సహాయం చర్చ:వికీపీడియా పరిచయం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ప్రతి పేజీలో ఎడమ వైపు నావిగేషన్[మార్చు]

చదువరి గారూ, వికీపీడియాకు తోడ్పడడం గురించి పరిచయం పేజీలో "తిరిగి పాఠాల మెనూకు" అనే నావిగేషన్ ఉంచారు.అలాగే ప్రతి పేజీలో ముందు పేజీకి నావిగేషన్ ఉంటే బాగుంటుదని నా అభిప్రాయం.ఎందుకంటే నాలాంటి హడావుడి వాడకరులం ముందు అక్కడ సరిగా చదువ కుండానో, అర్థం చేసుకోకుండానో ముందు పేజీకి వెళతాం. తరువాత ఏదో గుర్తు వచ్చి వెనకకు వెళ్లాలి అనుకుంటాం.సమయానికి back చేయాలని గుర్తుకురాదు.నావిగేషన్ ఉంటే బాగుంటుందేమోనని నా అభిప్రాయం, సూచన మాత్రమే.--యర్రా రామారావు (చర్చ) 09:24, 24 ఫిబ్రవరి 2021 (UTC)[ప్రత్యుత్తరం]

యర్రా రామారావు గారూ, ప్రతీ పాఠం లోనూ 4 ఉండి 6 పేజీలు ఉంటాయి. ఆ పాఠంలో చివరి పేజీ నుండి పరిచయం పేజీకి లింకు ఉంటోంది. ఒక పాఠం చదవడం మొదలుపెట్టిన పాఠకులు ఆ పాఠంలోని అన్ని పేజీలూ చదవడం అయ్యాకే పరిచయం పేజీకి తిరిగి వెళ్తారని బహుశా ఇంగ్లీషువికీ వాళ్ళు భావించి ఆ లింకును అలా ఇచ్చి ఉంటారు. మీ సూచనను తేలిగ్గా ఎలా అమలు చెయ్యవచ్చో చూస్తాను. (ఒకే పాఠం లోని ఇతర పేజీలకు వెళ్ళేందుకు లింకులు ఎడమవైపు లింకులు ఎలనూ ఉండనే ఉన్నాయి) __చదువరి (చర్చరచనలు) 05:21, 25 ఫిబ్రవరి 2021 (UTC)[ప్రత్యుత్తరం]