ఆచార్య ఎస్వీ రామారావు
సూగూరు వెంకటరామారావు | |
---|---|
జననం | సూగూరు వెంకటరామారావు 1941, జూన్ 6 మహబూబ్ నగర్ జిల్లా, శ్రీరంగాపూర్ గ్రామం |
వృత్తి | అధ్యాపకుడు |
ప్రసిద్ధి | విమర్శకుడు, రచయిత |
మతం | హిందూ |
భార్య / భర్త | స్వయంప్రభ |
తండ్రి | సూగూరు వాసుదేవరావు |
తల్లి | రామచూడమ్మ |
ఉత్తమ సాహిత్యదార్శనికుడు ఆచార్య ఎస్వీ రామారావు ఎం.ఫిల్, పి.హెచ్.డి. పరిశోధనా పర్యవేక్షకుడిగా కూడా మంచి పేరు సంపాదించుకున్నాడు. ఇతని పర్యవేక్షణలో 19 పి.హెచ్.డి పరిశోధనలు, 15 ఎం.ఫిల్ పరిశోధనలు జరిగాయి.
జీవిత విశేషాలు
[మార్చు]1941, జూన్ 5వతేదీ విష్ణు నామసంవత్సరం జ్యేష్ఠ శుద్ధ దశమి నాడు రామచూడమ్మ, వాసుదేవరావు దంపతులకు వనపర్తి జిల్లా, శ్రీరంగాపూర్ గ్రామంలో సూగూరు వెంకటరమారావు జన్మించాడు. ఇతని విద్యాభ్యాసం శ్రీరంగాపురం ప్రాథమిక పాఠశాల, వనపర్తి ఉన్నత పాఠశాలలో నడిచింది. హైదరాబాదు 1958 జూన్ లోనిజాం కాలేజీలో పి.యు.సి, బి.ఏ. చదివాడు. ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆర్ట్స్ కళాశాలలో ఎం.ఏ.ఛేశాడు. డా.సి.నారాయణరెడ్డి పర్యవేక్షణలో తెలుగులో సాహిత్యవిమర్శ - అవతరణ వికాసాలు అనే విషయంపై పరిశోధన చేసి 1973లో పి.హెచ్.డి.సాధించాడు. అదే యేడు భారతీయ విద్యాభవన్ నుంచి జర్నలిజంలో డిప్లొమా సంపాదించాడు. అదే యేడు 1973లో పిహెచ్.డి డిగ్రీ రావటం జరిగింది.[1]
1966లో లెక్చరర్‌గా ఉద్యోగం ప్రారంభించి 1976లో రీడర్‌గా,1987లో ప్రొఫెసర్‌గా పదోన్నతి పొందాడు. తెలుగుశాఖ అధ్యక్షుడిగా, బోర్డ్ ఆఫ్ స్టడీస్ డైరెక్టర్‌గా,ఫ్యాకల్టీ ఆఫ్ ఆర్ట్స్ డీన్‌గా వివిధ పదవులు నిర్వహించాడు. కేంద్రీయ విశ్వవిద్యాలయం,కాకతీయ విశ్వవిద్యాలయం,బెనారస్ యూనివర్శిటీ, బెంగళూరు యూనివర్శిటీలకు విజిటింగ్ ప్రొఫెసర్‌గా పనిచేశాడు. సాహితీలోకానికి ఇతను ఆచార్య ఎస్వీ రామారావుగా పరిచితుడు. వివిధ సదస్సులలో పాల్గొని పత్రసమర్పణ గావించాడు. పాఠ్యగ్రంథాల (1వ తరగతి నుండి ఎం.ఏ.వరకు) రచన, సంపాదకత్వం మొదలైనవి చేశాడు. పలు సాహిత్య సాంస్కృతిక సంస్థల నిర్వహణలో పాలుపంచుకున్నాడు. 2001 ఏప్రిల్‌లో పదవీవిరమణ చేశాడు.[2]
రచనలు
[మార్చు]- తెలుగులో సాహిత్య విమర్శ (సిద్ధాంత గ్రంథం) - 1974
- The Evolution of Telugu literary criticism -1990
- అన్వీక్షణం (వ్యాస సంపుటం) - 1984
- సమవీక్షణం (వ్యాస సంపుటం) - 1992
- అభివీక్షణం (వ్యాస సంపుటం) - 1998
- కావ్యామృతం (వ్యాస సంపుటం) - 2004
- గ్రంథావలోకనం (వ్యాస సంపుటం) - 2014
- కృత్యాలోకనం (66 పీఠికలు) - 2000
- మనోవీక్షణం (ఆకాశవాణి ప్రసంగాలు) -2006
- నన్నయ దర్శనం (ఆదిపర్వం అవతారిక) వ్యాఖ్యానం - 1998
- కర్ణపర్వం(ద్వితీయాశ్వాసం) తి.తి.దే ప్రచురణ వ్యాఖ్యానం - 2005
- భీమేశ్వర శతకం (వి.ఎల్.ఎస్.భీమశంకరం) వ్యాఖ్యానం - 2006
- శ్రీ సత్యసాయి అవతారం - దశావతార గాథలు - 2005
- పరిశోధనోత్సవం - 2006
- శతాబ్ది కవిత (నూరేళ్ళ కవిత్వధోరణుల సమాలోచన) -2009
- సాహితీ కదంబం (కథలు, కవితలు) - 2010
- నూటపది వసంతాల శ్రీకృష్ణదేవరాయాంధ్రభాషానిలయం - 2010
- పాలమూరు సాహితీవైభవం (ప్రాచీన యుగం) -2010
- విశ్వనాథ దర్శనం - 2011
- విమర్శక వతంసులు - 2011
- పాలమూరు ఆధునిక యుగకవుల చరిత్ర - 2012
- తెలుగు సాహిత్య చరిత్ర - 2012
- తెలంగాణ సాహిత్య వైశిష్ట్యం -2013
సంపాదకుడిగా
[మార్చు]- జ్యోతిర్మయి (కవితా సంకలనం)
- సమర్పణ (కథా సంకలనం)
- అలంపూరు సంచిక
- ఆత్మకూరు సంచిక
- సుజాత (గడియారం రామకృష్ణశర్మ షష్టిపూర్తి సంచిక)
- చౌడూరి ఆరుపదులు (చౌడూరి గోపాలరావు షష్టిపూర్తి సంచిక)
- మధుర రాగమాలిక (పాలమూరు సంగీత్సోత్సవ సంచిక)
- పుష్పాంజలి (బూర్గుల శతకం)
- నివేదన (బూర్గుల కవితలు)
- బూర్గుల పీఠికలు
- సురవరం ప్రతాపరెడ్డి వ్యాసాలు
- హైదరాబాదు - నాలుగు శతాబ్దాల సాహిత్యవికాసం
- వేమూరి చంద్రావతి స్మారక సంచిక
- వి.ఎల్.ఎస్.భీమశంకరం సప్తతి అభినందన సంచిక
- కావ్యత్రయ సమీక్ష (వేమూరి రామనాథం కావ్యాలు)
- నిశ్శబ్ద సంస్కర్త (వడ్లకొండ నరసింహారావు జయంతి సంచిక)
- సాహితీ వసునందనం (రావికంటి వసునందన షష్టిపూర్తి సంచిక)
- తెలుగు భాషా సాహిత్య వైశిష్ట్యం (వ్యాస సంకలనం)
పురస్కారాలు,సత్కారాలు
[మార్చు]- పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయ ఉత్తమ విమర్శ పురస్కారం - 1994
- సహృదయ సాహితీపురస్కారం, వరంగల్ - 2001
- విశ్వసాహితి విమర్శ పురస్కారం - 2001
- దాశరథి పురస్కారం - 2007
- ఉమ్మెత్తల అవార్డు, మహబూబ్‌నగర్ - 2007
- జీవిఎస్ సాహితీపీఠం పురస్కారం - 2007
- ఎర్రంరెడ్డి రంగనాయకమ్మ ధర్మనిధి పురస్కారం - 2006
- ఇరివెంటి పురస్కారం - 2009
- బూర్గుల రామకృష్ణారావు ప్రతిభా పురస్కారం - 2011
- ధన్వంతరి ఫౌండేషన్ ఉగాది పురస్కారం - 2011
- దివాకర్ల శతజయంతి పురస్కారం - 2011
- వానమామలై జయంతి పురస్కారం - 2011
- బి.ఎన్.శాస్త్రి స్మారక సాహితీపురస్కారం - 2011
- కొండేపూడి సుబ్బారావు పురస్కారం - 2012
- తిరుమల శ్రీనివాసాచార్య ధర్మనిధిపురస్కారం - 2012
- గురజాడ అప్పారావు సాహితీపురస్కారం - 2012
- సర్వవైదిక సంస్థానం (కరీంనగర్) ధర్మనిధి పురస్కారం - 2012
- సనాతనధర్మ ఛారిటబుల్ ట్రస్ట్ ప్రతిభాపురస్కారం - 2013
అనేక సాహిత్య సాంస్కృతిక సంస్థలు పలుసందర్భాలలో ఇతడిని సన్మానించాయి.
మూలాలు
[మార్చు]- యశస్వి - ఆచార్య ఎస్వీ రామారావు 73వ జన్మదిన అభినందన సంచిక -2013