Coordinates: 17°41′45″N 83°16′51″E / 17.695811°N 83.280709°E / 17.695811; 83.280709

అంతర్జాతీయ యుద్ధనౌక ప్రదర్శన 2016

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అంతర్జాతీయ యుద్ధనౌకల సమీక్ష
వ్యవథి5 రోజులు
తేదీ4-8, ఫిబ్రవరీ 2014
వేదికతూర్పు నావికా దళం
ప్రదేశంవిశాఖపట్నం,  భారతదేశం
భౌగోళికాంశాలు17°41′45″N 83°16′51″E / 17.695811°N 83.280709°E / 17.695811; 83.280709
ఇలా కూడా అంటారుIFR 2016
పోషకులుభారత ప్రభుత్వం
నిర్వాహకులుభారత నావికా దళం
పాలుపంచుకున్నవారు52 దేశాల నావికాదళాలు [1][2]
వీడియో ప్రకటనIFR 2016 Theme Song on Youtube
పత్రిక ప్రకటనGWAW15001898_IFR Press Ad
ప్రచురణAhoy IFR 2016
వెబ్‌సైటుIFR 2016 Indian Navy Official

అంతర్జాతీయ యుద్ధనౌకల సమీక్ష 2016 (IFR) భారతదేశ సుప్రీం కమాండర్ అయిన దేశాధ్యక్షుని తరుపున భారత నావికా దళం నిర్వహిస్తున్న ఒక సైనిక విన్యాసం. దేశ సార్వభౌమత్వాన్ని కాపాడేందుకు, సాగరంలో ఎదురుదాడికి దిగగల సత్తా చాటేందుకు పొరుగు దేశాలతో విశ్వాసం పెంపొందించుకోవడమే ఈ నావికాదళ విన్యాసాల లక్ష్యం. దేశప్రతిష్ఠ ప్రతిభింబించే విధంగా ఈ విన్యాసాల్లో భారత నావికా దళం పాల్గొనడానికి తయారు అవుతుంది.[3]

తొలిసారిగా భారత తూర్పు నావికాదళ కేంద్రంగా అభివృద్ధి చెందిన విశాఖ తీరం అంతర్జాతీయ యుద్ధనౌకల విన్యాసాలకు వేదికైంది. మునుపటి అంతర్జాతీయ యుద్ధనౌక ప్రదర్శన భారత నేవీ ముంబై వద్ద జనవరి 2011 లో నిర్వహించింది. ఈ ప్రదర్శన 4 ఫిబ్రవరి నుండి 8 ఫిబ్రవరి వరుకు పెద్ద ఎత్తున విశాఖపట్నంలో జరగనుంది.

నమూన సమీక్ష[మార్చు]

అంతర్జాతీయ యుద్దనౌకల సమీక్షలో భాగంగా విన్యాసాల నమూనా ప్రదర్శన నిర్వహించనున్నారు.[4] దీనిలో భాగంగా 'ఫ్లై పాస్ట్'ను కూడా నిర్వహిస్తున్నారు. సమీక్ష జరగడానికి ముందు భారత నౌకాదళ వాయుసేన విభాగానికి చెందిన పలు యుద్ధ విమానాలు, నిఘా విమానాలు, వివిధ రకాల హెలికాప్తర్లు, హాక్లు, మిగ్లు తదితర విమానాలు ఆకాశం నుంచి గౌరవ వందనం సమర్పిస్తాయి. సముద్రంలో మెరైన్ కమాండోల విన్యాసాలు కూడా నిర్వహించబడ్డాయి.

తొలి ఏర్పాట్లు[మార్చు]

ఈ కర్యక్రమానికి త్రివిధ దళాల ఉన్నతాధికారులు, కేంద్ర రాష్ట్ర మంత్రులు, పలువురు విదేశీ అతిథులు హాజరు కావటంతో పటిష్ఠ భద్రత, గాలింపు చర్యలు కేటాయించబడ్డాయి. హోటళ్లు, సాగరతీర భవంతులు, వాహన తనిఖీ జరిగాయి. విహంగవీక్షణ ఛాయాచిత్రాలు, వీడియోలు (ఏరియల్ ఫొటోగ్రఫీ, వీడియోగ్రఫీ) చిత్రీకరణకు ఉపయోగపడే డ్రోన్లు నిషేధించబడ్డాయి. దుర్వినయోగ సామర్థ్యం కలిగిన సాంకేతిక పరిజ్ఞానంపై నిషేధం విధించారు. [5]

రోజువారి షెడ్యూలు[మార్చు]

  • విశాఖ సాగరతీరంలోని యుద్ధవీరుల స్మారకస్థూపం వద్ద పుష్పగుచ్చాన్ని వుంచి మౌనం పాటించిన తర్వాత అంతర్జాతీయ యుద్ధనౌకల విన్యాసాలు ప్రారంభం కానున్నాయి. ఫిబ్రవరి నాలుగోతేదీన సాయం వేళ ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఇదే రోజున ఏయూ ఇంజినీరింగ్ గ్రౌండ్స్‌లో సముద్రయాన ప్రదర్శనతో IFR గ్రామాన్ని ప్రజల సందర్భనార్ధం ప్రారంభించనున్నారు.
  • ఐదో తేదీనే ప్రారంభ వేడుక జరగనుంది. అదే రోజు దేశాధ్యక్షుడు, దేశ ప్రధాని విశాఖకు వేర్వేరు విమానాల్లో చేరుకుంటారు.
  • ఆరో తేదీన భారత నావికా దళం బ్యాండ్ ప్రతిభతో ఓలలాడించనుంది. మధ్యానం గంటలలో సాముద్రిక నావల్ ఆడిటోరియంలో ఈ బ్యాండ్ కచేరి జరుగతుంది.
  • ఏడో తేదీన అంతర్జాతీయ సముద్రయాన కాన్ఫరెన్స్, నగరంలో పెరేడు జరుగుతుంది. భారత నేవీ, ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, రాష్ట్ర పోలీసు, NCC, విదేశీ నౌకా దళాలు నుండి కార్యకర్తలు కవాతులో పాల్గొంటారు.
  • చివరి దినం నాడు ముగింపు వేడుక కావాల్సి ఉంది.

సూచికలు[మార్చు]

  1. Ruchi Bambha. "International Fleet Review 2016 curtain raiser: 6 key things to know". ET. Retrieved 8 January 2016.
  2. "IFR-2016లో పాల్గోనే దెశాల సంఖ్య 52". The Hindu. Retrieved 8 January 2016.
  3. "ఫ్లీట్ ఫెస్ట్". సాక్షి. Retrieved 23 January 2016.
  4. "నేటి నుంచి నమూనా యుద్ద విన్యాసాలు". ప్రజాశక్తి. Retrieved 27 January 2016.[permanent dead link]
  5. "తీరప్రాంతంపై ప్రత్యేక దృష్టి కేంద్రికరించిన రక్షణ సిబ్బంది". ఈనాడు. Retrieved 24 January 2016.[permanent dead link]