అంటుకట్టుట

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మామిడి చెట్టు కొమ్మలలో ఒకటి నాటు మామిడి కాయలు కాయగా, మరొకటి బంగినపల్లి మామిడి కాయలు కాస్తుంది, వీటిలో బంగినపల్లి మామిడి కాయలు కాసే కొమ్మ సియాన్ కొమ్మ.

అంటుకట్టుటను ఆంగ్లంలో గ్రాఫ్టింగ్ లేక గ్రాఫ్‍టేజ్ అంటారు. అంటుకట్టడం అనేది తోటపనికి సంబంధించిన సాంకేతిక పరిజ్ఞానం (హార్టికల్చరల్ టెక్నిక్), అనగా ఒక మొక్క కణజాలముతో, మరొక మొక్క నాడీ కణజాలము కలసేలా అమర్చటం. ఈ నాడి కలయికను (వాస్కులర్ జాయినింగ్) inosculation అంటారు. ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని అలైంగిక పద్ధతిలో, సాధారణంగా హార్టికల్చర్, వ్యవసాయ సంబంధిత మొక్కలను వాణిజ్యపరంగా వ్యాప్తి చేయడానికి ఉపయోగిస్తారు. చాలా సందర్భాలలో, ఒక మొక్కను ఆ మొక్క యొక్క వేర్ల తోటి ఎంపిక చేస్తారు, ఈ విధంగా ఎంపిక చేసిన ఈ మొక్కను (మొక్క యొక్క భాగాన్ని) కాండం లేదా వేరు కాండం అంటారు. మరొక మొక్క ఎంపికను (మొక్క యొక్క భాగాన్ని) ఆ మొక్క యొక్క కాండం, కొమ్మలు, ఆకులు, పువ్వులు, లేదా పండ్లతో కూడిన భాగాలను ఎంపిక చేస్తారు, ఈ విధంగా ఎంపిక చేయబడిన భాగాన్ని సియాన్ లేదా సియోన్ అంటారు, ఈ సియాను అంటు మొక్క పై భాగాన ఉంటుంది. ఈ అంటు మొక్క కింది భాగం వేరే జన్యువులతో కూడిన భాగంతో ఉన్నను పై భాగాన ఉన్న సియాన్ మొక్క (నకిలీ మొక్క) ఏ జన్యువులతో కూడి ఉంటుందో ఆ జన్యు సంబంధిత ఉత్పత్తిని భవిష్యత్తులో ఈ అంటుమొక్క అందిస్తుంది.

ఇవి కూడా చూడండి

[మార్చు]

చిత్రమాలిక

[మార్చు]

బయటి లింకులు

[మార్చు]