శోభన రనాడే

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
Shobhana Ranade
శోభన రనాడే
జీవిత సాఫల్య అవార్డు అందుకుంటున్న రనాడే
జననం (1924-10-26) 1924 అక్టోబరు 26 (వయసు 99)[1]
పూణే, బొంబై ప్రెసిడెన్సీ, బ్రిటీష్ ఇండియా
వృత్తిసామాజిక కార్యకర్త
పురస్కారాలుపద్మ భూషణ్

శోభన రనాడే(ఆంగ్లం:Shobhana Ranade)(జననం 1924 అక్టోబరు 26) భారతదేశానికి చెందిన సామాజిక కార్యకర్త, ఈమె నిరుపేద మహిళల కోసం, పిల్లల కోసం అందించిన సేవలకు ప్రజా మన్నన పొందింది. ఈమె గాంధీ సిద్ధాంతాలను విశ్వసిస్తుంది. 2011 భారత ప్రభుత్వం ఈమె సేవలను గుర్తించి, భారత పురస్కారాలతో మూడవ అత్యున్నమైన అవార్డు పద్మ భూషణ్ అందజేసింది.

తొలినాళ్లలో[మార్చు]

1924 సంవత్సరంలో బొంబాయి ప్రెసిడెన్సీలోని పూనా లో జన్మించింది. 1942లో శోభన రనాడే 18 సంవత్సరాల వయసులో ఉండగా పూనాలోని అగా ఖాన్ ప్యాలస్ వద్ద మహాత్మా గాంధీని కలిసిన తరువాత అతని వ్యక్తిత్వంచే ప్రేరేపించబడి గాంధీ అడుగుజాడల్లో నడవడం మొదలెట్టింది.

కెరీర్[మార్చు]

రనాడే తన జీవితాన్ని నిరుపేద మహిళల, పిల్లల జీవితాలను మెరుగుపర్చడానికి అంకితం చేసింది. ఆమె సామాజిక కార్యాచరణ 1955లో అస్సాం రాష్ట్రం ఉత్తర లక్ష్మీపూర్ సందర్శించి, వినోబా భావేతో కలిసి ఒక పాదయాత్ర చేపట్టడంతో మరింత మెరుగైంది. అక్కడే మైత్రేయ ఆశ్రమం, శిశు నికేతన్ స్థాపించి సేవలందించడం ప్రారంభించింది. అస్సాంలోని నాగ తేగల మహిళలకు చక్ర నేత పని నేర్పించడానికి ఆదిమ జాతి సేవ సంఘ్ ను స్థాపించింది.

1979లో రానా డే పూణే కి తిరిగి వచ్చిన తర్వాత అగా ఖాన్ ప్యాలస్లో గాంధీ జాతీయ స్మారక సమాజాన్ని స్థాపించి మహిళల శిక్షణ కార్యక్రమాలు కొనసాగించింది.[2]

1998లో లో గాంధీ జాతీయ స్మారక సమాజం ఆధ్వర్యంలో కస్తూర్బా మహిళా ఖాదీ గ్రామోద్యోగ విద్యాలయం స్థాపించింది, ఈ సంస్థ ద్వారా 20 గ్రామాలలో నిరుపేద మహిళల కోసం వివిధ నైపుణ్య అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించింది.[2]

అనాధ పిల్లల కోసం మహారాష్ట్ర లోని బాల గ్రామంలో ఒక ఆశ్రమం స్థాపించింది కాలక్రమేణా అది పదహారు వందల మంది పిల్లలకు తలదాచుకునే స్థలంగా మారింది. పుణే లోని శివాజీ నగర్ లో స్థాపించిన హెర్మన్ జైమినీర్ సమాజ సంస్థ వీధి బాలలకు నెలవుగా ఉంది.[3]

పూణేలో ఈమె స్థాపించిన బాల గృహ, బాల సదన్ 60 మంది నిరుపేద బాలికలకు ఆశ్రమాన్ని కల్పించాయి. గంగా నది కాలుష్య నివారణ కోసం చేపడుతున్న సేవ్ గంగా ఉద్యమానికి గాంధీ జాతీయ స్మారక సమాజం మద్దతుగా నిలిచింది.[4]

పురస్కారాలు[మార్చు]

  • పద్మభూషణ్ - 2010
  • జమ్నాలాల్ బజాజ్ అవార్డు - 2011[5]
  • రిలయన్స్ ఫౌండేషన్ - CNN IBN రియల్ హీరోస్ 2012 లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు[6]
  • రవీంద్రనాథ్ ఠాగూర్ బహుమతి
  • రాజీవ్ గాంధీ మానవ సేవా అవార్డు - 2007
  • ప్రైడ్ ఆఫ్ పూణే అవార్డు - పూణే విశ్వవిద్యాలయం
  • శిశు సంక్షేమ పనికి జాతీయ పురస్కారం - 1983[2][7]
  • మహాత్మా గాంధీ అవార్డు

మూలాలు[మార్చు]

  1. Encyclopaedia of women biography: India, Pakistan, Bangladesh, Volume 3. A.P.H. Pub. Corp. 2001. ISBN 8176482641.
  2. 2.0 2.1 2.2 "Blogspot". Retrieved 12 August 2014.
  3. "Save Ganga". Retrieved 12 August 2014.
  4. "YouTube video". Retrieved 12 August 2014.
  5. "Jamnalal Bajaj". Archived from the original on 7 ఫిబ్రవరి 2015. Retrieved 12 August 2014.
  6. "CNN IBN award". Retrieved 12 August 2014.
  7. "Balgram". Archived from the original on 12 ఆగస్టు 2014. Retrieved 12 August 2014.