శ్రీపురం వెంకటనరసింహరావు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

దక్షిణ భారతదేశ తొలి రక్తదాత శ్రీపురం వెంకటనరసింహరావు. ఈయన నెల్లూరు జిల్లా వెంకటగిరి వాసి. దేశంలో మొదటి రక్తదాత బీహార్‌లోని జెంషెడ్‌పూర్‌కు చెందిన బాల్లన్ కాగా, స్వచ్ఛంద రక్తదాతగా వెంకటనరసింహరావు గుర్తింపు పొందారు. బాల్లన్ 1939లో రక్తదానం చేయగా నరసింహరావు 1942లో రక్తం దానం చేసి దక్షిణ భారతదేశపు తొలిరక్తదాతగా పేరుగాంచారు.

ప్రేరేపణ[మార్చు]

1942లో నరసింహరావు నెల్లూరు జిల్లా కావలిలో సైన్యంలో యువకులను రిక్రూట్ చేసుకొనే అధికారిగా వ్యవహరిస్తున్నారు. ఆ సమయంలో కావలి వద్ద జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు తీవ్రంగా గాయపడడం, రక్తం లభించక ప్రాణాలొదలడం ఆయనను కదిలించి వేసింది. వెంటనే రక్తదాన మహోద్యమానికి శ్రీకారం చుట్టేలా ప్రేరేపించింది. అనుకున్నదే తడవుగా ఆయన దేశమంతటా రక్తదాన ఆవశ్యకతపై ప్రచారం నిర్వహించారు. తన 37వ ఏట చెన్నై జనరల్ ఆసుపత్రిలో మొదట రక్తదానం చేశారు. చరిత్రకారుడు రసూల్ ప్రకారం తదుపరి 20 సంవత్సరాలలో ఆయన 64 సార్లు రక్తదానం చేశారు. 1962లో ఢిల్లీ రెడ్ క్రాస్ ప్రారంభించిన సమయంలో రక్తదానం చేసిన వారిలో నరసింహరావు ఒకరు. తను 56 సంవత్సరాల వయస్సులో శ్వాసకోశ సంబంధిత వ్యాధి కారణంగా మరణించారు.

మూలాలు[మార్చు]

సాక్షి దినపత్రిక - 14-06-2014