హైదరాబాదీ పహిల్వాన్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
1870లలో జరిగిన కుస్తీ పోటీ కోసం సిద్ధమవుతున్న హైదరాబాదీ పహల్వాన్ లు

పహిల్వాన్ అనగా మల్ల యుద్ధం చేసేవారు అని అర్థం. హైదరాబాదులో సాధారణంగా రెండు రకాల వ్యక్తులను పహిల్వాన్ అనే పేరుతో పిలుస్తారు. నిజాంల కాలంలోనే మట్టి కుస్తీ క్రీడాకారులకు మంచి గుర్తింపు ఉండేది.[1]

  • కుస్తీపోటీల్లో రెజ్లర్‌లుగా పోషించబడ్డ పహల్వాన్‌లు అంటే కుస్తీపోటీల్లో ప్రపంచవ్యాప్తంగా టైటిల్స్ సాధించడం ద్వారా హైదరాబాద్ నగరానికి కీర్తినీ, గౌరవాన్ని తెచ్చిపెట్టిన మల్లయోధులను పహిల్వాన్ అంటారు.
  • పహిల్వాన్ పదం ముంబైలోని భాయ్ అనే పదాన్ని కూడా సూచిస్తోంది. భూస్వాములుగా మారి బలవంతపు వసూళ్ళు, రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేసేవాళ్ళు.[2]

చరిత్ర[మార్చు]

నిజాం కాలంనుండే ఈ పహల్వాన్ లు ఉన్నారు. సామాన్య శకం 1818లో మీర్ అక్బర్ అలీ ఖాన్ సికందర్ జాహ్, అసఫ్ జా III III పరిపాలనలో హద్రాముత్ అరబ్బులు పూణే, నాగపూర్ భోస్లాస్ నుండి హైదరాబాద్‌కు వలస వచ్చారు. యెమెన్‌లోని ముకల్లా సుల్తాన్‌కు నిజాం మహబూబ్ అలీ ఖాన్, అసఫ్ జా VI ఆశ్రయం ఇచ్చినప్పుడు అరబ్బులతో సంబంధాలు బలపడ్డాయి. హైదరాబాద్ శివార్లలో బ్యారక్స్ లోపల పెద్ద సంఖ్యలో ఫుట్ సైనికులు నివాసముండేవారు. ఈ బ్యారక్‌లు తరువాత 'బార్కాస్' గా పిలువబడ్డాయి. ఆ సైనికులు నిజాం సైన్యంలో కలిసిపోసి, నిజాం రాయల్ గార్డ్‌గా ఉపయోగించబడ్డారు. నిజాం పాలన తరువాత యెమెన్‌లోని అనేక కుటుంబాలను దేశం నుంచి వెళ్లిపోవాలని భారత ప్రభుత్వం ఆదేశించింది. అందుకు వారు నిరసన వ్యక్తం చేసి, తాము ఇప్పుడు హైదరాబాద్‌కు చెందినవారమని ప్రకటించారు. ఆ తరువాత వారిలో కొందరు మల్లయోధులుగా మారారు, కుస్తీ నేర్చుకున్నారు. మొదట్లో హైదరాబాదు నగరంలో పహల్వాన్ ఎక్కువగా అరబ్ (చౌష్) వాళ్ళు ఉండేవారు. తొలిరోజుల్లో పహిల్వాన్ లు ప్రజలచే గౌరవించబడేవారు, ప్రజా సమస్యలను పరిష్కరించేవారు.[3][4]

నగరంలోని బార్కాస్ గ్రౌండ్, ఎల్.బి. స్టేడియంలలో రెగ్యులర్ గా ఈ కుస్తీ పోటీలు జరుగుతాయి. పోటీలలో విజేతలకు టైటిల్స్ ఇవ్వబడతాయి. స్థానిక ప్రజలు ఈ పోటీలను చూడడానికి వస్తారు.

హైదరాబాదీ పహల్వాన్ లు[మార్చు]

అరబ్బులు హైదరాబాదీ పహల్వాన్లకు ప్రాతినిధ్యం వహించారు. వారిని 'చౌష్' అని పిలిచేవారు. అలా చౌష్ రెజ్లర్లకు 'పహల్వాన్' అనే బిరుదు లభించింది. వీరు డైరీ ఫామ్‌లు, తినుబండారాలు, పండ్ల వ్యాపారాలలో తమ సేవలను అందించడం ద్వారా తమ జీవనోపాధిని సంపాదించుకున్నారు. 70ల చివరలో, 80ల ప్రారంభంలో భూ డీలర్లుగా తమ వ్యాపారాలను ప్రారంభించారు. స్థానిక ప్రజలు ఈ పహల్వాన్లను పోషించడం వలన గత కొన్ని సంవత్సరాల నుండి హైదరాబాద్ ప్రాంతంలో రియల్టీ ధరలు బాగా పెరిగాయి. వారి పెరుగుదలకు, మనుగడకు హైదరాబాదు స్థానిక రాజకీయ నాయకులు ఆర్థిక సహాయం అందించారు.

శిక్షణ[మార్చు]

హైదరాబాదులో పహిల్వాన్ ఇనిస్టిట్యూట్‌లు ఉన్నాయి. కుస్తీ నేర్చుకోవడానికి ఆసక్తి ఉన్న వ్యక్తులకు ఉచిత కోచింగ్ కూడా అందిస్తున్నారు. ప్రతిరోజూ దాదాపు ఆరు నుండి ఎనిమిది గంటలు సాధన చేయాల్సివుంటుంది.[5]

మూలాలు[మార్చు]

  1. "The pehelwans of Hyderabad: How kusti is still practised in the city". The News Minute (in ఇంగ్లీష్). 2021-03-19. Retrieved 2021-09-19.
  2. "Old City in the grip of loan sharks". The Times of India. 8 October 2011. Archived from the original on 26 January 2013. Retrieved 19 September 2021.
  3. "It's Pahelwans who call the shots in Old City". The Times of India. Archived from the original on 2012-11-05. Retrieved 19 September 2021.
  4. "Pahalwan nurse a grudge against Akbaruddin over a land dispute". The Times of India. Archived from the original on 2012-05-31. Retrieved 19 September 2021.
  5. "Salaam, Pasha! These wrestlers keep the traditional sport alive". The New Indian Express. Retrieved 2021-09-19.