శాంతి స్వరూప్ భట్నాగర్
వికీపీడియా నుండి
| జననం | ఫిబ్రవరి 21 1894 పంజాబ్, బ్రిటిష్ ఇండియా |
|---|---|
| మరణం | జనవరి 1, 1955 (వయసు 60) న్యూఢిల్లీ, భారతదేశం |
| నివాసం | |
| జాతీయత | |
| రంగము | రసాయన శాస్త్రం |
| సంస్థ | శాస్త్రీయ మరియు పారిశ్రామిక పరిశోధనా కౌన్సిల్ |
| మాతృ సంస్థ | పంజాబ్ విశ్వవిద్యాలయం యూనివర్శిటి కాలేజ్ ఆఫ్ లండన్ |
| పర్యవేక్షకుడు | ఫ్రెడరిక్ జి.డోన్నన్ |
| ప్రాముఖ్యత | భారతీయ ఖగోళ కార్యక్రమం |
| ముఖ్య పురస్కారాలు | పద్మవిభూషణ్ (1954), OBE (1936), Knighthood (1941) |
| మతం | హిందూ / బ్రహ్మో |
శాంతి స్వరూప్ భట్నాగర్ (ఫిబ్రవరి 21, 1894 – జనవరి 1, 1955) ప్రసిద్ధిగాంచిన భారతీయ శాస్త్రవేత్త. భట్నాగర్ ను భారత పరిశోధన శాలల పితామహుడిగా అభివర్ణిస్తారు. బ్రిటీష్ ఇండియాలోని షాపూర్ (ఇప్పుడు పాకిస్థాన్ లో ఉంది)లో జన్మించాడు. చిన్నప్పటి నుంచి బొమ్మలు, యంత్ర పరికరాలు చేయటంలో ఆసక్తి కనబరిచేవాడు.
వీరి పరిశోధనలు ఎక్కువగా పారిశ్రామిక రసాయనాలపై జరిగింది. ఆయన శాస్త్రీయ పరిశోధనకు 1941లో బ్రిటన్ ప్రభుత్వం సర్ బిరుదును ప్రదానం చేసింది.
భారత స్వాతంత్యం తరువాత కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రిసెర్చ్ సంస్థకు తొలి డైరెక్టర్ జనరల్ పదవి అలంకరించాడు.
మన దేశంలో మొత్తం 12 పరిశోధన శాలలను ఈయన స్థాపించాడు.
ఈతని జ్ఞాపకార్ధం భారత ప్రభుత్వం శాంతి స్వరూప్ భట్నాగర్ పురస్కారం స్థాపించింది.