Jump to content

వాడుకరి చర్చ:Mpradeep/పాత చర్చ 2

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
వికీపీడియా నుండి

మూసలు

[మార్చు]

ప్రదీప్, నేను సభ్యుల-మార్పులు మూస తయారు చేస్తే....అదెందుకో పని చెయ్యలేదు. నేను మూస:సభ్యుల-మార్పులు పేరుతో పేజీ సృష్టించాను. నువ్వు చేసిన మార్పులు గమనించాను. ముందెందుకు పని చెయ్యలేదు? ఇప్పుడెందుకు పని చేస్తోంది? నా అనుమానాన్ని తీర్చగలవని ఆశిస్తూ --నవీన్ 07:33, 7 మే 2007 (UTC)[ప్రత్యుత్తరం]

తొందరగా సమాధానం ఇచ్చినందుకు సంతోషం. అన్నట్టు నేను కూడా NITK, Surathkal లోనే చదివాను. నీకన్నా రెండో మూడో సంవత్సరాలు సీనియర్ ని అనుకొంటా :) --నవీన్ 09:13, 7 మే 2007 (UTC)[ప్రత్యుత్తరం]

అభినందనీయం

[మార్చు]

ప్రదీప్ గారు మీరు వికీపీడియా కు చేకూరుస్తున్న విలువ అభినందనీయం, మీ సభ్యుని పేజీలో 'వ్యాసాన్ని సృష్టించు' అనే పెట్టెను ఉపయోగిమ్చాలని ప్రయత్మించాను. కానీ తెలుగు పేరు రాయలేక పోయాను. అంగ్ల అక్షరాలు వచ్చయి. తెలుగులో ఎలా టైపు చెయ్యాలో సూచించగలరా?

పవన్ Navamoini 09:36, 11 మే 2007 (UTC)[ప్రత్యుత్తరం]

లక్ష మార్పు

[మార్చు]

లక్షొ మార్పు చేసినదుంకు శుభాకంక్షలు ....--172.142.230.149 22:06, 18 మే 2007 (UTC)[ప్రత్యుత్తరం]

ధన్యవాదాలు. కానీ చేసింది నేను కాదు. నేను నడుపుతున్న బాటు. అది కూడా అనుకోకుండా జరిగిపోయింది. __మాకినేని ప్రదీపు (చర్చదిద్దుబాట్లుమార్చు) 22:41, 18 మే 2007 (UTC)[ప్రత్యుత్తరం]

వైజాసత్య

[మార్చు]

మీరే లక్షో దిద్దుబాటు చేయడం , మీరే మైలురాళ్ళు పేజిలో మీ పేరు వ్రాసుకోవడం మాత్రం ఏమిబాగా లేదు. ఒక్క నిమిషం ఆగితే వైజాసత్య గారు మార్చేవారు కదా

ఎవరు చేసినా ఒకటే నండి. అదీకాక ప్రదీపు తెవికీ మాంత్రికుడు. ఈయన లోలోన పనిచేస్తూ అనేక అద్భుతమైన పనులు చేస్తుంటారు. ముందుముందు మీరే చూస్తారుగా --వైఙాసత్య 20:19, 19 మే 2007 (UTC)[ప్రత్యుత్తరం]

ఇక్కడున్న చెత్తను కొంత తొలగించింది నేనే - --నాగడు 04:13, 9 జూన్ 2007 (UTC)[ప్రత్యుత్తరం]

యాంత్రికంగా మొలకల బేరీజు

[మార్చు]

ప్రదీపు, యాంత్రికంగా మొలకలను బేరీజు వేయటానికి పద్ధతి సిద్ధం చ్స్తున్నావని అనుకుంటున్నాను. ఇది చాలా బాగుంది. అయితే ఒక వ్యాసాన్ని మొలకగా నిర్ణయించటానికి ఎటువంటి నిబంధనలు పాటిస్తున్నావో అని కుతూహలంగా ఉంది. 2 కిలోబైట్ల కన్నా చిన్న వ్యాసాలను మొలకలుగా నిర్ణయిస్తే బాగుంటుందని నా కనిపిస్తుంది. --వైఙాసత్య 12:22, 22 మే 2007 (UTC)[ప్రత్యుత్తరం]

అవును ప్రస్తుతానికి వ్యాసం సైజుని మాత్రమే చూస్తున్నాను. 2KB కంటే తక్కువ ఉంటే గనక మొలక అని బాటుద్వారా నిర్ణయిస్తున్నాను. మనం మార్పులు చేస్తున్నప్పుడు EDITBOXలో ఏదయితే కనబడుతుంఓ దాని size మాత్రమే పరిగణలోకి తీసుకోబడుతుంది. అంటే మూసలు పెట్టటం వలన వచ్చే HTMLని పట్టించుకోదు. __మాకినేని ప్రదీపు (చర్చదిద్దుబాట్లుమార్చు) 12:30, 22 మే 2007 (UTC)[ప్రత్యుత్తరం]

సంయమనం

[మార్చు]

ఆయ్యా మీరు తెవికీ మాంత్రికుడు కావచ్చు, మీరు మాలాంటి క్రొత్త సభ్యులతో సంయమనం పాటిస్తే బాగుంటుందేమో!!!!!!!--S172142230149 18:10, 25 మే 2007 (UTC)[ప్రత్యుత్తరం]
ఏదో నిర్వాహక హోదా ఉంది కదా అని మీసభ్యత్వ పేజిని రక్షించుకోవడం ఏమి బాగాలేదు. మీ పేజి దండయాత్రలు జరుగుతున్నాయి అంటే మీలొ ఏదో తేడా ఉంది. --S172142230149 18:10, 25 మే 2007 (UTC)[ప్రత్యుత్తరం]

edit=sysop:move=sysop

S172142230149 గారూ, ఇలా వ్యక్తిగత దూషణకు దిగటం వికీనియమాలకు విరుద్ధం. ప్రదీపు తన సభ్యుని పేజీని పరిరక్షంచుకోవటం ఆయన వ్యక్తిగత విషయం. దయచేసి వ్యక్తిగత విషయాలను పక్కనపెట్టి తెలుగు భాషా అభివృద్ధి కలసి పనిచేద్దాం రండి. ఇలాంటి వ్యాఖ్యలు మీ,మా అందరి సమయాన్ని వృధా చేస్తాయి. --వైఙాసత్య 18:17, 25 మే 2007 (UTC)[ప్రత్యుత్తరం]


పుణ్య క్షేత్రాలకి ఏమైన ప్రాజెక్టు మూసలు ఉన్నాయా??--శాస్త్రి 20:45, 26 మే 2007 (UTC)

బాటు

[మార్చు]

ప్రదీప్ గారు మీ దగ్గర నుండి క్షమాపణ కోరుకోంటున్నాను బాబు, ఏదోఒకటి రాయండి... నిన్న నువ్వు మళ్ళి బాటు నడిపినట్లు న్నావు. బాటు బాగుంది. ఇటువంటి బాటు లు ఎన్నో నడపాలని నేను తెవికీ తరపున కోరుకొంటున్నాను...--S172142230149 16:36, 1 జూన్ 2007 (UTC)[ప్రత్యుత్తరం]


బాటు బాబు

[మార్చు]

నేను నాపేరు మర్చుకొన్నాను...మన తెవికీ లొ బొమ్మల బాబు గారు కూడా ఉన్నారు నాపేరు--మాటలబాబు 10:15, 2 జూన్ 2007 (UTC)[ప్రత్యుత్తరం]

బాబు ప్రదీప్ గారు, మీరు సురత్కల్ లో ఉన్నారా....మీరు రోజు రాత్రి పూట రావడం కష్టంగా లేదా, నా పేరు మార్చుకొన్నాను మాటలబాబు గా, నువ్వేమౌ బాటు బాబు నేనేమౌ మాటలబాబు..--మాటలబాబు 18:34, 2 జూన్ 2007 (UTC)[ప్రత్యుత్తరం]
ఇప్పటికి నాతో మాట్లాడం వల్ల ఈరోజు నిద్ర పడుతుంది. మీరు రేపు మంగళూరు వెళ్తారా... బాగుందా మంగళూరు , నన్ను తప్పకుండా కాపు బీచ్ లొ కలవండి. --మాటలబాబు 18:41, 2 జూన్ 2007 (UTC)[ప్రత్యుత్తరం]

బాటు అభ్యర్ధన

[మార్చు]

ప్రదీపు, మీకు వీలైతే {{"[[Category:":"[[వర్గం:", "[[category:":"[[వర్గం:", "[[Image:":"[[బొమ్మ:", "[[image:":"[[బొమ్మ:"}} ఈ రిప్లేస్ స్క్రిప్టు అన్ని వ్యాసాలపై నడపగలరా? --వైఙాసత్య 03:14, 7 జూన్ 2007 (UTC)[ప్రత్యుత్తరం]

అలాగే నడుపుతాను. __మాకినేని ప్రదీపు (చర్చదిద్దుబాట్లుమార్చు) 12:00, 7 జూన్ 2007 (UTC)[ప్రత్యుత్తరం]


దేశములోని ఊళ్ళు

[మార్చు]

మీ బాటుతో ఈ [1] పట్టికలోని ప్రదేశములను సృష్టించగలరా?--Sumanthk 04:24, 12 జూన్ 2007 (UTC)[ప్రత్యుత్తరం]

ఈ ఆంగ్లములో ఉన్న పేర్లను తెలుగులోకి తర్జుమా చేయడమే అన్నింటికంటే పెద్ద పని. వీటికీ మీ బాటుతో తెలుగు వికీపీడియాలో పేజీలు సృష్టించబోతున్నారా? అలా అయితే తర్జుమా చేసే ప్రయత్నాలు మొదలు పెడతాం --వైజాసత్య 04:31, 12 జూన్ 2007 (UTC)[ప్రత్యుత్తరం]
నా బాటుకిAutoWikiBrowser కావాలి. తెలుగు వికీలో అది ప్రస్తుతం పని చేయదు.next versionలో పని చేస్తుంది. అప్పుడు నా బాటుతో సృష్టించగలను. కాని కొన్ని limitations ఉన్నాయి.Population etc లంటి డేటా accept చెయ్యదు. see http://en.wikipedia.org/wiki/User:Sumibot/AWB_settings and http://en.wikipedia.org/wiki/Special:Contributions/Sumibot

--Sumanthk 04:50, 13 జూన్ 2007 (UTC)[ప్రత్యుత్తరం]

అవునా, ఆటో వికీ బ్రౌజర్లో తెలుగు వచ్చేసరికి ఈ తాలూకాల పట్టికను తెలుగులో అనువదించే ప్రయత్నం చేస్తాం. ఈ పట్టిక తయారైతే ఈ ప్రదేశాలకు పేజీలు సృష్టించటం పెద్ద పనేం కాదు --వైజాసత్య 05:37, 13 జూన్ 2007 (UTC)[ప్రత్యుత్తరం]
ఈ వ్యవహారంలో బాటు గురించి అ,ఆ లు కూడా తెలీని నాబోటి గాళ్ళు చెయ్యగలిగేది ఏమైనా ఉందా? అనువాదాల్లాంటివి ఏమైనా చెయ్యాలంటే చెప్పండి. పనిలో పనిగా ఈ గ్రామాల పేజీల్లో చెయ్యాల్సింది మరోటుంది.. మండలాలను ఫలానా జిల్లా గ్రామాలు అనే వర్గంలోకి చేర్చడం. మండలాల పేజీలను ఫలానా జిల్లా మండలాలు అనే వర్గం లోకి చేర్చాం కానీ, గ్రామాల వర్గంలోకి చేర్చలేదు. ప్రతీ మండలమూ ఓ గ్రామమే కదా, కొన్ని పట్టణాలు తప్పించి. __చదువరి (చర్చరచనలు) 06:55, 13 జూన్ 2007 (UTC)[ప్రత్యుత్తరం]
ఆటో వికీ బ్రౌజరు వచ్చినాక ఇటువంటి వర్గీకరణ పనులు చాలా సులువుగా చేయవచ్చు. --Sumanthk 03:37, 14 జూన్ 2007 (UTC)[ప్రత్యుత్తరం]
నేను గత కొన్ని రోజులుగా ఊళ్ళోలేక పోవటం వలన ఈ చర్చలో పాల్గొనలేకపోయాను వీకెండులో దీనిని ఒక సారి పరిశీలిస్తాను. __మాకినేని ప్రదీపు (చర్చదిద్దుబాట్లుమార్చు) 06:09, 15 జూన్ 2007 (UTC)[ప్రత్యుత్తరం]

బాటు

[మార్చు]

ఆ రొజు (జూన్ 1 వ తారిఖు[2] మీరు బాటు నడపడం వల్ల ఇటివల మార్పుల పేజిలు పూర్తిగా మీ బాటు తో నిండిపోయాయి.ఎవరు వేమి వ్రాశారో తెలియకుండా పోయింది. ఎందుకు ఆవ్యాఖ్య తీసేశారు.బాబు గారు ఏమిటి ఈ మధ్య బాటు ఎక్కువగా నడపడం లేదు. --మాటలబాబు 13:59, 16 జూన్ 2007 (UTC)[ప్రత్యుత్తరం]

బాటు చేర్చిన మార్పులు సాధారణంగా కనిపించవు. ఇటీవల మార్పులులో బాటు మార్పులు చూపించు అని నొక్కితే తప్ప. కాబట్టి బాటు మార్పుల వల్ల మామూలు మార్పులు కనిపించుకుండా పోయే అవకాశమే లేదు. అంతెందుకు ఇప్పుడు కూడా నేనిది రాస్తుంటే బాటు నడుస్తుంది. గమనించారా!!! --వైజాసత్య 14:40, 16 జూన్ 2007 (UTC)[ప్రత్యుత్తరం]
అరే చాలా ఆశ్చర్యంగా ఉందే.. బాటు కనిపించడం లేదే ఆరోజు ఎందుకు ఇటి వల మార్పులు పేజి పూర్తిగా బాటు తో నిండి పోయింది. మన తెవికీ చాలా మంది బాటు బాబులు ఉన్నారా.. --మాటలబాబు 14:45, 16 జూన్ 2007 (UTC)[ప్రత్యుత్తరం]
జూన్ 1వ తారీఖున నా బాటు పెద్దగా రచనలే చేయలేదు. కానీ ఆ రోజు అంతముందు కొన్ని రోజులు నేను చాలా మార్పులు చేర్పులు చేసాను. మీరు నా మార్పులు చేర్పులను బాటు చేసిన మార్పులు చేర్పులుగా పొరపాటు పడి వుంటారు. __మాకినేని ప్రదీపు (చర్చదిద్దుబాట్లుమార్చు) 14:57, 16 జూన్ 2007 (UTC)[ప్రత్యుత్తరం]
ఏమందోయ్ మీ బాటు చేస్తున్న పని అంతా నేను కనిపెడుతున్నాను. ఇటివల మార్పుల పేజిలో బాటు ని దాచు అనే లింకు నొక్కితే మీ బాటు కనిపించదు. లేక పోతే బాటు కనిపిస్తుంది, మీ బాటు మిగతా మార్పులు దుశ్చర్యలు చూడనివ్వదు. --మాటలబాబు 15:18, 16 జూన్ 2007 (UTC)[ప్రత్యుత్తరం]

భారతదేశం మండలాలు

[మార్చు]
ఒక్క ఆంధ్ర ప్రదేశ్ లో మిగిలిన రాష్ట్రాలలో అన్నింటా వీటిని తాలూకాలంటారు. కాబట్టి ప్రాజెక్టు భారతదేశ తాలూకాలు అంటే బాగుంటుందేమో. ప్రస్తుతం అన్ని జిల్లాలకే పేజీల్లేవు. కాబట్టి మొదటి భారతదేశ జిల్లాలు ప్రాజెక్టు నడపాల్సి ఉంటుందేమో (జిల్లాలా జాబితా ఈ పాటికే తెలుగులో ఇక్కడుంది భారతదేశ జిల్లాల జాబితా). జిల్లాలు, తాలూకాలు రెండూ ఒకటేసారి చేద్దామా? --వైజాసత్య 15:10, 16 జూన్ 2007 (UTC)[ప్రత్యుత్తరం]
జిల్లాలు తాలూకాలు కలిపి ఒకేసారి అవ్వగొట్టేద్దాము. జిల్లాలలో మొదట మనకు ఎట్లాగూ తాలూకాల జాబితా చేర్చే అవకాశం ఉంటుంది. __మాకినేని ప్రదీపు (చర్చదిద్దుబాట్లుమార్చు) 15:18, 16 జూన్ 2007 (UTC)[ప్రత్యుత్తరం]
ఓకే! అయితే జాబితా అనువదించే కార్యక్రమం ప్రారంభిస్తా --వైజాసత్య 15:22, 16 జూన్ 2007 (UTC)[ప్రత్యుత్తరం]

కొమర్రాజు లక్ష్మణ రావు విజ్ఞాన సార్వస్వం

[మార్చు]

ఇది ప్రస్తుతం PDFగా లభిస్తుంది. లైసెన్సుకూడా పబ్లిక్‌డొమైనులోనే లభిస్తుంది అని అనుకుంటున్నాను. దీనిని వికీపుస్తకాలలో ఎక్కించటం మొదలు పేడితే ఎలా ఉంటుంది. __మాకినేని ప్రదీపు (చర్చదిద్దుబాట్లుమార్చు) 14:04, 18 జూన్ 2007 (UTC)[ప్రత్యుత్తరం]

మనిద్దం ఒకేలా ఆలోచిస్తున్నాం. నేను మొదటి 100 పేజీల డీజేవీయూ ఫైలు సోర్స్ లో ఎక్కించాను. అందులోనుండి యూనీకోడీకరించటానికి మచ్చుకు ఒక సైడ్ బై సైడు ప్రివ్యూ పేజీ ఒకటి చేశాను కూడా. ఇది చూడండి. [3] --వైజాసత్య 14:36, 18 జూన్ 2007 (UTC)[ప్రత్యుత్తరం]
ఇదేదో చాలా బాగుంది "పేజి" నేంస్పేసు గురించి అర్ధం చేసుకోవడానికి కొంత సమయం పట్టింది. DJVU ఫార్మాటు ఉపయోగించి పుస్తకాలను వికీపీడియాలోకి చాలా సులువుగా ఎక్కించవచన్న మాట. తెలుగు ఓఛృ కూడా ఒకటి ఉంతే బాగుంటుది ఈ పనికి. __మాకినేని ప్రదీపు (చర్చదిద్దుబాట్లుమార్చు) 16:58, 18 జూన్ 2007 (UTC)[ప్రత్యుత్తరం]

ఉక్కిరి బిక్కిరి

[మార్చు]

సభ్యులు ఉక్కిరి బిక్కిరి అయిపోగలరు మీ ప్రశ్నలతో!!కొద్దిగా నెమ్మదించండి--మాటలబాబు 18:49, 21 జూన్ 2007 (UTC)[ప్రత్యుత్తరం]

ఏమిటండి బొమ్మల మీద ప్రాజెక్టు ఏమైన చేస్తున్నారా!!!మీకే తెవికీ లో బొమ్మలు ఎక్కువ ఉన్నట్లున్నాయి--మాటలబాబు 19:08, 21 జూన్ 2007 (UTC)[ప్రత్యుత్తరం]
నేను ఎక్కించిన బొమ్మలలో 95% మండలాల పఠములు ఉంటాయి, వాటన్నిటినీ నేనే తయారుచేసాను. __మాకినేని ప్రదీపు (చర్చదిద్దుబాట్లుమార్చు) 19:20, 21 జూన్ 2007 (UTC)[ప్రత్యుత్తరం]
మీకృషి కి అభినందనములు, మీకు గ్రాఫిక్స్ తొ బాగా పరిచయం ఉందా?--మాటలబాబు 19:23, 21 జూన్ 2007 (UTC)[ప్రత్యుత్తరం]
నాకు గ్రాఫిక్ పెద్దగా పరిచయం లేదు, కానీ అప్పట్లో నాకు చాలా ఖాళీ సమయం ఉండేది. __మాకినేని ప్రదీపు (చర్చదిద్దుబాట్లుమార్చు) 20:06, 21 జూన్ 2007 (UTC)[ప్రత్యుత్తరం]
కాపీ రైటు లేని బొమ్మలపై యుద్ధం ప్రకటించినట్లున్నారు,నేను సుందరకాండ లో హనుమ సముద్రలంఘనం చేయడం గురించి వ్రాస్తున్నాను, మీరేమౌ కాపీ రైటు లేని బొమ్మలపై పడు తున్నారు. మీ కార్యదీక్షకు అభినందనలు--మాటలబాబు 21:36, 21 జూన్ 2007 (UTC)[ప్రత్యుత్తరం]
టైమూ ఎంతయ్యింది అక్కడ మీకు--మాటలబాబు 22:11, 21 జూన్ 2007 (UTC)[ప్రత్యుత్తరం]

సెర్బియన్ బెబ్బులి బొమ్మ

[మార్చు]

మీరు ఆ బొమ్మను ఎక్కడి నుండి సేకరించారో తెలుపగలరా. __మాకినేని ప్రదీపు (చర్చదిద్దుబాట్లుమార్చు) 15:38, 22 జూన్ 2007 (UTC)[ప్రత్యుత్తరం]

చెప్పేస్తున్నా.. చెప్పేస్తున్నా... ఈ బొమ్మ ఆంగ్ల వికీ పీడీయాలొ విశేష చిత్రం గా ప్రదర్శించబడ్డ బొమ్మ ఆవిషయాన్ని ఇక్కడ చూడవచ్చు. టాగు ఎలా పెట్టాలో తెలియక తికమక పడి ఏదో ఒక టాగు అంటించాను--మాటలబాబు 16:23, 22 జూన్ 2007 (UTC)[ప్రత్యుత్తరం]
ఈ బొమ్మ ఇప్పటికే కామన్సులో ఉంది కాబట్టి ఇక్కడ మళ్ళీ ఎక్కించాల్సిన అవసరం లేదు. మీరు [[Image:Siberischer tiger de edit02.jpg]] అని మీ సభ్య పేజీలో పెట్టుకుంటే సరి. __మాకినేని ప్రదీపు (చర్చదిద్దుబాట్లుమార్చు) 17:34, 22 జూన్ 2007 (UTC)[ప్రత్యుత్తరం]
(ఏడుస్తూ) అయితే నేను ఎక్కించిన నా బెబ్బులి ని తొలగించేస్తారా!! అది తెలుగు వికీపీడీయా కామన్స్ లో లేదు కదా...సరే ఏం చేస్తాం తొలగించండి, డౌన్ లోడ్ కి 5 నిమిషాలు , అప్ లోడ్ కి 10 నిమిషాలు పట్టింది.--మాటలబాబు 17:41, 22 జూన్ 2007 (UTC)[ప్రత్యుత్తరం]
తెలుగు వికీ ప్రత్యేకంగా కామన్స్ ఉండడు. కామన్స్ అంటేనే అన్ని వికీపీడియాల ఉమ్మడి సొత్తు. కామన్స్ లో పకడ్బందీగా కాపీహక్కులు ఉంటేనే అప్లోడ్ చేస్తారు. కామన్స్ లో ఉన్నవాటిని ఇక్కడ లోడ్ చెయ్యకుండానే ఉపయోగించుకోవచ్చు. ఫెయిర్ యూజ్ క్రింద వచ్చేవి, సినిమా పోస్టర్లు వైగైరాలు కామన్స్లో ఎక్కించలేము..అందుకే వాటిని స్థానికంగా ఇక్కడే తెలుగు వికీలో అప్లోడ్ చేసుకొని ఉపయోగించుకోవాలి. --వైజాసత్య 18:12, 22 జూన్ 2007 (UTC)[ప్రత్యుత్తరం]

అయోమయ నివృత్తి పేజీలు

[మార్చు]
ప్రదిప్ గారు నేను బాగా అయౌమయ నివృత్తి పేజి ల లొ నివృత్తి చేస్తున్నానా--మాటలబాబు 16:55, 24 జూన్ 2007 (UTC)[ప్రత్యుత్తరం]
అయోమయ నివృత్తి బాగానే చేస్తున్నారు. __మాకినేని ప్రదీపు (చర్చదిద్దుబాట్లుమార్చు) 17:04, 24 జూన్ 2007 (UTC)[ప్రత్యుత్తరం]
బావున్నారా!--మాటలబాబు 18:16, 25 జూన్ 2007 (UTC)[ప్రత్యుత్తరం]
ఎలా ఉనారు, నేను చేసే పేజిలు అన్ని మీరు నిర్ములిస్తున్నారు , నన్ను పేజిలు చేయడం మానేయ మంటారా, నాకు ఈ ప్రాజేక్ట్ అచ్చి వచ్చినట్లు లేదు, మనేస్తాను--మాటలబాబు 19:05, 25 జూన్ 2007 (UTC)[ప్రత్యుత్తరం]
భలే భలే పరిశిలించవలసిన వర్గం ఉండే పేజిలు మాయం అయి పోతున్నాయి, ఇప్పుడు నేను మీరు తెవికి మాంత్రికుడు అంటే ఒప్పు కొంటాను, భలే భలే ఉంది, నాకు చాలా సంతోషం గా ఉంది , బాటు భలే నడుస్తోంది, బావుంది-మాటలబాబు , నాఎడిట్ బాక్స్ లేచి పోయింది.

గ్రామ అయోమయ నివృత్తి పేజీలో

[మార్చు]

గ్రామ అయోమయ నివృత్తి పేజీలో రెండో వాక్యం ఇలా ఉంది: "ఆ వ్యాసాల జాబితాను ఇక్కడ ఇచ్చారు." అది ఇలా ఉంటే బాగుంటుంది: "ఆ వ్యాసాల జాబితా ఇక్కడ ఉంది." లేదా "ఆ వ్యాసాల జాబితా:" లేదా "ఆ వ్యాసాల జాబితా ఇది:" __చదువరి (చర్చరచనలు) 02:42, 26 జూన్ 2007 (UTC)[ప్రత్యుత్తరం]

"ఆ వ్యాసాల జాబితా:"తో తరువాత మారుస్తాను(బాటుతోనే నేను స్వయంగా కాదు). కొన్ని చోట్ల "...ఆ జాబితా ఇక్కడ ఇవ్వబడింది." అని చేర్చాను దానిని కూడా మార్చాలి.__మాకినేని ప్రదీపు (చర్చదిద్దుబాట్లుమార్చు) 02:46, 26 జూన్ 2007 (UTC)[ప్రత్యుత్తరం]
[మార్చు]

Andhra pradesh mandal images do not have any copyright info (E.g: [4]). Could you please provide the details so that we can use the same in English wiki?. --Sumanthk 04:55, 26 జూన్ 2007 (UTC)[ప్రత్యుత్తరం]

Hi Sumanth, most of the mandal images that end with "mandals_outlineNN.png" are created by me. They can be used as "PD-user" or "GFDL-self". Sure I will update the lisence information for those images. Thanks for your inquiry

done.

__మాకినేని ప్రదీపు (చర్చదిద్దుబాట్లుమార్చు) 07:52, 26 జూన్ 2007 (UTC)[ప్రత్యుత్తరం]

Thanks pradeep. I will try to upload these to Wikipedia commons.--Sumanthk 08:08, 26 జూన్ 2007 (UTC)[ప్రత్యుత్తరం]

అయోమయ నివృత్తి పేజీకి లింకులు

[మార్చు]

బాటుతో మంచి మంచి పనులు చేయిస్తున్నారు. అభినందనలు, ప్రదీప్! ఈ అయోమయ నివృత్తి పేజీల్లో చేసిన మార్పులకు తోడుగా మరో పని చెయ్యాల్సి ఉంది, అది కూడా మీ దృష్టిలో ఉండే ఉంటుంది. అయినా ఇక్కడ రాస్తాను. నే చెప్పదలచింది ఒక ఉదాహరణగా రాస్తాను.. దామనచెర్ల అనే పేజీని తీసుకుందాం.. ఈ పేరుతో రెండు పేజీలున్నందు వలన అయోమయ నివృత్తి పేజీ తయారు చేసాం,

దామనచెర్ల అని. ఆ పేజీలో సదరు రెండు పేజీలకు లింకులిచ్చాం, ఇలా..
దామనచెర్ల (వరికుంటపాడు)
దామనచెర్ల (పెనగలూరు)

అంటే వరికుంటపాడు, పెనగలూరు పేజీల్లో దామనచెర్ల లింకులను కూడా మార్చి, కొత్త పేజీలకు లింకులు ఇవ్వాలి కదా. ప్రస్తుతం బాటు ఆ పని చేస్తున్నట్టు లేదు. ఇదైపోయాక ఆ పని చేద్దామని అనుకున్నారా? లేక మనుషులే చెయ్యాలా? __చదువరి (చర్చరచనలు) 06:02, 26 జూన్ 2007 (UTC)[ప్రత్యుత్తరం]

ప్రస్తుతానికి నేను దాని గురించి ఏమీ ఆలోచించలేదు. ఆ పని బాటుతోనే చేయించేమో!.. కానీ అది అంతగా అవసరం లేదు అని అనుకుంటున్నాను. అయోమయ నివృత్తి పేజీలు ఉన్నాయి కాబట్టి సరయిన పేజీలకు వారు వెళ్ళగలుగుతారనే అనుకుంటున్నాను. ఒకవేళ మీకు అది మరీ ముఖ్యమని అనుకుంటే చెప్పండి, దాన్ని కూడా బాటు ద్వారా చేయడానికి ప్రయత్నిస్తాను. __మాకినేని ప్రదీపు (చర్చదిద్దుబాట్లుమార్చు) 06:07, 26 జూన్ 2007 (UTC)[ప్రత్యుత్తరం]
అలా చెయ్యాలని మూస:అయోమయ నివృత్తిలో మనం రాసుకున్నాం. చేస్తేనే బాగుంటుందనుకుంటా! __చదువరి (చర్చరచనలు) 06:14, 26 జూన్ 2007 (UTC)[ప్రత్యుత్తరం]

వ్యాసాలకు మూలాలు

[మార్చు]

మాటలబాబుగారు, నాదొక చిన్న మనవి. మీరు తయారు చేస్తున్న వ్యాసాలలో చాలా మంచి సమాచారాన్ని చేరుస్తున్నారు, అందుకు ధన్యవాదాలు. కానీ, మీరు చేరుస్తున్న సమాచారం ఎక్కడి నుండి తెస్తున్నారో ఆ మూలాలను (రిఫరెంసులు) పేర్కొనటంలేదు. అలా మూలాలను పేర్కొనటం వలన ఇతర సభ్యులు మీరు రాసిన వివరాలను దృవపరచుకోగలుగుతారు. అంతేకాదు, అలా మూలాలలో ఇచ్చిన లింకులనుండో, పుస్తకాలనుండో దొరికే సమాచారం వేరే వ్యాసాలకు కూడా ఉపయోగపడే అవకాశమ్ ఉంది. మూలాలు ఎలా చేర్చాలో ఈ పేజీని చూసి నేర్చుకోండి. __మాకినేని ప్రదీపు (చర్చదిద్దుబాట్లుమార్చు) 00:16, 28 జూన్ 2007 (UTC)[ప్రత్యుత్తరం]

నేను వ్రాసే దాదాపు అన్ని విషయాలు పురాణాలనుండే ఇప్పుడు రాస్తున్న పుణ్యక వ్రతం బ్రహ్మవైవర్త పురాణము లోనిది, శివపార్వతుల రతి భంగమైనప్పుడు పుత్రుడి కోసం పార్వతి శివుడుని ఏదైన వ్రతం గురించి చెప్పమనగా శివుడు పార్వతి చెప్పిన విషయాలను, నారణముని నారదుడికి చెప్పగా, సత్రయాగమ్ చేస్తున్నప్పుడు రోమ మహర్షి గా పేరు సంపాదించిన సూతుడు శౌనకాది ఋషులకు చెప్పిన విషయాలను నేను తెవికి లొ రాస్తున్నాను, ఏమైన అభ్యంతరమైతే చెప్పండి, మానేస్తాను.ముందు ముందు వివిధ దేవతల కవచలా గురించి రాద్దామను కొంటున్నాను--మాటలబాబు 00:30, 28 జూన్ 2007 (UTC)[ప్రత్యుత్తరం]
ప్రదీప్ గారు మీ ప్రోత్సాహానికి కృతజ్ఞుడిని. ప్రదీప్ గారు పరుషంగా ఏమైన రాస్తే క్షమించండి, నేను వ్రాసేవన్ని పురాణాలనుండే.. వాటి వివరము అందుబాటు లొ దొరికినప్పుడల్ల ఒక లింకో పుస్తకము పేరో రాస్తాను. --మాటలబాబు 02:54, 28 జూన్ 2007 (UTC)[ప్రత్యుత్తరం]

తెలుగు సహాయం

[మార్చు]

నేనే అనుకొంటా వైజా సత్యా గారికి విన్న వించుకోవడం వల్ల ఎడిట్ బాక్స్ క్రింద తెలుగు టైపింగ్ సహాయాన్ని ఏర్పాటు చేశారు. ఆ టైపింగ్ సహాయాన్ని ఎడిట్ బాక్స్ ప్రక్కకు మార్చే అవకాశము ఏమైన ఉన్నదేమో చూడండి.--మాటలబాబు 00:30, 28 జూన్ 2007 (UTC)[ప్రత్యుత్తరం]

నేత్రం

[మార్చు]

ఒకసారి మీరు కూడా సత్యా గారి పేజి లొ వ్రాసిన వ్యాఖ్యను చూడగలరు.ఇంకో విషయం మీ చర్చా పేజి నిక్షిప్తం చేయవలసిన సమయం వచ్చేసింది --మాటలబాబు 15:58, 30 జూన్ 2007 (UTC)[ప్రత్యుత్తరం]

అలా కాదు గాని ఇక్కడ ఆ విషయం చూపిస్తా [5]--మాటలబాబు 16:08, 30 జూన్ 2007 (UTC)[ప్రత్యుత్తరం]
engorgementకి నాకు సరయిన తెలుగు పదం తెలీదు. __మాకినేని ప్రదీపు (చర్చదిద్దుబాట్లుమార్చు) 16:12, 30 జూన్ 2007 (UTC)[ప్రత్యుత్తరం]

లొకేషన్ మాప్

[మార్చు]

లొకేషన్ మాప్ మూసను సరిచేసినందుకు కృతజ్ఞతలు. --వైజాసత్య 16:25, 3 జూలై 2007 (UTC)[ప్రత్యుత్తరం]

మీడియావికీలో ఉపయోగించే సాఫ్టువేరులో, SVG బొమ్మలను PNGలుగా మార్చే ఇంకో సాఫ్టువేరు ఉంటుంది, ఆ సాఫ్టువేరు బొమ్మల పేర్లు యూనీకోడులో ఉంటే PNGలుగా మార్చటం లేదు. దీనివలన ప్రస్తుతానికి SVGలకు మనం ఆంగ్లపేర్లనే వాడాలి. ఇప్పుడు మార్చిన దానుకంటే ఇంకొంచెం సులువుగా ఉండేటట్లు మార్చటానికి ప్రయత్నిస్తాను. __మాకినేని ప్రదీపు (చర్చదిద్దుబాట్లుమార్చు) 18:11, 3 జూలై 2007 (UTC)[ప్రత్యుత్తరం]

ప్రశ్న

[మార్చు]
మీరేంటొ నేను దేని గురించి రాసిన పట్టించు కోరు. సరె ఆవిషయాన్ని విడిచి పెట్టండి నా దగ్గర 2-3 మంచి ఇంద్రధనస్సు బొమ్మలు ఉన్నాయి వాటిని అప్‌లోడ్‌ చేయంటారా.. ఇంకో సందేహం నేనే 50 వేల మార్పు చేశాను అని చెప్పడానికి ఏమైన ఋజువు ఉన్నదా...--మాటలబాబు 18:55, 3 జూలై 2007 (UTC)[ప్రత్యుత్తరం]
వికీపీడియాలో లాగులో, ఎప్పటికప్పుడు కొత్త పేజీలను చూసుకోవచ్చు. ఈ పేజీలో total అనే వేరియబుల్లో వికీపీడియాలో ఎప్పటికప్పుడు తెలుగు వికీపీడియాలో ఎన్ని పేజీలు ఉన్నాయో తెలుసుకోవచ్చు. ఈ రెండిటినీ కలుపుకుని, ఏ పేజీ ఎన్నోదో తెలుసుకోవచ్చు. __మాకినేని ప్రదీపు (చర్చదిద్దుబాట్లుమార్చు) 19:11, 3 జూలై 2007 (UTC)[ప్రత్యుత్తరం]
మీరిచ్చిన లింకులు ఒకసారి సరి చూడండి, రెండొ లింకు లొ వేరియబుల్‌ తెలుస్తోంది కాని, మడటి లింకు నొక్కితే ఇక్కడీకి మీ చర్చాపేజికే వచ్చాను--మాటలబాబు 19:19, 3 జూలై 2007 (UTC)[ప్రత్యుత్తరం]