అంజలి (టెలివిజన్ నటి)
స్వరూపం
అంజలి | |
---|---|
జననం | అంజలి |
వృత్తి | టెలివిజన్ నటి |
జీవిత భాగస్వామి | సంతోష్ పవన్[1] |
అంజలి తెలుగు టెలివిజన్ నటి. మొగలిరేకులు, రాధా-మధు, రాధాకళ్యాణం, కృష్ణావతారాలు, అమృతం, దేవత, మమతల కోవెల వంటి సుమారు యాభై ధారావాహికల్లో నటించింది.
జననం - విద్యాభ్యాసం
[మార్చు]అంజలి పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు లోని వ్యవసాయ కుటుంబంలో జన్మించింది. డిగ్రీ వరకు చదువుకుంది.
కళారంగం
[మార్చు]పదో తరగతి సెలవుల్లో హైదరాబాద్ లోని బంధువుల ఇంటికి వచ్చిన అంజలి, ఆ ఇంటి పక్కన ఉన్న వ్యక్తి సహాయంతో ఒక భక్తి సీరియల్ నటించింది. ఇంటర్ చదువుతున్న సమయంలో రెండేళ్లపాటు 'కళాంజలి' దుస్తులకు మోడలింగ్ చేసింది.[2] అంజలి మొదటి ధారావాహిక రాధా-మధు అయునా, మొగలిరేకులు ధారావాహిక ద్వారా గుర్తింపు వచ్చింది.[3] అది చూసిన శివాజీ రాజా తన సంబరాల రాంబాబు ధారావాహికలో నటించే అవకాశం ఇచ్చారు.
నటించిన ధారావాహికలు
[మార్చు]- సంబరాల రాంబాబు
- రాధా-మధు
- మొగలిరేకులు
- రాధాకళ్యాణం
- కృష్ణావతారాలు
- అమృతం
- దేవత
- మమతల కోవెల
- మహాలక్ష్మీ
- అగ్నిపూలు
వ్యాఖ్యాతగా
[మార్చు]- నేడే చూడండి
- ఆహా... ఏమి రుచి
- ఆలీ 369
- స్టార్ మహిళ
- మోడ్రన్ మహాలక్ష్మీ
- రంగం
- భలేఛాన్సులే
మూలాలు
[మార్చు]- ↑ సాక్షి. "బుల్లితెర నటి అంజలి వివాహం". Retrieved 28 June 2017.
- ↑ టాలీవుడ్ ఫోటో ప్రొఫైల్స్. "Anjali TV artist,అంజలి టి.వి నటి". tollywoodphotoprofiles.blogspot.in. Archived from the original on 19 మార్చి 2017. Retrieved 28 June 2017.
- ↑ నెట్ టీవి ఫర్ యూ. "Anjali Elsa". www.nettv4u.com. Retrieved 28 June 2017.