శరణ్య మోహన్
శరణ్య మోహన్ | |
---|---|
జననం | అలెప్పుళా, కేరళ, భారతదేశము | 1989 ఫిబ్రవరి 9
ఇతర పేర్లు | అప్పు |
వృత్తి | సినిమా నటీమణి |
క్రియాశీల సంవత్సరాలు | 1997 – 2015 |
శరణ్య మోహన్ (జననం 1989 ఫిబ్రవరి 20) భారతీయ మాజీ నటి, ఆమె ప్రధానంగా మలయాళం, తమిళ చిత్రాలలో నటిస్తుంది. ఆమె కొన్ని తెలుగు, కన్నడ, హిందీ చిత్రాలలో కూడా నటించింది. యారాడి నీ మోహిని (2008), వెన్నిల కబడ్డీ కుజు (2009), ఈరం (2009), వేలాయుధం (2011), ఒస్తే (2011) చిత్రాలలో ఆమె నటనకు మంచి పేరు తెచ్చుకుంది. అలాగే, ఆమె నటించిన విలేజ్ లో వినాయకుడు సినిమా ద్వారా కూడా మంచి గుర్తింపు వచ్చింది.[1]
కాదలుక్కు మరియాదై చిత్రం ద్వారా తమిళ సినిమాకు పరిచయం అయిన ఆమె వెన్నెలాకబడ్డీకుళు చిత్రంతో కథానాయికిగా ఎదిగింది.
ప్రారంభ జీవితం
[మార్చు]శరణ్య కేరళ లోని ఆళప్పుళాలో 20 ఫిబ్రవరి 1989 న జన్మించింది. ఆమె కళామండలం, దేవిక దంపతుల పెద్ద కూతురు. ఆమెకు సుకన్య అనే చెల్లెలు ఉంది, ఆమె శాస్త్రీయ నృత్యకారిణిగా శిక్షణ పొందింది. ఆమె తల్లిదండ్రులు ఇద్దరూ శిక్షణ పొందిన క్లాసికల్ డ్యాన్సర్లు, డ్యాన్స్ టీచర్లు కూడా. వారికి అలప్పుజాలో ఒక డ్యాన్స్ స్కూల్, వైకెబి డాన్స్ అకాడమీ ఉంది.[2] ఇందులోనే శరణ్య మోహన్ భరతనాట్యం నేర్చుకుంది. ఆమె సెయింట్ జోసెఫ్స్ కాలేజ్ ఫర్ ఉమెన్ లో చదువుకుంది,[3] ఆంగ్ల సాహిత్యంలో తన బి. ఎ. డిగ్రీని పూర్తి చేసింది. అన్నామలై విశ్వవిద్యాలయం నుండి ఆంగ్ల సాహిత్యంలో ఎం.ఎ. పూర్తి చేసిన ఆమె చిదంబరం అదే విశ్వవిద్యాలయం నుండి భరతనాట్యంలో ఎం.ఎఫ్.ఎ పట్టా పుచ్చుకుంది.[4][5]
కెరీర్
[మార్చు]డ్యాన్స్ స్కూల్‌లో శరణ్య డ్యాన్స్ చేయడాన్ని చూసిన మలయాళ దర్శకుడు ఫాజిల్ ఆమెను వెండితెరకు పరిచయం చేసాడు. ఆమె 1997 మలయాళ చిత్రం అనియతి ప్రవు, దాని తమిళ రీమేక్, కధలుక్కు మరియాదైలలో బాలనటిగా చేసింది. ఆ తర్వాత మమ్ముట్టి, మోహన్‌లాల్, జూహీ చావ్లా ప్రధాన పాత్రల్లో నటించిన మలయాళంలో విజయం సాధించిన హరికృష్ణన్స్ చిత్రంలో చైల్డ్ ఆర్టిస్ట్‌గా కనిపించింది. ఆ తర్వాత మోహన్‌లాల్, సురేశ్ గోపీతో కలిసి మరో మలయాళ చిత్రం రక్తసాక్షికల్ సిందాబాద్‌లో కూడా ఆమె చైల్డ్ ఆర్టిస్ట్‌గా చేసింది. ఆమె తిరిగి తన చదువుపై దృష్టి సారించింది. తదుపరి తిరిగి ఫాజిల్ దర్శకత్వం వహించిన ఒరు నాల్ ఒరు కనవు (2005)లో సహాయక పాత్ర పోషించింది.
ఆమె తర్వాత విడుదలైన ధనుష్, నయనతార నటించిన యారాడి నీ మోహిని (2008)తోనూ ఆమె మంచి పేరు తెచ్చుకుంది. ఆమె 2008లో మరో మూడు తమిళ చిత్రాలు జయంకొండన్, మహేష్, శరణ్య మాత్రం పలర్, పంచామృతంలలో నటించింది, అయితే అవి అంతగా విజయం సాధించలేదు.
2009లో ఏకంగా ఆమె నటించిన ఆరు చిత్రాలు విడుదల అయ్యాయి, వాటిలో నాలుగు తమిళ ప్రాజెక్ట్‌లు, వీటిలో సుసీంథిరన్ దర్శకత్వం వహించిన వెన్నిల కబడ్డీ కుజు, సూపర్ నేచురల్ థ్రిల్లర్ ఈరమ్ వాణిజ్యపరంగానూ, విమర్శనాత్మకంగానూ విజయవంతమయ్యాయి. ఇక మరో రెండు తమిళ సినిమాలు ప్రభుతో అ ఆ ఈ ఈ, భరత్, ప్రియమణి ప్రధాన పాత్రల్లో నటించిన ఆరుముఘం.
ఆ తరువాతి సంవత్సరం, ఆమె విలేజ్ లో వినాయకుడు సినిమాతో తెలుగులోకి అడుగుపెట్టింది. ఆమె 2010లో భీమిలి కబడ్డీ జట్టు అనే తమిళ సినిమాకి తెలుగు రీమేక్ చేసింది, అది కూడా బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు రాబట్టింది. ఆ తర్వాత అదే ఏడాది తెలుగులో మరో సినిమా హ్యాపీ హ్యాపీగాలో చేసింది. కల్యాణ్ రామ్ మూవీ కత్తి (2010) సినిమాలో ఆయనకు చెల్లెలిగా కనిపించింది.[6]
2011లో ముఖేష్, విను మోహన్, సరయు మోహన్‌లతో కలిసి మరో మలయాళ చిత్రం నడకమే ఉలకమ్ చేసింది. ఆ తర్వాత అదే సంవత్సరం తమిళంలో అళగర్సామియిన్ కుత్తిరై చిత్రంలో అతిధి పాత్రలో నటించింది. 2011లో ఆమె ఎం.రాజా వేలాయుధంలో కూడా నటించింది, అది భారీ విజయాన్ని సాధించింది. విజయ్ సోదరిగా ఆమె చేసిన పాత్ర ఆమెకు చాలా మంచి సమీక్షలను అందుకుంది. అదే ఏడాది తర్వాత మలయాళంలో ఇన్నాను ఆ కళ్యాణం అనే సినిమా చేసింది. ఆమె 2011 చివరలో శింబు ప్రధాన పాత్రలో ధరణి ఒస్తే అనే మరో చిత్రంలో కూడా నటించింది. 2012లో ఆమె తన తొలి కన్నడ చిత్రం ఈ భూమి ఆ భాను చేసింది. 2014లో ఆమె మరో కన్నడ చిత్రం పరమశివలో వి. రవిచంద్రన్ సర్ లో కూడా నటించింది. అదే సంవత్సరం ఆమె నిషాన్ సరసన బద్లాపూర్ బాయ్స్‌తో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది, ఇది ఆమె హిట్ తమిళ చిత్రం వెన్నిలా కబడ్డీ కుజు హిందీ రీమేక్.[7]
వ్యక్తిగత జీవితం
[మార్చు]తన చిన్ననాటి స్నేహితుడు దంత వైద్యుడు అరవింద్ కృష్ణన్‌ను ఆమె 2015 సెప్టెంబరు 6న అలప్పుజలోని కొట్టంకులంగర దేవి ఆలయంలో వివాహం చేసుకుంది. వీరికి అనంతపద్మనాభన్ అరవింద్ అనే కుమారుడు, అన్నపూర్ణ అరవింద్ అనే కుమార్తె ఉన్నారు.[8] వివాహం తరువాత శరణ్య మోహన్ సినిమాలకు దూరంగా ఉంటోంది.[9]
మూలాలు
[మార్చు]- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2013-12-19. Retrieved 2014-02-18.
- ↑ YKB International Academy. YKB International Academy. Retrieved 22 September 2016.
- ↑ St Joseph's College. Stjosephscollegeforwomen.org (1 July 1954). Retrieved 22 September 2016.
- ↑ http://www.cinegoer.com/telugu-cinema/interviews/interview-with-saranya-mohan-261009.html
- ↑ Interview With Saranya Mohan – Interviews. CineGoer.com (26 October 2009). Retrieved 22 September 2016.
- ↑ "Bheemili Kabaddi Jattu Actress Saranya Mohan Enjoying With Family - Sakshi". web.archive.org. 2024-02-19. Archived from the original on 2024-02-19. Retrieved 2024-02-19.
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link) - ↑ "Saranya faints on sets | Deccan Chronicle". Deccan Chronicle. Archived from the original on 3 April 2013. Retrieved 17 January 2022.
- ↑ http://english.manoramaonline.com/entertainment/entertainment-news/saranya-mohan-blessed-with-a-baby-boy.html ?
- ↑ "Saranya Mohan: భీమిలీ కబడ్డీ జట్టు సినిమాలోని ఈ హీరోయిన్ ఇప్పుడు ఎలా ఉందో తెలుసా.? చూస్తే అవాక్ అవుతారు - Telugu News | Do you know how the heroine who acted in the movie Bheemili Kabaddi jattu is now | TV9 Telugu". web.archive.org. 2024-02-19. Archived from the original on 2024-02-19. Retrieved 2024-02-19.
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link)