అండాశయపు తిత్తులు
అండాశయపు తిత్తులు | |
---|---|
చాలా వరకు ఫోలిక్యులర్ మూలం ఉన్న సాధారణ అండాశయ తిత్తి | |
ప్రత్యేకత | గైనకాలజీ |
లక్షణాలు | సాధారణంగా ఎటువంటి లక్షణాలను కలిగించవు. అప్పుడప్పుడు ఉబ్బరం, పొత్తికడుపు నొప్పి లేదా వెన్నునొప్పి ఉంటాయి. |
సంక్లిష్టతలు | తిత్తి పగిలి పోవడం లేదా అండాశయం మెలితిప్పడం (టొర్షన్) వలన, తీవ్రమైన నొప్పి. ఇంకా వాంతులు లేదా తెలివితప్పిపోయే అనుభూతి ఉండవచ్చు |
రకాలు | ఫోలిక్యులర్ సిస్ట్,కార్పస్ లూటియం సిస్ట్, ఎండోమెట్రియోసిస్ కారణంగా ఏర్పడే తిత్తులు, డెర్మోయిడ్ సిస్ట్, సిస్టాడెనోమా, అండాశయ క్యాన్సర్ |
రోగనిర్ధారణ పద్ధతి | అల్ట్రాసౌండ్ లేదా ఇతర పరీక్షలతో పాటు , కటి పరీక్ష |
చికిత్స | సాధారణ నిర్వహణ, నొప్పి నివారణ మందులు, శస్త్ర చికిత్స |
ఔషధం | పారాసెటమాల్ (ఎసిటమైనోఫెన్) లేదా ఇబుప్రోఫెన్ వంటి నొప్పి నివారణ మందులు |
రోగ నిరూపణ | సాధారణంగా సమస్య ఉండదు |
తరుచుదనము | రుతువిరతి ముందు సుమారు 8% మందిలో |
అండాశయ తిత్తి అనేది అండాశయం లోపల ద్రవంతో నిండిన సంచి. సాధారణంగా అవి ఎటువంటి లక్షణాలను కలిగించవు. అప్పుడప్పుడు అవి ఉబ్బరం, పొత్తికడుపు నొప్పి లేదా వెన్నునొప్పిని కలిగించవచ్చు. చాలా వరకు తిత్తులు ప్రమాదకరం కాదు. తిత్తి పగిలి పోవడం లేదా అండాశయం మెలితిప్పడం (టొర్షన్) వలన, అది తీవ్రమైన నొప్పిని ఇంకా వాంతులు లేదా తెలివితప్పిపోయే అనుభూతిని కలిగించవచ్చు .[1]
కారణాలు
[మార్చు]చాలా అండాశయ తిత్తులు అండోత్సర్గానికి (అండోత్పాదన) సంబంధించినవి, అవి ఫోలిక్యులర్ తిత్తులు లేదా కార్పస్ లూటియం తిత్తులు. ఇతర రకాలలో ఎండోమెట్రియోసిస్, డెర్మాయిడ్ తిత్తులు (అంటే చర్మం, వెంట్రుకల ఫోలికల్స్, స్వేద గ్రంధులను ఇంకా పొడవాటి జుట్టు బుడిపెలు కలిగి ఉండేవి), సిస్టడెనోమాస్ (గ్రంధుల నుంచి ఎపిథీలియం మీద ఏర్పడిన కణితులు) కారణంగా తిత్తులు ఉంటాయి. పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ (పిసిఒఎస్- PCOS ) లో రెండు అండాశయాలలోను అనేక చిన్న తిత్తులు ఏర్పడతాయి. కటి శోథ వ్యాధి కూడా తిత్తులకు దారితీయవచ్చు . అరుదుగా, తిత్తులు అండాశయ క్యాన్సర్ కి ఒక సంకేతం కావచ్చు.[1]
చికిత్స
[మార్చు]ఈ వివరాలను సేకరించడానికి ఉపయోగించే అల్ట్రాసౌండ్ లేదా ఇతర పరీక్షలతో, కటి పరీక్ష ద్వారా రోగ నిర్ధారణ జరుగుతుంది. తరచుగా, తిత్తులు కాలక్రమేణా గమనించుతారు. అవి నొప్పిని కలిగిస్తే, పారాసెటమాల్ (ఎసిటమైనోఫెన్) లేదా ఇబుప్రోఫెన్ వంటి మందులను ఉపయోగించుతారు. తరచుగా ఈ లక్షణాలు ఏర్పడే వారిలో మరింత ఎక్కువగా తిత్తులు నివారించడానికి హార్మోన్ల గర్భ నియంత్రణ విధానం (అంటే హార్మోన్లు ఉపయోగించడం ద్వారా గర్భ నిరోధం) అనుసరిస్తారు.[1] అయితే దీనికి ఆధారాలు లేవు.[2] అవి చాలా కాలం తర్వాత కూడా పోకపోతే, పెద్దవిగా మారితే, అసాధారణంగా కనిపిస్తే లేదా నొప్పిని కలిగిస్తే, వాటిని శస్త్రచికిత్స ద్వారా తొలగించుతారు.[1]
ప్రాబల్యం
[మార్చు]పునరుత్పత్తి వయస్సు గల చాలా మంది మహిళలలో ప్రతి నెలా చిన్న తిత్తులు ఏర్పడుతూనే ఉంటాయి. ఋతువిరతి ముందు సుమారు 8% మంది మహిళల్లో సమస్యలను కలిగించే పెద్ద తిత్తులు సంభవిస్తాయి.[1] ఋతువిరతి తర్వాత సుమారు 16% మంది మహిళల్లో అండాశయ తిత్తులు ఉంటాయి, ఇవి ఉంటే క్యాన్సర్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది.[1][3]