అంగులూరి అంజనీదేవి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అంగులూరి అంజనీదేవి
అంగులూరి అంజనీదేవి
జననంమామిడేల అంజనీదేవి
నివాస ప్రాంతంహన్మకొండ
ప్రసిద్ధినవలా రచయిత్రి, కథా రచయిత్రి, కవయిత్రి
మతంహిందూ
భార్య / భర్తఅంగులూరి ఆంజనేయులు
తండ్రిమామిడేల రాఘవయ్య
తల్లిమామిడేల వెంకట సుబ్బమ్మ

అంగులూరి అంజనీదేవి వరంగల్లు జిల్లాకు చెందిన రచయిత్రి. ఈమె నవల, కథ, కవిత్వ ప్రక్రియలలో రచనలు చేశారు. మామిడేల రాఘవయ్య, వెంకట సుబ్బమ్మ దంపతులకు జన్మించారు. అంగులూరి ఆంజనేయులును వివాహం చేసుకున్నారు. పదవ తరగతి చదివే సమయం నుండే కథలు వ్రాయడం మొదలు పెట్టారు. ఇంటర్మీడియట్ చదివేటప్పుడు తొలి నవల మధురిమ ప్రగతి వారపత్రిక నుండి ధారావాహికగా వెలువడింది. కథలు, కవిత్వం ఆకాశవాణి కడప, వరంగల్లు కేంద్రాలలో ప్రసారమయ్యాయి. తెలుగు సాహిత్యంలో బి.ఎ. చదివారు.

రచనలు

[మార్చు]

ఈమె వెలువరించిన పుస్తకాలలో కొన్ని:

  1. మధురిమ (నవల)
  2. నీకు నేనున్నా (నవల)
  3. మౌన రాగం (నవల)
  4. ఈ దారి మనసైనది (నవల)
  5. రెండో జీవితం (నవల)
  6. ఎనిమిదో అడుగు (నవల)
  7. ఆమె అతడిని మార్చుకుంది (నవల) [1]
  8. జీవితం ఇలా కూడా ఉంటుందా? (నవల)
  9. ఆరాధ్య (నవల)
  10. ఇలా ఎందరున్నారు? (నవల) [2]
  11. జ్ఞాపకం (నవల)
  12. ఒక చిన్న అబద్ధం (నవల)
  13. ఉద్వేగ (నవల) [1][permanent dead link]
  14. నీ జీవితాన్ని నువ్వే మార్చుకో (నవల)
  15. అందమైన మనసు (నవల)
  16. ఈ రోజుల్లో ఒక అమ్మాయి (నవల)
  17. జీవితం అంటే కథ కాదు (కథా సంపుటి)
  18. సైలెంట్ మెలోడి (ఆంగ్ల నవల)
  19. గుండెలోంచి అరుణోదయం (కవితా సంపుటి)

పురస్కారాలు

[మార్చు]
  • 1986లో ఉమ్మెత్తల సాహితీ అవార్డు.
  • 2010లో లేఖిని సంస్థ నుండి మాతృమూర్తి నవలకు యద్దనపూడి సులోచనారాణి అవార్డు.
  • 2012లో హెల్త్ కేర్ ఇంటర్నేషనల్ వారి జాతీయ అవార్డు.
  • 2012లో సెలెబ్రిటీ న్యూస్ మేకర్ అవార్డు.
  • 2014లో భారత మహిళా శిరోమణి అవార్డు.

మూలాలు

[మార్చు]

బయటిలింకులు

[మార్చు]

Interview with Myindmedia Radiohttps://www.youtube.com/watch?v=pNuOvk-5YKc&list=PLwvKbhzkvIJ1G2qz3qyqJYuNcotCT44C9[2][3]