అంగ్ లీ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అంగ్ లీ
అంగ్ లీ (2016)
జననం (1954-10-23) 1954 అక్టోబరు 23 (వయసు 69)
చౌచౌ, పింగ్‌టుంగ్, తైవాన్
వృత్తి
క్రియాశీల సంవత్సరాలు1991–ప్రస్తుతం
జీవిత భాగస్వామి
జేన్ లిన్
(m. 1983)
పిల్లలు2, మాసన్ లీ

అంగ్ లీ తైవానీస్ సినిమా దర్శకుడు, నిర్మాత,రచయిత.[1][2][3] తన సినీ జీవితంలో అంతర్జాతీయ విమర్శనాత్మక, ప్రజాదరణ పొందిన ప్రశంసలను అందుకున్నాడు.[4][5]

జననం

[మార్చు]

అంగ్ లీ 1954, అక్టోబరు 23న తైవాన్‌లోని దక్షిణ వ్యవసాయ కౌంటీ అయిన పింగ్‌టుంగ్, [6] చౌచౌలో ఉన్న రిపబ్లిక్ ఆఫ్ చైనా ఆర్మ్‌డ్ ఫోర్సెస్‌లోని మిలిటరీ డిపెండెంట్స్ గ్రామంలో వైషెంగ్రెన్ కుటుంబంలో జన్మించాడు.[7]

సినిమారంగం

[మార్చు]

లీ తొలినాళ్ళలో తీసిన పుషింగ్ హ్యాండ్స్ (1991), ది వెడ్డింగ్ బాంక్వెట్ (1993), ఈట్ డ్రింక్ మ్యాన్ వుమన్ (1994) సినిమాలకు దర్శకత్వం వహించాడు. మూడు సినిమాలను అనధికారికంగా "ఫాదర్ నోస్ బెస్ట్" త్రయం అని పిలుస్తారు.[8] ఈ సినిమాలు అతని స్వస్థలమైన తైవాన్‌లో, అంతర్జాతీయంగా విమర్శకుల విజయం సాధించాయి. 1995లో కాస్ట్యూమ్ డ్రామా సెన్స్ అండ్ సెన్సిబిలిటీ అనే మొదటి పూర్తి ఆంగ్ల భాషా సినిమాను తీశాడు. 1997లో ది ఐస్ స్టార్మ్, 1999లో రైడ్ విత్ ది డెవిల్, 2000లో క్రౌచింగ్ టైగర్, హిడెన్ డ్రాగన్, 2003లో హల్క్, 2005లో బ్రోక్‌బ్యాక్ మౌంటైన్ (2005), 2007లోలస్ట్, కాషన్, 2012లో లైఫ్ ఆఫ్ పై మొదలైన సినిమాలకు దర్శకత్వం వహించాడు.[9][10]

సినిమాలు

[మార్చు]
సంవత్సరం పేరు దర్శకుడు నిర్మాత రచయిత
1991 పుషింగ్ హాండ్స్ Yes కాదు Yes
1993 ది వెడ్డింగ్ బాంక్వెట్ Yes కాదు Yes
1994 ఈట్ డ్రింక్ మ్యాన్ వుమన్ Yes కాదు Yes
1995 సియావో యు కాదు Yes Yes
సెన్స్ అండ్ సెన్సిబిలిటీ Yes కాదు కాదు
1997 ది ఐస్ స్టార్మ్ Yes కాదు కాదు
1999 రైడ్ విత్ దిడెవిల్‌ Yes కాదు కాదు
2000 క్రౌచింగ్ టైగర్, హిడెన్ డ్రాగన్ Yes Yes కాదు
2003 హల్క్ Yes కాదు కాదు
2005 బ్రోక్ బాక్ మౌంటైన్ Yes కాదు కాదు
2007 లస్ట్ ,కాషాన్ Yes Yes కాదు
2009 టేకింగ్ వుడ్‌స్టాక్ Yes Yes కాదు
2012 లైఫ్ ఆఫ్ ఫై Yes Yes కాదు
2016 బిల్లీ లిన్స్ లాంగ్ హాఫ్ టైమ్ వాక్ Yes Yes కాదు
2019 జెమిని మ్యాన్ Yes కాదు కాదు

లీ కమర్షియల్ ఛోసెన్ (2001)కి కూడా దర్శకత్వం వహించాడు.

నటించినవి

సంవత్సరం పేరు పాత్ర ఇతర వివరాలు
1993 ది వెడ్డింగ్ బాంక్వెట్ వివాహ అతిథి అతిధి పాత్ర
1998 ది క్యాండిడేట్ హ్సు గియు జింగ్ చిన్ననాటి స్నేహితుడు
2007 హాలీవుడ్ చైనీస్ డాక్యుమెంటరీ

అవార్డులు

[మార్చు]

దర్శకుడిగా తొమ్మిది అకాడమీ అవార్డులకు నామినేట్ అయిన లీ, అందులో మూడు అవార్డులను గెలుచుకున్నాడు. ఉత్తమ విదేశీ భాషా చిత్రం విభాగంలోక్రౌచింగ్ టైగర్ హిడెన్ డ్రాగన్, బ్రోక్‌బ్యాక్ మౌంటైన్, లైఫ్ ఆఫ్ పై సినిమాలకు ఉత్తమ దర్శకుడిగా అకాడమీ అవార్డులు అందుకున్నాడు. బహుమతిని గెలుచుకున్న మొదటి శ్వేతజాతీయేతర దర్శకుడిగా నిలిచాడు. ది వెడ్డింగ్ బాంకెట్, సెన్స్ అండ్ సెన్సిబిలిటీ పినిమాలకు బెర్లిన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో గోల్డెన్ బేర్‌ను గెలుచుకున్నాడు. బ్రోక్‌బ్యాక్ మౌంటైన్, లస్ట్ కాషన్ సినిమాలకు వెనిస్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో గోల్డెన్ లయన్‌ని గెలుచుకున్నాడు. గోల్డెన్ లయన్‌ని రెండుసార్లు గెలుచుకున్న నలుగురు దర్శకులలో లీ ఒకడు. రెండుసార్లు గోల్డెన్ బేర్‌ను అందుకున్న ఏకైక చిత్ర దర్శకుడిగా నిలిచాడు. లీకి డైరెక్టర్స్ గిల్డ్ ఆఫ్ అమెరికా అవార్డ్స్, గోల్డెన్ గ్లోబ్స్,[11] బ్రిటీష్ అకాడమీ ఫిల్మ్ అవార్డ్స్ అవార్డులు కూడా లభించాయి. తైవాన్ ప్రభుత్వం అందించే రెండవ అత్యున్నత పౌర పురస్కారమైన ఆర్డర్ ఆఫ్ బ్రిలియంట్ స్టార్‌ని కూడా అందుకున్నారు.[12]

2003లో ది గార్డియన్స్ 40 మంది ఉత్తమ దర్శకులలో లీ 27వ స్థానంలో నిలిచాడు.[13] 2007 ఆగస్టులో టోటల్ ఫిల్మ్ మ్యాగజైన్ పోల్‌లో లీ ఆల్ టైమ్ 41వ గొప్ప దర్శకుడిగా ఎంపికయ్యాడు.[14] 2012లో ఫ్రెంచ్ ప్రభుత్వం నుండి ఫ్రెంచ్ ఆర్డర్ డెస్ ఆర్ట్స్ ఎట్ డెస్ లెటర్స్ నైట్ ఆఫ్ ది అవార్డులను కూడా అందుకున్నాడు.[15] 2021లో నైట్ ఆఫ్ ది ఫ్రెంచ్ లెజియన్ ఆఫ్ హానర్[16][17] 2020లో అతను బ్రిటీష్ సినిమాకి అత్యుత్తమ విరాళాల కోసం బ్రిటీష్ ఫిల్మ్ ఫెలోషిప్‌ను అందుకున్నాడు.

2021 నవంబరు 30న లీ తైవాన్ ప్రెసిడెంట్ త్సాయ్ ఇంగ్-వెన్ నుండి ఆర్ట్స్ అండ్ కల్చర్ విభాగంలో ప్రెసిడెన్షియల్ కల్చర్ అవార్డును అందుకున్నారు.[18]

లీ' చిత్రాలకు వచ్చిన అవార్డులు, నామినేషన్లు
సంవత్సరం శీర్షిక అకాడమీ అవార్డులు బ్రిటీష్ ఫిల్మ్ అవార్డులు గోల్డెన్ గ్లోబ్ అవార్డులు
నామినేషన్ విజేత నామినేషన్ విజేత నామినేషన్ విజేత
1993 ది వెడ్డింగ్ బాంక్వెట్ 1 1
1994 ఈట్ డ్రింక్ మ్యాన్ వుమన్ 1 1 1
1995 సెన్స్ అండ్ సెన్సిబిలిటీ 7 1 12 3 6 2
1997 ది ఐస్ స్టార్మ్ 2 1 1
2000 క్రౌచింగ్ టైగర్, హిడెన్ డ్రాగన్ 10 4 14 4 3 2
2005 బ్రోక్ బాక్ మౌంటైన్ 8 3 9 4 7 4
2007 లస్ట్ , కాషాన్ 2 1
2012 లైఫ్ ఆఫ్ ఫై 11 4 9 2 3 1
మొత్తం 38 12 49 14 23 9

మూలాలు

[మార్చు]
  1. Williams, Sarah (20 February 2013). "'Life of Pi's Ang Lee Conquers Anti-Asian Bias". Voice of America. Retrieved 2023-06-23. Like many Asian-Americans in Hollywood's film industry, Chinese-born American film director Ang Lee struggled for acceptance early in his career.
  2. Corliss, Richard (20 November 2012). "Ang Lee's Life of Pi: Storm and Fang, Water and Wonder". Time (magazine). Retrieved 2023-06-23. The Chinese-born American director mastered the nuances of 19th-century English manners in Sense and Sensibility, set martial-artist adversaries to dancing on tree tops in Crouching Tiger, Hidden Dragon and sold the mainstream audience on the love story of two cowboys in Brokeback Mountain.
  3. "Speaking a Universal Language: Director Ang Lee". gotoread.com. Archived from the original on 5 May 2015. Retrieved 2023-06-23.
  4. "Ang Lee and His Thoughts". asian-nation.org. 28 December 2005. Retrieved 2023-06-23.
  5. Phippen, Richard (18 November 2008). "Ang Lee's Hulk - FOR (& Against)". sky.com. Archived from the original on 3 December 2013. Retrieved 2023-06-23.
  6. Ho Yi. Family and friends praise Ang Lee's quiet dedication. Taipei Times. 2023-06-23.
  7. Lipworth, Elaine (26 April 2013). "Ang Lee: My family values". The Guardian. ISSN 0261-3077. Retrieved 2023-06-23.
  8. Wei Ming Dariotis, Eileen Fung, "Breaking the Soy Sauce Jar: Diaspora and Displacement in the Films of Ang Lee," in Hsiao-peng Lu, ed., Transnational Chinese Cinemas: Identity, Nationhood, Gender (Honolulu: University of Hawaiʻi Press, 1997), p. 242.
  9. "The Western look Ang Lee: everywhere, nor sets traces". best-news.us. 12 March 2013. Archived from the original on 5 November 2013. Retrieved 2023-06-23.
  10. "Kevin Kline, Ang Lee, and Sigourney Weaver on "The Ice Storm"". filmscouts.com. 4 June 2010. Archived from the original on 25 February 2010. Retrieved 2023-06-23.
  11. "Life of Pi - film that transcends global emotions". The Times of India. 27 September 2012. Archived from the original on 13 November 2013. Retrieved 2023-06-23.
  12. AFP (10 May 2013). "Oscar-winning Ang Lee receives Taiwan medal". The Bangkok Post.
  13. "40 best directors | Features | guardian.co.uk Film". www.theguardian.com. Archived from the original on 29 June 2019. Retrieved 2023-06-23.
  14. Film, Total (5 March 2010). "Greatest Directors Ever – Part 2". TotalFilm.com. Archived from the original on 10 April 2014. Retrieved 2023-06-23.
  15. AFP (27 November 2012). "Les Arts et Lettres pour Emmanuelle Béart et Ang Lee". lefigaro.fr. Retrieved 2023-06-23.
  16. "Le réalisateur taïwanais Ang Lee fait Chevalier de la Légion d'honneur par la France". taiwaninfo.nat.gov.tw. 5 February 2021. Retrieved 2023-06-23.
  17. "Taiwan director Ang Lee conferred with France's highest distinction". Taiwan news. 4 February 2021. Retrieved 2023-06-23.
  18. "Ang Lee receives Presidential Culture Award - Focus Taiwan". focustaiwan.tw. Retrieved 2023-06-23.

బయటి లింకులు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=అంగ్_లీ&oldid=3921344" నుండి వెలికితీశారు