పారాసిటమాల్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పారాసిటమాల్
వ్యవస్థాత్మక (IUPAC) పేరు
N-(4-hydroxyphenyl)ethanamide
Clinical data
లైసెన్స్ సమాచారము US FDA:link
ప్రెగ్నన్సీ వర్గం A (AU) B (US) safe
చట్టపరమైన స్థితి Unscheduled (AU) GSL (UK) OTC (US)
Routes Oral, rectal, intravenous
Pharmacokinetic data
Bioavailability almost 100%
మెటాబాలిజం 90 to 95% Hepatic
అర్థ జీవిత కాలం 1–4 h
Excretion Renal
Identifiers
CAS number 103-90-2
ATC code N02BE01
PubChem CID 1983
DrugBank APRD00252
ChemSpider 1906
Chemical data
Formula C8H9NO2 
Mol. mass 151.17 g/mol
Physical data
Density 1.263 g/cm3 g/cm³
Melt. point 168 °C (334 °F)
Solubility in water 14 mg/mL (25 °C) mg/mL (20 °C)
 ☑Y (what is this?)  (verify)

పారాసెటమాల్ (INN) ([1]) లేదా ఎసిటమైనోఫేన్ ([2]) (USAN) విస్త్రుతంగా వాడబడుతున్న ఒక ఓవర్-ది-కౌంటర్ అనల్జసిక్ (నొప్పి నివారిణి) మరియు యాంటీ పైరటిక్ (జ్వరము తగ్గించేది). దీన్ని సాధారణముగా జ్వరము, తలనొప్పి మరియు ఇతర చిన్న నొప్పులకు, పోటులకి వాడుతారు. ఇది అనేక జలుబు మరియు ఫ్లూ మందులు తయారీలో చేర్చబడుతున్న ఒక ముఖ్య పదార్ధము. శస్త్ర చికిత్స అనంతరం ఏర్పడే నొప్పి వంటి తీవ్రమైన నొప్పులని నివారించడానికి కూడా పారాసెటమాల్ ని స్టీరాయ్ద్ కాని వాపు తగ్గించే మందులతో (NSAIDలు) మరియు ఒపియాయ్ద్ అనాల్జేసిక్ లతో కలిపి వాడుతారు.[1]

పారాసిటమాల్

సిఫార్సు చేయబడిన మోతాదులో (1000 mg ఒక మోతాదుకి చొప్పున పెద్దవాళ్ళకి రోజుకి 4000 mg వరకు, మద్యం తాగే వాళ్ళకయితే రోజుకి 2000 mg వరకు[2]) వాడినప్పుడు మానవులకి సురక్షితమే. కాని పారాసెటమాల్ ని స్వల్పవ్యవధిలో మితిమీరిన మోతాదులో వాడినప్పుడు కాలేయానికి ప్రాణాంతకమైన రీతిలో హాని ఏర్పడే అవకాశము ఉంటుంది. అరుదుగా కొంత మందికి సాధారణ మోతాదుతోనే ఈ హాని కలగొచ్చు; మద్యం సేవించడము వల్ల ఈ ఆపద పెరుగుతుంది. పాశ్చాత్ట్స్, యునైటెడ్ కింగ్డం, ఆస్ట్రేలియా మరియు న్యు జీలాండ్ దేశాలలో ఎక్కువ మోతాదులో వాడబడే మందులలో పారాసెటమాల్ అగ్ర స్థానములో ఉంది.[3][4][5][6]

పారాసెటమాల్ ను బొగ్గు తారు నుండి తయారు చేస్తారు. ఇది "ఎనిలైన్ ఎనాల్జెసిక్స్" అనే వర్గానికి చెందిన మందు; ఇటువంటి మందులలో ఇది మాత్రమే ఈనాటికి కూడా ఉపయోగములో ఉంది.[7] ఒకప్పుడు అనాల్జేసిక్ గానూ యాంటిపైరేటిక్ గానూ ప్రసిద్ధి చెందిన ఫేనసేటిన్లో పారాసెటమాల్ యాక్టివ్ మెటాబోలైట్ గా ఉంది. అయితే ఫేనసేటిన్ మరియు వాటి మిశ్రమాలు లాగ కాకుండా పారాసెటమాల్ చికిత్సకు సరిపడిన మోతాదులో కేన్సరు కలిగించదని భావిస్తున్నారు.[8] అసిటామినోఫెన్ (యునైటెడ్ స్టేట్స్, కేనడా, హాంగ్ కాంగ్ మరియు ఇరాన్ దేశాలలో వాడబడుతున్న పదం[9]) మరియు పారాసెటమాల్ (ఇతర దేశాలలో వాడబడుతున్న పదం) అనే రెండు పదాలు ఈ పదార్ధము యొక్క రసాయన పేర్ల నుండి వచ్చింది; పారా -ఎసిటై ల్ ఎమైనోఫేనాల్ మరియు పారా -ఎసేటై ల్ ఎమైనోఫెన్. కొన్ని సంధర్భాలలో దీన్ని N- సేటైల్- ఆరా- మినోఫే నోల్ లేదా APAP గా సంక్షిప్తం చేయబడుతుంది.

చరిత్ర[మార్చు]

ఎసిటానిలైడ్ అనాల్జేసిక్ మరియు యాంటిపైరేటిక్ గుణాలతో కూడిన అనిలిన్ నుండి ఉత్పన్నమైన మొదటి మందు. దీన్ని త్వరగతిలో యాంటిఫెబ్రిన్ అనే పేరుతో 1886 లో ఎ.కాన్ మరియు పి.హెప్ వైద్య వృత్తిలో ప్రవేశపెట్టారు.[10] అయితే దీనికి మిథిమోగ్లోబినేమియా వల్ల ఏర్పడే సైనోసిస్ వంటి అత్యంత భయంగొలిపే, ఆమోదయోగ్యం కాని దుష్ట ప్రభావం ఉన్నందున, దానికంటే తక్కువ విషమ ప్రభావం కలిగిన ఎనిలిన్ నుండి ఉత్పన్నమైన మందులని కనుగొనటానికి అన్వేషణ మొదలైంది.[7] అప్పడికే హార్మన్ నోర్త్రాప్ మోర్స్ పారాసెటమాల్ ని జాన్స్ హాప్కిన్స్ విశ్వవిద్యాలయంలో తయారు చేశారు. దీనికి p -నైట్రోఫేనాల్ని గ్లేషియల్ ఎసిటిక్ ఆమ్లము లోని టిన్తో కలిపి క్షయకరణం చేసే పద్ధతిని 1877లో వాడారు.[11][12] అయితే, 1887లోనే తొలిసారిగా పారాసెటమాల్ ని క్లినికల్ ఫార్మకాలజిస్ట్ జోసెఫ్ వాన్ మేరింగ్ రోగులమీద ప్రయోగం చేశారు.[7] పారాసెటమాల్ ను, మరొక ఎనిలిన్ నుండి ఉత్పన్నమైన ఫేనాసిటిన్ ను, వైద్యంగా వాడటం గురించిన ఒక పరిశోధన పత్రాన్ని వాన్ మేరింగ్ 1893లో ప్రచురణ చేశారు.[13] ఫెనాసిటిన్ మాదిరిగా కాకుండా పారాసెటమాల్ కి మిథేమోగ్లోబినేమియాని ఉత్పన్నం చేసే ధోరణి కొంత ఉందని వాన్ మేరింగ్ పేర్కొన్నారు. వెంటనే పారాసెటమాల్ ని వాడటం ఆపి, ఫేనాసిటిన్ ని వాడటం మొదలుపెట్టారు. ఫేనాసిటిన్ అమ్మకంతో బేయర్ ఒక పెద్ద మందుల సంస్థగా పేరు పొందింది.[14] 1899లో హేయిన్రిచ్ డ్రేసేర్ చే ప్రవేశపెట్టబడిన యాస్పిరిన్ప్రభావం వల్ల కొంత మేరకు వెనకబడినా, ఫెనాసిటిన్ చాల దశాబ్దాలు వరకు జనసమ్మతమైన మందుగా ఉండేది. ముఖ్యంగా, విస్త్రుతంగా ప్రచారం చేయబడిన ఫెనాసిటిన్, యాస్పిరిన్లేదా ఒక అమినోపైరిన్ వ్యుత్పన్నం, కేఫీన్ మరియు కొన్ని సార్లు బార్బిట్యురేట్తో కూడిన ఓవర్-ది-కౌంటర్ "తలనొప్పి మిశ్రమాల"లో వాడబడింది.[7]

వాన్ మేరింగ్ పేర్కొన్న విషయాన్ని అర్ధ శతాబ్దం వరకు ఎవరు ఎదురించలేదు. తరువాత యునైటెడ్ స్టేట్స్ కు చెందిన రెండు పరిశోధనా బృందాలు ఎసిటెనలైడ్ మరియు పారాసెటమాల్ యొక్క జీవనప్రక్రియని పరిశీలించారు.[14] మానవ రక్తములో ఉన్న ఎసిటనలైడ్ యొక్క ముఖ్యమైన మెటాబోలైట్ పారాసెటమాల్ అని, 1947లో డేవిడ్ లెస్టర్ మరియు లియాన్ గ్రీన్బెర్గ్ ఆధారాలు చూపారు. తరువాత ఒక పరిశోధనలో అల్బినో ఎలుకలకి పెద్ద మోతాదులో పారాసెటమాల్ ఇచ్చినప్పుడు మిథేమోగ్లోబినేమియా ఏర్పడలేదని పేర్కొన్నారు.[15] సెప్టెంబర్ 1948లో జర్నల్ అఫ్ ఫార్మకాలజీ అండ్ ఏక్ష్పెరిమెన్టల్ థేరపెటిక్స్ లో ప్రచురించబడిన మూడు పరిశోధన పత్రాలలో బెర్నార్డ్ బ్రోడీ, జూలియస్ ఆక్షెల్రాడ్ మరియు ఫ్రెడరిక్ ఫ్లిన్ ముగ్గురూ, నిర్ణీతమైన పద్ధతులు ద్వారా మానవ రక్తములో ఉన్న ఎసిటనలైడ్ యొక్క ముఖ్యమైన మెటాబోలైట్ పారాసెటమాల్ అని మరియు అది దాని పూర్వగామి మాదిరిగానే నొప్పినివారణకు సమర్ధ ఫలితాలు ఇస్తుందని నిర్ధారించారు.[16][17][18] ముఖ్యంగా ఫేనైల్ హైడ్రాక్సైల్ ఎమైన్ అనే మరొక మెటాబోలైట్ మానవులలో మిథేమొగ్లోబినేమియాకు ముఖ్య కారణం అని కూడా వారు సూచించారు. 1949లో బ్రాడీ మరియు ఆక్సెల్రాడ్ దీన్ని అనుసరించి విడుదల చేసిన మరొక పరిశోధనా పత్రములో, ఫెనాసిటిన్ కూడా పారాసెటమాల్ గా జీవప్రక్రియ అవుతుందని నిర్ధారించారు.[19] దీనివల్ల పారాసెటమాల్ "మరల కనిపెట్టబడింది".[7] పారాసెటమాల్ ని వాన్ మేరింగ్ 4-అమినోఫేనాల్ నుండి తయారు చేసినప్పుడు అది 4-ఎమినోఫేనాల్తో కల్తీ అయి ఉండవచ్చునని అదే అతని తప్పు ఫలితాలకి కారణమయి ఉండవచ్చునని సూచించారు.

బెర్నార్డ్ బ్రోడీ మరియు జూలియస్ అక్సేల్రోడ్ (చిత్రీకరించారు) ఎసిటెనలైడ్ మరియు ఫినేసేటిన్ రెండూ పారాసెటమోల్ గా జీవప్రక్రియ ద్వారా మార్పు చెందినట్లు ప్రదర్శింపబడి, ఒక నొప్పినివారిణిగా మరింత బాగా ఇముడుతుంది.

పారాసెటమాల్ మొదటి సారిగా యునైటెడ్ స్టేట్స్ లో 1953 సంవత్సరమున స్టెర్లింగ్-విన్త్రోప్ కో. చే విక్రయించబడింది. ఇది అస్పిరిన్ కంటే మేలని, ఇది పిల్లలకు మరియు కడుపులో పుండ్లు ఉన్నవారికి సురక్షితమని ప్రచారం చేశారు.[14] యునైటెడ్ స్టేట్స్ లో ప్రస్తుతం ప్రసిద్ధి చెందిన పారాసెటమాల్ బ్రాండ్ అయిన టైలినాల్ని 1955లో మేక్ నీల్ లేబోరేటరీస్ ప్రవేశ పెట్టారు. వారు పారాసెటమాల్ ని పిల్లలకు నొప్పి మరియు జ్వరము నివారణిగా ప్రచారం చేసి అమ్మడం మొదలు పెట్టారు. వారు దీన్ని టైలినాల్ చిల్రన్స్ ఎలిక్సిర్ అనే పేరుతో అమ్మారు. "టైలినాల్" అనే పదం పారా -ఏస్టైల్ ఎమైనోఫ్ఈనోల్ నుండి వచ్చింది.[20] 1956లో 500 mg పారాసెటమాల్ మాత్రలు యునైటెడ్ కింగ్డంలో పానడాల్ అనే వ్యాపార పేరుతో అమ్మడం మొదలయింది. దీన్ని స్టెర్లింగ్ డ్రగ్ ఇంక్. యొక్క ఉపసంస్థ అయిన ఫ్రెడరిక్ స్టియర్న్స్ & కో ఉత్పత్తి చేశారు. పానడాల్ అప్పట్లో నొప్పి మరియు జ్వరానికి వైద్యుల నిర్దేశం మేరకే అమ్మబడింది. ఇది కడుపుకి కోమలంగా ఉంటుందని ప్రచారం చేశారు ఎందుకంటే అప్పట్లో ఇతర నొప్పినివారిణి మందులలో కడుపులో మంట కలిగించే యాస్పిరిన్ ఉండేది.[ఉల్లేఖన అవసరం] 1963లో పారాసెటమాల్ బ్రిటిష్ ఫార్మకోపియాలో చేర్చబడింది. అప్పటినుండి దాదాపు ఏ దుష్ఫలితాలు లేని మరియు ఇతర మందులతో అతి తక్కువ సంఘర్షణ కలిగి ఉన్న ఒక నొప్పినివారిణి అని పారాసెటమాల్ కు ఆదరణ లభించింది.[12] సురక్షత గురించిన చింతల కారణముగా 1970ల వరకు పారాసెటమాల్ విస్తృతంగా ఆమోదం పొందలేదు. అయితే 1980 దశాబ్దములో పారాసిటమాల్ అమ్మకం యాస్పిరిన్ అమ్మకాన్ని దాటి పోయింది, యునైటెడ్ కింగ్దొంలో సహా. దీనితో పాటు, అనాల్జేసిక్ నేఫ్రోపతి మరియు రక్తముపై దుష్ప్రభావాలకు కారణమవుతుందని ఫెనాసిటిన్ పై ఆరోపణలు రావటంతో వ్యాపార రీత్యా అది అంతమయింది.[7]

పారాసెటమాల్ యొక్క U.S. పేటంట్ల కాల పరిమితి ఎన్నడో ముగిసిపోయి, 1984 సంవత్సరపు డ్రగ్ ప్రైస్ కామ్పెటిషన్ అండ్ పేటంట్ టర్మ్ రేస్టోరేషన్ యాక్ట్ కింద సామాన్య (జెనెరిక్) మందులు విస్తృతంగా అందుబాటులోకి వచ్చాయి. అయితే కొన్ని టైలేనాల్ మందులు మాత్రం 2007 వరకు పేటెంట్ పరిమితిలోనే ఉన్నాయి. సెప్టెంబర్ 3, 1998న దరఖాస్తు చేయబడిన U.S. పేటంట్ 6,126,967 ని "అసిటామినోఫెన్ కణాల యొక్క పొడిగించబడిన విడుదల" కొరకు ఆమోదించబడింది.[21]

ఆకృతి మరియు ప్రతిచర్యాశీలత[మార్చు]

పారాసెటమాల్ బృహదణువు యొక్క పోలార్ ఉపరితల వైశాల్యం

పారాసెటమాల్ లో బెంజీన్ వలయం మధ్యభాగంలో ఉండి, హైడ్రోక్స్యల్ అణుశకల సమూహము మరియు అమైడ్ సమూహంలోని పారా (1,4) పద్ధతిలో ఉన్న నైట్రోజన్ అణువుచే బదలాయించబడి ఉంది.[22] ఏసిటెమైడ్ (ఇథనమైడ్) ఆ అమైడ్ గ్రూపు. హైడ్రోక్స్యల్ ఆమ్లజని మీద ఉన్న ఆ ఏకైక జత, బెంజీన్ pi మేఘము, నైట్రోజను ఏకైక జత, కార్బొనిల్ కార్బను మీద ఉన్న p ఆర్బిటాల్ మరియు కార్బోనిల్ కార్బను మీద ఉన్న ఏకైక జత అన్నీ కలసి ఈ అత్యంత సంయుక్త విధానాన్ని సృష్టించాయి. రెండు ఉత్తేజపరచే సముదాయాలు ఉండటంతో బెంజీన్ వలయం ఎలేక్ర్ట్రోఫిలిక్ యారొమాటిక్ ప్రత్యామ్నము వైపు అత్యంత రసాయన ప్రతిక్రియ కలిగి ఉంది. దాని యొక్క ప్రత్యామ్నాలు ఆర్ధో, పారా-నిర్దేశించబడిన మరియు ఒకదానితో మరియొకటి పారాగా ఉండి, వృత్తము మీద ఉన్న అన్ని ప్రాంతాలు దాదాపుగా ఒకే విధముగా ఉత్తజపరచబడి ఉన్నాయి. ఆ సంయోగము వలన ఆమ్లజని మరియు నత్రజని యొక్క క్షార లక్షణమును తగ్గించి, ఫినోక్సైడ్ యానయాన్ పై ఉద్భవించిన విద్యుదావేశం స్థలమార్పిడి చేసి హైడ్రోక్సిల్ యొక్క ఆమ్ల లక్షణమును పెంచబడుతుంది.

సంయోగము[మార్చు]

ఇతర మందులవలె కాకుండ, పారాసేటమాల్ కు స్టీరియోసెంటర్లు లేనందున దాన్ని సంయోగము చేయడము చాల సులభం. అందువలన స్టీరియోని ఉద్ధ్యేశించి సంయోగము చేయవలసిన అవసరము లేదు.

పరిశ్రమలలో పారాసెటమాల్ ను సాధారణంగా నైట్రోబెంజీన్ నుండి తయారు చేస్తారు.[23] ఒక మెట్టులోనే థయో ఎసితేట్ ద్వారా క్షయకరణ ఎసిటెమైడేషన్ రసాయన ప్రక్రియని ప్రారంభించవచ్చు.[24]

ప్రయోగశాలలో పారాసెటమాల్ ని సులభంగా తయారు చేయవచ్చు. ఫీనాల్ ని సోడియం నైట్రేట్తో నైట్రేట్ చేస్తే p -నైట్రోఫీనాల్ని ఆర్థో -ఉపలబ్ధి నుండి వేరు చేయవచ్చు. తరువాత నైట్రో సమాహికని సోడియం బోరోహైడ్రైడ్ ద్వారా క్షయకరణం చేయాలి. ఫలితంగా వచ్చే p -ఎమైనోఫీనాల్ అసిటిక్ అన్హైడ్రైడ్తో ఎసిటలైట్ చేయబడుతుంది.[25] ఈ ప్రక్రియలో ఫీనాల్ అత్యంత ఉత్తేజితవంతమైనది కావటంతో, దీనికి సాధారణ పరిస్థితులు సరిపోతాయి. (c.f. బెంజీన్ యొక్క నైట్రేషన్) :

Synthesis of paracetamol from phenol.png

రసాయన ప్రక్రియలు[మార్చు]

p -ఎమైనోఫీనాల్ని ఎమైడ్ జలవిశ్లేషణ ద్వారా పొందవచ్చు. ఈ విధముగా తయారైన p -ఎమైనోఫీనాల్, వ్యాపార రీత్యా అందుబాటులో ఉన్న మెటాల్కు సంబంధం ఉంది. దీన్ని ఛాయాచిత్రాకారులు ఒక డెవలపర్ లాగ వాడుతున్నారు.[26]

లభిస్తున్న రూపాలు[మార్చు]

పనడోల్ రాపిడ్ కాప్లేట్ లు (AU)

పారాసెటమాల్ మాత్రలు, గొట్టాలు, ద్రవము, సప్పోసిటరి, రక్తనాళములోనికి, కండరంలోనికి ఇచ్చే విధంగా లభ్యమవుతున్నాయి. సాధారణముగా పెద్దవారికి 500 mg నుండి 1000 mg వరకు మోతాదు వాడుతారు. పెద్దవారికి అత్యధికంగా ఒక రోజుకి 4000 mg మోతాదు వరకు వాడవచ్చని సూచిస్తారు. సూచించబడిన మోతాదులో వాడితే పారాసెటమాల్ పిల్లలకు, పసిపిల్లలకు మరియు పెద్దవారికి సురక్షితమే.[27]

ఆఫ్రికా, ఆసియా, మధ్య అమెరికా మరియు ఆస్ట్రేలేషియా ప్రదేశాల్లో 80కు పైన దేశాలలో విస్తృతంగా లభిస్తున్న బ్రాండ్ పనడోల్ . ఉత్తర అమెరికాలో పారాసెటమాల్ జెనెరిక్ రూపంలో (సాధారణంగా ఎసిటమైనోఫెన్ అనే పేరుతో) లేదా టైలేనాల్ (మక్నీల్-PPC, ఇంక్.), అనాసిన్-3, టెంప్ర, మరియు డాట్రిల్ వంటి అనేక వ్యాపార పేరులతో అమ్మబడుతున్నాయి. బ్రాండ్ పేరుతో (ఉ. పనడోల్) పారాసెటమాల్ U.K.లో లభించినప్పటికి, బ్రాండ్ కానిదైన జెనెరిక్ పారాసిటమాల్ ఎక్కువగా అమ్మబడుతున్నది. ఐరోపాలో ఎక్కువగా లభిస్తున్న పారాసెటమాల్ బ్రాండ్ లు ఎఫ్ఫెరాల్గన్ మరియు డోలిప్రేన్ . ఇండియాలో ఎక్కువగా వాడబడుతున్న పారాసెటమాల్ బ్రాండ్ గ్లాక్సో స్మిత్ క్లైన్ ఆసియా ఉత్పత్తి చేస్తున్న క్రోసిన్ . బంగ్లాదేశ్ లో ఎక్కువగా వాడబడుతున్నది బెక్సిమ్కో ఫార్మ ఉత్పత్తి చేస్తున్న నాపా అనే బ్రాండ్.

కొన్ని తయారీలలో పారాసెటమాల్ ని కో-కోడమాల్ (BAN) అని కొన్ని సార్లు సూచించబడుతున్న ఓపియాయ్డ్ కోడీన్ లతో కలుపుతారు. యునైటెడ్ స్టేట్స్ మరియు కెనడాలో టైలేనాల్ #1/2/3/4 అనే పేరుతో, 8–10 mg, 15 mg, 30 mg, మరియు 60 mg కొడీన్ కలిగి ఉన్న మందులను విక్రయిస్తారు. U.S.లో ఈ సంయోగాలు వైద్యుల చీటీ మీద మాత్రమే లభ్యమవుతుంది. వీటిలో, అతి తక్కువ మోతాదు ఉన్న మందు మాత్రం ఓవర్-ది-కౌంటర్ గా కెనడాలో అమ్మబడుతుంది. ఇతర దేశాల్లో ఇతర మోతాదుల మందులు కూడా ఓవర్-ది-కౌంటర్ లో దొరకవచ్చు. ఈ సంయోగాల యొక్క జెనెరిక్ రూపాలు కూడా ఉన్నాయి. UK మరియు అనేక ఇతర దేశాల్లో ఈ సంయోగము టైలేక్స్ CD మరియు పానాడీన్ అనే పేర్లతో విక్రయించబడుతున్నాయి. ఇతర పేర్లు ఏమనగా కాప్టిన్, డిస్ప్రోల్, డైమేడాన్, ఫేన్సమ్, హిడేక్స్, మెక్సలేన్, నోఫెడోల్, పారాలేన్, పీడియపిరిన్, పెర్ఫాల్గాన్ మరియు సోల్పడీన్. పారాసెటమాల్ ను కో-డైడ్రమోల్ (BAN) అని సూచించబడుతున్న డైహైడ్రోకొడోన్ వంటి ఒపియోయిడ్స్, ఆక్సికొడోన్ లేక హైడ్రోకొడోన్ వంటి ఇతర ఒపియాయ్డ్ తో కలిపి పెర్కొసేట్ మరియు వికోడిన్ అనే పేర్లతో U.S.లో అమ్మబడుతున్నాయి. డార్వోసెట్ అనే బ్రాండ్ పేరుతో ఎక్కువగా అమ్మబడుతున్న నొప్పినివారిణి సంయోగము ప్రోపోక్సిఫీన్ నేప్సైలేట్తో పారాసెటమోల్ యొక్క అనాల్జేసిక్ సంయోగం. పారాసెటమాల్, కొడీన్ మరియు ఉపశమనం కలిగించే డాక్సిలామైన్ సక్సినేట్, ఈ మూడూ కలిగి ఉన్న సంయోగం సిండాల్ లేదా మెర్సైన్డాల్ అనే పేరుతో విక్రయించబడుతుంది.

పారాసెటమాల్ ను సాధారణముగా మైగ్రైన్ తలనొప్పిని నివారించడానికి బహుళ ఘటకద్రవ్యములు కలిగిన, ముఖ్యంగా బుటాల్బిటాల్, పారాసెటమాల్ తో కూడిన తయారీలలో భాగంగా వాడుతారు. ఈ తయారీలలో కెఫీన్ ఉండవచ్చును లేదా ఉండకపోవచ్చును. కొన్ని సందర్భాలలో ఈ తయారీలలో కోడీన్ కూడా ఉంటుంది.

బ్రాండ్ పేర్లు[28]
అసిటా, అక్టిమిన్, అనాసిన్-3, అపాసేట్, అస్పిరిన్ ఫ్రీ అనాసిన్, ఆటాసాల్, బనేసిన్, బెన్-యురోన్, క్రోసిన్, డాపా, డోలో, డాట్రిల్ ఎక్స్ట్రా- స్ట్రెంథ్, డేక్విల్, డెఫోన్ & డెఫోన్ మాక్సిమం, ఫీవరాల్, ఫ్యు డ్రాప్స్, ఫిబి, ఫిబి ప్లస్, జీనాపాప్, జేనిబ్స్, లేకడోల్, లేమ్సిప్, లిక్విప్రిన్, ల్యుపోసేట్, నియోపాప్, నై-క్విల్, ఒరాఫెన్-PD, పానడో, పానడాల్, పారాసెట్, పారాలెన్, ఫినాఫెన్, ప్లైసేట్, రెడ్యుటెం, స్నాప్లేట్స్-FR, సుప్పాప్, టమెన్, టపనోల్, టెంప్రా, టైలినోల్, వాలోరిన్, ఎక్సెల్.

పనిచేసే విధానం[మార్చు]

పారాసెటమాల్ సాధారణంగా స్టీరాయ్ద్-కాని వాపుని నివారించే మందులు (NSAID) తో పాటు వర్గీకరించబడినా, అది వాటిలో ఒకటిగా పరిగణించబడటం లేదు. ఈ వర్ఘానికి చెందిన ఇతర మందులు మాదిరిగానే, ఇది కూడా సైక్లోఆక్సీజేనేస్ (COX) అనే ఎంజైమ్ పనితీరుని అడ్డుకుంటుంది. ఈ ఎంజైమ్, వాపు, నొప్పి మరియు జ్వరాలకి మధ్యవర్తిత్వం వహిస్తున్న ముఖ్యమైన ప్రోస్టాగ్లాన్దిన్స్ తయారీకి కారణం. అందువలన, అన్ని NSAIDలు వాపు-తగ్గించే గుణము, నొప్పి నివారిణి గుణము మరియు జ్వర నివారిణి గుణము పొంది ఉంటాయని చెప్పవచ్చును. ఒక్కొక్క NSAID మందు యొక్క ప్రత్యేకమైన పనితీరు, వాటి ఔషధ గుణాలు, వ్యాప్తి మరియు జీవప్రక్రియ మీద ఆధారపడి ఉంటుంది.

పారాసెటమాల్ కు యాస్పిరిన్కు ఉన్నట్లే నొప్పి నివారిణి మరియు జ్వర నివారిణి గుణాలు ఉన్నాయి కాని వాపు తగ్గించే గుణము అంత ఎక్కువగా లేదు. ఎందుకంటే వాచిన భాగాలలో ఎక్కువ స్థాయిలో ఉన్న పెరాక్సైడ్లు పారాసిటమాల్ ను బలహీనపరుస్తాయి.

AM404-పారాసెటమాల్ యొక్క మెటాబోలైట్
అనాండమైడ్ - ఒక ఎండోజీనస్ కెన్నబినాయ్ద్

అయితే, పారాసెటమాల్ ఏ విధంగా జ్వరాన్ని మరియు నొప్పిని తగ్గిస్తుందనేది ఇంకా వివాదాస్పదంగానే ఉంది.[29] పారాసిటమాల్ వాపుని ప్రోత్సాహించే రసాయన పదార్ధాలైన ప్రోస్టాగ్లాన్దిన్ ల తయారీని తగ్గించటం దీనికి కారణం. యాస్పిరిన్ కూడా ప్రోస్టాగ్లండిన్ ల తయారిని తగ్గిస్తుంది కాని ఆస్పిరిన్ వలె పారాసెటమాల్ కు వాపు తగ్గించే గుణం లేదు. అలాగే యాస్పిరిన్ రక్తం గడ్డకట్టడాన్ని ప్రోత్సాహించే రసాయన పదార్దాలైన త్రోంబొక్సేన్ యొక్క ఉత్పత్తిని తగ్గించినట్లు పారాసెటమోల్ తగ్గించదు. యాస్పిరిన్ సైక్లోఒక్ష్యజెనేస్ (COX) ఎంజైమ్ లకు ఆటంకం కలిగిస్తుందనేది తెలిసిన విషయమే. పారాసెటమాల్ కు కూడా కొంత మేరకు అలాంటి గుణమే ఉంది కాబట్టి, పారాసిటమాల్ కూడా COX లకి ఆటంకం కలిగిస్తుందా అనే విషయం మీద ఎక్కువ పరిశోధనలు జరిగాయి. పారాసిటమాల్ కనీసం రెండు మార్గాలలో పనిచేస్తుందనేది ప్రస్తుతం స్పష్టమయింది.[7][30][31][32]

అరాఖిడోనిక్ ఆమ్లం ప్రోస్టాగ్లాన్దిన్ H2 అనే ఒక అస్థిర బృహదణువుగా జీవప్రక్రియ చెందటానికి COX ఎంజైమ్లే కారణం. ఈ అస్థిర బృహదణువు తరువాత దశలో వాపు కలగడానికి కారణమైన అనేక మిశ్రమాలుగా మారుతాయి. NSAID వంటి సాంప్రదాయక వాపు నివారిణిలు ఈ ప్రక్రియను ఆపుతాయి. COX ఎంజైమ్ సరిగ్గా ఆక్సిడైస్ చేయబడితేనే క్రియాశీలంగా పనిచేస్తుంది.[33][34] పారాసెటమాల్ ఆక్సిడైస్ చేయబడిన COX ఎంజైమ్ పరిమాణమును తగ్గించి, వాపుకు కారణమైన రసాయాన పదార్థాలు తయారవడాన్ని నిలిపివేస్తుంది.[31][35]. ఫలితంగా, CNSలో ప్రోస్టాగ్లాన్డిన్ E2 పరిమాణాన్ని తగ్గించి, ఉష్ణనియంత్రణ కేంద్రంలో హైపోథెలామిక్ సెట్ పాయింట్ ని తగ్గిస్తుంది. ఇంకొక ఎంజైమైన COX3 ని నియంత్రించటంతో పారాసెటమాల్ కు ప్రత్యేక సంబంధం ఉంది. COX3 ఆర్టికిల్ వ్యాసానికి బైట కనబడటం లేదు.[36] పారాసెటమాల్ ఎండోజీనస్ కెన్నాబినోయిడ్ వ్యవస్థని కూడా నియంత్రిస్తుంది.[37] పారాసెటమాల్, అనేక చర్యలు చేయగల AM404 అనే మిశ్రమముగా మారుతుంది; ముఖ్యంగా ఇది ఎండోజీనస్ కెన్నబినాయ్ద్/వెనిల్లోయిడ్ అనాండమైడ్ లను నరాల కణాలు గ్రహించకుండా చేస్తుంది. అనాండమైడ్ తీసుకోవడం ద్వారా శరీరములోని ముఖ్యమైన నొప్పిగ్రాహి (నాసిసేప్టార్) అయిన TRPV1 (పాత పేరు: వనిల్లాయ్డ్ గ్రాహి) ఉత్తేజపరచబడుతుంది. లిడోకైన్, ప్రోకైన్ వంటి శస్త్ర చికిత్సకు వాడే మత్తు మందులు మాదిరిగానే AM404 కూడా సోడియం మార్గాలను అడ్డుకుంటుంది.[38] ఈ రెండిటిలోనూ ఏ ఒక్క చర్య అయినా నొప్పిని తగ్గిస్తుంది, ఇవే పారాసెటమాల్ పని చేసే విధానము అయి ఉండవచ్చును. అయితే, కెన్నబినాయ్ద్ గ్రాహకులను అడ్డుకున్న తరువాత, కెన్నబినాయ్ద్ ని తిరిగి గ్రహించటం వలన సంభవించే ఏ ప్రభావమైనా అర్ధంలేనిదిగా మారటంతో, పారాసెటమాల్ నొప్పినివారిణ గుణాన్ని కోల్పోతుంది. దీనివల్ల ఏమి తెలుస్తుందంటే, పారాసెటమాల్ ఎండోజీనస్ కెన్నబినాయ్ద్ వ్యవస్థ ద్వారానే నొప్పినివారణ చర్యని చేపడుతుంది.[39]

COX ఎంజైమ్ కుటుంబానికి చెందిన COX3 ఐసొఫార్మ్ ని అడ్డుకోవడం వల్లే పారాసెటమాల్ పనిచేస్తుందని ఒక సిద్ధాంతం చెపుతుంది. కుక్కలలో వ్యక్తమైనప్పుడు ఈ ఎంజైమ్ కు, ఇతర COX ఎంజైమ్లకు బలమైన పోలిక ఉండి, వాపుకు కారణమైన రసాయన పదార్ధాలని ఉత్పత్తి చేస్తుంది. దీన్ని పారాసెటమాల్, ప్రత్యేక విధముగా అడ్డుకుంటుంది.[40] అయితే COX-3 ఎంజైమ్ కు మానవులు మరియు ఎలుకలలో వాపు కలిగించే గుణము లేదని కొన్ని పరిశోధనలు సూచించాయి.[30] ఇంకొక అవకాశం ఏమంటే, పారాసెటమాల్ సైక్లోఆక్సీజెనేస్ ని అడ్డుకుంటుంది (యాస్పిరిన్లో మాదిరిగానే). అయితే పెరాక్సైడ్ ల పరిమాణము ఎక్కువగా ఉన్న వాచిన స్థితిలో, పారాసిటమాల్ యొక్క ఆక్సీడేషన్ స్థితి కూడా ఎక్కువగా ఉండి, దాని పనిని అడ్డగిస్తుంది. అంటే, పారాసెటమాల్ నేరుగా వాపు స్థలములో పని చేయదు కాని ఆక్సీడేటివ్ స్థితి లేని వాతావరణములో, అది CNS మీద ఉష్ణోగ్రత తగ్గించడం వంటి పనులు చేస్తుంది.[40] పారాసెటమాల్ COX-3 మీద కచ్చితంగా ఎలా పనిచేస్తుందనే విషయము వివాదాస్పదంగా ఉంది.

జీవప్రక్రియ[మార్చు]

పారాసెటమాల్ యొక్క ముఖ్యమైన జీవప్రక్రియ మార్గం (పెద్దగా చేయడానికి క్లిక్ చేయండి).నీలము మరియు ఊదా రంగులలో చూపబడిన మార్గాలు దుష్ప్రభావం లేని మెటాబోలైట్స్ కు దారి చూపుతాయి; ఎరుపు రంగులో చూపబడిన మార్గం దుష్ప్రభావం ఉన్న NAPQI కు దారి చూపుతాయి.

పారాసెటమాల్ ముఖ్యంగా కాలేయంలో జీవప్రక్రియ చేయబడి దుష్ప్రభావం లేని పదార్థాలుగా మారుతుంది. ఈ జీవప్రక్రియలో జరిగే విధానములు మూడు:

 • గ్లూకురోనిడేషన్ 40% నుండి మూడులో రెండు వంతులు వరకు పారాసెటమాల్ జీవప్రక్రియకి కారణమని నమ్మబడుతుంది.[41]
 • సల్ఫెషన్ (సల్ఫేట్ కలయిక) 20-40% వరకు కారణం కావచ్చు.[41]
 • N-హైడ్రాక్సీలేషన్ మరియు పునరమరిక, తరువాత GSH సంయోగము, 15% కంటే తక్కువ కారణం. హెపాటిక్ సైటోక్రోం P450 ఎంజైమ్ వ్యవస్థ పారసెటమాల్ ని జీవప్రక్రియ చేసి NAPQI (N -అసిటైల్ -p -బెంజో-క్వినోన్ ఇమైన్) అనే ఒక చిన్న, అదే సమయములో ముఖ్యమైన, అల్కైలేటింగ్ మెటాబోలైట్ గా మారుస్తుంది.[42] తరువాత NAPQI తిరిగి మార్చలేనివిధముగా గ్లూటాతియోన్ యొక్క సల్ఫ్ హైద్రల్ సమూహముతో సంయోగం జరుపుతుంది.[42]

మూడు దారులు కూడా చివరికి దుష్ప్రభావం లేని, ఉత్తేజరహిత పదార్థాల్ని తయారు చేస్తాయి. ఇవి మూత్రపిండాలు ద్వారా విసర్జించబడతాయి. మూడో దారిలో మాత్రం మధ్యలో తయారయే NAPQI దుష్ప్రభావం కలిగి ఉంటుంది. NAPQI యే పారాసెటమాల్ యొక్క దుష్ప్రభావాలకి ముఖ్య కారణం; ఇది దుష్ప్రభావానికి ఒక గొప్ప ఉదాహరణ.

సైటోక్రోం P450 యొక్క రెండు ఐసొఎంజైమ్ లైన CYP2E1 మరియు CYP1A2 యే NAPQI తయారీకి ముఖ్య కారణం. P450 జన్యువుకి పాలిమార్ఫిక్ గుణం ఎక్కువగా ఉంటుంది, అయితే పారాసెటమాల్ దుష్ప్రభావాలలోని వ్యక్తిగత వ్యత్యాసాలకి మూడో ఐసొఎంజైమైన CYP2D6 కారణమని నమ్మబడుతుంది. CYP2D6 లోని జన్యు పాలిమార్ఫిసం వల్ల NAPQI తయారి వేగాలలో గణనీయమైన తేడాలు ఏర్పడే అవకాశం ఉంది. పైగా, CYP2D6 జన్యువు యొక్క వ్యక్తీకరణ స్థాయిలను బట్టి వ్యక్తుల జీవప్రక్రియను "అతి ఎక్కువ జీవప్రక్రియదారులు", "చాలా వేగవంతమైన" మరియు "తక్కువ" (NAPQI తయారి చేసేవి) జీవప్రక్రియదారులని వర్గీకరించవచ్చు. ఇతర P450 ఎంజైమ్ లకంటే CYP2D6 పారాసెటమాల్ ని జీవప్రక్రియ చేసేది తక్కువే అయినప్పటికీ, దాని వల్లే 'అతి ఎక్కువ' మరియు 'చాల వేగవంతమైన' మేటబోలైజర్స్ లో పారాసిటమాల్ ఎక్కువ మోతాదులో తీసుకున్నప్పుడు పారాసిటమాల్ దుష్ప్రభావం ఏర్పడుతుంది.[43] సాధారణమైన మోతాదులలో, NAPQI సంయోగం వలన త్వరగా దుష్ప్రభావాన్ని కోల్పోతుంది.[42] మితి మీరిన మోతాదు వల్ల మరియు బహూశ 'అతి ఎక్కువ' మరియు 'చాల వేగవంతమైన' మేటబోలైజర్స్ లో కూడా, ఈ దుష్ప్రభావం నిర్వీర్యం చేసే వ్యవస్థ నిండిపోయి, NAPQI పరిమాణం పెరగడం మొదలవుతుంది.

ఉపయోగాలు[మార్చు]

ERROR: {{Expand}} is a disambiguation entry; please do not transclude it. Instead, use a more specific template, such as {{incomplete}}, {{expand list}}, {{missing information}}, or {{expand section}}.

పిల్లలకు 38.5 °C (101.3 °F) కంటే ఎక్కువ జ్వరం ఉన్నప్పుడు పారాసెటమాల్ ఇవ్వాలని WHO సూచిస్తుంది.[44]

జటర ఆమ్ల స్రావం ఎక్కువగా ఉన్న రోగులలో లేదా రక్త స్రావము ఎక్కువ సమయము జరిగే రోగులలో పారాసెటమాల్ యాస్పిరిన్కు ఒక సరైన ప్రత్యామ్నాయం అవుతుంది. పారాసెటమాల్ కు నొప్పినివారణ మరియు జ్వరనివారణ గుణాలు యాస్పిరిన్కు సమానంగా ఉన్నాయి కాని వాపు తగ్గించే గుణం తక్కువగా ఉంది. పారాసెటమాల్ యొక్క మూడు గుణాలు, అంటే శరీరానికి బాగుగా సహించటం, వైద్య చీటీ లేకుండానే లభ్యమవటం మరియు యాస్పిరిన్ కు ఉన్న జటరకు సంబంధించిన దుష్ఫలితాలు లేవు అనే గుణాలు వల్ల, ఇది ఈ మధ్య కాలములో ప్రతి ఇంటిలో వాడబడుతున్న సామాన్య మందుగా మారుతుంది.

ఫలోత్పాధన మరియు దుష్ఫలితాలు[మార్చు]

యాస్పిరిన్, ఇబుప్రోఫెన్ వంటి ఇతర సాధారణ నొప్పినివారిణీలు లాగ కాకుండా, పారసెటమాల్ కు వాపు తగ్గించే గుణము చాల తక్కువగా ఉండటంవల్ల, దీన్ని స్టీరాయిడ్-కాని వాపు తగ్గించే మందు (NSAID) లాగ పరిగణించడం లేదు .

ఫలోత్పాధన[మార్చు]

ఫలోత్పాధన విషయములో పారాసెటమాల్ ని NSAID లతో పోల్చినప్పుడు పరస్పర విరుద్ధ ఫలితాల చూపిస్తున్నాయి. పెద్దవాళ్ళలో ఆస్టియోఆర్త్రైటిస్ వల్ల ఏర్పడే దీర్ఘకాల నొప్పి గురించిన ఒక క్రమరహితమైన మరియు నియంత్రించబడిన పరిశోధనలో పారాసెటమాల్ మరియు ఇబుప్రోఫెన్ రెండిటికి ఒకే ఫలితము ఉంటుందని గ్రహించారు.[45][unreliable source?][46] అయితే పిల్లలలో తీవ్ర కండరాల మరియు ఎముకల నొప్పి గురించిన ఒక క్రమరహితమైన మరియు నియంత్రించబడిన పరిశోధనలో ఇబుప్రోఫెన్ యొక్క ప్రమాణ OTC మోతాదు, పారాసెటమాల్ యొక్క ప్రమాణ మోతాదు కంటే ఎక్కువ ఉపసమనం కలిగిస్తుందని కనిపెట్టారు.[47][unreliable source?]

ప్రతికూల ఫలితాలు[మార్చు]

సూచించబడిన మోతాదులలో పారాసెటమాల్ జీర్ణకోశము యొక్క పొరలో ఉపద్రవము కలిగించదు. NSAIDలు కలిగించినంత రక్తం గడ్డకట్టడం కలిగించదు మరియు మూత్రపిండాల మీద ఎటువంటి ప్రభావం చూపించదు.[ఉల్లేఖన అవసరం] అయితే ఎక్కువ మోతాదులో వాడినప్పుడు (2,000 mg per dayకంటే ఎక్కువగా) జీర్ణ కోశ రక్త స్రావం వంటి గాస్ట్రోఇంటేస్టైనల్ ఇబ్బందులు ఏర్పడుతాయని కొన్ని పరిశోధనలు చూపించాయి.[48] యాస్పిరిన్ లేదా పారాసెటమాల్ ని అతి ఎక్కువగా - అంటే ఏడాదికి 300 గ్రాములు (సగటుకు రోజుకు 1 g) వాడినప్పుడు, చిన్న, సొట్టబోయిన, రాళ్లతోకూడిన మూత్రపిండాలు (SICK) అనే పరిస్థితికి కారణమవుతుందని పరిశోధకులు కనుగొన్నారు.[49] పారాసెటమాల్ గర్భంలో కూడా సురక్షితం మరియు NSAIDల లాగ కాకుండా పిండం యొక్క డక్టస్ ఆర్తీరియోసస్ మూసివేయడానికి అడ్డు రాదు.[50] యాస్పిరిన్ లాగ కాకుండా ఇది పిల్లలకి కూడా సురక్షితం ఎందుకంటే పారాసెటమాల్, వైరల్ వ్యాధులతో బాధ పడుతున్న పిల్లలకు వచ్చే రేయిస్ సిండ్రోంతో పారాసిటమాల్ కు సంబంధం లేదు.[51]

ఒపియాయ్ద్ నొప్పి నివారిణులవలే కాకుండానూ, NSAIDలు వలే, పారాసెటమాల్ అతి ఆనందం కలిగించడం గాని మనస్థితిని మార్చడం గాని చేయదు. పిల్లలలో పారాసెటమాల్ వల్ల ఏర్పడే దీర్ఘకాల దుష్ఫలితాల గురించిన ఒక అతి పెద్ద పరిశోధనా ఫలితాలని ది లాన్సేట్లో 2008లో ప్రచురించారు. ఈ పరిశోధనని 31 దేశాలలో 200,000 కంటే ఎక్కువ మంది పిల్లల మీద జరిపారు. దీని ఫలితాలు ప్రకారం, జీవితములో మొదటి సంవత్సరములో జ్వరానికి పారాసెటమాల్ వాడినప్పుడు 6-7 వయస్సులో ఉబ్బసము సంబంధించిన లక్షణాలు ఎక్కువవుతాయని కనుగొన్నారు. మరియు పారాసిటమాల్ వాడటం, మొదటి ఏడాది మరియు 6-7 వయసుల్లో పిల్లలకి రైనోకంజక్టివిటిస్ మరియు ఎక్జీమ వంటి జబ్బులతో సంబంధం ఉందని కనుగొన్నారు.[52] వారి పరిశోధనా ఫలితాలు, పారాసెటమాల్ ఉపయోగించి రోగానికి చికిత్స ఇవ్వడం వల్ల ఏర్పడి ఉండవచ్చని, ఈ రెండిటికి సంబంధాలు కేవలం అకస్మాత్తుగా ఏర్పడినవి కాకపోవచ్చని వారు పేర్కొని, దీన్ని నిర్దారించడానికి ఇంకా పరిశోధనలు చేపట్టాలని గట్టిగా చెప్పారు. ఆపైన, ఈ పరిశోధనకు సంబంధించిన పద్ధతులు మరియు ముగింపులు గురించిన అనేక సంపాదకీయాలు, వ్యాఖ్యానాలు, ఉత్తరప్రత్యుత్తరాలు మరియు దానికి వారు సమాధానాలు, ఇవి అని ద లాన్సేట్ లో ప్రచురించబడ్డాయి.[53][54][55][56][57][58][59] UK నియంత్రణ సంస్థ అయిన మేడిసిన్స్ అండ్ హేల్త్సుర్ ప్రాడక్ట్స్ రెగ్యులేటరి ఏజెన్సీ, కూడా ఈ పరిశోధనని సమీక్షించి, ఫలితాలని విశ్లేషించడం గురించి అనేక చింతలని ప్రచురించి, వైద్యులు మరియు తల్లితండ్రులకు ఈ విధముగా సలహా ఇచ్చారు: "ఈ కొత్త పరిశోధన యొక్క ఫలితాలు బట్టి ఈ మందుని పిల్లలకి వాడే విషయములో ప్రస్తుత మార్గదర్శకాలని ఏ మార్పు చేయవలసిన అవసరము లేదు." పారాసెటమాల్ పిల్లలకి ఒక సురక్షితమైన మరియు తగిన నొప్పినివారిణిగా కొనసాగుతుంది. పిల్లలకి జ్వర నివారిణి వాడే విషయములో ఉన్న మార్గాదర్శకమును మార్చడానికి ఈ పరిశోధనలో కావలసిన ఆధారం లేదు."[60]

దుష్ప్రభావాలు[మార్చు]

మితిమీరిన రీతిలో పారాసెటమాల్ ని వాడటం వల్ల అనేక అవయవాలకు, ముఖ్యంగా కాలేయము మరియు మూత్రపిండాలకి కీడు జరగవచ్చు. ఈ రెండు అవయవాలలో, పారాసెటమాల్ వల్ల ఏర్పడే దుష్ప్రభావాలు మందు వల్ల ఏర్పడటం లేదు. మందు యొక్క మెటాబోలైట్ అయిన N -అసిటైల్-p -బెంజోక్వినోనేమైన్ (NAPQI) వల్ల ఏర్పడుతుంది. కాలేయంలో పారాసెటమాల్ ని NAPQI గా మర్చేవి సైటోక్రోం P450 ఎంజైమ్స్ అయిన CYP2E1 మరియు CYP3A4. మూత్రపిండములో సైక్లోఆక్సీజేనేస్ ద్వారా పారాసిటమాల్ NAPQI గా మారుతుంది.[61] పారాసెటమాల్ మితిమీరిన మోతాదులో తీసుకున్నప్పుడు, అది NAPQI నిలువ చేస్తుంది. తరువాత అవి గ్లూటాథయోన్తో కలుస్థాయి. ఈ కలయిక సహజమైన యాంటి-ఆక్సిడంట్ అయిన గ్లూటాథయోన్ ని తగ్గిస్తుంది. దీనితో పాటు NAPQI నేరుగా జీవకణాలని గాయపరుస్తుంది. వీటివల్ల కణాలు దెబ్బతిని మరణం సంభవిస్తుంది.[62]

యునైటెడ్ స్టేట్స్ మరియు యునైటెడ్ కింగ్డంలో తీవ్ర కాలేయ వైఫల్యానికి అతి సామాన్యమైన కారణం పారాసెటమాల్ హేపటోటాక్సిసిటి.[6][63] ఇతర ఈ మందులకన్నా, పారాసెటమాల్ మితిమీరిన మోతాదు తీసుకోవడమే US లో విష నియంత్రణ కేంద్రానికి ఎక్కువ సంఖ్యలో పిలుపులు రావడానికి కారణం.[64] ప్రారంభంలో పారాసెటమాల్ దుష్ప్రభావం సంబంధించిన సూచనలు మరియు లక్షణాలు అసలు లేక పోవచ్చు లేదా అస్పష్టంగా ఉండవచ్చు. దీనికి చికిత్స తీసుకోకపోతే, మితిమీరిన మోతాదు వల్ల కాలేయం విఫలమయి కొన్ని రోజులలోనే మరణం సంభవిస్తుంది. దీనికి చికిత్స ఏమంటే శరీరము నుండి పారాసెటమాల్ ని తొలగించి దాని స్థానములో గ్లూటాథయోన్ ని పంపించడం. మితిమీరిన మోతాదు తీసుకున్న వెనువెంటనే రోగిని చికిత్సకి తీసుకువస్తే, పారాసెటమాల్ ని శరీరం పీల్చుకోవడాన్ని తగ్గించడానికి ఉత్తీజిత బొగ్గు వాడవచ్చును. ఎసిటైల్ సిస్టీన్ (N-అసిటైల్సిస్టైన్ లేదా NAC అని కూడా పిలవబడుతుంది) అనే విరుగుడు మందు గ్లూటాథయోన్ పని చేసే ముందు శరీరం కాలేయం దెబ్బ తినకుండా ఆపడానికి కావలసిన పునఃసృష్టిచేయడానికి సహాయ పడుతుంది. కాలేయానికి తీవ్రమైన హాని కలిగితే కాలేయ మార్పిడి చేయవలసిన అవసరము ఏర్పడుతుంది.[3]

పారాసెటమాల్ యొక్క విష ఫలితము నుండి ప్రజలకి రక్షణ కల్పించడానికి కొత్త నియమాలు విధించాలని జూన్ 2009న ఒక FDA సలహా కమిటి సూచించింది.[65][66]

జంతువుల మీద ప్రభావము[మార్చు]

పారాసిటామాల్ పిల్లులకి చాల ప్రమాదకరం. ఎటువంటి పరిస్థుతలలోను పిల్లులకి ఈయకూడదు. పారాసెటామాల్ ని సురక్షితంగా విభాగించడానికి కావలసిన గ్లుకురోనైల్ ట్రాన్స్ ఫరేస్ అనే ఎంజైమ్ లు పిల్లులలో లేవు కనక ఈ బిళ్ళ యొక్క అతి స్వల్ప భాగము కూడా ప్రాణాంతకంగా ఉంటుంది. ప్రారంభ సంకేతాలు ఏమనగా వాంతులు, చొంగ కారడం మరియు నాలుక, చిగురులు రంగు మారడం. మనుషులలో మాదిరిగా కాకుండా, మితిమీరిన మోతాదు వల్ల కాలేయానికి హాని ఏర్పడి మరణం సంభవించడం అరుదు; బదులుగా మిథేమోగ్లోబిన్ ఏర్పడి ఎర్రరక్తకణంలో హీన్జ్ వస్తువులు తయారవుతాయి. ఇవి రక్తం ఆక్సిజెన్ ని రవాణా చేయడానికి అంతరాయం కలిగించి ఉక్కిరిబిక్కిరి కావటం, (మిథేమొగ్లోబినేమియా మరియు హీమోలైటిక్ ఎనీమియా) వలన ఏర్పడుతుంది. స్వల్ప మోతాదులో పారాసెటమాల్ తీసుకున్న తరువాత N-అసిటైల్ సిస్టీన్, మిథిలిన్ నీలం లేదా రెండూ కొన్ని సార్లు ఉపయోగంగా ఉంటాయి. ఒక పరిశోధన ప్రకారం, బ్రతికే అవకాశం ఆడ పిల్లులకు ఎక్కువ ఉంటుంది. అయితే ఈ పరిశోధనలో తీసుకున్న మాదిరీల సంఖ్య తక్కువ.[67]

కుక్కలలో పారాసెటమాల్ కు ఎటువంటి గణనీయమైన వాపు తగ్గించే గుణము లేనప్పటికీ, దీన్ని యాస్పిరిన్ వలె మస్కులోస్కెలిటల్ నొప్పికి చికిత్సగా వాడుతారు.[68] ఒక పారాసెటమాల్-కొడీన్ మందు (వ్యాపార పేరు పర్దేల్-V) [69] UKలో జంతు వైద్య మందు చీటీ మీద కుక్కకి వాడటానికి ఉపయోగిస్తారు.[70] జంతు వైద్యుల సలహా మీద మాత్రమే ఇది కుక్కలకి ఈయాలి. కుక్కలలో ఈ మందు వలన ఏర్పడే దుష్ప్రభావం ముఖ్యంగా కాలేయము దెబ్బ తినడం.[71] కుక్కలు పారాసెటమాల్ తీసుకున్న కొన్ని గంటలు లోపల N-ఎసిటైల్సిస్టైన్ చికిత్స చేస్తే ఉపయోగం ఉంటుంది.[68]

పారాసెటమాల్ పాములకి కూడా ప్రాణాంతకమైనది. గువంలో గోధుమ రంగు చెట్టు పాము (బోయిగా ఇర్రేగ్యులారిస్ ) కు రసాయన నియంత్రణ కొరకు సూచించబడింది.[72]

సూచనలు[మార్చు]

 1. కాన్సర్ రోగులలో నొప్పి నియంత్రణ సంకేత సూచనలు 40 భాగం 6.
 2. http://www.drugs.com/acetaminophen.html
 3. 3.0 3.1 Daly FF, Fountain JS, Murray L, Graudins A, Buckley NA (2008). "Guidelines for the management of paracetamol poisoning in Australia and New Zealand—explanation and elaboration. A consensus statement from clinical toxicologists consulting to the Australasian poisons information centres". Med. J. Aust. 188 (5): 296–301. PMID 18312195. Unknown parameter |month= ignored (help)CS1 maint: multiple names: authors list (link)
 4. Khashab M, Tector AJ, Kwo PY (2007). "Epidemiology of acute liver failure". Curr Gastroenterol Rep. 9 (1): 66–73. doi:10.1007/s11894-008-0023-x. PMID 17335680. Unknown parameter |month= ignored (help)CS1 maint: multiple names: authors list (link)
 5. Hawkins LC, Edwards JN,PI (2007). "Impact of restricting paracetamol pack sizes on paracetamol poisoning in the United Kingdom: a review of the literature". Drug Saf. 30 (6): 465–79. doi:10.2165/00002018-200730060-00002. PMID 17536874.CS1 maint: multiple names: authors list (link)
 6. 6.0 6.1 Larson AM, Polson J, Fontana RJ; et al. (2005). "Acetaminophen-induced acute liver failure: results of a United States multicenter, prospective study". Hepatology. 42 (6): 1364–72. doi:10.1002/hep.20948. PMID 16317692. Explicit use of et al. in: |author= (help)CS1 maint: multiple names: authors list (link)
 7. 7.0 7.1 7.2 7.3 7.4 7.5 7.6 Bertolini A, Ferrari A, Ottani A, Guerzoni S, Tacchi R, Leone S (2006). "Paracetamol: new vistas of an old drug". CNS drug reviews. 12 (3–4): 250–75. doi:10.1111/j.1527-3458.2006.00250.x. PMID 17227290.CS1 maint: multiple names: authors list (link)
 8. Bergman K, Müller L, Teigen SW (1996). "The genotoxicity and carcinogenicity of paracetamol: a regulatory (re)view". Mutat Res. 349 (2): 263–88. doi:10.1016/0027-5107(95)00185-9. PMID 8600357. Unknown parameter |month= ignored (help)CS1 maint: multiple names: authors list (link)
 9. Bradley, N (1996). "BMJ should use "paracetamol" instead of "acetaminophen" in its index". BMJ. 313 (7058): 689. Unknown parameter |month= ignored (help)
 10. Cahn, A (1886). "Das Antifebrin, ein neues Fiebermittel". Centralbl. Klin. Med. 7: 561–64. Unknown parameter |coauthors= ignored (|author= suggested) (help)
 11. H. N. Morse (1878). "Ueber eine neue Darstellungsmethode der Acetylamidophenole". Berichte der deutschen chemischen Gesellschaft. 11 (1): 232–233. doi:10.1002/cber.18780110151.
 12. 12.0 12.1 Milton Silverman, Mia Lydecker, Philip Randolph Lee (1992). Bad Medicine: The Prescription Drug Industry in the Third World. Stanford University Press. pp. 88–90. ISBN 0804716692.CS1 maint: multiple names: authors list (link)
 13. వాన్ మేరింగ్ జే. బైట్రాజ్ జూర్ కేంట్నిస్ డెర్ యాంటిపైరేటిక. తేర్ మోనాట్స్చ్ 1893;7:577–587.
 14. 14.0 14.1 14.2 Sneader, Walter (2005). Drug Discovery: A History. Hoboken, N.J.: Wiley. p. 439. ISBN 0471899801.
 15. Lester D, Greenberg LA, Carroll RP (1947). "The metabolic fate of acetanilid and other aniline derivatives: II. Major metabolites of acetanilid appearing in the blood". J. Pharmacol. Exp. Ther. 90: 68–75.CS1 maint: multiple names: authors list (link)
 16. Brodie, BB (1948). "The estimation of acetanilide and its metabolic products, aniline, N-acetyl p-aminophenol and p-aminophenol (free and total conjugated) in biological fluids and tissues". J. Pharmacol. Exp. Ther. 94 (1): 22–28. PMID 18885610. Unknown parameter |coauthors= ignored (|author= suggested) (help)
 17. Brodie, BB (1948). "The fate of acetanilide in man" (PDF). J. Pharmacol. Exp. Ther. 94 (1): 29–38. PMID 18885611. Unknown parameter |coauthors= ignored (|author= suggested) (help)
 18. Flinn, Frederick B (1948). "The effect on the pain threshold of N-acetyl p-aminophenol, a product derived in the body from acetanilide". J. Pharmacol. Exp. Ther. 94 (1): 76–77. PMID 18885618. Unknown parameter |coauthors= ignored (|author= suggested) (help).
 19. Brodie BB, Axelrod J (1949). "The fate of acetophenetidin (phenacetin) in man and methods for the estimation of acetophenitidin and its metabolites in biological material". J Pharmacol Exp Ther. 94 (1): 58–67.
 20. "ఎ ఫెస్టివల్ ఆఫ్ ఎనాల్జెసిక్స్." ఖెమికల్ హెరిటేజ్ ఫౌండేషన్. 2001. ఆగష్టు 17, 2007 నాడు తీయబడినది.
 21. మూస:Ref patent
 22. Bales, JR (May 1, 1985). "Two-dimensional proton nuclear magnetic resonance "maps" of acetaminophen metabolites in human urine". Clinical Chemistry. 31 (5): 757–762. PMID 3987005. Unknown parameter |coauthors= ignored (|author= suggested) (help)
 23. Anthony S. Travis (2007). "Manufacture and uses of the anilines: A vast array of processes and products". In Zvi Rappoport (సంపాదకుడు.). The chemistry of Anilines Part 1. Wiley. p. 764. ISBN 978-0-470-87171-3.
 24. Bhattacharya A.; Purohit V. C.; Suarez, V.; Tichkule, R; Parmer, G.; Rinaldi, F. (2006). "One-step reductive amidation of nitro arenes: application in the synthesis of Acetaminophen". Tetrahedron Letters. 47 (11): 1861–1864. doi:10.1016/j.tetlet.2005.09.196.CS1 maint: multiple names: authors list (link)
 25. Ellis, Frank (2002). Paracetamol: a curriculum resource. Cambridge: Royal Society of Chemistry. ISBN 0-85404-375-6.
 26. Henney, K (1939). Handbook of Photography. Whittlesey House. p. 324. Unknown parameter |coauthors= ignored (|author= suggested) (help)
 27. "ఎసిటామైనోఫెన్." ఫిసిషియన్స్ డెస్క్ రేఫరేన్స్, 63వ ప్రచురణ మోంట్వెల్, NJ: ధాంసన్ PDR; 2009:1915-1916.
 28. Reader's Digest Guide to Drugs and Supplements. Pleasantville, New York; Montreal: Reader's Digest Association, Inc. 2002. ISBN 0-7621-0366-3.
 29. Rossi, S. (ed.) (2008). Australian Medicines Handbook 2008. Adelaide: Australian Medicines Handbook. p. 30. ISBN 0-9757919-6-7 Check |isbn= value: checksum (help). Unknown parameter |ISBN status= ignored (help)CS1 maint: extra text: authors list (link)
 30. 30.0 30.1 Kis B, Snipes JA, Busija DW (2005). "Acetaminophen and the cyclooxygenase-3 puzzle: sorting out facts, fictions, and uncertainties". J. Pharmacol. Exp. Ther. 315 (1): 1–7. doi:10.1124/jpet.105.085431. PMID 15879007.CS1 maint: multiple names: authors list (link)
 31. 31.0 31.1 Aronoff DM, Oates JA, Boutaud O (2006). "New insights into the mechanism of action of acetaminophen: Its clinical pharmacologic characteristics reflect its inhibition of the two prostaglandin H2 synthases". Clin. Pharmacol. Ther. 79 (1): 9–19. doi:10.1016/j.clpt.2005.09.009. PMID 16413237.CS1 maint: multiple names: authors list (link)
 32. Graham GG, Scott KF (2005). "Mechanism of action of paracetamol". American journal of therapeutics. 12 (1): 46–55. doi:10.1097/00045391-200501000-00008. PMID 15662292.
 33. Ohki S, Ogino N, Yamamoto S, Hayaishi O (1979). "Prostaglandin hydroperoxidase, an integral part of prostaglandin endoperoxide synthetase from bovine vesicular gland microsomes". J. Biol. Chem. 254 (3): 829–36. PMID 104998.CS1 maint: multiple names: authors list (link)
 34. Harvison PJ, Egan RW, Gale PH, Nelson SD (1986). "Acetaminophen as a cosubstrate and inhibitor of prostaglandin H synthase". Adv. Exp. Med. Biol. 197: 739–47. PMID 3094341.CS1 maint: multiple names: authors list (link)
 35. రాబెర్ట్స్, L.J II. & మారో, J.D. "హార్డ్మాన్, జ్.జి. & లిమ్బిర్డ్, ఎల్.ఇ. వ్రాసిన "గుడ్మాన్ & గిల్మన్ యొక్క ది ఫార్మకలాజికల్ బేసిస్ అఫ్ థేరపెటిక్స్ 10వ ప్రచురణ" లోని "గౌట్ చికిత్సలో వాడబడుతున్న నొప్పి నివారిణి, జ్వర నివారిణి మరియు వాపు తగ్గించే మందులు" మేగ్రా హిల్ చే ప్రచురించబడినది, 2001, పి.687–731.
 36. Dinarello, Charles A.; Porat (2008). "Fever and Hyperthermia". In Kasper, Dennis L.; Braunwald, Eugene; Jameson, J. Larry; Kasper, Stephen L.; Hauser, Dan L.; Loscalzo, Joseph (సంపాదకులు.). Harrison's Principles of Internal Medicine (17th సంపాదకులు.). New York: McGraw-Hill Medical Publishing Division. ISBN 978-0-07-146633-9 Check |isbn= value: checksum (help). Unknown parameter |first2n= ignored (help)
 37. Högestätt ED, Jönsson BA, Ermund A; et al. (2005). "Conversion of acetaminophen to the bioactive N-acylphenolamine AM404 via fatty acid amide hydrolase-dependent arachidonic acid conjugation in the nervous system". J. Biol. Chem. 280 (36): 31405–12. doi:10.1074/jbc.M501489200. PMID 15987694. Explicit use of et al. in: |author= (help)CS1 maint: multiple names: authors list (link)
 38. Köfalvi A (2008). "Chapter 9: Alternative interacting sites and novel receptors for cannabinoid ligands. In: 'Cannabinoids and the Brain' Springer-Verlag": 131–160. doi:10.1007/978-0-387-74349-3_9. Cite journal requires |journal= (help)
 39. Ottani A, Leone S, Sandrini M, Ferrari A, Bertolini A (2006). "The analgesic activity of paracetamol is prevented by the blockade of cannabinoid CB1 receptors". Eur. J. Pharmacol. 531 (1–3): 280–1. doi:10.1016/j.ejphar.2005.12.015. PMID 16438952.CS1 maint: multiple names: authors list (link)
 40. 40.0 40.1 Chandrasekharan NV, Dai H, Roos KL; et al. (2002). "COX-3, a cyclooxygenase-1 variant inhibited by acetaminophen and other analgesic/antipyretic drugs: cloning, structure, and expression". Proc. Natl. Acad. Sci. U.S.A. 99 (21): 13926–31. doi:10.1073/pnas.162468699. PMC 129799. PMID 12242329. Explicit use of et al. in: |author= (help)CS1 maint: multiple names: authors list (link)
 41. 41.0 41.1 హేన్డ్రిక్సన్, రాబర్ట్ జి.; కేనేత్ ఇ. బిజోవి (2006). నెల్సన్, లూయిస్ హెచ్.; ఫ్లోమేన్బాం, నీల్; గోల్డ్ ఫ్రాంక్, లూయిస్ ఆర్. et al. లో “ఎసిటమినోఫెన్గోల్డ్ ఫ్రాంక్ యొక్క టాక్సీకాలోజిక్ ఎమేర్జెంసీస్ , పి. 525, న్యు యార్క్: మెగ్రా-హిల్. గూగుల్ బుక్ సెర్చ్ ద్వారా జనవరి 18, 2009 నాడు తీయబడినది.
 42. 42.0 42.1 42.2 బోర్న్, రోనాల్డ్ ఎఫ్. "ప్రిన్సిపల్స్ అఫ్ మెడిసినల్ కెమిస్ట్రి , నాలుగో ప్రచురణ లో నాన్ స్టిరోయిడల్ యాంటి-ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్" Eds. ఫోయే, విల్లియం ఓ.; లెమ్కె, థామస్ ఎల్.; విల్లియమ్స్, డేవిడ్ ఏ. విల్లియమ్స్ & విల్కిన్స్ చే ప్రచురించబడినది, 1995. పి. 544–545.
 43. Dong H, Haining RL, Thummel KE, Rettie AE, Nelson SD (2000). "Involvement of human cytochrome P450 2D6 in the bioactivation of acetaminophen". Drug Metab Dispos. 28 (12): 1397–400. PMID 11095574.CS1 maint: multiple names: authors list (link) ఉచిత పూర్తి రచన
 44. "Baby paracetamol asthma concern". BBC News. 2008-09-19. Retrieved 2008-09-19. Cite news requires |newspaper= (help)
 45. Bradley JD, Brandt KD, Katz BP, Kalasinski LA, Ryan SI (1991). "Comparison of an antiinflammatory dose of ibuprofen, an analgesic dose of ibuprofen, and acetaminophen in the treatment of patients with osteoarthritis of the knee". N. Engl. J. Med. 325 (2): 87–91. PMID 2052056.CS1 maint: multiple names: authors list (link)
 46. doi:10.1111/j.1365-2710.2006.00754.x
 47. Clark E, Plint AC, Correll R, Gaboury I, Passi B (2007). "A randomized, controlled trial of acetaminophen, ibuprofen, and codeine for acute pain relief in children with musculoskeletal trauma". Pediatrics. 119 (3): 460–7. doi:10.1542/peds.2006-1347. PMID 17332198.CS1 maint: multiple names: authors list (link)
 48. García Rodríguez LA, Hernández-Díaz S (December 15, 2000). "The risk of upper gastrointestinal complications associated with nonsteroidal anti-inflammatory drugs, glucocorticoids, acetaminophen, and combinations of these agents". Arthritis Research and Therapy. 3 (2): 98. doi:10.1186/ar146. PMC 128885. PMID 11178116. |access-date= requires |url= (help)
 49. http://news.bbc.co.uk/2/hi/health/3271191.stm
 50. Rudolph AM (1981). "Effects of aspirin and acetaminophen in pregnancy and in the newborn". Arch. Intern. Med. 141 (3 Spec No): 358–63. doi:10.1001/archinte.141.3.358. PMID 7469626. Unknown parameter |month= ignored (help)
 51. Lesko SM, Mitchell AA (1999). "The safety of acetaminophen and ibuprofen among children younger than two years old". Pediatrics. 104 (4): e39. doi:10.1542/peds.104.4.e39. PMID 10506264. Unknown parameter |month= ignored (help)
 52. Beasley, Richard; Clayton, Tadd; Crane, Julian; von Mutius, Erika; Lai, Christopher; Montefort, Stephen; Stewart, Alistair (2008). "Association between paracetamol use in infancy and childhood, and risk of asthma, rhino conjunctivitis, and eczema in children aged 6–7 years: analysis from Phase Three of the ISAAC programme". The Lancet. 372: 1039–1048. doi:10.1016/S0140-6736(08)61445-2. Retrieved 2008-09-19.CS1 maint: multiple names: authors list (link)
 53. doi:10.1016/S0140-6736(08)61414-2
  This citation will be automatically completed in the next few minutes. You can jump the queue or expand by hand
 54. doi:10.1016/S0140-6736(08)61417-8
  This citation will be automatically completed in the next few minutes. You can jump the queue or expand by hand
 55. doi:10.1016/S0140-6736(09)60032-5
  This citation will be automatically completed in the next few minutes. You can jump the queue or expand by hand
 56. doi:10.1016/S0140-6736(09)60030-1
  This citation will be automatically completed in the next few minutes. You can jump the queue or expand by hand
 57. doi:10.1016/S0140-6736(09)60029-5
  This citation will be automatically completed in the next few minutes. You can jump the queue or expand by hand
 58. doi:10.1016/S0140-6736(09)60028-3
  This citation will be automatically completed in the next few minutes. You can jump the queue or expand by hand
 59. doi:10.1016/S0140-6736(09)60031-3
  This citation will be automatically completed in the next few minutes. You can jump the queue or expand by hand
 60. Medicines and Healthcare products Regulatory Agency; Commission on Human Medicines (2008). "Paracetamol use in infancy: no strong evidence for asthma link". Drug Safety Update. 2 (4): 9. Retrieved 2009-05-01.
 61. Mohandas J, Duggin GG, Horvath JS, Tiller DJ (1981). "Metabolic oxidation of acetaminophen (paracetamol) mediated by cytochrome P-450 mixed-function oxidase and prostaglandin endoperoxide synthetase in rabbit kidney". Toxicol. Appl. Pharmacol. 61 (2): 252–9. doi:10.1016/0041-008X(81)90415-4. PMID 6798713. Unknown parameter |month= ignored (help)CS1 maint: multiple names: authors list (link)
 62. Mitchell JR, Jollow DJ, Potter WZ, Gillette JR, Brodie BB (1973). "Acetaminophen-induced hepatic necrosis. IV. Protective role of glutathione". The Journal of pharmacology and experimental therapeutics. 187 (1): 211–7. PMID 4746329. Unknown parameter |month= ignored (help)CS1 maint: multiple names: authors list (link)
 63. Ryder SD, Beckingham IJ (2001). "ABC of diseases of liver, pancreas, and biliary system. Other causes of parenchymal liver disease". BMJ. 322 (7281): 290–92. doi:10.1136/bmj.322.7281.290. PMC 1119531. PMID 11157536. [11157536 ఉచిత పూర్తి రచన]
 64. Lee WM (2004). "Acetaminophen and the U.S. Acute Liver Failure Study Group: lowering the risks of hepatic failure". Hepatology. 40 (1): 6–9. doi:10.1002/hep.20293. PMID 15239078. Unknown parameter |month= ignored (help)
 65. "FDA ఎసిటమైనోఫెన్ మీద ఆంక్షలు విధించవచ్చు"
 66. "FDA: మందుల యొక్క సురక్షిత తత్వం మరియు లభ్యత - ఎసిటమైనోఫెన్ గురించిన సమాచారం"
 67. Rumbeiha WK, Lin YS, Oehme FW (1995). "Comparison of N-acetylcysteine and methylene blue, alone or in combination, for treatment of acetaminophen toxicosis in cats". Am. J. Vet. Res. 56 (11): 1529–33. PMID 8585668. Unknown parameter |month= ignored (help)CS1 maint: multiple names: authors list (link)
 68. 68.0 68.1 Maddison, Jill E. (2002). Small Animal Clinical Pharmacology. Elsevier Health Sciences. pp. 260–261. ISBN 0702025739. Unknown parameter |coauthors= ignored (|author= suggested) (help)
 69. "Pardale-V Tablets: Presentation". UK National Office of Animal Health Compendium of Animal Medicines. September 28, 2006. Retrieved 3 January 2007. Cite web requires |website= (help)
 70. "Pardale-V Tablets: Legal Category". UK National Office of Animal Health Compendium of Animal Medicines. November 15, 2005. Retrieved 3 January 2007. Cite web requires |website= (help)
 71. Villar D, Buck WB, Gonzalez JM (1998). "Ibuprofen, aspirin and acetaminophen toxicosis and treatment in dogs and cats". Vet Hum Toxicol. 40 (3): 156–62. PMID 9610496.CS1 maint: multiple names: authors list (link)
 72. Johnston J, Savarie P, Primus T, Eisemann J, Hurley J, Kohler D (2002). "Risk assessment of an acetaminophen baiting program for chemical control of brown tree snakes on Guam: evaluation of baits, snake residues, and potential primary and secondary hazards". Environ Sci Technol. 36 (17): 3827–33. doi:10.1021/es015873n. PMID 12322757.CS1 maint: multiple names: authors list (link)

వెలుపటి వలయము[మార్చు]