Jump to content

వాడుకరి చర్చ:వైజాసత్య/పాత చర్చ 11/పాత చర్చ 9

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
వికీపీడియా నుండి

వైద్యశాస్త్రములోని వ్యాధులు, శరీరభాగాలకు సంబంధించిన ICD codes చాలా ముఖ్యం. వీటి తెలుగు పేర్లు, లింకులు, సమాచారము నెమ్మదిగా మనం చేర్చవచ్చును. అలాగే Gray's Anatomy నుండి శరీర నిర్మాణ శాస్త్రము సంబంధించిన మంచి బొమ్మలు చేర్చినచో సమాచారం పూర్తిగా ఉంటుంది. ధన్యవాదాలు.Rajasekhar1961 15:23, 6 సెప్టెంబర్ 2007 (UTC)

మీరు en:ICD-10 గురించేకదా చెబుతున్నది. 10 ఒకటి చేర్చితే సరిపోతుందనుకుంటా ఆంగ్లవికీలో 9, 9-CM కూడా ఉన్నాయి కానీ అవి అనవసరం అనుకుంటా. ఏమంటారు? గ్రేస్ అనాటమీ బొమ్మలన్నీ కామన్స్లో ఉన్నాయి కాబట్టి వాటిని నేరుగా ఇక్కడ అప్లోడ్ చేసుకోకుండా వినియోగించుకోవచ్చు. మళ్ళీ ఇక్కడ అప్లోడ్ చెయ్యటమెందుకు..దీని గురించి నాకు అంత స్పష్టంగా అర్ధం కాలేదు..కాస్త వివరించండి. అన్ని అవయవాలకు సమాచారపెట్టెలు చేర్చుదామనా మీ ఉద్దేశ్యం? --వైజాసత్య 15:36, 6 సెప్టెంబర్ 2007 (UTC)

గణాంకాలు

[మార్చు]

ఈ నెల గణాంకాలు వచ్చాయి చూడండి. __మాకినేని ప్రదీపు (+/-మా) 05:14, 7 సెప్టెంబర్ 2007 (UTC)

చాలా కృతజ్ఞతలు. వీటి గురించే మీకు సందేశం పంపుదామనుకున్నాను. --వైజాసత్య 08:32, 7 సెప్టెంబర్ 2007 (UTC)
గణంకాలు చూస్తుంటే మంచి పురోగతి కనిపిస్తున్నది. >10 కె.బి. కంటె ఎక్కువ ఉన్న వ్యాసాల సంఖ్య పెరుగుతోండి. ఒక గ్రాఫ్ మీద చూస్పిస్తే ఇంకా బాగుంటుంది. --మాటలబాబు 08:38, 7 సెప్టెంబర్ 2007 (UTC)
ఆ క్రితం నెల కూడా అభివృద్ధి జరిగింది..కానీ అనువాదము కాని పేజీలను నేను తీసివెయ్యటము, తదితర ట్రిమ్మింగ్ పనుల వల్ల సంఖ్యలు అంతగా పెరగలేదు. అవును, మంచి ఆలోచన గ్రాఫ్ వెయ్యాలి. ఈ గణంకాలను కాస్త వాస్తవిక దృష్టిలో తీసుకోవాలి 1500 వందల్లో కూడా, తేదీల పేజీలు, సంవత్సరాల పేజీలు, జాబితాలు పోగా సరిగ్గా వ్యాసాలనదగినవి ఒక వెయ్యే ఉంటాయని నా అంచనా. అయినా ఆనందిచాల్సిన విషయమే 1000 2 కేబీల వ్యాసాలు, త్వరలో 1000 5 కేబీల వ్యాసాలు, 1000 కేబీల వ్యాసాలయ్యి అక్కడినుండి 1000 విశేష వ్యాసాలకు తప్పకుండా ప్రస్థానం చేస్తాయి. --వైజాసత్య 08:47, 7 సెప్టెంబర్ 2007 (UTC)

en:Red rain in Kerala అనే వ్యాసమునకు శీర్షిక ఏం పేట్టాలి???--మాటలబాబు 11:12, 7 సెప్టెంబర్ 2007 (UTC)

కేరళలో ఎరుపురంగు వర్షం అని పేరు పెట్టండి ప్రస్తుతానికి సరిపోతుంది --వైజాసత్య 11:14, 7 సెప్టెంబర్ 2007 (UTC)

Image:Solar eclips 1999 4.jpg వచ్చే వారం బొమ్మ క్రింద ప్రదర్శిద్దామా. సెప్టంబర్ 11 సూర్య గ్రహణం--మాటలబాబు 11:18, 8 సెప్టెంబర్ 2007 (UTC)

ఒకే, బాగానే ఉంది. ఇంతకీ దీనికోసం సూర్యుడు పేజీని, మరియు గ్రహణం పేజీ ప్రారంభించాలనుకుంటా --వైజాసత్య 11:20, 8 సెప్టెంబర్ 2007 (UTC)

కృతజ్ఞతలు

[మార్చు]

వైజా సత్యా!

నావి 10వేల దిద్దుబాట్లు అయిన సంగతి నేను గమనించనేలేదు! కృతజ్ఞతలు. 'గండపెండియరంబు' లభించుట నాకెంతయును ముదావహంబు. శ్రీకృష్ణదేవరాయలవలెను, బ్రౌన్ దొరవలెను నీవు తెలుగు భాషకు ఇతోధికంగా సేవ చేయవలెనని నా ఆశయంబు. --కాసుబాబు 05:51, 9 సెప్టెంబర్ 2007 (UTC)

గ్రామాలు వ్యాసాల గురించి

[మార్చు]

ఒకసారి సభ్యులపై చర్చ:Chaduvariలో నేను గ్రామాల వ్యాసాలగురించి చేసిన ప్రతిపాదనను చూడు. నీ అభిప్రాయాన్ని అక్కడ కానీ, లేదా నేరుగా నాకు ఇ-మెయిల్‌లో గాని ఇవ్వవచ్చును. --కాసుబాబు 05:51, 9 సెప్టెంబర్ 2007 (UTC)

ఈ వారం బొమ్మ

[మార్చు]

వచ్చే వారం బొమ్మ క్రింద ఏమి ప్రదర్శించాలి? మీరు ఏమైనా ఆలోచించారా??--మాటలబాబు 21:42, 12 సెప్టెంబర్ 2007 (UTC)

ఆలోచించలేదు..మీరేమైనా ఆలోచించారా? --వైజాసత్య 22:50, 12 సెప్టెంబర్ 2007 (UTC)
కొండపల్లి బొమ్మలు --మాటలబాబు 05:39, 13 సెప్టెంబర్ 2007 (UTC)
చాలా బాగుంది..బాగా పట్టారు --వైజాసత్య 05:41, 13 సెప్టెంబర్ 2007 (UTC)
ఏంటి, నేను సూచించినవి మీకిద్దరికీ నచ్చలేదా?:) __చదువరి (చర్చరచనలు) 06:37, 13 సెప్టెంబర్ 2007 (UTC)
ఓ!! సూచనలు చేశారని చూడలేదు. లిపి బొమ్మలు కూడా ప్రదర్శించడానికి తగినవే --వైజాసత్య 06:40, 13 సెప్టెంబర్ 2007 (UTC)
లిపి బొమ్మలు , పాత సినిమా పోస్టర్లు, నాణాలు (పెద్ద సైజు), ప్రాముఖ్యం కల పెద్ద సైజు తపాలా బిళ్ళలు , మ్యాప్ లు ప్రదర్శించాలని నా అభిప్రాయం, {{ఈ వారం బొమ్మ పరిగణన}} అనే మూస చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం. వీటి జాబితా మొదటి పేజి లొ బొమ్మ క్రింద ఇస్తే ఎలా ఉంటుంది. చదువరి గారు చేసిన సూచన నేను చూశాను కాని వెతికడం లొ కష్టం అయ్యింది--మాటలబాబు 16:39, 13 సెప్టెంబర్ 2007 (UTC)
వచ్చే వారానికి ఈ బొమ్మ బొమ్మ:Kondapalli Toys.jpg సరే కదా?--మాటలబాబు 14:45, 16 సెప్టెంబర్ 2007 (UTC)
తయారైంది కదా. అదే ప్రదర్శిద్దాం. ఆ వచ్చే వారం తెలుగులిపి ప్రదర్శిద్దాం --వైజాసత్య 14:50, 16 సెప్టెంబర్ 2007 (UTC)

కృతజ్ఞతలు

[మార్చు]

మీరిచ్చిన వీరతాడుకుగాను కృతజ్ఞతలు! __చదువరి (చర్చరచనలు) 12:11, 14 సెప్టెంబర్ 2007 (UTC)

మెచ్చుకున్నందుకు చాలా ఆనందంగా ఉంది. Dev 06:20, 19 అక్టోబర్ 2007 (UTC)

సినిమా గణాంకాలు

[మార్చు]

సినిమా గణాంకాలలో చివరిదైన "సినిమాలతో కలిసిన ఇతరవ్యాసాలు" ఏంటో నాకు సరిగా అర్ధం కాలేదు. నేను అర్ధం చేసుకున్నదేమిటంటే ఈ జాబితాలో ఉన్న పేజీల్లో సినిమా సమాచారంతో పాటు ఇంక వేరే విషయంపై కూడా సమాచారం కలిసి ఉన్నదని. (ఉదాహరణకు బృందావనం పేజీలో బృందావనం సినిమాతో పాటూ బృందావనం అనే రెండు గ్రామాల సమాచారం కూడా ఉన్నది) వీటన్నింటినీ నిన్ననే తనిఖీ చేసి సరిచేయవలసిన 3 పేజీలు మాత్రం సరిచేసి మిగిలినవి తీసేశాను. వీటి ఉపయోగము నేను సరిగా అర్ధం చేసుకోలేదో లేక వీటిని ఏరటానికి బాటు ఉపయోగించిన తర్కం సరికాదో తెలియదు.--వైజాసత్య 15:15, 16 సెప్టెంబర్ 2007 (UTC)

సినిమా పేజీలలో ఉన్న సినిమా మూస, ఆ పేజీని వర్గీకరించేస్తుంది. అలా కాకుండా మూసతో పాటుగా ఏదయినా వర్గాన్ని కూడా చేరిస్తే ఆ పేజీని "సినిమాలతో కలిసిన ఇతరవ్యాసాలు" అనే శీర్షిక కిందకు తీసుకుని వస్తుంది. మీరు ఉదాహరణగా ఇచ్చిన పేజీలను ఏరటానికి ఇలాంటి తర్కాన్ని ఉపయోగించాను. ఇప్పుడు అలాంటి పేజీలు లేపుకాబట్టి ఆ శీర్షికను తీసేయవచ్చు. __మాకినేని ప్రదీపు (+/-మా) 15:24, 16 సెప్టెంబర్ 2007 (UTC)
ఒహో అందుకే సింగీతం శ్రీనివాసరావు దర్శకత్యం వహించిన సినిమాలన్నీ ఈ జాబితాలో చేరాయి. అవును ఈ జాబితా తొలగించెయ్యవచ్చు --వైజాసత్య 15:27, 16 సెప్టెంబర్ 2007 (UTC)

వికీపీడియా:WikiProject/ఆంధ్ర ప్రదేశ్ జిల్లాలు

[మార్చు]

జిల్లా ల వ్యాసలు క్రమబద్ధీకరించి ఒక ప్రమాణీకరత చేకూరుతందనే ఉద్దేశం తో ఈ వికీపీడియా:WikiProject/ఆంధ్ర ప్రదేశ్ జిల్లాలు పేజిని వ్రాశాను.--మాటలబాబు 21:37, 18 సెప్టెంబర్ 2007 (UTC)

బాగుంది. చాలా మంచి పనిచేశారు. కృతజ్ఞతలు --వైజాసత్య 23:42, 18 సెప్టెంబర్ 2007 (UTC)

వర్గం, క్రమము

[మార్చు]

చాలా థాంక్సండి. కాని నిన్న రాత్రి నాకొక చిన్న అనుమానం వచ్చింది ఆర్డర్ అంటే వర్గం కాదేమో క్రమము అయిఉండవచ్చని. మిగతా పేజీల్లో కూడా ఆర్డర్ ని వర్గంగానే రాశారు. ఇది తప్పేమోనని నా అనుమానం. వర్గీకరణలో ఉండే వివిధ ర్యాంకులకు కచ్చితమైన తెలుగు అనువాదాలు ఉన్నాయి, వాటిని తెలుసుకుంటే బాగుంటందేమోనని నా ఉద్దేశ్యము. --Dvratnam 05:08, 20 సెప్టెంబర్ 2007 (UTC)

నాకు తెలిసి ఆర్డరును వర్గం అంటారని గుర్తుంది. నేను తప్పై ఉండవచ్చు (పక్కవాళ్ళు చదువుతుంటె యాధృఛ్ఛికంగా బుర్రలోకి వెళ్ళిందే) ఒకసారి తెలుగు పాఠ్యపుస్తకాలు తిరగేసి చూస్తా. ఇంకో విషయం కొత్త చర్చలు, పాతచర్చలపై రాయకండి. ఈ చర్చలు భవిష్యత్తులో రెఫరెన్సుగా ఉపయోగపడతాయి :-) --వైజాసత్య 05:24, 20 సెప్టెంబర్ 2007 (UTC)

ఇండియా ప్రయాణం

[మార్చు]

మీరు ఉండేది హైదరాబాదేనా? అయితే బేషుగ్గా రావచ్చు. ఎక్కడ ఉంటారో చెపితే ఎవరితోనయినా కలిసి రావచ్చు, ఆటో ఖర్చులు కలసి వస్తాయి. Chavakiran 20:06, 21 సెప్టెంబర్ 2007 (UTC)

ప్రస్తుతానికి ఖండాతరంగా ఉంటున్నాను. కొద్ది రోజులలొనే రావచ్చు. వచ్చినప్పుడు తప్పక తెలుగు మీటింగ్స్ కి వస్తాను --మాటలబాబు 20:37, 21 సెప్టెంబర్ 2007 (UTC)
ఏంటీ, హైదరాబాదు వెళుతున్నారా? --వైజాసత్య 02:53, 22 సెప్టెంబర్ 2007 (UTC)
రోజులు దగ్గర పడుతున్నాయి. ఇంకో నెలలొ రాకేశ్వరుడు ప్రస్తుతం ఉన్నపరిస్థితి. అప్పుడు హైదరాబాదు ప్రయాణం తప్పదు.నా ఉద్దేశం హైదరాబాదు కి వచ్చినప్పుడు సమావేశానికి తప్పకుండా వెళ్ళడం హైదరాబాదులొ ఉంటే --మాటలబాబు 10:35, 22 సెప్టెంబర్ 2007 (UTC)
వచ్చే వారం బొమ్మ ఏర్పాట్లు ఇంకా పూర్తి కాలేదు. రెండు బొమ్మలు కలిపి ప్రదర్శించాలా లేక ఒకటే ప్రదర్శించాల??--మాటలబాబు 20:30, 23 సెప్టెంబర్ 2007 (UTC)
నేను రెండు బొమ్మలు కలిపి ఇంకాసేపట్లో అప్లోడ్ చేస్తాను. రెండూ కలిపే ప్రదర్శిద్దాం --వైజాసత్య 20:36, 23 సెప్టెంబర్ 2007 (UTC)
ఈ వారం బొమ్మ మూస లొ పెట్టి ప్రదర్శించడానికి తయారు చేశాను చూడండి మార్పులు చేయ్యాలేమో చూడండి--మాటలబాబు 22:16, 23 సెప్టెంబర్ 2007 (UTC)
కొన్ని లింకులు సరిచేసాను. బాగుంది. తయారు చేసినందుకు నెనర్లు --వైజాసత్య 22:21, 23 సెప్టెంబర్ 2007 (UTC)
తెలుగు భాషలొ పదాలు చచ్చి పోకుండా వాటికి ప్రాణం పోస్తున్నారు. నెనర్లు--మాటలబాబు 22:24, 23 సెప్టెంబర్ 2007 (UTC)

ఒక సారి యోగి- సాంకేతిక నిపుణులు విభాగం చూడగలరా. నాకు కుదరక కొంచెం కంపు చేసా. కృతజ్ఞతలు .విశ్వనాధ్. 12:01, 25 సెప్టెంబర్ 2007 (UTC)

For deletion?

[మార్చు]

I can't understand Telugu. Is the article అయ్యావళి is proposed for deletion. If so please don't delete. Any one please translate the article. - ़~़़़117.97.149.191

Yes, It is proposed to be deleted in a week. but if someone attempts to translate it. It will survive. We don't have enough people to translate the articles. Please try to understand --వైజాసత్య 19:37, 26 సెప్టెంబర్ 2007 (UTC)

వచ్చే వారం బొమ్మ

[మార్చు]

వచ్చే వారం బొమ్మ గురించి ఆలోచించారా? కోణార్క్ చక్రాన్ని పదర్శిస్తారా??--మాటలబాబు 19:47, 26 సెప్టెంబర్ 2007 (UTC)

కోణార్క్ చక్రం బాగానే ఉంటుంది కానీ దానికి సంబంధించిన వ్యాసమేదీ మనదగ్గర లేదు. అదే సమస్య --వైజాసత్య 19:50, 26 సెప్టెంబర్ 2007 (UTC)

తొలగింపు

[మార్చు]

వైజాసత్య గారు మీరు ఈ మూసలను తొలగించగలరా? 'మూస:ఆంధ్రప్రదేశ్‌' ‍‍మరియు 'మూస:ఆంధ్రప్రదేశ్‌లోని జిల్లాలు' నేను సరిగా చూసుకోకుండా వీటిని తయారుచేసాను, తరవాత మూస:ఆంధ్ర ప్రదేశ్‌ ముందునుంచి ఉందని గమనించి అందులోనే మార్పులు చేసాను. పైన చెప్పిన మూసలను తొలగించండి లేదా ఎలా తొలగించాలో చెప్పండి. దేవదాసు 08:44, 27 సెప్టెంబర్ 2007 (UTC)

[మార్చు]

నమస్కార్/नमस्कार/Namaskaar मै हिन्दी विकि पर प्रबंधक(administrator) हूँ। कृपया आप खोज बॉक्स में फोनेटिक टूल को लगाने कि विधि बता दें। I am an administrator at hindi wikipedia would you please tell how to apply phonetic tool in search box. --सुमित सिन्हा/Sumit Sinha

బాటు

[మార్చు]

మంచి బాటు నడుపుతున్నారు. హిందీ వారికి మంచి సహాయం అందించారు.--బ్లాగేశ్వరుడు 20:06, 2 అక్టోబర్ 2007 (UTC)

అవును, పేరు మార్చారేంటి? --వైజాసత్య 20:24, 2 అక్టోబర్ 2007 (UTC)
ఈ మధ్య కొద్దిగా బ్లాగుతున్నానని పేరు మార్చాను.ఈ వారం రోజులు పని చాలా ఎక్కువగా ఉండడం, అనారోగ్యంగా ఉండడం(వైరల్ ఫీవర్ వంటిది+తలనొప్పి) వల్ల వికీ వైపు ఎక్కువగా రాలేక పోయాను. --బ్లాగేశ్వరుడు 20:30, 2 అక్టోబర్ 2007 (UTC)
ఇప్పుడు తగ్గిందా? నేనూ అకస్మాత్తుగా వాషింగ్టన్ వెళ్ళాల్సి రావడంతో గత నాలుగు రోజులపాటు లేను --వైజాసత్య 20:38, 2 అక్టోబర్ 2007 (UTC)


ధన్యవాద్/धन्यवाद/Thanks

[మార్చు]

कोड को मैने hi:MediaWiki:Common.js‎ में लगा तो दिया है , परन्तु यह तभी चलता है जब संपादन में जा कर फोनेटिक एडिटर को ऑन किया जाये , मेरे खयाल से यह समस्या इस लिये है क्योंकि हिन्दी का एडिटर చचेक बॉक्स पर टिक करने से చचालू होता है परंतु यहाँ कोई टिक बॉक्स नही होता है। क्या आप हिन्दी एडिटर को भी तेलुगु ఏडिटर कि तरह बनाने मे सहायता देंगे। i have attached code in hi:MediaWiki:Common.js‎ but it only works when one has checked the tic box in the editor window . i think the problem may go if we could make the phonetic tool Default On as it is in telugu would u plz help in this issue-సుమిత్ సిన్హా/सुमित सिन्हा/sumit sinha

मैने hi:mediawiki:Monobook.js में आप द्वारा बताये गये बदलावों को कर दिया है। इससे लिप्यांतिकरण చचला तो परंतु तब जब आप लॉग इन कर చचुके हों , इसके लिये मै क्या करु?-సుమిత్ సిన్హా/सुमित सिन्हा/sumit sinha

థాంక్సండి.. 'ఆంగ్ల భాష'ను సవరించినందుకు, నేను అనవసరంగా తొందరపడుతుంటాను దేవెర 08:47, 11 అక్టోబర్ 2007 (UTC)

ఎంచేసినా ఇక్కడ వెనక్కి తీసుకెళ్ళవచ్చు. నిశ్చింతగా దిద్దుబాట్లు చెయ్యండి --వైజాసత్య 08:48, 11 అక్టోబర్ 2007 (UTC)

చర్చా పేజీలు

[మార్చు]

చర్చా పేజీలను రంగుల మయం చేసినందుకు నెనర్లు. ఇప్పుడు చర్చలను చదవటం ఇంకొంత సులువుగా ఉంటుంది. __మాకినేని ప్రదీపు (+/-మా) 11:06, 6 అక్టోబర్ 2007 (UTC)

అవును, బాగుంది కదా! కలర్ కాంబినేషను బాగా కుదిరింది --వైజాసత్య 11:21, 6 అక్టోబర్ 2007 (UTC)
పై విషయం నాకు అర్థం కాలేదు. దయచేసి వివరించగలరా? --బ్లాగేశ్వరుడు 00:29, 7 అక్టోబర్ 2007 (UTC)
పై విషయం నాకు ఇప్పుడు అర్థం అయ్యింది. నిన్ని బ్రౌజర్ కాచ్ లొ ఉండడం వల్ల చర్చా పేజిలొ ఉన్న పేజిలలొ వ్యాఖ్య లలొ రంగుల మార్పు తెలియలేదు. చాలా మంచి ప్రయత్నం --బ్లాగేశ్వరుడు 20:13, 7 అక్టోబర్ 2007 (UTC)
చర్చా పేజీలలో వివిధ ఇండెంటేషన్లో ఉన్న వ్యాఖ్యలు విభిన్న రంగులలో కనిపించడం వలన చదవటానికి మరింత సులభంగా ఉంటుందని నేనూ, ప్రదీపు అనుకున్నాము. చర్చా పేజీలలోని రంగులు గమనించలేదా మీరు? --వైజాసత్య 00:33, 7 అక్టోబర్ 2007 (UTC)
హిందు మతం పై ఉన్న వ్యాసాలు నాణ్యత బేరీజు వేస్తున్నాను, సరే కాదా?? --బ్లాగేశ్వరుడు 00:29, 7 అక్టోబర్ 2007 (UTC)
అవును, మంచిపనే చేస్తున్నారు. అనుమానమెందుకు? కానివ్వండి --వైజాసత్య 00:33, 7 అక్టోబర్ 2007 (UTC)

బొమ్మలు - సహాయం

[మార్చు]

వైజా సత్యా! సెలవుల్లో నేను కొన్ని వూళ్ళ ఫొటోలు సేకరించాను. (అంతా వీడు పిచ్చాడని నవ్వుతున్నారు!) అవి హడావుడిగా అప్‌లోడ్ చేస్తాను. కాని నాకు సమయం తక్కువ ఉన్నది. కనుక ఫార్మాటింగ్ వంటి విషయాలు, శీర్షికలు మీరు వీలయితే (ఎవరైనా గాని) సరి చూడండి. 6 మెగా పిక్సెల్ కెమెరాలో ఒకో బొమ్మా 2.5 మెగాబైట్లు వస్తున్నది. నేను అప్‌లోడ్‌కు ముందుగా కుదించాలా? అలాగే ఉంచెయ్యనా? --కాసుబాబు 09:04, 13 అక్టోబర్ 2007 (UTC)

అలాగే ఎక్కించండి. కుదించొద్దు. మిగిలినవి నేను చూసుకుంటాలే --వైజాసత్య 16:48, 13 అక్టోబర్ 2007 (UTC)

ఈవాబొ

[మార్చు]

బెంగాలు బెబ్బులి పరిశీలించవలసింది గా గోరుఁచున్నాను--బ్లాగేశ్వరుడు 02:39, 15 అక్టోబర్ 2007 (UTC)

బాగుంది. బొమ్మ మార్చా --వైజాసత్య 03:02, 15 అక్టోబర్ 2007 (UTC)
ఈ వారం బొమ్మ గా ధింసా నృత్యాన్ని ప్రదర్శించవచ్చు కదా ఒకవారం (కొయ్య నృత్యం అరకు ప్రదేశం దీనికి ప్రసిద్ధి)--బ్లాగేశ్వరుడు 15:53, 15 అక్టోబర్ 2007 (UTC)

bomma pai sahayam

[మార్చు]

bomma pai copy rights ela jata parachali,edaina sahayam kosam sabyunni ela sampradimchali,naa e-mail: charanxp@yahoo.com. mimmalanu sapradimchadaniki mee e-mail ivva galara.......?

ఏదైనా సభ్యుని పేజీకి వెళ్ళినప్పుడు ఎడమ వైపున్న సెర్చ్ బాక్స్ క్రింది డబ్బాలో (పరికరాల పెట్ట్)లో సభ్యునికి ఈ-మైల్ పంపు అన్న దగ్గర క్లిక్ చేసి ఏ సభ్యునికైనా ఈ-మెయిల్ పంపే అవకాశముంది. మీకు మెయిల్ చేస్తాను --వైజాసత్య 06:51, 15 అక్టోబర్ 2007 (UTC)

పి.డి.యఫ్

[మార్చు]

నాకు తెలుగు పైళ్ళు పి.డి.యఫ్. ఫైలుగా మార్చడం వచ్చేసింది. ఈ సారి నేను పంపగలను. తప్పులు చేయను. అవసరమైతే నాకు వేగు పంపండి--బ్లాగేశ్వరుడు 02:26, 17 అక్టోబర్ 2007 (UTC)

భలే, అయితే ఈ సారి మీరే పంపండి. ఏ తంత్రసామగ్రిని (సాఫ్ట్వేర్) ఉపయోగించారు? --వైజాసత్య 02:33, 17 అక్టోబర్ 2007 (UTC)
నేను పి.డి.యఫ్. ఫ్యాక్టరి వాడాను. కాని పేజి చివర వారి గుర్తు విడుస్తోంది--బ్లాగేశ్వరుడు 13:35, 17 అక్టోబర్ 2007 (UTC)
మళ్ళీ ఒకసారి బుల్ జిప్ ప్రయత్నించండి. పనిచేస్తుందేమో --వైజాసత్య 14:17, 17 అక్టోబర్ 2007 (UTC)
మీరే పంపండి ఈ వారం వ్యాసం మీకు వీలుకాకపోతే నాకు చెప్పండి.--బ్లాగేశ్వరుడు 08:56, 20 అక్టోబర్ 2007 (UTC)
మూస:టైపింగ్ సహాయం లొ మీరు చేసిన మార్పులు చేయమని ఎప్పటినుండో కోరదాము అని అనుకొన్నాను. మీరు నా మెదడుని చదువుతున్నారు --బ్లాగేశ్వరుడు 08:56, 20 అక్టోబర్ 2007 (UTC)
:-) --వైజాసత్య 09:01, 20 అక్టోబర్ 2007 (UTC)