సునీతా విలియమ్స్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సునీతా విలియమ్స్
జననం (1965-09-19) 1965 సెప్టెంబరు 19 (వయసు 59)
యూక్లిడ్, ఓహియో, యు.ఎస్
స్థితిక్రియాశీలకం
వృత్తిటెస్ట్ పైలట్
అంతరిక్ష జీవితం
నాసా వ్యోమగామి
ర్యాంకు Captain, USN
అంతరిక్షంలో గడిపిన కాలం
321 రోజుల 17 గంటల 15 నిమిషాలు
ఎంపికనాసా వ్యోమగామి వర్గం 17
మొత్తం ఇ.వి.ఎ.లు
7
మొత్తం ఇ.వి.ఎ సమయం
50 గంటల 40 నిమిషాలు
అంతరిక్ష నౌకలుSTS-116/117 (Expedition 14/15), Soyuz TMA-05M (Expedition 32/33), CTS-1
అంతరిక్ష నౌకల చిత్రాలు
STS-116 ISS Expedition 14 ISS Expedition 15 STS-117 Expedition 32 Expedition 33

సునీతా విలియమ్స్ యునైటెడ్ స్టేట్స్ నావికాదళ అధికారిణి, NASA వ్యోమగామి . అంతర్జాతీయ అంతరిక్ష స్టేషను నియమించి సాహసయాత్ర 14కు సభ్యురాలిగా చేశారు తర్వాత ఆమె సాహసయాత్ర 15లో చేరారు. 1983 లో విలియమ్స్ మేరీల్యాండ్‌లోని అన్నాపోలిస్‌లోని యు.ఎస్. నావల్ అకాడమీలో ప్రవేశించారు. ఆమె 1987 లో నావల్ ఏవియేషన్ ట్రైనింగ్ కమాండ్ వద్ద ఏవియేటర్ శిక్షణ పొంది తరువాత జూలై 1989 లో ఆమె యుద్ధ హెలికాఫ్టర్ శిక్షణను పూర్తిచేశారు. [1]పెర్షియన్ గల్ఫ్ యుద్ధానికి సన్నాహాక కార్యక్రమాలలో , ఇరాక్‌లోని కుర్దిష్ ప్రాంతాలపై నో ఫ్లై జోన్‌ల స్థాపనలో, అలాగే 1992 లో మయామిలో ఆండ్రూ హరికేన్ సమయంలో సహాయక కార్యక్రమాలలో ఈవిడ పాల్గొన్నది.

ప్రస్తుతం ఆమె, మరో నాసా వ్యోమగామి బారీ విల్మోర్ అంతరిక్ష కేంద్రంలో ఉన్నారు, వీరు 2025లో తిరిగి భూమికి చేరుకోనున్నారు.[2] 2024 జూన్ 5న కేవలం 10 రోజుల మిషన్‌లో భాగంగా ఈ రోదసీ యాత్రను వారు చేపట్టారు. జూన్ 14వ తేదీన వీరిద్దరూ భూమికి తిరుగుపయనం కావాల్సి ఉండగా, స్టార్‌లైనర్‌ వ్యోమనౌకలో హీలియం లీకేజీ కారణంగా టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఎదురయ్యాయి. దీంతో వీరి ప్రయాణం వాయిదా పడింది. ఆ తర్వాత జూన్‌ 26న ఖరారు చేస్తూ నాసా ప్రకటించింది. మళ్ళీ మరోసారి వాయిదా పడింది. చివరికి సెప్టెంబరు 7న సునీతా విలియమ్స్, బారీ ఇ విల్మోర్ లేకుండానే బోయింగ్ భూమి మీదకు వచ్చేసింది.

జీవిత విశేషాల

[మార్చు]

సునీత అమెరికా లోని ఒహాయో రాష్ట్రం లో జన్మించింది. తండ్రి దీపక్ పాండ్య గుజరాత్ కి చెందినవాడు. తల్లి బోనీ జలోకర్ స్లోవేకియా దేశస్తురాలు. వీరికి ఉన్న ముగ్గురు సంతానంలో సునీత చివరిది. ఆమె అమెరికా లోని నవల్ అకాడెమీలో ఫిజిక్స్ డిగ్రీ, ఫ్లోరిడా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి ఇంజనీరింగ్ మేనేజ్మెంట్ లో మాస్టర్స్ పూర్తి చేసింది. [3]

వ్యోమగామి

[మార్చు]

తండ్రి సూచనతో నౌకాదళం లో బేసిక్ డైవింగ్ ఆఫీసర్ గా చేరింది. నేవల్ ఏవియేటర్ గా హెలికాప్టర్ కంబాట్ సపోర్ట్ స్క్వాడ్రన్3 నేతృత్వంలో యుద్ధ విమానాలు నడపడంలో శిక్షణ తీసుకుంది. 30 సంవత్సరాల వృత్తిలో వివిధ ఎయిర్ క్రాఫ్ట్ లపై 2770 విమాన ( ఫ్లైట్ అవర్స్) గంటల అనుభవం గడించింది..
నాసా ఆమెను వ్యోమగామిగా ఎంపిక చేసింది. 1998లో అంతరిక్ష యానం లో శిక్షణ తీసుకుంది. కల్పన చావ్లా తరువాత అంతరిక్షం లోకి వెళ్ళిన రెండవ మహిళ ఈమె. తొలి పర్యటన 2006 డిసెంబర్ నుండి 2007 జూన్ వరకు జరిగింది. రెండోసారి 2012లో నాలుగు నెలల పాటు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం లో గడిపింది. అంతరిక్షం లో గడిపిన 322 రోజులలో ఒక రోజు కూడా వ్యాయామం మానలేదు. అంతరిక్ష మొదటి ప్రయాణం లో ఆరు నెలలు సౌర ఫలకాలను అమర్చడం, ప్రయోగాలకు అనువుగా ఆ కేంద్రాన్ని మరమ్మత్తులు చేయడం వంటివి చేసింది. రెండవ సారి ఆర్బిటింగ్ ప్రయోగశాల పై పరిశోధనలు జరిపింది.
సునీత సముద్ర గర్భంలోనూ పరిశోధనలు చేపట్టింది. అమెరికాలోని ఫ్లోరిడాకు దగ్గరలో కీలర్గో అనే ప్రాంతంలో 9 రోజుల పాటు జరిగే అన్వేషణలో సముద్ర గర్భంలో మానవ అవాసానికి వీలయ్యే పరిస్థితులను పరిశోధించే "నాసా ఎక్సట్రీమ్ ఎన్విరాన్మెంట్ మిషన్ ఆపరేషన్స్" బృందం తో కలిసి పని చేసింది.[3]

గుర్తింపులు

[మార్చు]

2008లో భారత ప్రభుత్వం పద్మ భూషణ్ పురస్కారాన్ని ప్రకటించింది.

బోస్టన్ మారథాన్ లో పాల్గొన్న మొదటి వ్యక్తి..[3]

మూలాలు

[మార్చు]
  1. "Sunita Williams | Biography, Achievements, & Facts". Encyclopedia Britannica. Retrieved 2020-06-15.
  2. "sunita williams: సునీతా విలియమ్స్‌ తిరుగు ప్రయాణం వచ్చే ఏడాదే.. | sunita-williams-and-barry-wilmore-will-come-to-earth-from-next-year-february". web.archive.org. 2024-09-14. Archived from the original on 2024-09-14. Retrieved 2024-09-14.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  3. 3.0 3.1 3.2 నీలాల నింగిలోకి మూడోసారి. ఈనాడు.18 May 2024
వికీవ్యాఖ్యలో ఈ విషయానికి సంబంధించిన వ్యాఖ్యలు చూడండి.