Jump to content

అండకోశం

వికీపీడియా నుండి
(అండకోశము నుండి దారిమార్పు చెందింది)
అండకోశం

పుష్పం ఆవశ్యకాంగాలలో అండకోశం ఒకటి. దీనిని పుష్పం యొక్క స్త్రీ భాగంగా పరిగణిస్తారు. అండకోశం పదాన్ని 'గైనొసియమ్' (గ్రీకు పదాలైన గైనికోస్ ఒఇకియా : ల నుండి ఏర్పడింది. దీని అర్ధం ఆడ నివాసం అని) అనే గ్రీకు పదానికి సమానార్థకంగా స్వీకరించారు. పుష్పంలో అండకోశాన్ని స్త్రీ ప్రత్యుత్పత్తి భాగంగా భావించినట్లుగానే, కేసరావళిని పురుష ప్రత్యుత్పత్తి భాగంగా పరిగణిస్తారు. ఒక పుష్పంలో ఈ రెండు భాగాలు ఉండవచ్చు. లేదా ఏదో ఒక భాగం ఉండవచ్చు. రెండు భాగాలు ఉంటే ఆ పుష్పాన్ని ద్విలింగపుష్పమని, ఏదో ఒక భాగం ఉంటే ఏకలింగ పుష్పాలని పిలుస్తారు[1] పుష్పం ఒకటి లేక రెండు అండ కోశాలను కలిగి ఉంటుంది. ఒక పుష్పం ఒక అండకోశికను కలిగి ఉంటే ఆ పుష్పాన్ని ఎపో కార్పస్ అని పిలుస్తారు.అండకోశం అనేక అండకోశికలను సామూహికంగా కలిపి ఉంచుతుంది.అండకోశము తాలూకు జిగురుగా ఉన్న చివర, పుష్ప కాండము పుప్పొడిని తీసుకునేదిగా ఉంటుంది. దానికి మద్దతుగా ఉన్న తొడిమ, కీలం, పుప్పొడి నాళాలుగా పెరిగి పుప్పొడి రేణువులను పుష్ప కాండానికి అంటుకునేటట్టుగా చేస్తాయి, అండాలకు పునరుత్పత్తి సరుకుగా మోయబడతాయి. ఫలవంతం కాని అండకోశాన్ని వ్యంధ్య అండకోశం అని అంటారు. అండకోశంలో మూడు భాగాలు ఉంటాయి. అవి 1. అండాశయం, 2. కీలం, 3. కీలాగ్రం

అండాశయం

[మార్చు]

ప్రధాన వ్యాసం:అండాశయం (మొక్కలు)

అండాశయాలు-రకాలు

ఇది అండకోశ పీఠభాగంలో ఉండిన ఉబ్బిన పెట్టె వంటి నిర్మాణం. దీనిలో ఉబ్బెత్తుగా ఉండే ప్రత్యేక స్థానాలు అండాలను భరిస్తాయి. ఈ ప్రత్యేక స్థానాన్ని అండన్యాస స్థానం అని అంటారు. ఈ స్థానంలో అండాలు ఉండు గదిని బిలం అని పిలుస్తారు. పుష్పభాగాలతో సాపేక్షంగా అండాశయం ఆక్రమించే స్థానాన్ని బట్టి అండాశయాలు మూడు రకాలు. అవి 1. ఊర్ధ్వ అండాశయం, 2. నిమ్న అండాశయం, 3. అర్ధనిమ్న అండాశయం.

ఊర్ధ్వ అండాశయం

[మార్చు]

అండకోశాదస్థిత పుష్పాలలో ఈ రకమైన అండాశయం ఉంటుంది.

నిమ్న అండాశయం

[మార్చు]

అండకోశోపరిస్థిత పుష్పాలలో ఈ రకమైన అండాశయం ఉంటుంది.

అర్ధనిమ్న అండాశయం.

[మార్చు]

పర్యండకోశ పుష్పాలలో ఈ రకమైన అండాశయం ఉంటుంది.

కీలం

[మార్చు]

అండాశయం అగ్రభాగంలో ఉండే సన్నని కాడ వంటి భాగాన్ని కీలం అంటారు. అమరి ఉండిన విధానాన్ని భట్టి ఇది మూడు రకాలు. 1. అగ్రకీలం, 2. పార్శ్వకీలం, 3.అండకోశపీఠకీలం.

కీలాగ్రం

[మార్చు]

పరాగరేణువులను స్వీకరించే కీలం అగ్రభాగాన్ని 'కీలాగ్రం' అని అంటారు. ఈ కీలాగ్రం శీర్షాకారంగానో, తమ్మెలుగానో, ఈకలు గానో ఉంటుంది.

ఫలదళాలు

[మార్చు]

అండకోశంలో ఫలదళాలు ఉంటాయి. ఈ ఫలదళాల సంఖ్య ఒకటి నుండి ఎన్నైనా ఉండవచ్చు. ఫలదళాల సంఖ్య ఆధారంగా అండకోశాన్ని ఏకఫలదళయుత అండకోశం (ఉదా:డాలికస్) , ద్విఫలదళయుత అండకోశం (ఉదా:వంకాయ), త్రిఫలదళయుత అండకోశం (ఉదా: ఉల్లి), పంచఫలదళయుత అండకోశం (ఉదా:మందార, బహుఫలదళయుత అండకోశం (ఉదా:అనోనా) అని వర్ణిస్తారు. ఈ ఫలదళాలు అసంయుక్తంగా, సంయుక్తంగా, పాక్షి సంయుక్తంగా గాని ఉండవచ్చు.

ఇవి కూడా చూడండి

[మార్చు]

బయటి లింకులు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2014-02-23. Retrieved 2020-03-28.
"https://te.wikipedia.org/w/index.php?title=అండకోశం&oldid=3103151" నుండి వెలికితీశారు