షామానిజం

వికీపీడియా నుండి

ఎస్.ఐ.బోరిసోవ్ తీసిన ఫోటో ఆధారంగా రష్యన్ పోస్ట్‌కార్డు. ఖాకాస్ తెగకు చెందిన ఒక షామన్ స్త్రీ.[1]

షామాన్ అనునది మంగోలియా దేశానికి చెందిన ఒక విశ్వాసము. ఈ విశ్వాసం కలిగినవాడిని షామాన్ అని పిలుస్తారు. వీరి విశ్వాసాలలో ముఖ్యమైనది ఆత్మల లోకంతో సంబంధాలు మరియు ఆత్మలతో మాట్లాడడం.

[మార్చు] విశ్వాసాలు

ప్రపంచంలోని విశ్వాసాలకు దూరంగా వీరిలో విశ్వాసాలున్నాయి. షామన్లు అందరూ ఈ విశ్వాసాలు కలిగివుంటారు. ఎలియాడే (1964) గుర్తించిన కొన్ని సాధారణ విశ్వాసాలు : [2]

  • ఆత్మలు వున్నాయి, మనుషుల జీవితాలలో మరియు సమాజాలతో వీరి బాంధవ్యాలు ప్రమేయాలు ఎక్కువ.
  • షామన్లు ఆత్మలలోకంతో సంబంధాలు కలిగివుంటారు.
  • ఆత్మలు మంచివి చెడువి రెండునూ వుండవచ్చును.
  • చెడు ఆత్మలచే కలిగింపబడిన అనారోగ్యాలను షామన్లు నయం చేయగలరు.
  • షామన్లు "ట్రాన్స్" లోకి వెళ్ళగలరు, మరియు ఎవరూ వీక్షించని వాటికి వీరు వీక్షించగలరు.
  • షామన్ల ఆత్మ, వాటి శరీరాలను వదలి, అనేక లోకాలకు చుట్టి రాగలవు.
  • షామన్లు జంతువుల బొమ్మలను "ఆత్మ మార్గదర్శకులు" గాను మరియు సందేశాలనిచ్చే వారని భావించేవారు.
  • షామన్లు భవిష్యత్తును గూర్చి చెప్పేవారు. ఎముకలను ఎగురవేసి అనేక ఇతర ఆధ్యాత్మిక విషయాలను చేపట్టేవారు.

షామానిజం, భౌతిక ప్రపంచానికి అతీతంగా, ఆత్మలోకాలపై ఆధారపడి తయారైన నమ్మకం, మరియు ఆత్మలు మానవుల జీవితాలపై ప్రభావాలు చూపుతారనే విశ్వాసం ద్వారా జనియించినది.[3] భారత్ లోని తాంత్రిక మాంత్రికుల లాగా వీరునూ అనేక రకాలైన క్షుద్రవిద్యలను అమలు పరచి వారి క్షుద్రలోకంలోనే జీవిస్తారు.

[మార్చు] బయటి లింకులు


ఉదహరింపు పొరపాటు: <ref> tags exist, but no <references/> tag was found

పేజీకి సంభందించిన లింకులు