శిల్పా షిండే

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
శిల్పా షిండే
2018లో శిల్పా షిండే
జననం (1977-08-28) 1977 ఆగస్టు 28 (వయసు 46)
వృత్తినటి, రాజకీయవేత్త
క్రియాశీల సంవత్సరాలు1999–ప్రస్తుతం
సుపరిచితుడు/
సుపరిచితురాలు
భాభీ జీ ఘర్ పర్ హై!
బిగ్ బాస్ హిందీ సీజన్ 11

శిల్పా షిండే (జననం 1977 ఆగస్టు 28) ఒక భారతీయ టెలివిజన్ నటి. &టీవి భాభీ జీ ఘర్ పర్ హై! లో అంగూరి మన్మోహన్ తివారీ పాత్రలో ఆమె ప్రసిద్ధి చెందింది.[1][2][3] 2017లో, ఆమె బిగ్ బాస్ హిందీ సీజన్ 11లో పాల్గొని విజేతగా నిలిచింది.[4]

2019 లోక్‌సభ ఎన్నికలకు ముందు ఆమె 2019 ఫిబ్రవరి 5న ఆమె భారత జాతీయ కాంగ్రెస్‌లో చేరింది.[5][6]

2020లో ఆమె పౌరష్‌పూర్ వెబ్ సీరీస్ లో రాణి మీరావతి పాత్ర పోషించింది.[7]

ప్రారంభ జీవితం[మార్చు]

శిల్ప 1977 ఆగస్టు 28న మహారాష్ట్రకు చెందిన కుటుంబంలో జన్మించింది.[8][9] ఆమె తండ్రి డాక్టర్ సత్యదేవ్ షిండే హైకోర్టు న్యాయమూర్తి, కాగా, ఆమె తల్లి గీతా సత్యదేవ్ షిండే గృహిణి.[10] ఆమెకు ఇద్దరు అక్కలు, ఒక తమ్ముడు ఉన్నారు. తండ్రి ఆమెను న్యాయశాస్త్రం చదవాలనుకున్నాడు, కానీ, ఆమె మనస్తత్వశాస్త్ర విద్యార్థి.[11]

వ్యక్తిగత జీవితం[మార్చు]

టీవీ షో మాయికా (2007–2009) సెట్‌లో నటుడు రోమిత్ రాజ్‌ని ఆమె కలిసింది. ఆ తర్వాత ఇద్దరూ ఒకరితో ఒకరు డేటింగ్ చేయడం మొదలుపెట్టారు. వారు 2009లో వివాహ నిశ్చితార్థం చేసుకున్నారు, అయితే ఇద్దరూ దానిని తర్వాత రద్దు చేసుకున్నారు.[12][13]

ఆమె నటనను వృత్తిగా తీసుకోవడం ఆమె తండ్రికి ఇష్టం లేదు. అయితే, తను పట్టుబట్టినప్పుడు కేవలం ఒక సంవత్సరం సమయం ఇచ్చాడు. ఆమె తండ్రి 2013లో అల్జీమర్స్ వ్యాధితో బాధపడుతూ మరణించడంతో శిల్పా షిండే డిప్రెషన్‌లోకి వెళ్లిపోయింది.[14]

కెరీర్[మార్చు]

శిల్పా షిండే 1999లో టెలివిజన్‌ రంగంలోకి అడుగుపెట్టింది. భాభి అనే సీరియల్‌లో ఆమె ఒక పాత్ర పోషించి అందరి దృష్టికి వచ్చింది.[15] ఆమె తదుపరి సంజీవని సీరియల్‌లో నటించింది.[16] 2002లో, ఆమె ఆమ్రపాలిలో ప్రధాన పాత్ర పోషించింది. తరువాత, ఆమె మిస్ ఇండియా షోలో మరొక పాత్రను కొనసాగించింది. జనవరి 2004లో, ఆమె డిడి నేషనల్ టెలివిజన్ షో మెహెర్ – కహానీ హక్ ఔర్ హకీకత్ కీలో మెహర్‌గా సమాంతర ప్రధాన పాత్ర పోషించింది.

2005లో, శిల్పా జీ టీవి రబ్బా ఇష్క్ నా హోవ్‌లో 2006 వరకు జుహీ పాత్రను పోషించింది. ఆ తర్వాత ఆమె బెటియాన్ అప్నీ యా పరాయ ధన్‌లో వీర, హరి మిర్చి లాల్ మిర్చి,[17] వారిస్‌లో గాయత్రిగా కనిపించింది.[18]

ఆమె రెండు తెలుగు చిత్రాలలోనూ నటించింది. అవి దాసరి నారాయణరావు దర్శకత్వంలో వచ్చిన చిన్న (2001), సురేష్ వర్మ రూపొందంచిన శివాని (2000).[19]

సబ్ టీవి సిట్‌కామ్ చిడియా ఘర్‌లో పరేష్ గణత్రా సరసన కోయల్ నారాయణ్ అనే అద్భుతమైన పాత్రను ఆమె పోషించింది.[20] అయితే, ఆమె తన వ్యక్తిగత జీవితంలో సమస్యల కారణంగా 2014లో షో నుండి నిష్క్రమించింది. ఆమె స్థానంలో ఒక సంవత్సరం పాటు ఆ పాత్రను శుభాంగి ఆత్రే పోషించింది.[21]

2015లో &టీవి భాబీ జీ ఘర్ పర్ హై!లో ఆమె ప్రధాన పాత్ర పోషించింది. అందులో ఆమె అంగూరీ భాభి పాత్రలో కనిపించింది, కానీ ఆమె మార్చి 2016లో మేకర్స్‌తో అనేక సమస్యలను ఎదుర్కొని, వారు తనను మానసికంగా హింసిస్తున్నారని ఆరోపించిన తర్వాత ఆమె నిష్క్రమించింది.[22] ఇక, ఆమె స్థానంలో శుభాంగి ఆత్రే ఎంపికయింది.[23]

2017లో, రియాలిటీ షో బిగ్ బాస్ హిందీ సీజన్ 11లో శిల్పా షిండే పాల్గొన్నది.[24] జనవరి 2018లో షిండే విజేతగా నిలిచింది.[25]

2020లో, ఆమె గ్యాంగ్స్ ఆఫ్ ఫిల్మిస్తాన్‌లో కనిపించింది, ఆ తర్వాత ఆమె నిష్క్రమించింది.[26] డిసెంబరు 2020లో, పౌరష్‌పూర్ వెబ్ సిరీస్‌లో క్వీన్ మీరావతి పాత్రను ఆమె పోషించింది.[27]

2022లో, ఆమె ఝలక్ దిఖ్లా జా 10లో పాల్గొంది. అక్కడ 7వ వారంలో ఎలిమినేట్ అయిన ఆమె 12వ స్థానంలో నిలిచింది.[28]

2023లో ఆమె సోనీ సబ్ మేడమ్ సర్‌లో లేడీ కాప్ ఎసిపి నైనా మాథుర్ పాత్రను పోషించింది.[29]

ఫిల్మోగ్రఫీ[మార్చు]

సినిమాలు[మార్చు]

సంవత్సరం సినిమా పాత్ర భాష నోట్స్
2001 చిన్నా తెలుగు [30]
శివాని
2004 లేక్ లడ్కీ యా ఘర్చీ Madhavi మరాఠీ అతిధి పాత్ర
2017 పటేల్ కీ పంజాబీ షాదీ Dancer హిందీ "మారో లైన్" పాటలో ప్రత్యేక ప్రదర్శన

మూలాలు[మార్చు]

  1. "Kamya Punjabi replaced by Shilpa Shinde in television show". The Times of India. 28 August 2013. Archived from the original on 31 August 2013. Retrieved 17 November 2013.
  2. "11 Revelations made by Shilpa Shinde aka Angoori of 'Bhabhiji Ghar Par Hai' on quitting the show". The Times of India. Retrieved 20 December 2019.
  3. "Bigg Boss 11 winner Shilpa Shinde: Here's everything you want to know about her". The Hindustan Times. 14 January 2018. Retrieved 14 January 2018.
  4. "Bigg Boss 11: Shilpa Shinde to Hina Khan, celebs to be locked inside the house". The Times of India. October 2017. Retrieved 30 November 2017.
  5. "Shilpa Shinde joins Congress, wants Rahul Gandhi to be PM". India Today. 5 February 2019. Retrieved 5 February 2019.
  6. "Shilpa Shinde Joins Congress Ahead of Lok Sabha Elections". Times of India. 5 February 2019. Retrieved 2 March 2021.
  7. "Shilpa Shinde set for a royal avatar in new web series 'Paurashpur', also starring Milind Soman". Zee News. 8 November 2020. Retrieved 2 December 2020.
  8. "Bigg Boss 11 contestants name list: Who is Shilpa Shinde? Know about Angoori Bhabhi participating in Salman Khan show". The Financial Express. 1 October 2017. Retrieved 14 January 2018.
  9. "Did You Know That Shilpa Shinde Went into Depression After Her Father's Death? These Lesser Known Facts About the Controversial Girl Will Surely Leave You Amazed!". dailybhaskar. 29 November 2017. Retrieved 15 January 2018.
  10. "Did You Know That Shilpa Shinde Went into Depression After Her Father's Death? These Lesser Known Facts About the Controversial Girl Will Surely Leave You Amazed!". dailybhaskar. 29 November 2017. Retrieved 15 January 2018.
  11. "Did You Know That Shilpa Shinde Went into Depression After Her Father's Death? These Lesser Known Facts About the Controversial Girl Will Surely Leave You Amazed!". dailybhaskar. 29 November 2017. Retrieved 15 January 2018.
  12. "Bigg Boss 11: Shilpa's Ex Romit Calls Her Real Winner, Shares Adorable Post For The Actor". News18. 14 January 2018. Retrieved 14 January 2018.
  13. "Bigg Boss 11: When Shilpa Shinde's ugly break-up with co-star Romit Raj made news". India Today. 4 October 2017. Retrieved 14 January 2018.
  14. "Shilpa Shinde's father passes away". Tellychakkar.com (in ఇంగ్లీష్). Retrieved 17 December 2022.
  15. "Kamya Punjabi replaced by Shilpa Shinde in television show". The Times of India. 28 August 2013. Archived from the original on 31 August 2013. Retrieved 17 November 2013.
  16. "Metro Plus Delhi / Personality : At ease with the world". The Hindu. 11 November 2004. Archived from the original on 13 January 2005. Retrieved 17 November 2013.
  17. "Court rules in favour of actress Shilpa Shinde". Zeenews.india.com. 17 June 2008. Retrieved 17 November 2013.
  18. "Court rules in favour of actress Shilpa Shinde". Zeenews.india.com. 17 June 2008. Retrieved 17 November 2013.
  19. "An artiste set to dazzle". The Hindu. 11 July 2002. Archived from the original on 30 June 2003. Retrieved 17 November 2013.
  20. "Shilpa Shinde quits 'Chidiya Ghar'". Zeenews.india.com. 5 March 2013. Retrieved 17 November 2013.
  21. "Shilpa Shinde aka Koyal is back in 'Chidiya Ghar'". The Indian Express. 10 June 2014. Retrieved 15 January 2018.
  22. "Shilpa Shinde aka Angoori Bhabhi quits Bhabhiji Ghar Par Hai, accuses makers of mentally torturing her". The Indian Express. 16 March 2016. Retrieved 15 January 2018.
  23. Ojha, Shalini (18 April 2016). "Shubhangi Atre replaces Shilpa Shinde again! Five facts about new 'Angoori Bhabhi'". India TV News (in ఇంగ్లీష్). Retrieved 21 March 2021.
  24. "Bigg Boss 11: Shilpa Shinde aka former Angoori from 'Bhabiji Ghar Par Hai' in the show?". ABP. 4 August 2017.
  25. "Bigg Boss 11 Grand Finale: Shilpa Shinde Is The Winner Of The Show". NDTV.com. Retrieved 14 January 2018.
  26. Roy, Gitanjali (3 September 2020). ""Stop Telling Lies": Shilpa Shinde To Gangs Of Filmistan Producers. See Email Exchange She Posted". NDTV.com. Retrieved 4 September 2020.
  27. "Shilpa Shinde set for a royal avatar in new web series 'Paurashpur', also starring Milind Soman". Zee News. 8 November 2020. Retrieved 2 December 2020.
  28. "Shilpa Shinde to participate in Jhalak Dikhhla Jaa's new season, reveals why she's doing the show". The Indian Express. 31 July 2022. Retrieved 7 August 2022.
  29. "Shilpa Shinde returns to television with Maddam Sir, says 'Women officers are truly remarkable'". The Indian Express (in ఇంగ్లీష్). 13 January 2023. Retrieved 13 January 2023.
  30. "An artiste set to dazzle". The Hindu. 11 July 2002. Archived from the original on 30 June 2003. Retrieved 17 November 2013.