సి.ఎస్.కర్ణన్
జస్టిస్ సి.ఎస్.కర్ణన్ | |
---|---|
high court judge కోల్‌కాతా | |
వ్యక్తిగత వివరాలు | |
జననం | june 12 1955 తమిళనాడు, కడలూర్, |
జస్టిస్ సి.ఎస్.కర్ణన్ మద్రాసు హైకోర్టు న్యాయమూర్తి. [1][2][3] భారతదేశంలోని అత్యున్నత న్యాయస్థానం అయిన సుప్రీం కోర్టుచే జైలుశిక్ష విధించబడిన మొదటి న్యాయమూర్తి.[4]
ప్రారంభ జీవితం
[మార్చు]జస్టిస్ చిన్నస్వామి స్వామినాథన్ కర్ణన్ 1955 జూన్ 12 న కడలూరు జిల్లా, విరుధాచలం తాలూకాలోని కర్ణథం గ్రామంలో జన్మించారు. ఆయన తండ్రి పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుడు. ఆయన తండ్రి భారత రాష్ట్రపతిచే ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం పొందినవారు. ఆయన తల్లి కమలం అమ్మాళ్ సాధారణ గృహిణి. ఆమె కూడా పిల్లలకు విద్యాబోధన చేసేవారు.
ఆయన మంగళంపేట హైస్కూలులో పాఠశాల విద్యను పూర్తిచేసారు. ప్రీ యూనివర్శిటీ కోర్శును విరుధాచలం ఆర్ట్స్ కళాశాలలోనూ, బి.ఎస్సీ గ్రాడ్యుయేషన్ చెన్నైలోని న్యూ కాలేజీలోనూ చేసారు. తరువాత 1983లో మద్రాసు న్యాయ కళాశాలలో న్యాయ విద్యను అభ్యసించారు. తరువాత తమిళనాడు బార్ కౌన్సిల్‌లో న్యాయవాదిగా నమోదు చేసుకుని సివిల్ కేసులలో ప్రాక్టీసు చేసారు. న్యాయవాద వృత్తిలో ఆయన మెట్రో వాటర్ కు న్యాయ సలహాదారుగా ఎన్నికయ్యారు. సివిల్ కేసులకు ప్రభుత్వ అడ్వకేటుగా కూడా ఉన్నారు.
ఉన్నత విద్యా కాలంలొ ఆయన ఎన్.సి.సి , ఎన్.ఎస్.ఎస్. వంటి సామాజిక కార్యక్రమాలలో పాల్గొనేవారు. ఆయన గత 8 సంవత్సరాల నుండి మద్రాసు హైకోర్టుకు న్యాయమూర్తిగా ఉన్నారు. న్యాయపరమైన నియామకాలు, సంస్కరణలు చేసారు.[5]
నియామకం
[మార్చు]ఆయన మద్రాసు హైకోర్టులో న్యాయమూర్తిగా కాక మునుపు 25 సంవత్సరాలుగా న్యాయవాద వృత్తిలో అనుభవం కలిగి ఉన్నారు.[6] 2009 లో అప్పటి మద్రాసు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, అశోక్ కుమార్ గంగూలీ, జద్జీగా నియమించేందుకు గాను కర్ణన్ పేరును కొలీజియమ్‌కు సిఫారసు చేసారు. ఆయన పని గురించి కొలీజియమ్ సభ్యులకు తెలియనప్పటికీ ఆయన్ను జడ్జీగా నియమించారు. ది హిందూ పత్రికతో మాట్లాడుతూ, "న్యాయమూర్తులలో ఉండాల్సిన సామాజిక వర్గానికి చెందిన వాడు, కర్ణన్" అని తన సిఫారసును గంగూలీ సమర్ధించుకున్నాడు.[7] కానీ తదనంతర కాలంలో ఆ నిర్ణయం పట్ల, కొలీజియమ్ సభ్యులతో సహా గంగూలీ పశ్చాత్తాప పడ్డాడు.[8]
వివాదాలు
[మార్చు]2011 లో కర్ణన్ తాను దళిత న్యాయమూర్తి అయినందున యితర జడ్జిలచే సాధింపునకు గురి అవుతున్నానని "నేషనల్ కమీషన్ ఫర్ షెడ్యూల్ కేస్ట్" కు లేఖ రాసారు. [3]
2013 లో జస్టిస్ కర్ణన్ కొత్త చట్టం సృష్టించి వివాదాలకు గురయ్యాడు. వివాహ చట్టం ప్రకారం ఒక స్త్రీని ఒక పురుషుడు వివాహం చేసుకుంటానని వాగ్దానం చేసి, పెళ్ళికి ముందు శృంగారం చేసి వివాహం చేసుకోకపోతే ఆమె కోర్టును ఆశ్రయించవచ్చు. కానీ జస్టిస్ కర్ణన్ ఆ చట్టాన్ని మార్చి ఒక స్త్రీ భార్యగా సామాజిక గుర్తింపు పొందాలంటే పురుషుడు 21 సంవత్సరాలు నిండి ఒంటరిగానూ, స్త్రీ 18 సంవత్సరాలు నిండి ఒంటరిగానూ ఉన్నప్పుడే వివాహ పూర్వపు సెక్స్ వివాహమవుతుందని ప్రకటించాడు.
2014 జనవరిలో జస్టిస్ కర్ణన్ వేరొక కోర్టు గదిలోనికి వెళ్ళి అక్కడ ఇద్దరు జడ్జీల బెంచ్ జడ్జీల నియామకంపై వేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని (పిల్) వింటూండగా దానిలో జోక్యం చేసుకున్నాడు. అతను అన్యాయమైన, పక్షపాతంతో ఉన్న న్యాయమూర్తుల ఎంపికకు వ్యతిరేకతను వెల్లడించారు. ఆ కోర్టుకు ముందు ఈ విషయంలో అఫిడవిట్ను దాఖలు చేస్తానని చెప్పారు.
2015 లో జస్టిస్ కర్ణన్ తన ఛాంబర్ లో వేరొక న్యాయమూర్తి లైంగిక వేధింపు చేసినట్లు ఆరోపించాడు కానీ నిరూపించలేక పోయారు.
2015 చివరిలో తనకు "డమ్మీ కేసులు" కేటాయించడం జరిగిందనే కారణంగా లాంగ్ లీవ్ పెడుతున్నట్లు జస్టిస్ కౌల్ కు లేఖ రాసారు.[3]
ఫిబ్రవరి 2016 న అపెక్స్ కోర్టు ఆయనను కలకత్తా హైకోర్టుకు బదిలీ చేసింది. [4]
2017 జనవరి 23 న ప్రస్తుతం పనిచేస్తున్న, పదవీవిరమణ చేసిన సుప్రీమ్ కోర్టు న్యాయమూర్తులు మొత్తం 20 మంది అవినీతికి పాల్పడ్డారని జాబితాతో సహా భారత ప్రధానమంత్రికి లేఖ రాసారు.[9]
2017 మే 8 న కర్ణన్ సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జె.ఎస్.ఖేహర్, యితర ఏడుగురు న్యాయమూర్తులకు ఐదు సంవత్సరాల జైలుశిక్షను ఎస్.సి/ఎస్.టి అట్రాసిటీ యాక్ట్-1989, 2015 లో అమెండు చేయబడిన యాక్ట్ ప్రకారం విధించారు.[10][11] భారత ప్రధాన న్యాయమూర్తి జేఎస్ ఖేహర్‌కు అయిదేళ్ల కఠిన కారాగార శిక్షతోపాటు ఒక లక్ష రూపాయల జరిమానా విధించారు. ప్రధాన న్యాయమూర్తితో పాటు మరో ఏడుగురికి అయిదేళ్ల శిక్ష విధిస్తున్నట్టు కర్ణన్ తెలిపారు. ఒకవేళ జరిమానా చెల్లించకపోతే మరో ఆరు నెలలపాటు శిక్షను పొడిగించాలని ఆదేశించారు. కులవివక్ష చూపిన జడ్జిలందరికీ ఆయా పదవుల్లో కొనసాగే అర్హత లేదన్నారు.
2017 మే 9 న సుప్రీం కోర్టు ఆయనకు ఆరు నెలల జైలుశిక్ష విధించింది.[12] [13][14] కోర్టు ధిక్కరణతో పాటు ఓ హైకోర్టు సిట్టింగ్ జడ్జి జైలుకు వెళ్లడం ఇది తొలిసారి.
ఇతర లింకులు
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ PTI. "Won't attend SC contempt hearing on March 31: Justice Karnan". The Hindu (in ఇంగ్లీష్). Retrieved 2017-05-09.
- ↑ "Calcutta HC's justice Karnan gets 6 months in jail for contempt, SC orders immediate arrest". hindustantimes.com/ (in ఇంగ్లీష్). 2017-05-09. Retrieved 2017-05-09.
- ↑ 3.0 3.1 3.2 Kumar, D. Suresh. "Justice Karnan's judicial journey". The Hindu (in ఇంగ్లీష్). Retrieved 2017-05-09.
- ↑ 4.0 4.1 "Justice Karnan First Judge To Be Sentenced To Jail By Supreme Court". NDTV.com. Retrieved 2017-05-09.
- ↑ "C.S. Karnan". Archived from the original on 2017-05-07. Retrieved 2017-05-09.
- ↑ "All You Need To Know About Justice C.S. Karnan, Who Now Faces Contempt Charge By Supreme Court". outlookindia.com/. Retrieved 2017-05-09.
- ↑ "All You Need To Know About Justice C.S. Karnan, Who Now Faces Contempt Charge By Supreme Court". Outlook. Retrieved 9 May 2017.
- ↑ Edmond, Deepu Sebastian (29 February 2016). "Judge regrets recommending Karnan". The Hindu. Retrieved 11 May 2017.
- ↑ Mittal, Priyanka (2017-05-09). "Supreme Court sentences justice Karnan to 6 months imprisonment". livemint.com/. Retrieved 2017-05-09.
- ↑ PTI (2017-05-03). "Justice Karnan issues non-bailable warrants against 7 Supreme Court judges". livemint.com/. Retrieved 2017-05-09.
- ↑ Rajagopal, Krishnadas. "SC sentences Justice Karnan to six months imprisonment". The Hindu (in ఇంగ్లీష్). Retrieved 2017-05-09.
- ↑ "Supreme Court sentences Justice Karnan to 6 months in jail for contempt of court - Times of India". The Times of India. Retrieved 2017-05-09.
- ↑ "A first: Calcutta HC judge CS Karnan sentenced to 6 months in jail by Supreme Court". The Economic Times. Retrieved 2017-05-09.
- ↑ "Justice Karnan row: SC sentences belligerent HC judge to 6 months in jail for contempt of court". Firstpost (in అమెరికన్ ఇంగ్లీష్). 2017-05-09. Retrieved 2017-05-09.