శిలాజాలు
వికీపీడియా నుండి
Three small ammonite fossils, each approximately 1.5 cm across.
Petrified wood. The internal structure of the tree and bark are maintained in the permineralization process.
శిలాజాలు (ఆంగ్లం: Fossil) పురావస్తు శాస్త్రంలో విశేష ప్రాముఖ్యమున్నవి. ఫాజిల్ అనే పదం లాటిన్ పదం ఫాడెరి (fodere) నుండి ఉద్భవించింది. ప్రకృతి సిద్ధ కారణాల వల్ల, భూమిలో భద్రపరచబడిన ఖచ్ఛితమైన జీవావశేషాలను గాని, వాటి ఆనవళ్ళను గాని శిలాజాలు అని పిలుస్తారు. ఇవి సామాన్యంగా అవక్షేపిత శిలలో మాత్రమే ఏర్పడతాయి.
విషయ సూచిక |
[మార్చు] శిలాజాల ప్రాముఖ్యము
- భూమండలంపై జీవుల ఆవిర్భావదశ నుండి నేటి వరకు పుట్టి, పెరిగి, నశించిన అనేక జీవజాతుల ఉనికి మరియు వానిలో సంభవించిన పరిణామ క్రమాన్ని అధ్యయనం చేయడానికి శిలాజాల పరిశీలన వల్లనే సాధ్యమౌతుంది.
- భూమండలంపై వివిధ యుగాల్లో విశిష్ఠమైన జంతు మరియు వృక్ష జాతులు ఉండేవి. వీటి శిలాజాలు లభించడం వల్ల, ఆ కాలపు శిలల వయస్సును నిర్ణయించడంలో ఇవి ఎంతో ఉపయోగపడతాయి. ఇటువంటి శిలాజాలను "సూచికా శిలాజాలు (en:Index Fossils)" అంటారు. ఇది భౌమకాలమాన పట్టికలను తయారుచేయడానికి ఉపయోగపడుతుంది.
- శిలాజాల లక్షణాలను బట్టి పురాతన యుగాలలోని శీతోష్ణ పరిస్థితులను తెలుసుకోవచ్చును.
- కొన్ని ప్రత్యేకమైన శిలాజాలను ఆధారంగా పెట్రోలియం, బొగ్గు గనుల ఉనికిని, వాటి విస్తీర్ణతను గణించవచ్చును.
[మార్చు] శిలాజాలు-రకాలు
- జీవి యధాతథంగా శిలాజంగా మారడం (Mummification):
- మంచులో కప్పబడిన శిలాజాలు (Ice embedded Fossils):
- రెసిన్ లో ఇమిడి ఉండే శిలాజాలు (Resin Fossils)
- జీవుల గట్టిభాగాలు శిలాజంగా మారడం:
- బాహ్యరూప శిలాజాలు:
- ముద్రలు (Impressions):
- అచ్చులు (Moulds):
- పోతలు (Casts or Incrustations):
- శిలీభవనాలు (Petrifactions):
- కంప్రెషన్ శిలాజాలు (Compression Fossils):
- ఖనిజసంబంధ శిలాజాలు (Mineral Fossils):
- సూక్ష్మ శిలాజాలు (Microfossils)
[మార్చు] సజీవ శిలాజాలు
ముఖ్య వ్యాసము: సజీవ శిలాజాలు
[మార్చు] మూలాలు
[మార్చు] బయటి లింకులు
- The Virtual Fossil Museum throughout Time and Evolution
- Paleoportal, geology and fossils of the United States
- Palaeos, a multi-authored wiki encyclopedia on the history of life on Earth
- The Fossil Record, a complete listing of the families, orders, class and phyla found in the fossil record
- Bioerosion website, including fossil record
- Fossil record of life in the Coal Age