హెలికాప్టరు
హెలికాప్టరు (ఆంగ్లం Helicopter) గాలిలో ఎగిరే విమానం వంటి వాహనము. కాని, మామూలు విమానం లాగా కాకుండా, దీనికి తలపై రెండు లేక నాలుగు రెక్కలు ఉంటాయి. ఇవి వేగంగా తిరిగినప్పుడు, విమానం నిట్టనిలువుగా పైకి లేస్తుంది. గాలిలో అలా డేగ లాగా కొంతసేపు ఉండగలుగుతుంది. ముందుకు, వెనకకు కూడ పోగలుగుతుంది. మళ్ళీ తిరిగి, భూమి మీదకు ఏటవాలుగా కాకుండా, నేరుగా దిగుతుంది. దీనికి రన్ వే (runway) అవసరం లేదు. హెలిపాడ్ (helipad) ఉంటే చాలు.
ఉపయోగాలు [మార్చు]
హెలికాప్టరు యొక్క ప్రత్యేకమైన లక్షణాల మూలంగా విమానాల వలన కాని కొన్ని క్లిష్టమైన పనులను సులువుగా చేయగలుగుతున్నారు. ఈనాడు వీటిని రవాణా, నిర్మాణ రంగం, అగ్నిమాపక దళాలు, మిలటరీ వ్యవస్థలలో విస్తృతంగా ఉపయోగిస్తున్నారు.
-
Sikorsky S-64 Skycrane lifting a prefab house
-
Kern County (California) Fire Department Bell 205 dropping water on fire
-
A British Westland WAH-64 Apache attack helicopter
-
HH-65 Dolphin demonstrating hoist rescue capability
-
Traumahawk Loading 2.JPG
A Sikorsky S76-C+ air ambulance being loaded by firefighters
- హెలికాప్టరు ను గాలిలో ఎగిరే క్రేన్ గా ధృఢమైన తాళ్లతో బంధించిన బరువైన పరికరాల్ని గాలిలోకి లేపి ఎత్తైన భవనాల మీద లేదా కొండల మీద ఉంచడానికి ఉపయోగిస్తున్నారు. దట్టమైన అరణ్యాలలో వృక్షాల్ని తరలించడానికి కూడా వాడుతున్నారు.[1],[2]
- వరద ల సమయంలో వీటి సేవలు అమోఘమైనవి.వరదలలో చిక్కుకున్న వారిని రక్షించడానికి మరియు వరద బాధితులకు అహారపొట్లాలు,మంచినీరు అందించడానికి ఇవి ఉపకరిస్తాయి.
- హెలికాప్టరులను అంబులెన్స్ క్రింద అత్యవసర పరిస్థితులలో సుదూర ప్రాంతాలకు తక్కువ సమయంలో తరళించడానికి కొన్ని దేశాలలో ఉపయోగిస్తున్నారు. వీని ద్వారా సాధారణ అంబులెన్స్ చేరలేని ప్రాంతాలకు సైతం ఇవి వైద్య సేవలను అందించగలవు. ఇలాంటి అంబులెన్స్ హెలికాప్టరులలో అత్యవసర వైద్య సౌకర్యాలు కూడా ఉంటాయి.
- పోలీసు వ్యవస్థలో హెలికాప్టరు కీలకమైన పాత్ర పోషిస్తున్నాయి. భూమి మీది బలగాలకు ముఖ్యమైన సమాచారాన్ని అందించి అవసరమైనప్పుడు నేరస్తుల్ని గాలిలోనుండే దాడిచేసి నిర్వీర్యుల్ని చేయగలిగే సామర్ధ్యం కలిగువున్నాయి. వీటికి రాత్రి సమయంలో కూడా పనిచేయడానికి అవసరమైన ఆయుధాలు, సెర్చి లైట్లు మరియు కెమెరాలు అమర్చబడి వుంటాయి.
- మిలిటరీ బలాలు హెలికాప్టరు ను గాలిలోంచి భూమి మీది ప్రాంతాలపై దాడి చేయడానికి ఉపయోగిస్తున్నారు. వీటికి గన్ లు మరియు మిసైల్స్ అమర్చబడి వుంటాయి. వీరు సైనికుల్ని మరియు వారికి కావలసిన పరికరాల్ని కీలకమైన స్థావరాలకు తరలించడానికి కూడా ఉపయోగిస్తున్నారు.
- విదేశాలలో వీటిని వ్యవసాయం,అరణ్య అభినృద్ది(Seeding) లాంటి పనులకు వాడుతున్నారు.అనగా అతి పెద్ద వ్యవసాయ క్షేత్రాలలో ఎరువులు చల్లడానికి,అడవుల అభివృద్ది కోసం ఆకాశంనుండి విత్తనాలను వెదజల్లడం లాంటివి.
ప్రమాదాలు [మార్చు]
హెలికాప్టరు ప్రమాదాలు అరుదుగా జరుగుతాయి. వీనిలో ప్రముఖ వ్యక్తులు వై.యస్. రాజశేఖరరెడ్డి, జి.ఎం.సి.బాలయోగి, సినీనటి సౌందర్య ప్రాణాలు కోల్పోయారు.
మూలాలు [మార్చు]
- ↑ Day, Dwayne A. "Skycranes". Centennial of Flight Commission. Accessed on 1 October 2008.
- ↑ Webster, L. F. The Wiley Dictionary of Civil Engineering and Construction. New York: Wiley, 1997. ISBN 0-471-18115-3