Jump to content

అంగుళం

వికీపీడియా నుండి
(అంగుళాలు నుండి దారిమార్పు చెందింది)
1 అంగుళం =
SI ప్రమాణాలు
0.0254 m 25.4 mm
US customary/Imperial units
⅟36 yd ⅟12 ft

అంగుళం అనేది ఒక దూరమానం. ఒక గజానికి 36 అంగుళాలు, ఒక అడుగుకి 12 అంగుళాలు. ఒక అంగుళానికి 2.54 సెంటీమీటర్లు. "అంగుళం"(బహువచనం:అంగుళాలు),(ఆంగ్లం:inch) దీని గుర్తు (Inch:గుర్తు ") అనునది దైర్ఘ్యమానములో పొడవుకు ప్రమాణం. అత్యున్నతాధికారం కలిగిన , యునైటెడ్ స్టేట్స్ కస్టమరీ ప్రమాణాలలో కూడా అంగుళం అనునది కలదు. అత్యున్నతాధికారం కల ప్రమాణాల ప్రకారం అంగుళం అనునది ఒక అడుగు పొడవులో 1⁄12 వ భాగము. , ఒక గజం(యార్డు) లో 1⁄36 వ వంతు. ప్రస్తుతం గల ప్రమాణాల ప్రకారం ఇది సుమారు 25.4 mm. ఉంటుంది.

వాడుక

[మార్చు]

ఒక అంగుళం అనునది సాధారణంగా అమెరికా సంయుక్త రాష్ట్రాలు,[1] కెనడా ,[2][3] యునైటెడ్ కింగ్ డమ్ లో పొడవుకు ప్రమాణం గా వినియోగిస్తున్నారు. అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం అంగుళం యొక్క గుర్తు in , కానీ అంగుళం డబుల్ ప్రైమ్ (″ ) అనే గుర్తుతో సూచిస్తారు. , అడుగు నకు ప్రైమ్ (’) గుర్తుతో సూచిస్తారు. ఈ గుర్తు ఎపోస్ట్రోఫ్ గా ఆంగ్లంలో వాడబడుతుంది. ఉదాహరణకు 3 అడుగుల 2 అంగుళాలను 3 2 గా సూచిస్తాము. అంగుళంలో భాగాలను భిన్నములుగా సూచిస్తారు. ఉదాహరణకు 2 3/8 అంగుళాల ను2 ⅜గా సూచిస్తారు కాని 2.375 గా గాని, , 2 6⁄16 గా గాని సూచించరాదు.

కొలచే టేపు calibrated in 32nds of an inch

ఇతర ప్రమాణాలతో సంబంధం

[మార్చు]
Mid-19th century tool for converting between different standards of the inch

1 అంతర్జాతీయ అంగుళం ఈ క్రిందివానికి సమానము.

  • 100 points (1 point = 0.01 అంగుళాలు), ఆస్ట్రేలియా లోని బ్యూరో ఆఫ్ మెటొరాలజీ వారు వర్షపాతం కొలెచుటకు ఉపయోగించారు. 1974 కు ముందు [4]
  • 1,000 thou (also known as mil) (1 mil = 1 thou = 0.001 inches)
  • సుమారు 0.02778 అడుగులు (1 గజం=36 అంగుళాలు.)
  • 2.54 సెంటీమీటర్లు (1 సెంటీమీటరు ≈ 0.3937 అంతర్జాతీయ అంగుళాలు.)

పుట్టుక

[మార్చు]

inch అనే ఆంగ్ల పదము uncia నే లాటిన్ పదం నుండి ఉద్భవించింది. లాటిన్ భాషలో దీని అర్థము "పన్నెండవ భాగము"(అనగా ఒక అడుగు పొడవులో పన్నెండవ భాగము): ఔన్స్ అనుపదం కూడా ఇదేవిధంగా (పౌండులో పన్నెండవ భాగం) ఉధ్బవించింది.

చరిత్ర

[మార్చు]

ఇంగ్లాండ్ లో మొదటగా "అంగుళము" అను నది 7 వ శతాబ్దంలో వ్రాసిన అథెల్బెర్థ్ నియమాలలో గల గుర్తు ఆధారంగా తెలిసింది.1120 తర్వాత వ్రాసిన గుర్తుల ఆధారంగా కూడా ఇంచ్ ను వాడుతున్నారు.[5] ఈ గ్రంథంలో LXVII ప్రకారం గాయముల యొక్క వివిధ లోతులను తెలుసుకొనుటకు : ఒక ఇంచ్,ఒక షిల్లింగ్, రెండు ఇంచ్ లు, రెండు షిల్లింగ్ లు మొదలగునవి వాడబడుచున్నవి[6][7] పొడవుకు అంగ్లో షష్ట్యంశ ప్రమాణం బర్లెకార్న్. 1066 తర్వాత 1 అంగుళం అనగా 3 బార్లెకార్న్ లకు సమానంగా ఉంటుంది.ఇది అనేక దేశములలో న్యాయపరమైనదిగా గుర్తించారు. బార్లెకార్న్ అనునది మూల ప్రమాణం..[8] ప్రాచీన నిర్వచనములలో 1424 లో ఇంగ్లండ్ లో ఎడ్వర్డ్ II యొక్క విగ్రహంలో తెలియజేయబడింది. అంగుళం అనునది మూడు బార్లీ గింజలు,గుండ్రంగా పొడిగా నున్నవి,వరుసగా పేర్చితే దాని పొడవుకు సమానము.[8]

ఇదే విధమైన నిర్వచనములు అంగ్లంలో, వెల్ష్ ప్రాచీన నియమాలలో ఉన్నాయి.[9]

నూతన ప్రమాణం

[మార్చు]

ప్రస్తుతం అంతర్జాతీయంగా యు.ఎస్., ఇంపీరియల్ ప్రమాణాల ప్రకారం ఒక అంగుళం విలువ 25.4 మిల్లీ మీటర్లు. దీని ఆధారంగా అంతర్జాతీయ గజం(యార్డ్) కచ్చితంగా 0.9144 మీటర్లు ఉంటుంది.ఈ విలువలు అంతర్జాతీయ యార్డ్, పొండ్ అగ్రీమెంట్ నుండి 1959 నుండి దత్తత తీసుకోబడ్డాయి..[10] ఈ నిర్వచనం దత్తత తీసుకొనుటకు పూర్వం వివిధ నిర్వచనములు వాడుకలో ఉండెడివి. యునైటెడ్ కింగ్ డం, అనేక కామన్వెల్త్ దేశాలలో అంగుళం నకు ఇంపీరియల్ ప్రమాణాల యార్డు లలో తెలిపేవారు. యు.ఎస్ లో 1893 చట్టం ప్రకారం అంగుళం అనగా 25.4 మిల్లీ మీటర్లు. 1893 లో శుద్ధి చేసిన నిర్వచనం ప్రకారం ఒక మీటరులో ⅟39.37 వంతుగా తీసుకున్నారు.[11] 1930 లో బ్రిటిష్ ప్రమాణాల సంస్థ అంగుళం అనగా 25.4 మిల్లీ మీటర్లుగా తీసుకున్నది. అమెరికన్ ప్రమాణాల సంస్థ కూడా 1933 లో దీనిని అనుకరించడం జరిగింది. 1935 లో 16 దేశములు "ఇండస్ట్రియల్ అంగుళాన్ని" దత్తత తీసుకోవటం జరిగింది.[12][13]

1946 లో కామన్వెల్త్ సైన్స్ కాంగ్రెస్ కూడా ఒక యార్డు అనగా 0.9144 మీటర్లుగా తీసుకొనుటకు బ్రిటిష్ కామన్వెల్త్ కు సిఫారసు చేసింది. ఈ విలువను కెనడా 1951 లో దత్తత తీసుకున్నది.[14] యునైటెడ్ స్టేట్స్, యునైటెడ్ కింగ్ డం, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజీలండ్, దక్షిణ ఆఫ్రికా దేశాలు 1959 జూలై 1 నుండి ఈ ప్రమాణాన్ని ఉపయోగించాలని ఒడంబడిక కుదుర్చుకున్నాయి.[15] ఈ విధంగా అంగుళం అనగా 25.4 mm.గా నిర్ణయించబడింది. US లో సర్వే కొరకు ⅟39.37-metre ను అంగుళంగా ఉపయోగిస్తున్నారు. అంతర్జాతీయ, యు.ఎస్ సర్వే లలో స్వల్ప వ్యత్యాసం ఉంది.

యివి కూదా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. Corpus of Contemporary American English (Brigham Young University. Retrieved December 2011) lists 24,302 instances of inch(es) compared to 1548 instances of centimeter(re)(s) and 1343 instances of millimeter(re)(s).
  2. Weights and Measures Act Archived 2012-10-16 at the Wayback Machine
  3. Weights and Measures Act. Retrieved January 2012, Act current to 18 January 2012. Canadian units (5) The Canadian units of measurement are as set out and defined in Schedule II, and the symbols and abbreviations therefore are as added pursuant to subparagraph 6(1)(b)(ii).
  4. "Climate Data Online – definition of rainfall statistics". Bureau of Meteorology. Retrieved 10 June 2012.
  5. Goetz, Hans-Werner; Jarnut, Jörg; Pohl, Walter (2003). Regna and Gentes: The Relationship Between Late Antique and Early Medieval Peoples and Kingdoms in the Transformation of the Roman World. BRILL. p. 33. ISBN 978-90-04-12524-7.
  6. Wilkins, David (1871). Councils and Ecclesiastical Documents Relating to Great Britain and Ireland: English church during the Anglo-Saxon period: A.D. 595-1066. 1871. Clarendon Press. p. 48.
  7. Duncan, Otis Dudley (1984). Notes on social measurement: historical and critical. Russell Sage Foundation. p. 87. ISBN 978-0-87154-219-9.
  8. 8.0 8.1 H. Arthur Klein (1974). The world of measurements: masterpieces, mysteries and muddles of metrology. New York: Simon and Schuster.
  9. Jane Hawkes and Susan Mills (1999). Northumbria's Golden Age. Sutton. pp. 310. ISBN 978-0-7509-1685-1.
  10. Astin, A.V.; Karo, H. A.; Mueller, F.H. (25 June 1959). "Refinement of Values for the Yard and the Pound" (PDF). US Federal Register.
  11. Thomas Corwin Mendenhall (5 April 1893). "Appendix 6 to the Report for 1893 of the U.S. Coast and Geodetic Survey" (PDF). Archived from the original (PDF) on 30 సెప్టెంబరు 2012. Retrieved 3 ఫిబ్రవరి 2013.
  12. National Conference on Weights and Measures; United States. Bureau of Standards; National Institute of Standards and Technology (US) (1936). Report of the ... National Conference on Weights and Measures. US Department of Commerce, Bureau of Standards. p. 4.
  13. Wandmacher, Cornelius; Johnson, Arnold Ivan (1995). Metric Units in Engineering--going SI: How to Use the International Sytems of Measurement Units (SI) to Solve Standard Engineering Problems. ASCE Publications. p. 265. ISBN 978-0-7844-0070-8.
  14. National Conference on Weights and Measures; United States. Bureau of Standards; National Institute of Standards and Technology (US) (1957). Report of the ... National Conference on Weights and Measures. US Department of Commerce, Bureau of Standards. pp. 45–6.
  15. United States. National Bureau of Standards (1959). Research Highlights of the National Bureau of Standards. US Department of Commerce, National Bureau of Standards. p. 13.
  • Collins Encyclopedia of Scotland
  • Weights and Measures, by D. Richard Torrance, SAFHS, Edinburgh, 1996, ISBN 1-874722-09-9 (NB book focusses on Scottish weights and measures exclusively)
  • This article incorporates text from "Dwelly's [Scottish] Gaelic Dictionary" (1911).
  • Scottish National Dictionary and Dictionary of the Older Scottish Tongue

అంగుళం యొక్క వాడుక[1]

[మార్చు]

సాధారణంగా ఈ క్రింది కొలతలని అంగుళాలలోనే తెలియజేస్తారు.

  • కంప్యూటర్లు, టెలివిజన్ మొదలగువాటి తెరల పరిమాణం
  • టీవీ లేదా కంప్యూటర్ మానిటర్ స్క్రీన్
  • బాక్స్ లేదా ప్యాకేజీ యొక్క వెడల్పు, పొడవు, ఎత్తును
  • ఒక వ్యక్తి లేదా జంతువు యొక్క ఎత్తును కొలవడం
  • పైపు లేదా ట్యూబ్ యొక్క వ్యాసాన్ని కొలవడం
  • ఫాబ్రిక్ లేదా రిబ్బన్ యొక్క పొడవును కొలవడం
  • పుస్తకం లేదా పేపర్ షీట్ యొక్క మందాన్ని కొలవడం
  • పైపుల వ్యాసం
  • కంప్యూటరు ఫ్లాఫీల పరిమాణం
  • పీట్జా పరిమాణం
  1. basha786 (2023-03-27). "ఒక అంగుళం అంటే ఎన్ని సెంటీమీటర్లు |How many centimeters are in one inch?". chetta (in అమెరికన్ ఇంగ్లీష్). Archived from the original on 2023-04-10. Retrieved 2023-04-10.{{cite web}}: CS1 maint: numeric names: authors list (link)
"https://te.wikipedia.org/w/index.php?title=అంగుళం&oldid=4076291" నుండి వెలికితీశారు