అందే నారాయణస్వామి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అందే నారాయణస్వామి
జననం
అందే నారాయణస్వామి

1908
మరణం1982
వృత్తికథారచయిత, నవలా రచయిత

అందే నారాయణస్వామి (1908-1982) తెలుగు కథా రచయిత.

జీవిత సంగ్రహం

[మార్చు]

అందే నారాయణస్వామి గుంటూరు జిల్లా మంగళగిరిలో జన్మించాడు. చిన్నతనంలో విషజ్వరం సోకినప్పుడు వేసిన మందు వికటించడంతో చూపు కోల్పోయాడని ఇతని గురించి చెప్తారు.[1] ఇతను వృత్తిరీత్యా నేత కార్మికుడు. మల్లాది రామకృష్ణశాస్త్రి, శివశంకరశాస్త్రి , ఉన్నవ లక్ష్మీనారాయణ, నార్ల వెంకటేశ్వరరావు మొదలైన వారితో సన్నిహితంగా మెలిగాడు. మొదటలో పద్య కవిత్వం వ్రాసినా తరువాత కథా రచయితగా ఎదిగాడు. మొత్తం వందకు పైగా కథలు వ్రాశాడు. రెండు నవలలు, నాలుగు కథాసంపుటాలు వెలువరించాడు. తొలి కథ 1940లలో ప్రకటించాడు. ఒక దశ తర్వాత అకాల అంధత్వం కూడా ఆయన సాహిత్యసేవకు అడ్డంకి కాలేకపోయింది. ఈయనకు సాహిత్య రంగంలోనే గాక చిత్రలేఖనం, సంగీతంలో కూడా ప్రవేశం ఉంది. ఈయనకు ముందు ఏ రచయిత తన కుల వృత్తికి సంబంధించిన కథా రచనలను చేయలేదు. చేనేత వృత్తితో బాగా పరిచయం ఉండటం వలన చేనేత వృత్తికి సంబంధించిన కథలను బాగా వ్రాయ గలిగాడు. అందువలన తెలుగు సాహిత్యంలో అందే నారాయణ స్వామి తొలి వృత్తి కథా రచయిత గా గుర్తింపబడ్డాడు.

కథలు

[మార్చు]
 1. వ్యత్యాసాలు (కథల సంపుటి 1940)
 2. స్నేహితుడు (కథల సంపుటి 1956)
 3. ఉపాసనాబలం(కథల సంపుటి 1957)
 4. కారుణ్యం(కథల సంపుటి 1958)
 5. చీకటి తెరలు(కథల సంపుటి 2007 విశాలాంధ్ర ప్రచురణ)
 6. తానొకటి తలిస్తే...!
 7. శిల్పి
 8. దొంగా-దొర
 9. గాలిలో దీపం
 10. అమ్మ
 11. సవతి
 12. తేనెపూసిన కత్తులు
 13. ప్రతిఫలం
 14. పుత్ర సంతానం
 15. పరివర్తనం
 16. సంఘ సంస్కరణ
 17. కొడుకులు
 18. పడుగు పేకల మధ్య బడుగులు

నవలలు

[మార్చు]

1.కష్టసుఖాలు 2.ఇద్దరు తల్లులు


బిరుదము

[మార్చు]

ఆంధ్ర మొపాసా

మూలాలు

[మార్చు]
 1. పి., శ్రీనివాస్ గౌడ్ (2022-08-15). "చూపునిచ్చే అందే కథలు". మన తెలంగాణ. Retrieved 2023-12-23.

బాహ్యా లంకెలు

[మార్చు]