శివకాశి బాణాసంచా: కూర్పుల మధ్య తేడాలు
స్వరూపం
Content deleted Content added
←Created page with ' తమిళనాడు రాష్ట్రంలోని విరుదునగర్ జిల్లాలో ఉన్న శివకాశ...' |
(తేడా లేదు)
|
02:18, 27 జనవరి 2016 నాటి కూర్పు
తమిళనాడు రాష్ట్రంలోని విరుదునగర్ జిల్లాలో ఉన్న శివకాశి పట్టణం భారతదేశంలో బాణాసంచా ఉత్పత్తికి ప్రఖ్యాతి చెందింది. బాణాసంచాను ముఖ్యంగా దీపావళి పండుగ సమయంలో పేల్చినప్పటికీ వివాహాలు, ఎన్నికల ఊరేగింపులు, నాయకుల పుట్టినరోజు వేడుకలు, క్రీడలలో విజయం సాధించినప్పుడు మొదలైన అనేక సందర్భాలలో ఉపయోగిస్తారు.
చరిత్ర
బాణాసంచా వినియోగం భారతదేశంలో 19వ శతాబ్దం తొలినాళ్లలో ప్రారంభమైంది. మొట్టమొదటి బాణాసంచా కర్మాగారం కలకత్తాలో ప్రారంభమైంది. నెమ్మదిగా ఈ పరిశ్రమ కలకత్తా నుండి శివకాశికి తరలించబడింది. 1940లో ప్రేలుడు పదార్థాల చట్టం ఏర్పాటై బాణాసంచా కర్మాగారాల లైసెన్సింగ్ విధానం, బాణాసంచా నిలువ, అమ్మకాలపై నియంత్రణ మొదలయ్యింది. శివకాశిలో 8000లకు పైగా బాణాసంచా ఉత్పత్తి చేసే పరిశ్రమలున్నాయి. భారతదేశంలో ఉత్పత్తి అయ్యే బాణాసంచాలో 90 శాతము ఇక్కడి నుండే వెలువడుతున్నది. ప్రతియేటా 800 నుండి 1000 కోట్ల రూపాయల బాణాసంచా వ్యాపారం ఇక్కడి నుండి నడుస్తున్నది. ప్రపంచంలో చైనా తర్వాత మన దేశం ముఖ్యంగా శివకాశి 365 మిలియన్ డాలర్ల వార్షిక టర్నోవర్‌తో బాణాసంచా ఉత్పత్తిలో ముందున్నది[1].