సీతాపతి చలో తిరుపతి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సీతాపతి చలో తిరుపతి
(1992 తెలుగు సినిమా)
దర్శకత్వం విజయబాపినీడు
నిర్మాణం ఎస్.మురళి శ్రీనివాస్
సునీల్ కిలారు
కథ విజయబాపినీడు
ఎంవివిఎస్ బాబూరావు
చిత్రానువాదం విజయబాపినీడు
తారాగణం రాజేంద్ర ప్రసాద్,
ఐశ్వర్య
సంగీతం ఎం. ఎం. కీరవాణి
సంభాషణలు ఓంకార్
ఛాయాగ్రహణం బాబు
కూర్పు త్రినాథ్
నిర్మాణ సంస్థ సాయి రాఘవేంద్ర ఫిల్మ్స్
భాష తెలుగు

సీతాపతి చలో తిరుపతి1992 లో విడుదలైన కామెడీ చిత్రం. సాయి రాఘవేంద్ర ఫిల్మ్స్ పతాకంపై, విజయ బాపినీడు దర్శకత్వంలో ఎస్. మురళి శ్రీనివాస్, సునీల్ కిలారు నిర్మించారు. ఇందులో రాజేంద్ర ప్రసాద్, వాణి విశ్వనాథ్, ఐశ్వర్య ప్రధాన పాత్రల్లో నటించగా, చక్రవర్తి సంగీతం సమకూర్చాడు.[1] ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్‌గా నమోదైంది.[2]

కథ[మార్చు]

అమాయక వ్యక్తి సీతాపతి (రాజేంద్ర ప్రసాద్) తన మామ పిచ్చయ్య (కోట శ్రీనివాసరావు) కుమార్తె సీతను (ఐశ్వర్య) ప్రేమిస్తాడు. సీతాపతి దగ్గర డబ్బు లేనందున పిచ్చయ్య వారి పెళ్ళిని తిరస్కరిస్తాడు. అంతేకాక, అతను సీతాపతి అమ్మమ్మ గోవిందమ్మ (నిర్మలమ్మ) ను బాధపెడుతూంటాడు. ఒకసారి పిచ్చయ్య గోవిందమ్మను బహిరంగంగా అవమానించడంతో ఆమె ఆత్మహత్య చేసుకుంటుంది. ఆ తరువాత, సీతాపతి 6 నెలల్లో సీతాపతి తనను తాను నిరూపించుకుంటే పెళ్ళికి అంగీకరిస్తానను పిచ్చయ్య చెబుతాడు. తిరుపతిలో తోలు కర్మాగారంలో సూపర్‌వైజర్‌గా పనిచేస్తున్న తన చిన్ననాటి స్నేహితుడు రామదాసు (మల్లికార్జున రావు) ను కలవడానికి సీతాపతి తిరుపతి వెళ్తాడు. అయితే, అతని దురదృష్టానికి, సీతాపతిని పోలీస్ స్టేషన్లో పెడతారు. అక్కడ రామదాసును చిన్న దొంగగా చూసి ఆశ్చర్యపోతాడు. తేలిగ్గా డబ్బు సంపాదించడం కోసం తన మార్గాన్ని అనుసరించమని అతడు సలహా ఇస్తాడు. దాన్ని పాటిస్తూ సీతాపతి, మంగలి కాశీ వీరభద్రయ్య (పిఎల్‌నారాయణ) సంచిని కొట్టేస్తాడు. అందులో అతడి మంగలి కిట్టు ఉంటుంది. ఇక, సీతాపతి మంగలి అవతారమెత్తుతాడు. కాని కుటుంబ సభ్యులకు మాత్రం తానో గొప్ప ఉద్యోగం చెస్తున్నానని చెప్పి వాళ్ళను మభ్యపెడతాడు.

కొన్నాళ్ళ తరువాత, వీరభద్రయ్య తన బ్యాగ్‌ను కనుక్కుంటాడు. కానీ అతను సీతాపతి నిజాయితీని ప్రేమిస్తాడు. అతనికి ఆశ్రయం ఇస్తాడు. సమాంతరంగా, అతని కుమార్తె అలివేలు మంగతాయారు (వాణి విశ్వనాథ్) సీతాపతిని ప్రేమిస్తుంది. ఒక సమయంలో, సీతాపతి తన కథను చెప్పి క్షమాపణ కోరినప్పుడు మంగ అతని పట్ల తన తన ప్రేమను వ్యక్తం చేస్తుంది. ఇంతలో, పిచ్చయ్య ఒక ప్రమాదంలో గాయపడి, మొత్తం కుటుంబంతో పాటు తిరుపతి ఆసుపత్రిలో చేరతాడు. ఇక్కడ అదృష్టవశాత్తూ, మంగకు సీతతో పరిచయమై, ఆమెను సీతాపతి వద్దకు తీసుకెళుతుంది. అదే సమయంలో, సీతాపతి మంగలిగా ఆసుపత్రికి వెళ్ళినపుడు, అక్కడ అతన్ని పిచ్చయ్య చూసి తిడతాడు. అదే క్షణంలో మంగ వచ్చి తడి గురించి గొప్పగా చెబుతోంటే సీతాపతి మొహం సిగ్గుతో ఎర్రగా మారుతుంది. పిచ్చయ్య అమనసు మారకపోవడంతో, ప్రేమ పక్షులు ఆత్మహత్యకు ప్రయత్నిస్తాయి. కానీ హాస్యాస్పదంగా వాళ్ళు లోతులేని చెరువులోకి దూకుతారు. దీంతో పిచయ్య తన తప్పును గ్రహిస్తాడు.. చివరగా, సీతాపతి, సీతల పెళ్ళితో సినిమా ముగుస్తుంది.

తారాగణం[మార్చు]

పాటలు[మార్చు]

భువన చంద్ర రాసిన పాటలకు చక్రవర్తి సంగీతం సమకూర్చాడు. సూర్య మ్యూజిక్ కంపెనీలో సంగీతం విడుదలైంది.[3]

సం.పాటగాయనీ గాయకులుపాట నిడివి
1."మల్లెమొగ్గ ఏమన్నది"ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, చిత్ర3:32
2."కోనంగి వానా"ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, చిత్ర4:19
3."చిక్కు చిక్లెట్"చిత్ర4:23
4."పంపుకాడ బిందెట్టుకో"ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, చిత్ర3:36
5."అసలు సిసలు"చిత్ర3:01
Total length:18:51

మూలాలు[మార్చు]

  1. "Seetapathi Chalo Tirupathi (Cast & Crew)". gomolo.com. Archived from the original on 2018-09-26. Retrieved 2020-08-18.
  2. "Seetapathi Chalo Tirupathi (Review)". moviefone.
  3. "Seetapathi Chalo Tirupathi (Songs)". Youtube.