స్వప్న దత్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
స్వప్న దత్
మహానటి (2018) సక్సెస్ మీట్‌లో స్వప్న దత్
జననం
స్వప్నా దత్ చలసాని

(1981-08-30) 1981 ఆగస్టు 30 (వయసు 42)
విద్యాసంస్థఓహియో విశ్వవిద్యాలయం
వృత్తి
  • మీడియా ప్రొఫెషనల్
  • చిత్ర నిర్మాత
క్రియాశీల సంవత్సరాలు2000 - ప్రస్తుతం
జీవిత భాగస్వామిప్రసాద్ వర్మ
తల్లిదండ్రులుఅశ్వనీ దత్ (తండ్రి)
బంధువులుప్రియాంక దత్ (సోదరి)
నాగ్ అశ్విన్ (మరిది), స్రవంతి దత్ (సోదరి)

స్వప్న దత్ చలసాని (జననం 1981 ఆగస్టు 30) ఒక భారతీయ చలనచిత్ర నిర్మాత. ఆమె వైజయంతీ మూవీస్ వ్యవస్థాపకుడు అశ్విని దత్ కుమార్తె. 2000లో ఆజాద్ చిత్రానికి అసోసియేట్ ప్రొడ్యూసర్‌గా 18 ఏళ్ల వయస్సులో చలనచిత్ర నిర్మాణాన్ని ప్రారంభించింది. ఈ ప్రాజెక్ట్ తర్వాత తన తండ్రి అశ్విని దత్, సోదరి ప్రియాంక దత్ లతో కలిసి వైజయంతీ మూవీస్ బ్యానర్‌లో పలు సినిమాలను నిర్మించింది.

ప్రారంభ జీవితం[మార్చు]

విజయవాడలో తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రముఖ నిర్మాత కుటుంబంలో స్వప్న దత్ జన్మించింది. ఆమె అశ్విని దత్, వినయ కుమారి దంపతుల పెద్ద కుమార్తె. చలసాని అశ్విని దత్ సుప్రసిద్ధ భారతీయ చలనచిత్ర నిర్మాత, వైజయంతీ మూవీస్ వ్యవస్థాపకుడు. ఆమె, ఒక చెల్లెలు ప్రియాంక దత్ ఇద్దరూ తండ్రితో కలిసి సినిమాలను నిర్మించారు. హాస్పిటాలిటీ రంగంలో వ్యాపారవేత్త అయిన స్రవంతి దత్ మరో చెల్లెలు.[1] స్వప్న దత్ యూనివర్సిటీ ఆఫ్ ఫైండ్లే నుండి ఎంబిఎ డిగ్రీని పొందింది. 2010 డిసెంబరు 19న ప్రసాద్ వర్మను ఆమె వివాహం చేసుకుంది. వారికి నవ్య వైజయంతి అనే కుమార్తె ఉంది.[2]

కెరీర్[మార్చు]

టెలివిజన్[మార్చు]

ఓహియో యూనివర్సిటీలో బిజినెస్ మేనేజ్‌మెంట్ చదువుతున్న సమయంలో స్వప్న దత్ తండ్రికి సహాయం చేస్తూ, విదేశాల్లో సినిమాల షూటింగ్ షెడ్యూల్‌ల నిర్మాణ వ్యవహారాలను చూసుకునేది.[3] హైదరాబాద్‌లో వైజయంతి టెలివెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్‌ని ఆమె స్థాపించింది. తెలుగులోని ప్రముఖ ఛానెల్‌లలో వరుసగా విభిన్నమైన కార్యక్రమాలను అందించడం ద్వారా టెలివిజన్ పరిశ్రమ ముఖచిత్రాన్ని మార్చేసింది. 2008 అక్టోబరు 7న అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి డాక్టర్. వై. ఎస్. రాజశేఖర రెడ్డి లోకల్ టీవీని ప్రారంభించారు. ఇందులో చాలా కార్యక్రమాలు వైజయంతి టెలివెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్ కు చెందినవే.

సినిమాలు[మార్చు]

సినిమా కుటుంబంలో జన్మించిన ఆమె భారతీయ సినిమాల కెమెరా కోణంలో ఎక్కువ ఆసక్తి చూపింది. ఆమె తన కెరీర్ ప్రారంభంలో సినిమా నిర్మాణంలో తన తండ్రితో కలిసి పనిచేసింది. తరువాత ఆమె వైజయంతీ మూవీస్ బ్యానర్‌లో సినిమాలను నిర్మించింది. 2014లో ఆమె స్వప్న సినిమా బ్యానర్‌ని ప్రారంభించింది.[4] ఈ బ్యానర్ లో ప్రియాంక దత్ తో ఎవడే సుబ్రహ్మణ్యం చిత్రానికి సహ నిర్మాతగా వ్యవహరించింది.[5] ఈ సినిమా చిత్రీకరణలో ఎక్కువ భాగం ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌లో జరిగింది, ఈ ప్రదేశంలో చిత్రీకరించబడిన మొదటి భారతీయ చిత్రం.[6] ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద విమర్శనాత్మకంగా, వాణిజ్యపరంగా విజయవంతమైంది. ఆమె ఇప్పుడు పేరు పెట్టని తన కొత్త సినిమా ప్రీ ప్రొడక్షన్ పనుల్లో నిమగ్నమైఉంది.

అవార్డులు[మార్చు]

  • ఉత్తమ చలనచిత్రానికి నంది అవార్డు - ఎవడే సుబ్రహ్మణ్యం (2015)
  • ఉత్తమ చిత్రంగా ఫిల్మ్‌ఫేర్ అవార్డు - తెలుగు - మహానటి (2018)
  • ఉత్తమ చిత్రంగా SIIMA అవార్డు - మహానటి (2018)
  • జీ సినీ అవార్డ్స్ తెలుగు - మహానటి (2018)
  • తెలుగులో ఉత్తమ చలనచిత్రంగా జాతీయ చలనచిత్ర అవార్డు - మహానటి (2018)

మూలాలు[మార్చు]

  1. Kavirayani, Suresh (2018-05-12). "The Dutt sisters behind Mahanati". Deccan Chronicle (in ఇంగ్లీష్). Retrieved 2021-02-22.
  2. "Swapna Dutt introduces baby girl Navya Vyjayanthi - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 2021-02-22.
  3. "Smile of Success". The Hindu. Retrieved August 16, 2010.
  4. "Yevade Subramanyam' Review: Yes, He Is Worth The Find". GreatAndhra. Retrieved March 21, 2015.
  5. "Exclusvie | Dulquer Salmaan was a choice that I was hell bent on: Swapna Dutt Chalasani". Hindustan Times (in ఇంగ్లీష్). 2017-12-11. Retrieved 2021-02-22.
  6. staff (2 December 2014). "Yevade Subramanyam, the first Telugu film shot in Everest". Times of India. Retrieved 14 January 2015.