ముంబై నగర జిల్లా
ముంబై నగర జిల్లా | |||||||
---|---|---|---|---|---|---|---|
ముంబై నగర జిల్లా (Mumbai City District) (मुंबई जिल्हा) మహారాష్ట్ర జిల్లాల లోని కొంకణ్ డివిజన్ ప్రాంతంలోని ఒక జిల్లా. ఇదొక నగర జిల్లా, దీనికి ముఖ్యపట్టణం గాని ఉప ప్రాంతాలు గానీ లేవు. ఈ జిల్లా, ముంబై ఉపనగర జిల్లాను కలుపుకుని ముంబై మెట్రోపోలిస్ ఏర్పడినది. ఈ నగర ప్రాంతాన్ని "ద్వీప నగరం" అనీ, పాత ముంబై అనీ, దక్షిణ ముంబై అని కూడా వ్యవహరిస్తారు. ఈ ప్రాంతం దక్షిణాన కొలాబా నుండి ఉత్తరాన మాహిం, సియోన్ (శీవ్) వరకూ వ్యాపించి ఉంది. 1960 సం. వరకూ దీనిని ముంబైగా వ్యవహరించే వారు. నేడు, ముంబై మునిసిపల్ కార్పోరేషన్ లో రెండు జిల్లాలూ గలవు. ఈ నగర వైశాల్యం 67.7 కి.మీ.².
చరిత్ర
[మార్చు]సా.శ.150 లో టోలెమీ చేపట్టిన భౌగోళిక కార్యక్రమంలో మొదటిసారిగా గుర్తింపబడింది. ఈ నగరం అనేక ద్వీపాలతో కూడి వుండేది. ఈ ప్రాంతాన్ని మరాఠీ ప్రజలైన కోలీలు, అగ్రిలచే పరిపాలెంపబడేది.
ఈ ప్రాంతేయులు ఈ ద్వీపాలను 1345 వరకూ పరిపాలించారు. ఆతరువాత ముస్లింలు భారత్ లో ప్రవేశించిన తరువాత నేటి మహారాష్ట్ర 1534లో వారి చేతుల్లోకి వచ్చింది. ఆతరువాత గుజరాత్కు చెందిన ముస్లిం సుల్తాన్ ఈ ద్వీపాలన్నిటినీ స్వాధీన పరచుకున్నాడు. తదనంతరం పోర్చుగీసు వారి దండయాత్రలనంతరం వారిచేతుల్లోకి వచ్చింది.
భారతీయులతో జరిగిన అనేక యుద్ధాలలో పోర్చుగీసు వారికి ఆంగ్లేయులు చేసిన సహాయానికి ప్రతిఫలంగానూ,, పోర్చుగీసు యువరాణి బ్రగాంజా కేథరిన్తో బ్రిటిష్ యువరాజైన రెండవ చార్లెస్తో జరిగిన వివాహ సందర్భాన పెళ్ళికానుకగా 1661 లో ముంబాయి నగరం ఇవ్వబడింది. ఈ ద్వీపసమూహాల నగరం 1947 ఆగస్టు 15 వరకూ బ్రిటిష్ రాజ్ చేతుల్లో ఉంది.
భౌగోళికం
[మార్చు]వాతావరణం
[మార్చు]సాధారణంగా ముంబాయి నగర జిల్లాలో హ్యూమిడ్ వాతావరణం కానవస్తుంది.
ముంబై | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
Climate chart (explanation) | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
|
జనగణన
[మార్చు]2011 జనగణన ప్రకారం ముంబై నగర జిల్లా లోని జనాభా 3,145,966 గలదు.[1] ఈ జనాభా మంగోలియా దేశపు జనాభాతో దాదాపు సమానం,[2] లేదా అ.సం.రా. రాష్ట్రమైన అయోవా జనాభాతో సమానం.[3] మొత్తం 640 భారత జిల్లాలలో ముంబై యొక్క రేంక్ 110.[1] ఈ జిల్లా యొక్క జనసాంద్రత 19,652 PD/sqకి.మీ.[convert: unknown unit] .[1] దీని జనాభా పెరుగుదల రేటు 2001-2011 దశాబ్దంలో -5.75 %.[1] ముంబై నగరంలో లింగానిష్పత్తి ప్రతి 1000 పురుషులకు 838 స్త్రీలు.[1] అక్ష్యరాస్యతా శాతం 88.48%.[1]
మూలాలు
[మార్చు]- ↑ 1.0 1.1 1.2 1.3 1.4 1.5 "District Census 2011". Census2011.co.in. 2011. Retrieved 2011-09-30.
- ↑ US Directorate of Intelligence. "Country Comparison:Population". Archived from the original on 2011-09-27. Retrieved 2011-10-01.
Mongolia 3,133,318 July 2011 est.
- ↑ "2010 Resident Population Data". U. S. Census Bureau. Archived from the original on 2011-08-23. Retrieved 2011-09-30.
N Iowa 3,046,355
- Govt of Maharashtra/మహారాష్ట్ర ప్రభుత్వం
- Official site of Mumbai city collectorate/జిల్లా కలెక్టరేట్ Archived 2020-09-19 at the Wayback Machine
18°58′N 72°49′E / 18.96°N 72.82°E