Jump to content

అంగ్రేజీ మీడియం

వికీపీడియా నుండి

అంగ్రేజీ మీడియం
దర్శకత్వంహోమీ అదజానియా
రచనభవేష్ మందలియా
గౌరవ్ శుక్ల
వినయ్ చావల్
సారా బొదినార్
నిర్మాతదినేశ్‌ విజయన్‌
జ్యోతి దేశ్‌ పాండే
తారాగణం
ఛాయాగ్రహణంఅనిల్‌ మెహతా
కూర్పుఎ.శ్రీకర్ ప్రసాద్
సంగీతంసచిన్‌ జిగార్‌
తనిష్‌ బాగ్చి (నచ్చాన్ ను జీ కార్డా)
నిర్మాణ
సంస్థలు
మ్యాడ్‌డాక్‌ ఫిల్మ్స్‌
లండన్‌ కాలింగ్‌ ప్రొడక్షన్‌
పంపిణీదార్లుపెన్ ఇండియా లిమిటెడ్
జియో స్టూడియోస్
విడుదల తేదీ
13 మార్చి 2020 (2020-03-13)
సినిమా నిడివి
145 నిముషాలు
దేశం భారతదేశం
భాషహిందీ
బడ్జెట్36 కోట్లు
అంగ్రేజీ మీడియం ప్రత్యేక ప్రదర్శనకు రాధికా మదన్ హాజరయిన దృశ్యం

అంగ్రేజీ మీడియం 2020లో హిందీలో విడుదలైన కామెడీ డ్రామా సినిమా. ఇర్ఫాన్ ఖాన్, కరీనా కపూర్ ప్రధాన పాత్రల్లో నటించగా హోమీ అదజానియా దర్శకత్వం వహించాడు. 2017లో ఇర్ఫాన్‌ ఖాన్ నటించిన ‘హిందీ మీడియం’ కొనసాగింపుగా ఈ చిత్తాన్ని నిర్మించారు.[1]

రాజస్థాన్‌లో నివసించే చంపక్ బన్సల్ (ఇర్ఫాన్‌ఖాన్) ఓ మిఠాయి దుకాణం యజమాని. ఇతని తాత తోడర్‌మల్ ఘాంసీరామ్ బన్సల్ ఆస్తులు, అతని బ్రాండ్ నేమ్ కోసం ఇంకో సోదరుడు గోపి (దీపక్) తో పోట్లాడుతూ కోర్టు చుట్టూ తిరుగుతుంటాడు. బాబాయి కొడుకులు, పెదనాన్న కొడుకులు ఇలా పదుల సంఖ్యలో ఉండి అందరు స్వీట్స్ వ్యాపారం చేస్తూ ఘాంసీరాం బ్రాండ్ స్వీట్‌కు చాలా పేరు కాబట్టి దానికోసం పోరాడుతుంటారు. ‘‘ఇతని బాబాయి కొడుకు గోపి జడ్జికి 9 లక్షల రోలెక్స్ వాచీ ఇంకొన్ని బహుమతులు ఇచ్చి (లంచం) బ్రాండ్‌నేమ్‌ని తన పేరుమీద వచ్చెట్లు చేసుకుంటాడు. కోర్టులో గోపి గెలుస్తాడు కాని.. తన అన్న చంపక్ అంటె అతనికి ప్రాణం కన్నా ఎక్కువ. వ్యాపారము వ్యాపారమే ప్రేమ ప్రేమే అన్నట్లుగా ఉంటాడు. చంపక్ కూడా తమ్ముడి వరసైన గోపిని అదే ప్రేమతో చూస్తాడు. చంపక్ భార్య ఓ కూతుర్ని కని చనిపోతుంది. చిన్నప్పట్నుంచి ఆ కూతుర్ని (రాధికామదాన్) తల్లితండ్రి తానై అల్లారుముద్దుగా పెంచుతు తను అడిగిన ప్రతిది కాదనకుండా ఇస్తుంటాడు. కూతురే తన లోకం. తనని వదిలి ఉండలేని స్థితికి చేరుకుంటాడు. అతని కూతురు తారకా బన్సల్ మాత్రం తండ్రికి దూరంగా లండన్‌లో చదవాలని, ఫాస్ట్ లైఫ్‌ని అనుభవిస్తూ హాయిగా, ఉండాలని కోరుకుంటుంది. పైగా లండన్ వెళితే ఎలా బ్రతకాలో కూడా ఇండియాలోనే నేర్చుకునే క్రమంలో మందు తాగటం, చిన్న దుస్తులు వేసుకోవటం లాంటివి చేస్తుంటుంది. లండన్‌లో చదువుకోడానికి తండ్రిని ఒప్పిస్తుంది. కాని తండ్రి ఆమె చేసే ప్రతి ప్రయత్నాన్ని చెడగొట్టి తన దగ్గరే ఉంచుకోవాలని ప్లాన్ చేస్తుంటాడు. లండన్ వెళ్ళడానికి కోటి రూపాయలు ఫీజు, ఆ తర్వాత ఇంకో మూడు కోట్లు అవసరమవుతాయి. ఓ సాధారణ మిఠాయిలు అమ్ముకునే ఓ వ్యాపారి అన్ని కోట్లు కూతురి కోసం ఎలా సమకూర్చాడు? చివరికి కూతురు ఏం చేసింది? అనేది సినిమా కథ.[2]

నటీనటులు

[మార్చు]
  • ఇర్ఫాన్‌ ఖాన్‌ - చంపక్‌ బన్సల్‌
  • కరీనా కపూర్ ఖాన్‌ - నైనా కోహ్లీ (లండన్‌ పోలీస్‌)
  • రాధికా మదన్ - తారికా బన్సల్‌
  • దీపక్‌ దొబ్రియాల్‌ - గోపి
  • డింపుల్ కపాడియా
  • పంజక్ త్రిపాఠి
  • జాకీర్ హుస్సేన్
  • మేఘనా మాలిక్
  • రణవీర్ షోరే
  • పంకజ్‌ త్రిపాఠి
  • అనుష్క శర్మ (అతిథి పాత్ర)
  • కత్రినా కైఫ్‌ (అతిథి పాత్ర)
  • ఆలియా భట్‌ (అతిథి పాత్ర)
  • జాన్వీ కపూర్‌ (అతిథి పాత్ర)
  • అనన్య పాండే (అతిథి పాత్ర)
  • కృతిసనన్‌ (అతిథి పాత్ర)
  • కియారా అడ్వాణీ (అతిథి పాత్ర)

సాంకేతిక వర్గం

[మార్చు]
  • సంగీతం: సచిన్‌ జిగార్‌, తనిష్‌ బాగ్చి
  • సినిమాటోగ్రఫీ: అనిల్ మెహతా
  • ఎడిటింగ్: ఎ.శ్రీకర్‌ ప్రసాద్‌
  • నిర్మాత: దినేశ్‌ విజయన్‌, జ్యోతి దేశ్‌ పాండే
  • దర్శకత్వం: హోమీ అదజానియా

మూలాలు

[మార్చు]
  1. Disha daily (దిశ) (13 మార్చి 2020). "అంగ్రేజీ మీడియం సినిమా రివ్యూ". Disha daily (దిశ): Latest Telugu News | Breaking news. Archived from the original on 16 మే 2021. Retrieved 16 మే 2021.
  2. Eenadu (13 మార్చి 2020). "రివ్యూ: అంగ్రేజీ మీడియం". m.eenadu.net. Archived from the original on 16 మే 2021. Retrieved 16 మే 2021.