సుద్దాల దేవయ్య

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సుద్దాల దేవయ్య
సుద్దాల దేవయ్య


ఎమ్మెల్యే
పదవీ కాలం
2009 – 2014
ముందు సాన మారుతీ
తరువాత బొడిగె శోభ
నియోజకవర్గం చొప్పదండి నియోజకవర్గం

ఎమ్మెల్యే
పదవీ కాలం
1994 – 2004
ముందు పాటి రాజం
తరువాత కాసిపేట లింగయ్య
నియోజకవర్గం నేరెళ్ల

వ్యక్తిగత వివరాలు

జననం (1955-12-08) 1955 డిసెంబరు 8 (వయసు 68)
అంతర్గాం, జగిత్యాల మండలం, జగిత్యాల జిల్లా, తెలంగాణ రాష్ట్రం
రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ[1]
ఇతర రాజకీయ పార్టీలు తెలుగుదేశం పార్టీ[2]
కాంగ్రెస్ పార్టీ
తల్లిదండ్రులు పోచమ్మ, వెంకటి
జీవిత భాగస్వామి లతా
సంతానం గౌతంకృష్ణ, లక్ష్మీ జ్యోత్స్న, స్వప్న, కల్పన
నివాసం బల్వంతపూర్, మల్యాల మండలం, జగిత్యాల జిల్లా

సుద్దాల దేవయ్య తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 1994లో కరీంనగర్ జిల్లా నేరెళ్ల శాసనసభ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలిచి, టీడీపీ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశాడు.

రాజకీయ జీవితం[మార్చు]

సుద్దాల దేవయ్య తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి, అంతర్గాం గ్రామా సర్పంచ్‌గా[3], 1982లో తెలుగుదేశం పార్టీలో చేరి 1987లో కరీంనగర్ జిల్లా పరిషత్ ఛైర్మన్‌గా పనిచేసి 1994, 1999లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో నేరెళ్ల శాసనసభ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలిచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ హయాంలో రాష్ట్ర సహకార శాఖ, కార్మిక శాఖ మంత్రిగా పనిచేశాడు. ఆయన 2004లో ఓడిపోయి, 2009లో చొప్పదండి నియోజకవర్గం నుండి పోటీ చేసి ముదుసరి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యాడు.

అధికారిక పదవులు[మార్చు]

పార్టీ పదవులు[మార్చు]

  • 1982 - తెలుగుదేశం పార్టీలో చేరిక
  • 1985 - టీడీపీ జిల్లా సంయుక్త కార్యదర్శి
  • 1997 - కరీంనగర్ టీడీపీ జిల్లా అధ్యక్షుడు
  • 2004 - టీడీపీ రాష్ట్ర కార్య నిర్వాహక కార్యదర్శి
  • 2014 మార్చిలో టీడీపీ నుంచి కాంగ్రెస్ లో చేరిక
  • 2019 సెప్టెంబరు 15 - భారతీయ జనతా పార్టీలో చేరిక

ఎన్నికల్లో పోటీ[మార్చు]

ఎన్నికలు నియోజకవర్గం ఫలితం
1994 నేరెళ్ల శాసనసభ నియోజకవర్గం గెలుపు
1994 నేరెళ్ల శాసనసభ నియోజకవర్గం గెలుపు
2004 నేరెళ్ల శాసనసభ నియోజకవర్గం ఓటమి
2009 చొప్పదండి గెలుపు
2014 చొప్పదండి ఓటమి

మూలాలు[మార్చు]

  1. Sakshi (14 September 2019). "బీజేపీలోకి మాజీ మంత్రి సుద్దాల దేవయ్య!". Archived from the original on 4 April 2022. Retrieved 4 April 2022.
  2. Sakshi (28 March 2014). "సైకిల్ దిగిన సుద్దాల". Archived from the original on 4 April 2022. Retrieved 4 April 2022.
  3. Eenadu (6 November 2023). "నేతల గ్రామం అంతర్గాం". Archived from the original on 21 December 2023. Retrieved 21 December 2023.
  4. "సుద్దాల దేవయ్య అఫిడవిట్" (PDF). Ceo Telangana. Archived from the original (PDF) on 2022-04-09. Retrieved 2022-04-09.