అంజనం (మంత్ర-తంత్ర విద్య)
అంజనం అంటే కాటుక అని సాధారణ అర్థం. ఇంకొక అర్ధంలో దూరంగా ఉన్న వస్తువులనో, వ్యక్తులనో ఉన్నచోటనే ఉండి చూడటానికి అవకాశం కలిగించే ఒక మంత్ర/ తంత్ర విద్య. దీనిని తెలుగు పాత సినిమాలలో చూడవచ్చు.[1] ఎక్కడో జరుగుతున్న సంఘటనల గురించి గానీ, జరిగినవీ, జరగబోయేవీ సంఘటనల గురించి గానీ దృశ్యరూపంగా చూపించే పద్ధతిని అంజనం వేయడం అంటారు. క్రిస్టల్ గేజింగ్ అంటే ఒక గాజు గోళం (క్రిస్టల్) లో చూడదలచుకొన్న దృశ్యాలను చూడటం. పాశ్చాత్యదేశాలలోనూ, ఆఫ్రికా ఖండంలోనూ, ముఖ్యంగా ఈజిప్టులో, ఈ విద్య గురించి చాలా చోట్ల మాట్లాడు కొంటారు. ఐతే ఎవరికైనా క్రిస్టల్‌లో చూడదలచుకొన్న దృశ్యాలను చూపించిన దాఖలాలు లేవు. గోళంలో ఎవరైనా ఒక వ్యక్తి తనకు ఫలానా దృశ్యం కనిపిస్తున్నదంటే అది అతడి అనుభవం మాత్రమే. టీవీలో మాదిరి గాజు గోళంలో చుట్టూ కూర్చున్నవారందరూ దృశ్యాలను చూడటం సాధ్యం కాదు. కానీ, అలా చూసి చెప్పినవారి మాటలు నిజమైన సందర్భాలు ఉన్నాయి.
తెలుగు పల్లెల్లో
[మార్చు]తెలుగునాట పల్లెల్లో అంజనం వేసి తప్పిపోయిన తమ పశువులను కనుగొనేవారు. ఇప్పుడు ఈ ప్రక్రియ అంత వాడుకలో లేదు కాని, గతంలో ఎక్కువగా వుండేది. దీని ప్రక్రారం.... ఒక తమలపాకును తీసుకొని దాని మధ్యలో ఒక నల్లని చుక్కని పెట్టి... ఒక చిన్న పిల్లవాన్ని పిలిచి ఆ చుక్కను తదేకం కొంత సేపు చూడ మంటాడు అంజనం వేసే నిర్వహుకుడు. ఆ బాలుడు తదేకంగా ఆ చుక్క వైపు చూస్తుండగా నిర్వాహకుడు ... ఆ బాలుని ఉద్దేశించి..... ఆ తెల్ల మచ్చల నల్లావు కనిపించిందా..... అని రెండు మూడు సార్లు అంటుంటాడు..... దానికి ఆ పిల్లవాడు.... ఆ కనిపించింది..... అనగానే.... అది ఏదిక్కున ఉంది..... ఎంత దూరంలో ఉంది... అంటు ఆ ఆవు రూపు రేఖలను కొంత వరకు చెప్పి అడుగుతుంటాడు. దానికి ఆ బాలుడు... దాని కొమ్ములు ఇలా ఉన్నాయి.... అలా ఉన్నాయి.... అంటు దాని రూపు రేఖలు వర్ణిస్తాడు... దాంతో ఆవు యజమాని తన ఆవు గుర్తులను సరి పోల్చుకొని ...... ఆ.... అదే.... ఏదిక్కున వున్నది .... ఎంత దూరంలో వున్నది అని అడుగుతాడు. దానికి ఆ పిల్లావాడు... పలాన దిక్కులో ఎంత దూరంలో వున్నదో చెప్పుతాడు... ఆ సమాచారంతో యజమాని ఆదిక్కుకు వెళ్ళి తన ఆవుని తోలుకొని వస్తాడు. చాల వరకు ఇటువంటివి నిజమయ్యేవి.
మూలాలు
[మార్చు]- ↑ "ఆంధ్రభారతి.కాం లో అంజనం అన్వేషణకు పారమార్థిక పదకోశం (పొత్తూరి వేంకటేశ్వరరావు) 2010 నుండి". Archived from the original on 2014-02-09. Retrieved 2014-01-31.