వీధి భాగోతం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ఆంధ్ర దేశంలో ఆంధ్రులకే తెలియని "అరె" జాతి వారనే ఒక ప్రత్యేకమైన తెగకు సంబంధించిన వారు, అనేక మంది తెలంగాణా జిల్లాలలో వున్నారనే విషయం చాలా మందికి తెలియదనటం అతిశయోక్తి కాదు. వీరు ముఖ్యంగా కరీంనగర్, వరంగల్, నల్లగొండ జిల్లాలలో ఎక్కువ మంది నివసిస్తున్నారు. గోధలీలు తెలుగు దేశానికి ఎప్పుడు ఎలా వచ్చి స్థిరపడ్డారో చెప్పడానికి సరియైన చారిత్రక ఆధారాలు లేవు. కాని ఆరె వాళ్ళు వసస వచ్చిన తరువాతనో, లేక వారిని అనుసరిస్తూనో వినోద ప్రదర్శనాలు ఇవ్వడం కోసం వచ్చి, తెలంగాణాలో స్థిరపడి వుంటారని ఊహించ వచ్చంటారు. ఏది ఏమైనా ఈ గొంధళీలు కూడా మధ్య తెలంగాణా లోని ఆరె వాళ్ళ మాదిరి గానే, రాయలసీమ లోని సురభి వాళ్ళకన్న, ఆఅరె మరాఠీల కన్న ఆతి ప్రాచీనులని చెప్పవచ్చునని, డా. పేర్వారం జగన్నాథంగారు, వారు పరిశోధించిన ఆరె జానపద సాహిత్యం తెలుగు ప్రభావం అన్న గ్రంథం షష్ఠమ తరంగంలో వివరించారు.

కుండలాకార నృత్యం[మార్చు]

కుందలాకార నృత్య విశేషంగా చెప్పబడుతున్న గొండిలి, గొండ్లి, తోలు బొమ్మలాటల్లోని గాంధోళిగాడు గొంధళి, అనే పోదాలన్నీ ఒకే కుదురు నుంచి పుట్టి వుండవచ్చు నంటారు జగన్నాథంగారు. బుర్ర కథ, తోలు బొమ్మలాటల వంటి కళా రూపాలు కూడా మహారాష్ట్ర నుండి తెలుగు దేశానికి వచ్చాయన్న ప్రతీతి కూడా ఉంది. ఆరె వాళ్ళు మహారాష్ట్ర నుండి తెలుగు దేశానికి వలస వచ్చి కొన్ని శతాబ్దాల క్రితమే స్థిర పడి పోయారు. తెలుగు ప్రజల జీవితాలతో వారు పెన వేసుకు పోయినా ఇప్పటికీ వారి భాషా సంస్కృతుల్నీ అచార వ్వవహారాల్నీ నిలుపుకొంటూ వస్తున్నారు. వీరిని ఆరె వాళ్ళని, ఆరుకాపులనీ, అరె మరాఠీలని అర్య క్షత్రియులనీ, వివిధ పేర్లతో పిలుస్తున్నారు. వీరు ప్రాచీన కాలం నుంచీ ఆయుధోపజీవులుగా వున్నట్లు కనిపిస్తున్నారనీ, శాంతి సమయంలో నాగలి పట్టి నేల దున్నటం, యుద్ధ సమయంలో కత్తిబట్టి కదనరంగంలో క్షాత్ర తేజస్సును ప్రదర్శించడం వీళ్ళకు అనువంశిక సంప్రదాయ మైనట్లు కనిపిస్తున్నదనీ వివరిస్తున్నారు.

గొంధలే వీధి భాగోతాలు[మార్చు]

ఆరె వాళ్ళు గ్రామాలలో ఆఅరె భాషలో వీధి భాగోతాలను ప్రదర్శిస్తారు. ఈ ప్రదర్శనలను "ఆరె" వారితో పాటు, తెలుగు వారు కూడా ఆదరిస్తున్నారు. ఆరెవారిలో అంబీర, ఇంగ్లే, గుండే కారి, గుగై, దూదాటి షేక, నారా, సింధే అనే ఇంటి పేర్లు గల గొంధళీ కుటుంబాలు సుమారు రెండు వందలదాకా తెలంగాణా జిల్లాలలో వున్నట్లు జగన్నాథం గారు తెలియజేస్తున్నారు. ముఖ్యంగా వీరంతా మహామలింగంపల్లె, వరి కోలు, వేములపల్లి, కోయలాయ, వెంకటాపురం[-అయోమయ నివృత్తి పేజీకి వెళ్తున్న ఈ లింకును సవరించాలి-] అలాగే కరీంనగర్ జిల్లాలలోని గోపాలపురం జోజూనూరు పల్లి మొదలైన గ్రామాలలో ఉన్నారు. రంగస్థల కళాకారులైన వారు ఎక్కువగా మహాలింగం పల్లెలో వుంటున్నారు. ఈ గ్రామానికి సోమదేవర పల్లి అని కూడా మరో పేరు ఉంది.

గోధళీ బుర్ర కథలు[మార్చు]

ఇంతకు పూర్వం తెలంగాణాలో గొంధళీలు ఒక ప్రత్యేక మైన పద్ధతిలో వీర రసాత్మకాలైన కథలనూ, కరుణారస భరితాలైన కథలనూ బుర్ర కథలుగా చెప్పేవారట. ఈ కథలు చెప్పే బృందాల్లో కథకుడు పొడుగాటి బొందెల జుబ్బాను ధరించి, దోవతి కట్టి, నెత్తికి రంగుతో కూడిన రుమాలు చుట్టి, గవ్వల హారాన్ని జెందెం మాదిరిగా ధరించే వాడట. ఒకడు మద్దెల వాయిస్తూ వుండాగా, మరొకడు కిన్నెర వాయించే వాడట. ఇంకొకడు తాళం వేస్తూ వుండగా కథకుడు ఆరె భాషలో కథ చెపుతూ వుండేవాడట, అయితే ఆ విధంగా కథలు చెప్పే వారు ఈనాడు లేరట.

వీథి భాగోతాలు[మార్చు]

అయితే ఈ గోధళీలు, మధ్య తెలంగాణా ప్రాంతంలో ఆరే వారు ఎక్కువగా వుండే గ్రామాలకు వెళ్ళీ, ఈనాటికీ వీధి భాగోతాలు ప్రదర్శిస్తున్నారు. ఈ ప్రదర్శనాలు చాల వరకు మన వీధి నాటకాల పోలికలోనే వుంటాయట. వీరి భాగోతాలకు హంగుదార్లుగా హార్మోనియాన్ని, మద్దెలనూ ప్రక్క వాయిద్యాలుగా ఉపయోగిస్తారట. వీరు ప్రదర్శించే కథా ఇతి వృతాలు, భారత గాథలకూ, జానపద గాథలకూ సంబంధించి వుంటాయి. మన వీధి నాటకాలలో మాదిరి విదూషకుడులా వీరి భాగోతాలలో హాస్య పాత్ర ప్రవేశించి ప్రేక్షకుల్ని హాస్యం ద్వారా కడుపుబ్బ నివ్విస్తుంది. అంతే గాదు మధ్య మధ్యలో ఆరె భాషను తెలుగు లోకి అనువదిస్తూ వుంటాడు. ఒక్క మాటలో చెప్పాలంటే వీరి హాస్య పాత్ర సంస్కృత నాటకాల్లోని విదూషకుని పాత్రను పోలి వుంటుంది. రాజు పాత్రలకు అతి సన్నిహితంగా వుంటాడు. వీరి భాగోతాల్లో స్త్రీ పాత్రల్ని పురుషులే ధరిస్తారు. ఇక కథలో వచ్చే పాత్రల పేర్లన్నీ మహారాష్ట్ర సంస్కృతికి సంబంధించినవే వుంటాయి. అయితే మరికొన్ని పాత్రల పేర్లు తెలుగు పేర్లుగానే వుంటాయి. ప్రదర్శించే రంగస్థలంలో ఒక పొడుగాటి గవ్వల హారాన్ని వ్రేలాడ దరిస్తారు. ఈ దండను వారు అంబా భవానికి చిహ్నంగా ఆరాదిస్తారు. గొంధళీ కళాకారులు అరె వారి పారితోషికాలతోనే జీవిస్తున్నారు. తెలుగు ప్రజలు కూడా వారిని ఆదు కుంటున్నారు.

అయితే గోధళీల భాగోత ప్రదర్శనల కిప్పుడు ప్రజాదరణ తగ్గి పోతూ ఉంది. అందువల్ల గోధళీలలో చాల మంది వ్వవసాయాన్ని వృత్తిగా స్వీకరిస్తున్నారు. మరి కొంతమంది, వేరే వృత్తిలో జీవిస్తున్నారు. క్రమ క్రమంగా ఈ కళ క్షీణించి పోయేదశకు చేరుకుంది. ఇటీవల ఔత్సాహికులైన గోంధళీ కళాకారులు ఈ కళను కాపాడుకోవడం కోసం మహాలింగంపల్లి కేంద్రంగా గొంధళే నాటక మందలిని స్థాపించు కున్నారు.

బాలవంతి కథా ప్రదర్శనం[మార్చు]

వారు ప్రదర్శిచే ప్రదర్శనాలలో బాల వంతి కథ ఒకటి. బాలవంతి కథలో రాజుకు సంతానం కలగదు. సంతాన ప్రాప్తికోసం తపస్సు చేసి ఈశ్వరుని వల్ల వరం పొంది రావలసిందిగా రాణి రాజును ప్రోత్సహిస్తుంది. మొదట రాజు అంగీకరించడు. ఐనా రాణి బలవంతం చేస్తుంది. రాజు తన రాజ్య భారాన్ని లింబోజీ ప్రధానికి అప్పగించి తపస్సు కోసం అరణ్యానికి వెళ్ళడానికి సిద్ధపడాతాడు. ఆ సందర్భంలో వారిరువురి మధ్యా ఇలా సంవాదం జరుగుతుంది.

బాలవంతి: ......... వారి ఆరె భాషలో ఇలా వుంటుంది.

ఐకుమి రాజా మీతోటి సంగిత కానిదారు ఐకుమి రాజా
అంచనామయూ అంచనామగాదు సంగిత మీ అంచనామయూ
వరదనుదదాలా తేరపరచదనుదదాల బోలుధడావో వరదనుదదాలా
వింబోజిదదాలా అతేవింబోజిదదాల బోలుధడావే వింబోజిదదాలా

ఈ విధంగా సాగే వారి సంవాదం తెలుగులో ఇలా వుంటుంది.

బాలవంతి
............

ఓ రాజా... నేనోమాట చెబుతాను చెవున బెట్టవలసింది
మన పేరూ మన ఊరు పేరు చెబుతాను
మనకీ రాజరికం వుండి లాభమేమి
మక కీ ధనద్వ్రాలు కూడా వుండి ఏమి లాభం లేదు.
వేముల వాడ దేవుడుండీ కూడ లాభం లేకుండా వున్నది
వినవయ్యా ఓ రాజా.... నేనో మాట చెబుతాను
ఇటు చెవి బెట్టివిను.

అవర్సింగ్:.....

ఓ నారీ? అదేమి సంగతో చెప్పు వింటాను.

బాలవంతి:..........

మనకు కొడుకులూ కూతుళ్ళూ లేరు
నిన్ను నాన్నా అని పిలిచే కొడికులు లేరు
నన్ను అమ్మా అని పిలిచే కూతుర్లు లేరు
తండ్రి చెప్పులు తొడిగే కుమారుడు లేడు
తల్లి రవికెలు తొడిగే కూతురు లేదు
ఓ రాజా నీవిప్పుడు ధౌలగిరి (ధవళాగిరి)కి వెళ్ళాలి
నీవు కొడుకూ కూతుర్ల దానం పొందాలి.

అవర్ సింగ్:.....

ఓ నా రాణీ... నేను కూడ ఓ మాట చెబుతాను
ఓ నారీ దేవు డివ్వందే కూతుర్లెట్టా కలుగుతారు
ఓ నారీ దేవు డివ్వందే కొడుకులెట్టా కలుగుతారు
సంతానం కోసం నేనెక్కడికీ వెళ్ళను
నాతో నీవున్నూ ఇట్లా చావ వలసిందే తప్ప
నేను సంతానం కోసం ఎటూ వెళ్ళను సుమా..

బాలవంతి:....

వినవయ్య ఓ రాజా.. నేనో మాట చెబుతాను
కొడుకు కూతుర్ల వరం పొందడం కోసం నీవు తప్పక వెళ్ళాలి

బాలవంతి
............

ఓ రాజా... నేనోమాట చెబుతాను చెవున బెట్టవలసింది
మన పేరూ మన ఊరు పేరు చెబుతాను
మనకీ రాజరికం వుండి లాభమేమి
మక కీ ధనద్రవ్వాలు కూడా వుండి ఏమి లాభం లేదు.
వేముల వాడ దేవుడుండీ కూడ లాభం లేకుండా వున్నది
వినవయ్యా ఓ రాజా.... నేనో మాట చెబుతాను
ఇటు చెవి బెట్టివిను.

అవర్సింగ్:.....

ఓ నారీ? అదేమి సంగతో చెప్పు వింటాను.

బాలవంతి:..........

మనకు కొడుకులూ కూతుళ్ళూ లేరు
నిన్ను నాన్నా అని పిలిచే కొడికులు లేరు
నన్ను అమ్మా అని పిలిచే కూతుర్లు లేరు
తండ్రి చెప్పులు తొడిగే కుమారుడు లేడు
తల్లి రవికెలు తొడిగే కూతురు లేదు
ఓ రాజా నీవిప్పుడు ధౌలగిరి (ధవళాగిరి)కి వెళ్ళాలి
నీవు కొడుకూ కూతుర్ల దానం పొందాలి.

అవర్ సింగ్:.....

ఓ నా రాణీ... నేను కూడ ఓ మాట చెబుతాను
ఓ నారీ దేవు డివ్వందే కూతుర్లెట్టా కలుగుతారు
ఓ నారీ దేవు డివ్వందే కొడుకులెట్టా కలుగుతారు
సంతానం కోసం నేనెక్కడికీ వెళ్ళను
నాతో నీవున్నూ ఇట్లా చావ వలసిందే తప్ప
నేను సంతానం కోసం ఎటూ వెళ్ళను సుమా..

బాలవంతి:....

వినవయ్య ఓ రాజా.. నేనో మాట చెబుతాను
కొడుకు కూతుర్ల వరం పొందడం కోసం నీవు తప్పక వెళ్ళాలి

ఇట్లా బాలావంతి చెప్పడం ప్రారంభించింది.

అవర్ సింగ్:..........

మంకవతిని వెంటనే రప్పించాలి
సోదరుడు లింబోజీని కూడ పిలిపించాలి
ఆ లింబోజి అన్నకు ఈ రాజ్యం అప్పాగించాలి
పెద్ద చిన్న లంతా కూర్చున్నా రీ సభలో
కోమట్లూ బామండ్లూ కూడ కూర్చున్నా రిక్కడ
ఓ నారాణీ? నేనీ రాజ్యాన్ని ఎవరి కిచ్చేది?
అక్కడ అరెండు పైసల్ని ముడి వేయాలి
ఒక్క పైసను మాత్రం నేను ఒడిలో కట్టుకుంటాను.

ఇలా వారి సంవాదం జరుగుతుంది. ఈ ప్రదర్శనాలను ఈ నాటికి వారు ఆంధ్ర దేశంలో ప్రదర్శిస్తున్నారు. మన జానపద కళారూపాలు ఎలా శిథిలమై పోతున్నాయో గోంధళే వీధి భాగోతాలు కూడా నశిస్తున్నాయి. అవీ మన కళారూపాలతో పాటు పెరిగాయి గాబట్టి వాటిని సంరక్షించాల్చిన బాధ్యత ఉంది. ఈ గొంధళే వీధి భాగోతాలను పరిశోధించిన పేర్వారం జగన్నాథంగారికి కృతజ్ఞతలు.

మూలాలు[మార్చు]

  • డా. మిక్కిలినేని రాధాకృష్ణ మూర్తి వ్రాసిన తెలుగువారి జానపద కళారూపాలు

యితర లింకులు[మార్చు]