ని చూసి ఆనందాశ్చర్యాలకు లోనయ్యాడు. అక్కడే అన్నట్టె వలోన్ అనే ఫ్రెంచ్ స్త్రీని ప్రేమించాడు. వీరికి 1792లో కరొలిన్ జన్మించింది. కాని ఆర్ధిక సమస్యల వల్ల మరియు ఇంగ్లాండు, ఫ్రాన్స్ ల మధ్య ఉన్న ఘర్షణ వాతావరణం వల్ల ఆ తరువాతి సంవత్సరమే ఇంగ్లాండు తిరిగి వచ్చాడు. [4] ప్రియురాలిని వదిలివేసిన పరిస్థితులు, ఆ తరువాత ఇతని ప్రవర్తన కలిసి ప్రేమించి మోసం చేశాడా అనే అనుమానాలకు తావిచ్చింది, కానీ తరువాతి జీవితంలో ప్రియురాలికీ, కుమార్తెకూ తగినంత సాయం చేశాడు. ఈ కాలంలో మంచి గుర్తింపు పొందిన "It is a beauteous evening, calm and free," ను వ్రాశాడు. ఇందులో పదిసంవత్సరాలగా చూడని తన భార్యను గుర్తు తెచ్చుకుంటూ, ఆమెతో సముద్రపు ఒడ్డున నడచిన నడకలు గుర్తు తెచ్చుకుంటూ వ్రాసిన వ్రాతలు ఉన్నాయి. ఈ కవిత విషయంలో తన కుమార్తెను ఎప్పుడూ చూడలేదు. ఇందులోని పంక్తులు భార్య, కుమార్తెలపై వర్డ్స్ వర్త్ గాఢమైన ప్రేమను వ్యక్తపరుస్తాయి. Reign of Terror ఇతని ఫ్రాన్స్ ఘనతంత్ర విప్లవం గురించిన అభిప్రాయాలను మార్చివేసింది. ఇంకా ఇంగ్లాండ్, ఫ్రాన్స్ ల మధ్య యుద్దం కూడా అన్నెట్టా మరియు కరోలిన్ లను చాలా వత్సరాలు చూడకుండా చేశాయి. ఈ సమయంలో వర్డ్స్ వర్త్ మానసికంగా అశాంతికిలోనయినట్టు తెలుస్తుంది. Peace of Amiens తరువాత 1802లో వర్డ్స్ వర్త్, తన చెల్లెలుతో కలిసి ఫ్రాన్స్ వెళ్లి అన్నెట్టె మరియు కెరొలిన్ లను చూసి తన బాధ్యతల గురించి ఒక ఒప్పందానికి వచ్చాడు.[4]

తొలి ప్రచురణ మరియు లిరికల్ బాలెడ్స్[మార్చు]

లిరికల్ బాలడ్స్ ముందుమాటలో వర్డ్స్ వర్త్ తన కవితలను ప్రయోగాలుగా పేర్కొన్నాడు. ఈ లిరికల్ బాలడ్స్ Romantic విమర్శకు manifestగా పిలవబడింది. "An Evening Walk" , "Descriptive sketches" కవితలతో కూడిన సంపుటి 1793వ సంవత్సరంలో వెలుగు చూసింది. 1795వ సంవత్సరంలో 900 పౌండ్లు రైస్లే కల్వర్ట్ నుండి , కవితలు వ్రాయడం కొనసాగించడానికి పొందాడు. ఇదే సంవత్సరం ఇతను శామ్యూల్ కొలెరిడ్జ్ ను సోమర్సెట్ నందు కలుసుకున్నాడు. ఈ కవులిద్దరూ చక్కని స్నేహితులుగా మారారు. 1797 వ సంవత్సరంలో తన చెల్లెలు డొరోతీతొ కలిసి సోమర్సెట్ లోని అల్ ఫాక్స్ టన్ హౌజ్ కి మారారు. ఈ ఇల్లు నెదర్ స్టోవె లోని కొలెరిడ్జ్ ఇంటికి దగ్గర. డొరోతి సహకారంతో, వర్డ్స్ వర్త్, కొలొరిడ్జ్ కలిసి లిరికల్ బాలడ్స్ ను రూపొందించారు. ఈ లిరికల్ బాలడ్స్ ఆంగ్ల రొమాంటిక్ యుగంలో ఒక అతి ప్రధాన మైలురాయి. కానీ ఈ సంపుటికి వర్డ్స్ వర్త్ పెరు కానీ, కొలొరిడ్జ్ పేరు కానీ రచయితగా లేదు. ఇందులో వర్డ్స్ వర్త్ కవితల్లో ప్రఖ్యాతి గాంచిన "Tintern Abbey" ఉంది. అలాగే కొలొరిడ్జ్ కవిత "en:The Rime of the Ancient Mariner" కూడా ఇందులో ఉంది. 1800లో ముద్రించిన రెండవ ముద్రణలో కేవలం వర్డ్స్ వర్త్ పేరు మాత్రమే రచయితగా ఉంది. అంతే కాకుండా ఈ రెండవ ముద్రణలో కవితలకు ముందుమాట కూడా వ్రాశారు, ఈ ముందు మాటను ఆ తరువాతి 1802 ముద్రణలో మరింత విపులీకరించారు. లిరికల్ బాలడ్స్ ముందుమాట romantic సాహిత్య సిద్దాంతంలో ప్రధాన పనిగా భావిస్తారు. ఈ ముందుమాటలో కొత్త రకం కవిత్వం లక్షణాలను చర్చిస్తాడు. ఈ కవిత్వాన్ని వాడుక భాషలో చెప్పే విప్లవాత్మకమైన కవిత్వంగా, అంతకు ముందు ఉన్న గ్రాంథిక భాషా కవిత్వానికి భిన్నమైనదిగా సూత్రీకరిస్తాడు. ఆలాగే తన విశ్వ విఖ్యాత కొటేషన్ ఇక్కడే వ్రాశాడు "the spontaneous overflow of powerful feelings from emotions recollected in tranquility."

1805లో లిరికల్ బాలడ్స్ నాలుగవ మరియు చివరి ముద్రణ ప్రచురించబడింది.


జర్మనీ మరియు లేక్ జిల్లా పయనం[మార్చు]

ఆ తరువాత 1798 autumn లో వర్డ్స్ వర్త్, డొరోతి, కొలరిడ్జ్ లు జర్మనీ ప్రయాణించాడు. ఈ ప్రయాణం కొలరిడ్జ్ జ్ఞానానికి ప్రేరణగా నిలిచినప్పటికీ వర్డ్స్ వర్త్ మాత్రం ఇంటి మీద బెంగ పెట్టుకున్నాడు. [4]1798 - 1799 ఘన చలికాలంలో వర్డ్స్ వర్త్, తన సోదరి డొరోతితో కలిసి గస్లర్లో నివసించాడు. విపరీతమైన ఒత్తిడిలోనూ, ఒంటరితనం ఫీలవుతూ కూడా "The Prelude" అని తరువాత పిలవబడిన ఆత్మకథని ఈ కాలంలో వ్రాశాడు. ఇంకా చాలా కోవితలు వ్రాశాడు. "the lucy poems" ఈ కాలంలో వ్రాసినవే. తరువాత అన్నా చెల్లెళ్లిద్దరూ ఇంగ్లాండుకు తిరిగి వచ్చారు. ఈ సారి వారి నివాసం లేక్ జిల్లాలోని గ్రాస్మెరి లోని డోవ్ కాటేజీ. ఈ కాలంలో దగ్గరలో నివసించే మరో కవి రాబర్ట్ సౌతీతో కలిసి రచనలు సాగించారు. వర్డ్స్ వర్త్ , సౌతీ, కొలరిడ్జ్ మువ్వురినీ లేక్ కవులు అని పిల్చారు. [5] ఈ కాలంలో వర్డ్స్ వర్త్ కవితలు ఎక్కువగా మరణం, endurance, విరహం, దుఃఖం ల చుట్టూ పరిభ్రమించాయి.

విలియమ్ వర్డ్స్ వర్త్

వివాహం మరియు పిల్లలు[మార్చు]

1802లో సోదరి డొరోతితో కలిసి ఫ్రాన్స్ వెళ్లి ప్రియురాలు అన్నెట్టె మరియు కుమార్తె కరొలిన్ లను చూసి వచ్చాడు. ఆ తరువాత లార్డ్ లాన్స్ డేల్ నుండి వారసత్వ ఆస్తి పొందాడు. అదే సంవత్సరం ద్వితీయార్థంలో బాల్య స్నేహితురాలు మేరీ హచిన్సన్ ను వివాహం చేసుకున్నాడు. [4] వివాహానంతరం డొరోతి అన్నా వదినలతో కలిసి ఉంది. వదినా మరదళ్లు చక్కని స్నేహితురాళ్లుగా మారారు. 1803లో వర్డ్స్ వర్త్ దంపతులుకు తొలి సంతానం ఉదయించింది. వీరికి మొత్తం ఐదుగురు సంతానం.

 1. జాన్ వర్డ్స్ వర్త్ (జూన్ 18, 1803 - 1875)
 2. డొరా వర్డ్స్ వర్త్ (ఆగస్ట్ 16 1804 - జులై 9, 1847)
 3. థామస్ వర్డ్స్ వర్త్ (జూన్ 15, 1806 - డిసెంబర్ 1 1812 )
 4. కాథరిన్ వర్డ్స్ వర్త్ (సెప్టెంబర్ 6, 1808 - జూన్ 4 1812)
 5. విలియం విల్లీ వర్డ్స్ వర్త్ (మే 12 1810 - 1883 )

ఆత్మకథ మరియు రెండు సంపుటాల్లో కవితలు[మార్చు]

వర్డ్స్ వర్త్ కు చాలా కాలం ఒక పెద్ద తాత్విక కవిత వ్రాయాలని పథకాలు ఉన్నాయి. ఈ కవితను తను ది రిక్లుజ్ అని పిలుద్దామనుకున్నాడు. 1798 - 99 కాలంలో ఒక ఆత్మ కథా కవితను వ్రాయడం మొదలు పెట్టాడు. దీనికి పేరు పెట్టలేదు, కానీ ది ప్రిల్యూడ్ అని పిల్చాడు. ఈ ప్రిల్యూడ్ తన ది రిక్లూజ్ నకు అపెండిక్స్ గా మారింది. 1804 నాటికి ఈ ప్రిల్యూడ్ ను పొడిగించటం మొదలు పెట్టాడు, 1805 నాటికి పూర్తి చేశాడు, కానీ వ్యక్తిగత వివరాలు ఎక్కువగా ఉన్న దాన్ని తన రిక్లూజ్ పూర్తి రచన అయ్యేంతవరకూ ప్రచురించదలచలేదు. 1805 నాటి తన సోదరుని మరణం మానసికంగా కృంగదీసింది, ఇహ తన రచన ఎప్పటికీ పూర్తి చెయ్యలేదు. The source of Wordsworth's philosophical allegiances as articulated in The Prelude and in such shorter works as "Lines composed a few miles above Tintern Abbey" has been the source of much critical debate. While it had long been supposed that Wordsworth relied chiefly on Coleridge for philosophical guidance, more recent scholarship has suggested that Wordsworth's ideas may have been formed years before he and Coleridge became friends in the mid 1790s. While in Revolutionary Paris in 1792, the twenty-two year old Wordsworth made the acquaintance of the mysterious traveller John "Walking" Stewart (1747-1822),[6] who was nearing the end of a thirty-years' peregrination from Madras, India, through Persia and Arabia, across Africa and all of Europe, and up through the fledgling United States. By the time of their association, Stewart had published an ambitious work of original materialist philosophy entitled The Apocalypse of Nature (London, 1791), to which many of Wordsworth's philosophical sentiments are likely indebted.

In 1807, his Poems in Two Volumes were published, including "Ode: Intimations of Immortality from Recollections of Early Childhood". Up to this point Wordsworth was known publicly only for Lyrical Ballads, and he hoped this collection would cement his reputation. Its reception was lukewarm, however. For a time (starting in 1810), Wordsworth and Coleridge were estranged over the latter's opium addiction.[4] Two of his children, Thomas and Catherine, died in 1812. The following year, he received an appointment as Distributor of Stamps for Westmorland, and the £400 per year income from the post made him financially secure. His family, including Dorothy, moved to Rydal Mount, Ambleside (between Grasmere and Rydal Water) in 1813, where he spent the rest of his life.[4]

విజయాలు, కీర్తి ప్రతిష్టలు[మార్చు]

1814లో ఇతను "The Recluse" సీరీస్ లోని రెండవ భాగంగా "The Excursion"ను ప్రచురించాడు. ఆయితే తొలి మరియు తృతీయ భాగాలు ఎప్పటికీ పూర్తవ్వలేదు, కానీ తన కవితల యొక్క నిర్మానాన్నీ, ఉద్దేశ్యాన్నీ వివరిస్తూ ఒక prospectus మాత్రం వ్రాశాడు. ఈ prospectus నందు వర్డ్స్ వర్త్, ప్రకృతి - మనస్సుల గురించి చేసిన ప్రముఖ కొటేషన్లు కొన్ని ఉన్నాయి. : గణపతి

My voice proclaims
How exquisitely the individual Mind
(And the progressive powers perhaps no less
Of the whole species) to the external World
Is fitted:--and how exquisitely, too,
Theme this but little heard of among Men,
The external World is fitted to the Mind . . .

కొంత మంది ఆధునిక విమర్శకులు 1810 తర్వాత వర్డ్స్ వర్త్ కవితలు అంత క్రితం కవితలతో పోల్చి చూస్తే అంత బాగోలేవు అంటారు. బహుశా తన జీవితంలోనూ, నమ్మకాల్లోనూ వచ్చిన మార్పులే దీనికి కారణం అయి ఉండవచ్చు. ఈయన తొలిదశలో కవితా వస్తువులుగా స్వీకరించిన మరణం, ఓర్పు, ఎడం, విడిచిపోవటం వంటి విషయాలన్నింటినీ రచనల ద్వారా పరిష్కరించడంతో ఈయన కవితా జీవితంలో నిర్మాణాత్మక అధ్యాయం ముగిసింది. అయినా, 1820 కల్లా సమకాలీన విమర్శకులు ఈయన తొలిదశలోని కవితలపై విమర్శలను వెనక్కుతీసుకోవడంతో వర్డ్‌వర్త్ కవిగా విజయాన్ని అనుభవించాడు. 1828లో, వర్డ్‌వర్త్ కొలెరిడ్జ్‌తో ఉన్న విబేధాలు రూపుమాపుకొని సఖ్యత సాధించి, ఇద్దరూ కలిసి ఆ సంవత్సరం రైన్‌లాండ్ అంతా తిరిగివచ్చారు.[4] డొరోతికి 1829లో తీవ్రమైన జబ్బు చేసింది, ఆ తరువాత ఆమె కవిత్వ రచనలో వర్డ్స్ వర్త్ కి ఎటువంటి సహాయం చేయలేదు. 1835లో ఫ్రాన్స్ ప్రియురాలు అన్నెట్టె మరియు కుమార్తె కరోలిన్ ల పోషణకు సరిపోను నగదు చెల్లించాడు.

రాజ కవి మరియు ఇతర గౌరవాలు[మార్చు]

సివిల్ న్యాయంలో గౌరవ డాక్టరేటును డుర్హం విశ్వవిద్యాలయంనుండి 1838వ సంవత్సరంలోను, ఆ తరువాత సంవత్సరం అదే గౌరవాన్ని ఆక్సఫర్డ్ విశ్వవిద్యాలయంనుండి అందుకున్నాడు.[4] 1842లో ప్రభుత్వాన్నుండి 300 పౌండ్ల వార్షిక చందా లభించింది. 1843లో రాబర్ట్ సౌతీ మరణం తరువాత ఇంగ్లాండు రాజ కవిగా నియమించ బడ్డాడు. 1847లో కుమార్తె డోరీ మరణం తరువాత ఇహ కవితలు వ్రాయలేదు.

మరణం[మార్చు]

విలియమ్ వర్డ్స్ వర్త్ యొక్క సమాధి, గ్రస్మిర్, కమ్బ్రియ

ఏప్రియల్ 23 1850న న్యూమోనియా కారణంగా మరణించాడు. గ్రాస్మెరీలోని సెయింట్ ఆస్వాల్డ్స్ చర్చిలో ఆంతిమ సంస్కారాలు జరిపారు. మరణానంతరం ఇతని భార్య ద్వారా ఆత్మ కథ "poem to coleridge" The preludeగు వెలుగు చూసింది. 1850లో ఎక్కువ ప్రాధాన్యత పొందకపొయినా ఆ తరువాత వర్డ్స్ వర్త్ కవిత్వంలో ఇది ఘనమైనదిగా గుర్తింపు పొందింది.

ప్రధాన రచనలు[మార్చు]

 • The Excursion (1814)
  • "Prospectus to The Recluse"
 • Ecclesiastical Sketches (1822)
  • "Mutability"

పాద పీఠికలు[మార్చు]

 1. "William Wordsworth". Encyclopedia Britannica. 1911. 
 2. "William Wordsworth, Biography and Works". The Literature Network. Retrieved 2008-08-10. 
 3. Appendix A (Past Governors) of Allport, D.H. & Friskney, N.J. "A Short History of Wilson's School", Wilson's School Charitable Trust, 1986
 4. 4.0 4.1 4.2 4.3 4.4 4.5 4.6 4.7 [1]Everett, Glenn, "William Wordsworth: Biography" Web page at The Victorian Web Web site, accessed 7 January 2007
 5. See: Recollections of the Lake Poets.
 6. Kelly Grovier, "Dream Walker: A Wordsworth Mystery Solved", Times Literary Supplement, 16 February 2007
 7. 7.0 7.1 7.2 7.3 7.4 M. H. Abrams, editor of The Norton Anthology of English Literature: The Romantic Period, writes of these five poems: "This and the four following pieces are often grouped by editors as the 'Lucy poems,' even though 'A slumber did my spirit seal' does not identify the 'she' who is the subject of that poem. All but the last were written in 1799, while Wordsworth and his sister were in Germany, and homesick. There has been diligent speculation about the identity of Lucy, but it remains speculation. The one certainty is that she is not the girl of Wordsworth's 'Lucy Gray'" (Abrams 2000).

వనరులు[మార్చు]

 • M. H. Abrams, ed. (2000), The Norton Anthology of English Literatures: Volume 2A, The Romantic Period (7th ed.), New York: W. W. Norton & Company, Inc., ISBN 0-393-97568-1 
 • Stephen Gill, ed. (2000), William Wordsworth: The Major Works, New York: Oxford University Press, Inc., ISBN 0-19-284044-4 

బయట లంకెలు[మార్చు]

General information and biographical sketches

Wordsworth's works