అంజలి సిబిఐ
స్వరూపం
అంజలి సిబిఐ | |
---|---|
దర్శకత్వం | ఆర్. అజయ్ జ్ఞానముత్తు |
రచన | ఆర్. అజయ్ జ్ఞానముత్తు |
నిర్మాత | సీజే జయకుమార్, సిహెచ్ రాంబాబు |
తారాగణం | నయనతార విజయ్ సేతుపతి రాశి ఖన్నా అథర్వ మురళీ అనురాగ్ కశ్యప్ |
ఛాయాగ్రహణం | ఆర్.డి.రాజశేఖర్ |
కూర్పు | భువన్ శ్రీనివాసన్ |
సంగీతం | హిప్హాప్ తమిజా |
నిర్మాణ సంస్థ | విశ్వశాంతి పిక్చర్స్ |
విడుదల తేదీ | 22 ఫిబ్రవరి 2019 |
సినిమా నిడివి | 170 నిముషాలు |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
అంజలి సిబిఐ 2019లో తెలుగులో విడుదలైన సినిమా.తమిళంలో 2018లో విడుదలైన ఇమైక్క నోడిగల్ సినిమాను తెలుగులోకి డబ్బింగ్ చేసి రిలీజ్ చేశారు. విశ్వశాంతి పిక్చర్స్ బ్యానర్ పై సీజే జయకుమార్, సిహెచ్ రాంబాబు నిర్మించిన ఈ చిత్రానికి ఆర్. అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలో నయనతార , విజయ్ సేతుపతి, రాశి ఖన్నా, అథర్వ మురళీ, అనురాగ్ కశ్యప్ ముఖ్య పాత్రల్లో నటించారు.[1] ఈ సినిమా 22 ఫిబ్రవరి 2019న విడుదలైంది.[2][3]
కథ
[మార్చు]సైకో కిల్లర్ రుద్ర (అనురాగ్ కశ్యప్) వరుస హత్యలు చేస్తూ సిబిఐ కి సవాలుగా మారుతాడు. ఈ కేసు సిబిఐ ఆఫీసర్ అంజలి(నయనతార) హ్యాండిల్ చేస్తుంది. ఈ క్రమంలో రుద్ర సిబిఐ కి చెప్పి మరి హత్యలు చేస్తుంటాడు. ఇంతకీ ఈ రుద్ర ఎవరు? అతను సైకో కిల్లర్ గా మారడానికి అంజలి ఎలా కారణం అవుతుంది? చివరికి అంజలి సిబిఐ, రుద్ర ను పట్టుకుందా లేదా అనేదే మిగతా సినిమా కథ.
నటీనటులు
[మార్చు]- నయనతార
- విజయ్ సేతుపతి
- రాశి ఖన్నా
- అథర్వ మురళీ
- అనురాగ్ కశ్యప్
- దేవన్
- జీవా రవి
సాంకేతిక నిపుణులు
[మార్చు]- బ్యానర్: విశ్వశాంతి పిక్చర్స్
- నిర్మాతలు: సీజే జయకుమార్, సిహెచ్ రాంబాబు
- దర్శకత్వం: ఆర్. అజయ్ జ్ఞానముత్తు
- సంగీతం : హిప్ హాప్ తమిళ
- సినిమాటోగ్రఫీ : ఆర్.డి.రాజశేఖర్
మూలాలు
[మార్చు]- ↑ The Times of India. "Nayanthara's psychological-thriller 'Imaikkaa Nodigal' as 'Anjali CBI Officer' in Telugu - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Archived from the original on 17 జూన్ 2021. Retrieved 17 June 2021.
- ↑ Telangana Today (18 February 2019). "Anjali CBI gearing up for Feb 22 release". archive.telanganatoday.com. Archived from the original on 17 జూన్ 2021. Retrieved 17 June 2021.
- ↑ Mana Telangana (17 February 2019). "నయనతార కెరీర్‌లో బెస్ట్ సినిమా 'అంజలి సిబిఐ'". Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News. Archived from the original on 17 జూన్ 2021. Retrieved 17 June 2021.