వెంబాకం రాఘవాచార్యులు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
వెంబాకం రాఘవాచార్యులు
జననం
వెంబాకం రాఘవాచార్యులు
జాతీయతభారతీయుడు
వృత్తివిద్యార్థి

వెంబాకం రాఘవాచార్యులు( - 1842) ఈస్టిండియా కంపెనీ పరిపాలన కాలంలో పోలీస్ సూపరింటెండెంట్, మేజిస్ట్రేట్ వంటి ఉన్నత పదవులు చేపట్టిన వ్యక్తి. ఆయన వ్యక్తిగతంగా ధర్మకర్తగా, విద్యాదాతగా ప్రఖ్యాతి పొందారు. బ్రిటీష్ ఈస్టిండియా పాలనలో చెన్నపట్టణంలోని ప్రముఖుల్లో వెంబాకం రాఘవాచార్యలు కూడా ఒకరు.

స్నేహితులు[మార్చు]

రాఘవాచార్యులకు ఆనాటి చెన్నపట్టణం సుప్రీంకోర్టు ఇంటర్‌ప్రెటర్, తొలి తెలుగు యాత్రాచరిత్రాకారుడు ఏనుగుల వీరాస్వామయ్య, విద్యాదాత కోమలేశ్వరం శ్రీనివాస పిళ్ళై, మద్రాసు సుప్రీంకోర్టు అడ్వకేట్ జనరల్ జార్జి నార్టన్ ముఖ్య స్నేహితులు. వీరందరూ విద్యాభివృద్ధి, సాంఘిక సంస్కరణలు, ప్రజల సంక్షేమం వంటి విషయాలపై సమంగా ఆసక్తి కలిగిన వారు కావడంతో కలిసి చాలా సేవాకార్యకలాపాలు సాగించారు. ఎన్నో ప్రజాభివృద్ధి కార్యాలుకు నడుం కట్టారు.

ధర్మనిధికి అధ్యక్షునిగా[మార్చు]

విద్యాదాత పచ్చయప్ప ముదలియార్ వ్రాసిన విల్లుకు వ్యతిరేకంగా, ఆయన మరణానంతరం పచ్చయప్ప దానధర్మాలకు కేటాయించిన లక్షలాది రూపాయల సొమ్మును వారసులు తినివేశారు. ఈ నేపథ్యంలో బ్రిటీష్ ఈస్టిండియా కంపెనీ చెన్నై సుప్రీంకోర్టు అడ్వకేట్ జనరల్ కాంప్టన్, ఆయన అనంతరం వచ్చిన మరొక అడ్వకేట్ జనరల్ నార్టన్ పచ్చయప్ప దానధర్మాలకు కేటాయించిన సొమ్మును న్యాయపరంగా వెలికితీయించారు. ఆ వెలికి తీసిన సొమ్మును పచ్చయప్ప వీలునామా మేరకు ధర్మకార్యాలకు ఖర్చుచేసేందుకు 1832లో ధర్మకర్తల బోర్డు ఏర్పాటుచేశారు. ఆ బోర్డులో పోలీసు సూపరింటెండెంటు, దాత వెంబాకం రాఘవాచార్యులు అధ్యక్షునిగా, ప్రముఖ విద్యాదాత కోమలేశ్వరం శ్రీనివాస పిళ్ళై ఒకానొక ధర్మకర్తగా ఉన్నారు. 1842లో వెంబాకం రాఘవాచార్యులు మరణించాకా అప్పటి నుంచి శ్రీనివాసపిళ్ళై అధ్యక్షుడై 1852లో తాను మరణించేవరకూ కొనసాగారు. ఈ క్రమంలోనే ఆ ధర్మనిధితో పచ్చయప్ప కళాశాలను నిర్మించారు.[1]

మూలాలు[మార్చు]

  1. వీరాస్వామయ్య, యేనుగుల (1941). కాశీయాత్రా చరిత్ర (PDF) (మూడవ ముద్రణ ed.). విజయవాడ: దిగవల్లి వెంకట శివరావు.