99 సాంగ్స్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
99 సాంగ్స్
దర్శకత్వంవిశ్వేష్ కృష్ణ‌మూర్తి
స్క్రీన్ ప్లేవిశ్వేష్ కృష్ణ‌మూర్తి
(డైలాగ్స్) -- హుస్సేన్ దలాల్ (హిందీ)
గౌతమ్ మీనన్ (తమిళం)
కిరణ్ (తెలుగు)
కథఎ. ఆర్. రెహమాన్
విశ్వేష్ కృష్ణ‌మూర్తి
నిర్మాతఎ. ఆర్. రెహమాన్
తారాగణం
  • ఇహాన్ భ‌ట్‌
  • ‌ఎడిల్సీ వ‌ర్గ‌స్
ఛాయాగ్రహణంత‌నయ్‌
జేమ్స్ కౌలీ
కూర్పుఅక్ష‌య్ మెహ‌తా
శ్రేయాస్.బి
సంగీతంఎ. ఆర్. రెహమాన్
నిర్మాణ
సంస్థలు
ఐడియ‌ల్ ఎంట‌ర్‌టైన్‌మెంట్‌
వై.ఎమ్‌.మూవీస్‌
పంపిణీదార్లుజియో స్టూడియోస్
విడుదల తేదీs
10 అక్టోబరు 2019 (బుసాన్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్)
16 ఏప్రిల్, 2021 (భారతదేశం)
సినిమా నిడివి
178 నిముషాలు
దేశంభారతదేశం
భాషహిందీ

99 సాంగ్స్, 2021లో విడుదలైన హిందీ సినిమా. వై.ఎమ్‌.మూవీస్‌ బ్యానర్ పై సంగీత దర్శకుడు ఎ.ఆర్.రెహమాన్ తొలిసారి నిర్మాతగా‌ ఈ చిత్రాన్ని నిర్మించాడు.[1] ఈ సినిమా 2021 ఏప్రిల్ 16న హిందీ, తెలుగు, తమిళ భాషల్లో విడులైంది.[2]

సినిమా కథ[మార్చు]

జయ్ (ఇహాన్ భట్) కు సంగీతమంటే ప్రాణం. అది జీవితాన్ని నాశనం చేస్తుందని, దాని జోలికి పోవద్దు అని అతని తండ్రి చెప్పినా... ఆయనకు తెలియకుండానే సంగీత సాధన చేస్తాడు జయ్. ఒక్క పాట ప్రపంచాన్ని మార్చేస్తుందని ప్రగాఢంగా నమ్మే జయ్, వ్యాపారవేత్త సంజయ్ సింఘానియా (రంజిత్ బారోట్) కుమార్తె సోఫియా (ఎడిల్సీ వార్గాస్) తో ప్రేమలో పడతాడు. మూగమ్మాయి అయిన సోఫియాకు తన కోసం పాటలు రాసి, పాడే జయ్ అంటే ప్రేమ. అయితే ఆమె తండ్రి మాత్రం ఓ స్ట్రగులింగ్ మ్యూజీషియన్ కి కూతురును ఇచ్చి పెళ్ళి చేయడానికి ఇష్టపడడు. 'ఒక్క పాట కాదు సమాజాన్ని ప్రభావితం చేయగల వంద పాటలు తయారు చేసుకురమ్మని జయ్ కు ఛాలెంజ్ విసురుతాడు. దానిని స్వీకరించిన జయ్ తన స్నేహితుడు పోలో (టెంజిన్ దల్హా) తో కలిసి షిల్లాంగ్ వెళతాడు. షిల్లాంగ్‌లో ఎలాంటి సమస్యలను ఎదుర్కొన్నాడు. డ్రగ్స్ కేసులో జయ్‌కి ఎలాంటి అనుభవాలు ఎదురయ్యాయి? అక్కడ జాజ్ సింగర్ షీలా (లీసారే) పరిచయం కావడంతో అతని జీవితం ఊహించని మలుపు తిరుగుతుంది. మరి జయ్ చేసిన ఛాలెంజ్ ఏమైంది? అసలు అతని తండ్రికి సంగీతమంటే ఎందుకు ద్వేషం? ఒక్క పాటతో ప్రపంచాన్ని మార్చొచ్చు అన్న జయ్ ఆశయం నెరవేరిందా? అన్నదే సినిమా కథ.[3]

నటీనటులు / సినిమాలో పాత్ర పేరు[మార్చు]

  • ఇహాన్ భ‌ట్‌ - జయ్
  • ఎడిల్సీ వ‌ర్గ‌స్‌ - సోఫియా సింఘానియా
  • టెంజిన్ దల్హా - పోలో, జయ్ స్నేహితుడు
  • దిత్య సియోల్
  • లీసా రే - జాజ్ సింగర్ షీలా
  • మనీషా కోయిరాలా - రిహబిలేషన్ సెంటర్ నిర్వాహకులురాలు
  • వారినా హుస్సేన్
  • థామ‌స్ ఆండ్రూస్
  • రంజిత్ బారోట్ - సంజయ్ సింఘానియా, సోఫియా తండ్రి
  • రాహుల్ రామ్
  • రెమో ఫెర్నాండెస్
  • కునాల్ కామ్రా- అతిథి పాత్రలో
  • అశ్వత్ భట్ [4]
  • కురుష్ దేబూ
  • దివాకర్ పుండిర్

సాంకేతిక వర్గం[మార్చు]

  • స్క్రీన్‌ప్లే, ద‌ర్శ‌క‌త్వం: విశ్వేష్ కృష్ణ‌మూర్తి
  • సంగీతం: ఎ.ఆర్‌.రెహ‌మాన్‌
  • క‌థ‌: ఎ.ఆర్‌.రెహ‌మాన్
  • ఛాయాగ్ర‌హ‌ణం: త‌నయ్‌, జేమ్స్ కౌలీ
  • కూర్పు: అక్ష‌య్ మెహ‌తా
  • నిర్మాత : ఎ.ఆర్‌.రెహ‌మాన్
  • నిర్మాణ సంస్థలు: ఐడియ‌ల్ ఎంట‌ర్‌టైన్‌మెంట్‌, వై.ఎమ్‌.మూవీస్‌
  • విడుద‌ల‌: జియో స్టూడియోస్

మూలాలు[మార్చు]

  1. Firstpost (11 April 2019). "99 Songs: AR Rahman to make debut as writer, producer with film, starring Lisa Ray, Manisha Koirala-Entertainment News , Firstpost". Archived from the original on 29 సెప్టెంబరు 2020. Retrieved 24 April 2021.
  2. Eenadu (16 April 2021). "99Songs Review: రివ్యూ: 99 సాంగ్స్‌ - a r rahman 99 songs telugu movie review". Archived from the original on 24 ఏప్రిల్ 2021. Retrieved 24 April 2021.
  3. The New Indian Express (17 April 2021). "'99 songs' movie review: This musical misses a lot of notes". Archived from the original on 24 ఏప్రిల్ 2021. Retrieved 24 April 2021.
  4. "Raazi actor Ashwath Bhatt: Kashmiris are doing well in the industry; genes help – Mumbai Mirror -". Mumbai Mirror. Retrieved 24 April 2021.
"https://te.wikipedia.org/w/index.php?title=99_సాంగ్స్&oldid=4069214" నుండి వెలికితీశారు